ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదినారాయణ రెడ్డి యెర్రపురెడ్డి
Adinarayana Reddy Yerrapureddy
ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి


పదవీ కాలం
1964-1970
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
1982-1988
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
1952 – 1954
నియోజకవర్గం మద్రాస్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
1955 – 1962
నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం

పదవీ కాలం
1974 – 1980
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1916-10-15)1916 అక్టోబరు 15
టి.సుండుపల్లె మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 2002 జూన్ 08
హైదరాబాద్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వై. బసమ్మ
సంతానం 4 కుమారులు, 3 కుమార్తెలు
నివాసం ఆంధ్రప్రదేశ్

ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రాయచోటి నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశాడు.[1]

స్వాతంత్ర్య పోరాటం[మార్చు]

ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి విద్యార్థి దశనుంచే జాతీయోద్యమ రాజకీయాల వైపు ఆకర్షితుడై అంచెలంచెలుగా ఎదిగి అప్పట్లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అతను ఆ హోదాలో 1940–41లో వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించి, అది నిర్వహించినందుకు గాను 500 రూపాయల జరిమాన, వేలూరు సెంట్రల్‌ జైలులో మూడు నెలల శిక్ష అనుభవించాడు. ఆదినారాయణ రెడ్డి కడప జిల్లాలో క్విట్‌ ఇండియా ఉద్యమ వ్యాప్తికి కృషి చేసి కొన్నాళ్లు రహస్య జీవితాన్ని గడిపాడు. అతనును బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి 1942 డిసెంబరు 11వ తేదీ నుంచి 1944 డిసెంబరు 7వ తేది వరకు వేలూరు, తంజావూరు జైళ్లలో శిక్ష అనుభవించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి 1952 నుండి 54, 1954 నుండి 1962 వరకు రెండుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా, 1964 నుండి 1970 వరకు రాజ్యసభ సభ్యుడిగా, ఏ తరువాత 1974 ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (15 March 2019). "రాజకీయ చాతుర్యం.. నిరాడంబర జీవితం". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.