ఎలక్ట్రానిక్ ఓటింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎలక్ట్రానిక్ ఓటింగ్ (e-ఓటింగ్‌ అని కూడా పిలుస్తారు) అనే పదం అనేక విభిన్న రకాల ఓటింగ్‌‌లను తెలియజేస్తుంది. ఈ విధానం కింద ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు వేయడం మరియు వేసిన ఓట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే లెక్కించడం జరుగుతుంది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ టెక్నాలజీలో పంచ్ కార్డులు, ఆప్టికల్ స్కాన్ ఓటింగ్ విధానాలు మరియు ప్రత్యేకంగా తయారు చేసిన ఓటింగ్ కియోస్క్‌లు (స్వీయ-నియంత్రణ డైరెక్ట్-రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (DRE) ఓటింగ్ విధానాలు సహా) ఉంటాయి. ఈ విధానంలో టెలిఫోన్లు, ప్రైవేటు కంప్యూటర్ నెట్‌వర్క్‌లు లేదా ఇంటర్నెట్ సాయంతో బ్యాలెట్‌లు మరియు ఓట్లను పంపడం (బదిలీ చేయడం) జరుగుతుంది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ టెక్నాలజీ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను శరవేగంగా చేస్తుంది. అలాగే వికలాంగ ఓటర్లకు అత్యంత ప్రవేశ సౌలభ్యతను కల్పిస్తుంది. అయితే ఈ విధానాన్ని అనుసరించడం పట్ల ప్రత్యేకించి, అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ఒక వివాదం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రత్యేకించి, DRE ఓటింగ్ విధానం ద్వారా ఎన్నికల మోసం ఎక్కువగా జరగవచ్చు.

విషయ సూచిక

పర్యావలోకనం[మార్చు]

నియోజకవర్గాల ఎన్నికలకు అనుసరించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు పంచ్ కార్డ్ వ్యవస్థల ఆవిష్కరణ మొదలుకుని అంటే 1960ల[1] నుంచే అమల్లో ఉన్నాయి. కొత్తరకం ఆప్టికల్ స్కాన్ ఓటింగ్ విధానాలు బ్యాలెట్‌పై ఓటరు గుర్తును కంప్యూటర్ లెక్కించేలా చేస్తాయి. DRE ఓటింగ్ యంత్రాలు సేకరించిన ఓట్లను ఒకే యంత్రంలో క్రమపరుస్తాయి. ఈ యంత్రాలను బ్రెజిల్ మరియు భారతదేశంలోని అన్ని రకాల ఎన్నికలకు ఓటర్లంతా వాడతారు. ఇక వెనుజులా మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాలల్లో మరింత ఎక్కువగా వినియోగించబడతాయి. నెదర్లాండ్స్‌‌లో వీటిని భారీస్థాయిలో వినియోగిస్తున్నారు. కానీ ప్రజా ఆందోళనల నేపథ్యంలో వీటిని ఉపసంహరించుకోవడం జరిగింది. ఇంటర్నెట్ ఓటింగ్ విధానాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. వీటిని ప్రభుత్వ ఎన్నికలు మరియు యునైటెడ్ కింగ్‌డమ్, ఎస్తోనియా మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో ప్రజాభిప్రాయ సేకరణలకు ఉపయోగిస్తున్నారు. అంతేకాక కెనడా పురపాలక ఎన్నికలకు మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాలు, ఫ్రాన్స్ దేశాల్లోని పార్టీ ప్రాథమిక ఎన్నికలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు.[2]

ఎలక్ట్రానిక్ బ్యాలెట్ మార్కింగ్ డివైజ్ (సాధారణంగా DRE మాదిరిగానే ఒక టచ్ స్క్రీన్ వ్యవస్థ) లేదా ఓటరు-పరిశీలనా పేపరు బ్యాలెట్‌ ముద్రణకు ఇతర సహాయక సాంకేతిక పరిజ్ఞానం వంటి మిశ్రమజాతి విధానాలు కూడా ఉన్నాయి. ముద్రణ బ్యాలెట్ల ముద్రణ తర్వాత ఎలక్ట్రానిక్ లెక్కింపు కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని వాడతారు.

పేపరు ఆధారిత ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం[మార్చు]

కొన్నిసార్లు "డాక్యుమెంట్ బ్యాలెట్ ఓటింగ్ విధానం,"గా పిలిచే పేపరు ఆధారిత ఓటింగ్ విధానాలు ఒక వ్యవస్థగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ ఎన్నికల పత్రాల (పేపర్ బ్యాలెట్)ను ఉపయోగించి వేసిన ఓట్లను చేతితో లెక్కిస్తారు. ఎలక్ట్రానిక్ లెక్కింపు అందుబాటులోకి రావడంతో పేపరు కార్డులు లేదా షీట్లు చేతితో గుర్తించబడుతున్నాయి. అయితే అవి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే లెక్కించబడుతున్నాయి. ఇలాంటి విధానాల్లో పంచ్ కార్డు ఓటింగ్, మార్క్‌సెన్స్ (అనేక కంప్యూటర్ స్కానర్లలో ఉండే ఆప్టికల్ రీడర్ పరికరం) మరియు డిజిటల్ పెన్ ఓటింగ్ సిస్టమ్స్‌ ఉన్నాయి.

ఇటీవలి కాలంలో, ఈ విధానాల్లో ఎలక్ట్రానిక్ బ్యాలెట్ మేకర్ (EBM) కూడా ఉపయోగించబడుతోంది. ఒక ఎలక్ట్రానిక్ ఇన్‌పుట్ పరికరం ద్వారా ఓటర్లు తమ ఎంపికలు చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. సాధారణంగా DRE మాదిరిగా ఇదొక టచ్ స్క్రీన్ విధానం. బ్యాలెట్ మార్కింగ్ డివైజ్ వంటి విధానాలు విభిన్న రకాల సహాయక సాంకేతిక పరిజ్ఞానంను కలిగి ఉంటాయి.

డైరెక్ట్-రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (DRE) ఓటింగ్ విధానం[మార్చు]

అన్ని బ్రెజిల్ ఎన్నికలు మరియు ప్రజాభిప్రాయ సేకరణలకు ఉపయోగించిన ప్రీమియర్ ఎలక్షన్ సొల్యూషన్స్ (గతంలో డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంఏజెన్సియా బ్రాసిల్ తీసిన ఛాయాచిత్రం

డైరెక్ట్-రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (DRE) ఓటింగ్ యంత్రం ఓటర్లు పనిచేయించ గలిగే (సాధారణంగా మీటలు (బటన్లు) లేదా టచ్‌స్క్రీన్) యాంత్రిక లేదా ఎలక్ట్రో-ఆప్టికల్ పరికరాల ద్వారా రూపొందించబడిన బ్యాలెట్ డిస్‌ప్లే ద్వారా ఓట్లను లెక్కిస్తుంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సాయంతో ఇది మొత్తం డేటాను పరిశీలిస్తుంది. అలాగే (కాంపొనెంట్స్) ఓటింగ్ డేటా మరియు బ్యాలెట్ ఇమేజ్‌లను మెమరీ పరికరాలలో రికార్డు చేస్తుంది. ఎన్నికల తర్వాత తొలగించే వీలున్న మెమరీ పరికరంలో నిక్షిప్తమైన ఓటింగ్ డేటాను ఇది ఒక పట్టికగా తయారు చేస్తుంది. తర్వాత ఒక ప్రతిని కూడా ముద్రిస్తుంది. ఈ విధానం వ్యక్తిగత బ్యాలెట్లు లేదా మొత్తం ఓట్లను సంఘటితం చేయడానికి కేంద్రీయ ప్రాంతానికి పంపడం మరియు కేంద్రీయ ప్రాంతం వద్ద ప్రాంతీయ పరిధుల (జిల్లాల) ఫలితాలను వెల్లడిస్తుంది. పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్లను గణించే జిల్లా లెక్కింపు పద్ధతిని ఈ విధానాలు అనుసరిస్తాయి. ఇలి నమోదైన రీతిలోనే బ్యాలెట్లను పట్టికగా తయారు చేస్తాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను ముద్రిస్తాయి.[3]

2002లో, అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో, వికలాంగుల సౌలభ్యం కోసం ఒక ఓటింగ్ విధానాన్ని హెల్ప్ అమెరికా ఓట్ యాక్ట్ తప్పనిసరి చేసింది. DRE ఓటింగ్ యంత్రాల వినియోగం ద్వారా సంతృప్తి చెందించడానికి పలు అధికార పరిధులు ఎంపిక చేయబడ్డాయి. కొన్ని పూర్తిగా DRE వైపే మొగ్గు చూపాయి. 2004లో, ఒక రకమైన డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం,{{http://www.kidsvotingoh.org/insidefiles/activities/Voting%20Systems%20Handout-3copy.pdf}}ను అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని 28.9% మంది నమోదిత ఓటర్లు ఉపయోగించారు. ఈ రేటు 1996లో 7.7%గా ఉంది.[4]

2004లో పార్లమెంటు ఎన్నికల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM)ను భారతదేశం ఉపయోగించింది. మిలియన్ (పది లక్షలు)కు పైగా ఓటింగ్ యంత్రాల ద్వారా 380 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.[ఉల్లేఖన అవసరం] భారత EVMల రూపకల్పన మరియు తయారీ బాధ్యతను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మరియు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) అనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెండు డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్షరింగ్ యూనిట్లు తీసుకున్నాయి. ఈ రెండు కంపెనీలు తయారు చేసిన యంత్రాలు సారూప్యత కలిగి ఉంటాయి. భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశికాలను అనుసరించి వీటిని రూపొందించారు. ఇది 6V బ్యాటరీలపై నడిచే రెండు పరికరాల కలయికతో తయారు చేయబడింది. ఇందులో ఓటింగ్ యూనిట్‌గా పనిచేసే పరికరాన్ని ఓటరు వినియోగిస్తాడు. కంట్రోల్ యూనిట్‌గా పిలిచే మరో పరికరాన్ని ఎన్నికల అధికారి ఉపయోగిస్తాడు. ఈ రెండు యూనిట్లూ 5 మీటర్ల కేబుల్‌తో అనుసంధానం చేయబడి ఉంటాయి. ప్రతి అభ్యర్థిని సూచించడానికి వీలుగా ఓటింగ్ యూనిట్‌ ఒక నీలం రంగు మీటను కలిగి ఉంటుంది. ఈ యూనిట్ 16 మంది అభ్యర్థులకు సంబంధించిన వివరాలను నిర్వహించగలదు. 64 మంది అభ్యర్థుల నిర్వహణ దిశగా 4 యూనిట్ల వరకు మాత్రమే వరుసగా ఏర్పాటు చేయగలం. కంట్రోల్ యూనిట్ల ఉపరితలంపై మూడు బటన్లు ఉంటాయి. అందులో మొదటి బటన్ ఒక్క ఓటును మాత్రమే అనుమతించడానికి, మరొకటి అప్పటివరకు నమోదైన మొత్తం ఓట్లను గుర్తించడానికి, ఆఖరిది ఎన్నికల ప్రక్రియను ముగించడానికి ఉపయోగించబడుతుంది. ఫలితాలను వెల్లడించే బటన్ మాత్రం దాయబడి మరియు సీలు చేయబడి ఉంటుంది. క్లోజ్ బటన్ అప్పటికే నొక్కి ఉంటే తప్ప దీనిని నొక్కరాదు.

పబ్లిక్ నెట్‌వర్క్ DRE ఓటింగ్ విధానం[మార్చు]

పబ్లిక్ నెట్‌వర్క్ DRE ఓటింగ్ అనేది ఒక ఎన్నికల విధానం. ఇది ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఉపయోగించుకోవడం మరియు ఓట్ల డేటాను పబ్లిక్ నెట్‌వర్క్ సాయంతో ఒక పోలింగ్ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపుతుంది. నమోదిత ఓట్ల డేటా వ్యక్తిగత బ్యాలెట్ల మాదిరిగా బదిలీ చేయబడవచ్చు. నిర్ణీతకాలంలో ఎన్నికల రోజంతా బ్యాలెట్ల సమూహాల మాదిరిగా లేదా ఓటింగ్ ముగింపు సమయానికి ఒక్క సమూహంగా పంపబడుతుంది. ఇది ఇంటర్నెట్ ఓటింగ్ మరియు టెలిఫోన్ ఓటింగ్ అని రెండు రకాలుగా ఉన్నాయి.

పబ్లిక్ నెట్‌వర్క్ DRE ఓటింగ్ విధానం జిల్లా లెక్కింపు లేదా కేంద్రీయ లెక్కింపు పద్ధతిని ఉపయోగించుకుంటుంది. కేంద్రీయ లెక్కింపు పద్ధతి అనేక జిల్లాలకు చెందిన బ్యాలెట్లను కేంద్రీయ ప్రాంతంలో లెక్కిస్తుంది.

మారుమూల ప్రాంతాల కోసం ఇంటర్నెట్ ఓటింగ్‌ను ఉపయోగిస్తారు (ఏదైనా ఇంటర్నెట్ కేబుల్ కంప్యూటర్ ద్వారా ఓటింగ్) లేదా ఇంటర్నెట్ ఓటింగ్ వ్యవస్థలతో సంధానం చేయబడిన ఓటింగ్ బూత్‌లతో కూడిన సంప్రదాయక పోలింగ్ కేంద్రాలను ఉపయోగించడం జరుగుతుంది.

కార్పొరేషన్లు మరియు సంస్థలు అధికారులు, బోర్డు సభ్యుల ఎన్నికకు మరియు ఇతర ప్రతినిధి ఎన్నికల కోసం సాధారణంగా ఇంటర్నెట్ ఓటింగ్‌ను ఉపయోగిస్తాయి. ఇంటర్నెట్ ఓటింగ్ విధానాలు (వ్యవస్థలు) పలు ఆధునిక దేశాల్లో ప్రైవేటుగానూ మరియు అమెరికా సంయుక్తరాష్ట్రాలు,UK,ఐర్లాండ్, స్విట్జర్లాండ్ మరియు ఎస్తోనియా వంటి దేశాల్లో బహిరంగంగా ఉపయోగించబడుతున్నాయి. స్విట్జర్లాండ్‌ స్థానిక ఎన్నికల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానం ద్వారా పోస్టల్ సర్వీస్ ద్వారా బ్యాలెట్లను యాక్సెస్ చేయడానికి ఓటర్లు తమ పాస్‌వర్డ్‌లు పొందుతారు. ఎస్తోనియాలోని పలువురు ఓటర్లు స్థానిక మరియు పార్లమెంటరీ ఎన్నికల్లో ఇంటర్నెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోగలరు. ఎందుకంటే, ఓటర్ల జాబితాలోని అనేక మందికి e-ఓటింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. ఈ విధానాన్ని అమలు చేస్తున్న అదిపెద్ద ఐరోపా సంఘం యొక్క దేశం ఇదే. ఎస్తోనియా పౌరులు ఎక్కువగా కంప్యూటర్-రీడబుల్ మైక్రోచిప్‌ ఉన్న జాతీయ గుర్తింపు కార్డును కలిగి ఉండటం వల్ల అక్కడ ఈ విధానాన్ని పెద్దయెత్తున అమలు చేయడం సాధ్యపడుతోంది. ఆన్‌లైన్ బ్యాలెట్‌ను ఓటర్లు యాక్సెస్ చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి. దీనంతటికీ ఓటరుకు కావాల్సింది ఒక కంప్యూటరు, వారి ID కార్డు మరియు దాని PIN మాత్రమే. ఇవంతా చెంత ఉంటే వారు ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఓటు వేయొచ్చు. ఎస్తోనియా e-ఓట్లు ముందస్తు ఓటింగ్ రోజుల్లోనే నమోదవుతాయి. ఎన్నికల రోజున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ విశ్లేషణ[మార్చు]

వికలాంగ ఓటర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ISG టాప్‌ఓటర్ యంత్రం

ఇతర ఓటింగ్ పద్ధతులతో పోల్చితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి. బ్యాలెట్ల ఏర్పాటు, పంపిణీ, ఓటింగ్, సేకరణ మరియు లెక్కింపు ఇలా అనేక ప్రక్రియల్లోని ఏదో ఒక దానితో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియల్లోని ఏదో ఒక దానిలో ప్రయోజనాలను కలిగించవచ్చు లేదా కలిగించకనూ పోవచ్చు. సంభావ్య దుష్ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎలక్ట్రానిక్ పరికరంలో లోపాలు లేదా బలహీనత ఏర్పడే అవకాశం కూడా ఉంది.

మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చార్లెస్ స్టీవార్ట్ ఈ విధంగా అంచనా వేశాడు, 2000లో కంటే 2004లో మిలియన్ ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. అందుకు కారణం, పేపరు ఆధారిత యంత్రాలు వదిలేసే అవకాశమున్న ఓట్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గుర్తించగలగడమే.[5]

మే, 2004లో U.S. ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం "ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఆఫర్స్ అపార్చునిటీస్ అండ్ ప్రజెంట్స్ ఛాలెంజెస్"[6], అనే శీర్షికతో ఒక నివేదిక విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు సంబంధించిన ప్రయోజనాలు మరియు ఆందోళనలకు సంబంధించిన విశ్లేషణా నివేదిక అది. "ఫెడరల్ ఎఫర్ట్స్ టు ఇంప్రూ సెక్యూరిటీ అండ్ రిలైబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ ఆర్ అండర్ వే, బట్ కీ యాక్టివిటీస్ నీడ్ టు బి కంప్లీటెడ్"[7] పేరుతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఆందోళనలు మరియు ప్రస్తుతం జరుగుతున్న పురోగతులపై సెప్టెంబరు, 2005లో రెండో నివేదిక విడుదలయింది.

ఓటింగ్ విధానాలు మరింత క్లిష్టతరంగా మారిన నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ సహా ఎన్నికల మోసాలకు భిన్నమైన పద్ధతులు సాధ్యమవుతుండటం తెలియజేయబడింది. మరికొందరు సిద్ధాంతపరంగా ఆలోచించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ వినియోగాన్ని సవాలు చేశారు. ఒక ఎలక్ట్రానిక్ యంత్రంలో చోటు చేసుకునే ప్రక్రియలను పరిశీలించే విధంగా ప్రజలు అభివృద్ధి చెందలేదనేది వారి వాదన. చెప్పాలంటే, ఈ ప్రక్రియలను ప్రజలు (ఇక్కడ ఓటర్లు) పరిశీలించలేరు. అంతేకాక ఇవి విశ్వసించదగ్గవి కావు. కొందరు గణాంక నిపుణులు విశాలమైన భావం కోసం వాదించారు. అంటే ప్రజలు తమకు తెలియని లేదా తాము రూపొందించని ప్రోగ్రామింగ్‌‌ను నమ్మరనేది నిపుణుల వాదన.[8]

రహస్య బ్యాలెట్ విధానంలో ఎన్నికల ఫలితాలతో పోల్చే విధంగా తెలిసిన ఇన్‌పుట్ గానీ లేదా ఊహించదగిన అవుట్‌పుట్ గానీ ఉండదు. అందువల్ల, ఎలక్ట్రానిక్ ఎన్నికల ఫలితాలు మరియు కచ్చితత్వం, నిజాయితీ మరియు మొత్తం ఎలక్ట్రానిక్ వ్యవస్థ యొక్క భద్రతను ప్రజలు పరిశీలించలేరు.[9].

భద్రతా విశ్లేషకుడు బ్రూస్ షీనియర్ సహా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విమర్శకులు ఈ విధంగా గుర్తించారు, "కంప్యూటర్ సెక్యూరిటీ నిపుణులు ఏమి చేయాలన్న దానిపై సర్వసమ్మతంగా ఉంటారు (కొందరు ఓటింగ్ నిపుణులు ఏకీభవించరు, అయితే కంప్యూటర్ సెక్యూరిటీ నిపుణులు మాత్రం అనుసరించాలి; ఇక్కడ కంప్యూటర్ వల్లే ప్రధాన సమస్యలు తలెత్తుతాయి, అంతేగానీ ఓటింగ్ ప్రయోజనానికి కంప్యూటర్ వినియోగించబడుతోందన్న వాస్తవం మాత్రం కాదు)...DRE యంత్రాలు తప్పక ఓటరు-పరిశీలనా పేపరు ఆడిట్ ట్రెయిళ్లు కలిగి ఉండాలి... DRE యంత్రాల్లో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను ఓటింగ్ విధానం యొక్క కచ్చితత్వాన్ని రూఢీ చేసే విధంగా ‌ప్రజా పరిశీలన"[10]కు తప్పక ఉంచాలి. నిర్ధారణ (తనిఖీ) బ్యాలెట్లు తప్పకుండా అవసరం. ఎందుకంటే, ఓటింగ్ యంత్రాలు రాజీపడే అవకాశమున్నందున కంప్యూటర్లు తప్పులు చేయొచ్చు.

ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు[మార్చు]

కంప్యూటర్ మెమరీలో ఓట్లను నిక్షిప్తం చేయడానికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు ఉపయోగించుకుంటాయి. వాటిని ప్రత్యేకంగా ఉపయోగించుకునే వ్యవస్థలను DRE ఓటింగ్ విధానాలుగా పేర్కొంటారు. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఉపయోగించడం వల్ల బ్యాలెట్ల పంపిణీ కొరత సమస్య తలెత్తదు. అదనంగా, ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ల వినియోగం ద్వారా పేపరు బ్యాలెట్ల ముద్రణ అవసరం పూర్తిగా ఉండదు. తద్వారా చెప్పుకోదగ్గ విధంగా ఖర్చు తగ్గుతుంది.[11] ఎన్నికల నిర్వహణకు బహుళ భాషా బ్యాలెట్లను వినియోగిస్తారు (అమెరికా సంయుక్తరాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో జాతీయ ఓటింగ్ హక్కుల చట్టం 1965 ప్రకారం, బహిరంగ ఎన్నికలు నిర్వహించాలి). ఒక్క యంత్రంలోనే బహుళ భాషా బ్యాలెట్లను ఏర్పాటు చేసే విధంగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రోగ్రామింగ్ చేస్తారు. విభిన్న భాషల్లో రూపొందించిన బ్యాలెట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి శ్రేష్ఠమైనవిగా ఉంటాయి. ఉదాహరణకు, కింగ్ కౌంటీ, వాషింగ్టన్ జనాభా గణాంకాలకు చైనా భాషలో బ్యాలెట్ యాక్సెస్ చేయడానికి U.S. ఫెడరల్ ఎలక్షన్ చట్టం అవసరమవుతుంది. ఎలాంటి పేపరు బ్యాలెట్‌కైనా, ఎన్ని చైనా భాషా బ్యాలెట్లను ముద్రించాలి మరియు ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఎన్ని బ్యాలెట్లను వినియోగించాలి వంటి తదితర విషయాలపై కౌంటీ నిర్ణయం తీసుకోవాలి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో చైనా భాషా బ్యాలెట్లు కచ్చితంగా అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని రూఢీ చేసే వ్యూహం ఏదైనా సరిగా లేకపోతే, చెప్పుకోదగ్గ సంఖ్యలో బ్యాలెట్లు వృధా అవుతాయి.[ఉల్లేఖన అవసరం] (లీవరు యంత్రాల పరిస్థితి పేపరు వాటి కంటే ఘోరంగా ఉంటుంది. అందువల్ల నమ్మకమైన రీతిలో బ్యాలెట్ల అవసరతను తీర్చడానికి ఏకైక మార్గం చైనా భాషా లీవరు యంత్రాన్ని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయడమే. వాటిలో కొన్ని ఎప్పటికీ ఉపయోగించవచ్చు.)

ఏదైనా భాషకు సంబంధించి, అదనపు బ్యాలెట్ల అవసరాన్ని ఓటింగ్ కేంద్రాల వద్ద బ్యాలెట్లను ముద్రించడం ద్వారా తగ్గించవచ్చని విమర్శకులు సూచిస్తున్నారు. అంతేకాక సాఫ్ట్‌వేర్ క్రమబద్ధీకరణ వ్యయం, కంపైలర్ విశ్వాస క్రమబద్ధీకరణ, ఇన్‌స్టాలేషన్ క్రమబద్ధీకరణ, డెలివరీ క్రమబద్ధీకరణ మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు సంబంధించిన ఇతర ప్రక్రియలు క్లిష్టమైనవి మరియు ఖర్చుతో కూడుకున్నవని వారంటున్నారు. అందువల్ల ముద్రిత బ్యాలెట్ల కంటే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లకు తక్కువ ఖర్చవుతుందని కచ్చితంగా హామీ ఇవ్వలేమనేది వారి వాదన.

ప్రవేశ సౌలభ్యం[మార్చు]

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వికలాంగులు సైతం పూర్తిగా వినియోగించుకునే విధంగా తయారు చేయొచ్చు. పంచ్ కార్డు మరియు ఆప్టికల్ స్కాన్ యంత్రాలు దృష్టి వైకల్యం ఉన్న వారికి పూర్తిగా అందుబాటులో ఉండవు. లీవరు యంత్రాలు పరిమితమైన చలనశీలత, శక్తీ ఉన్న ఓటర్లకు క్లిష్టతరమవుతాయి.[12] అవసరమైన ప్రవేశసౌలభ్యత కోసం హెడ్‌ఫోన్లు, సిప్ అండ్ పఫ్, ఫుట్ పెడల్స్, జాయ్ స్టిక్కులు మరియు ఇతర సహాయక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలక్ట్రానిక్ యంత్రాలు ఉపయోగించుకోగలవు.

వెరిఫైడ్ ఓటింగ్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల[13] ప్రవేశసౌలభ్యతను విమర్శించడం మరియు ప్రత్యామ్నాయాలను సూచించాయి. కొంతమంది వికలాంగ ఓటర్లు (అంధ ఓటర్లు సహా) రహస్య పేపరు బ్యాలెట్ ఓటు వేయడానికి స్పర్శసంబంధి బ్యాలెట్‌లను ఉపయోగించగలరు. ఈ బ్యాలెట్ విధానంలో ఓటర్లు తమకు నచ్చిన చోట మీట నొక్కే విధంగా భౌతికమైన గుర్తులు ఉంటాయి. ఈ బ్యాలెట్లు ఇతర ఓటర్లు ఉపయోగించే వాటి మాదిరిగానే రూపొందించబడతాయి.[14]. అయితే, ఇతర వికలాంగ ఓటర్లు (లాఘవ వైకల్యాలు కలిగిన ఓటర్లు సహా) ఈ బ్యాలెట్లను ఉపయోగించలేరు.

రహస్య తనిఖీ[మార్చు]

తాము వేసిన ఓటు నమోదైందా లేదా, లెక్కించబడిందా లేదా వంటి విషయాలను ఓటర్లు తెలుసుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధానాలు తప్పుగా ఓట్లు నమోదయ్యాయన్న ఆందోళనల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అలాంటి ఆందోళనలను తగ్గించడానికి ఏ విధంగా ఓటేశారన్న విషయాన్ని ఓటర్లకు నిరూపితం చేయడం ఒక చక్కటి మార్గం. అంటే డిజిటల్ సిగ్నేచర్స్‌ ద్వారా ఓటింగ్ అథారిటీ సంతకం చేసిన ఒక ఎలక్ట్రానిక్ రశీదును వారికి చూపించడం. ఇది గణన యొక్క కచ్చితత్వాన్ని స్పష్టం చేస్తుంది. అయితే ఓటరు ప్రత్యామ్నాయ రహస్య గోపనాన్ని తెలపలేని ఏదైనా ఒక తనిఖీ వ్యవస్థ కారణంగా ఓటరు భయం లేదా ఓటు విక్రయంకు అవకాశం ఏర్పడవచ్చు.

కొన్ని రహస్య తనిఖీ మార్గాలు ఓటర్లు తమ ఓటును వ్యక్తిగతంగా తనిఖీ చేసుకోవడంపై దృష్టి సారిస్తాయి. అయితే తృతీయ పక్షానికి మాత్రం ఆ అవకాశముండదు. తమ ఓటుకు సంబంధించి, డిజిటల్ టెక్నాలజీ ద్వారా సంతకం చేసిన రశీదును ఓటరుకు ఇవ్వడం అదే విధంగా నియమరహితంగా ఎంపిక చేసిన ఇతర ఓట్ల రశీదులను పొందుపరచడం ద్వారా ఆందోళనలకు తగ్గించవచ్చు. ఇది తన ఓటును గుర్తించడానికి ఓటరుకు అవకాశం కల్పిస్తుంది. అయితే ఇతరులు అతను/ఆమె ఓటును గుర్తించే అవకాశం ఎంతమాత్రం ఉండదు. అంతేకాక, నియమరహితంగా ఏర్పడిన ఓటింగ్ సెషన్ id ద్వారా ప్రతి ఓటూ గణించబడుతుంది. ఇది బ్యాలెట్ యొక్క పబ్లిక్ ఆడిట్ ట్రెయిల్‌లో తమ ఓటు సక్రమంగా నమోదైందా లేదా అన్న విషయాన్ని తనిఖీ చేసుకునే విధంగా ఓటరుకు అవకాశం కల్పిస్తుంది.

ఓటరు అభిప్రాయం[మార్చు]

ఓటు వేసేటపుడు వెయ్యవలసిన ముద్రల కంటే ఎక్కువ గానీ, తక్కువ గానీ ముద్రలు వెయ్యడం వంటి పొరపాట్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గుర్తించి ఓటరును అప్రమత్తం చేస్తాయి. తద్వారా ఓటు మురిగి పోకుండా కాపాడవచ్చు.

పారదర్శకత[మార్చు]

UKకి చెందిన ఓపెన్ రైట్స్ గ్రూప్[15][16] వంటి గ్రూపులు ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు సంబంధించిన తనిఖీలు, పేలవమైన ఆడిట్ విధానాలు మరియు తగిన దృష్టి లేకపోవడం వల్ల "ఎన్నికలు దోషాలు మరియు మోసానికి బహిరంగమయ్యాయి" అని దుయ్యబట్టాయి.

2009లో ఓటింగ్ యంత్రాలను ఉపయోగించేటప్పుడు ఫలితం తనిఖీ అనేది ఓటరు ద్వారా సాధ్యపడుతుందని మరియు ఇలా చేయడానికి వారికి దాని గురించి ప్రత్యేకమైన అనుభవం అవసరముండదు" అని ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ జర్మనీ గుర్తించింది. అప్పటివరకు ఉపయోగించిన DRE Nedap-కంప్యూటర్లు ఆ అవసరాన్ని తీర్చలేకపోయాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను నిషేధించాలనే నిర్ణయం తీసుకోలేదు. అయితే ప్రజల పరిశీలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.[17][18]

ఆడిట్ ట్రెయిల్స్ మరియు ఆడిటింగ్[మార్చు]

వేసిన ఓట్లు మొత్తం నమోదయ్యాయా మరియు నమోదైనవి క్రమపరచబడినవా (పట్టిక మాదిరిగా) అన్న విషయాన్ని స్పష్టం చేయడమనేది ఏదైనా ఓటింగ్ యంత్రం నుంచి ఎదురయ్యే ప్రధాన సవాలు. నాన్‌-డాక్యుమెంట్ బ్యాలెట్ ఓటింగ్ విధానాలు అత్యధిక బాధ్యతను కలిగి ఉంటాయి. దీనిని తరచూ ఒక స్వతంత్ర ఆడిట్ వ్యవస్థ ద్వారా పరిష్కరించవచ్చు. కొన్నిసార్లు దీనిని స్వతంత్ర తనిఖీగా కూడా వ్యవహరిస్తారు. దీనిని తిరిగి లెక్కించడం లేదా ఆడిట్లలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధానాలు తాము ఏ విధంగా ఓటేశామన్న విషయాన్ని తనిఖీ చేసే సమర్థతను ఓటర్లకు కల్పిస్తాయి లేదా తమ ఓట్లు ఏ విధంగా క్రమపరచబడ్డాయన్న విషయాన్ని కూడా వారు తెలుసుకోగలరు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ (NIST) పరిశోధకులు ఈ విధంగా పేర్కొన్నారు, "తన ఎలక్ట్రానిక్ రికార్డులను స్వతంత్ర ఆడిట్లకు DRE ఆర్కిటెక్షర్ సమకూర్చలేని అసమర్థత కారణంగా అది ముఖ్యంగా పొరపాట్లు మరియు మోసాన్ని గుర్తించలేని పరిస్థితిని ఎదుర్కొంటుంది."[19] ఈ నివేదిక NIST అధికారి హోదాను తెలపదు మరియు నివేదిక యొక్క దోషాల వల్ల "ఈ నివేదికలోని కొన్ని అంశాలు తప్పుగా పేర్కొనబడినవి" అని NIST వివరించడానికి దారితీశాయి. ఈ ముసాయిదా నివేదికలో ఎన్నికల అధికారులు, ఓటింగ్ సిస్టమ్ వ్యాపారులు, కంప్యూటర్ శాస్త్రవేత్తలు మరియు ఈ రంగంలోని ఇతర నిపుణుల యొక్క ప్రకటనలు ఉంటాయి. అంటే DREలపై సంభావ్య దాడుల గురించి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. అయితే, ఈ ప్రకటనలు నిర్ణయాలను వెల్లడించలేవు."[20]

VVPATతో కూడిన ఒక డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్ ఇంక్ మోడల్ అక్యూఓట్-TSx DRE ఓటింగ్ యంత్రం.

తమ ఓటు సక్రమంగానే నమోదైందని ఓటర్లకు హామీ ఇవ్వడానికి, సాధ్యపర మోసం లేదా పొరపాట్లను గుర్తించడానికి మరియు వాస్తవిక యంత్రాన్ని ఆడిట్ చేయడానికి అనేక టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. క్రిప్టోగ్రఫీ (గూఢలేఖన శాస్త్రం)(దృశ్యమాపక లేదా గణిత సంబంధిత), పేపర్ (ఓటరు వద్ద ఉంటుంది లేదా తనిఖీ మాత్రమే చేయబడుతుంది), ఆడియో తనిఖీ మరియు ద్వంద్వ రికార్డింగ్ లేదా సాక్ష్యాధార వ్యవస్థలు (పేపరుతో కాకుండా వేరేవి) వంటి టెక్నాలజీలను కొన్ని విధానాలుగా పేర్కొనవచ్చు.

ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (VVPAT) విధాన రూపకర్త Dr. రీబెక్కా మెర్కురి (స్థూల ఓటరు పరిశీలనా బ్యాలెట్ విధానంపై అక్టోబరు, 2000లో ఆమె యొక్క Ph.D. సమగ్ర పరిశీలనా వ్యాసంలో వివరించినట్లుగా) ఓటింగ్ యంత్రం ముద్రించిన పేపరు బ్యాలెట్ లేదా భద్రతా ప్రాంతానికి వెళ్లడానికి ముందు ఓటరు దృశ్యమాపకంగా పరిశీలించే ఇతర పేపరు నకలు సాయంతో అడిగే ఆడిటింగ్‌ సంబంధిత ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రతిపాదించింది. తర్వాత కొన్ని సందర్భాల్లో దీనిని "మెర్కురి విధానంగా పేర్కొన్నారు." వాస్తవంగా ఓటరు పరిశీలించేలా, రికార్డు అనేది తప్పక ఓటరు చేత పరిశీలించబడాలి. దృశ్యమాపకం లేదా వినడం వంటి సహాయాలు లేకుండా పూర్తి కావాలి. ఒకవేళ ఓటరు బార్-కోడ్ స్కానర్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశీలనకు ఉపయోగించినట్లయితే, అప్పుడు రికార్డు వాస్తవంగా ఓటరు-పరిశీలన చేయబడదు. అందువల్ల వాస్తవానికి ఓటరు రికార్డును తనిఖీ చేసేది ఎలక్ట్రానిక్ పరికరం మాత్రమే. VVPAT అనేది ఒక రకమైన స్వతంత్ర తనిఖీ. ఇది సర్వసాధారణంగా అమెరికా సంయుక్తరాష్ట్రాల ఎన్నికలలో ఉపయోగించబడుతుంది.

ఎండ్-టు-ఎండ్ ఆడిటబుల్ ఓటింగ్ విధానాలు ఇంటికి తీసుకెళ్లే విధంగా ఓటర్లకు రశీదును అందించగలవు. ఈ రశీదు తాము ఎలా ఓటేశామో ఇతరులకు చెప్పడానికి ఓటర్లకు ఉపయోగపడదు. కానీ, మొత్తం గణనలో తమ ఓటు చేరిన విషయాన్ని పరిశీలించడానికి మాత్రం వీలవుతుంది. ఓట్లు మొత్తం అర్హులైన ఓటర్లు వేసినవే. అందువల్ల ఫలితాలు సక్రమంగా రూపొందించబడుతాయి. పంచ్‌స్కాన్, త్రీబ్యాలెట్ మరియు ప్రెట్ ఎ ఓటర్‌లను ఎండ్-టు-ఎండ్ (E2E) విధానాలుగా పేర్కొంటారు. స్కాన్‌టిగ్రిటీ అనేది అదనమైనది. ఇది ప్రస్తుత E2E లేయర్ కలిగిన ఆప్టికల్ స్కాన్ ఓటింగ్ విధానాలను మరింత విస్తృతపరుస్తుంది. టొకోమా పార్క్, మేరీల్యాండ్‌ నగరం నవంబరు, 2009లో జరిగిన తన ఎన్నికలకు స్కాన్‌టిగ్రిటీ IIని ఉపయోగించింది.[21][22]

ఏ విధంగా ఓటేశామన్న విషయాన్ని నిరూపించుకునే విధంగా ఓటర్లను అనుమతించే విధానాలను U.S. సాధారణ ఎన్నికల్లో అస్సలు ఉపయోగించరు. వాటిని పలు రాష్ట్ర నియోజకవర్గాలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆందోళనలుగా ఓటరు భయం మరియు ఓటు విక్రయంలను చెప్పవచ్చు.

సాధ్యపర పొరపాల్లు (తప్పులు) లేదా మోసాన్ని గుర్తించడానికి నియమరహితంగా తిరిగి లెక్కించిన వాటిని గణించడానికి ఒక ఆడిట్ విధానాన్ని ఉపయోగిస్తారు. VVPAT విధానంలో పేపరు బ్యాలెట్‌ను తరచూ అధికారిక రికార్డు బ్యాలెట్‌గా పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో బ్యాలెట్ అనేది ప్రాథమికమైనది. ఎలక్ట్రానిక్ రికార్డులను ప్రాథమిక లెక్కింపు కోసం మాత్రమే ఉపయోగిస్తారు. తదనంతర ఏవైనా తిరిగి లెక్కింపులు లేదా సవాళ్లకు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ కాకుండా పేపరును క్రమపరచడానికి వాడుతారు. పేపరు రికార్డు ఒక చట్టపరమైన బ్యాలెట్‌గా పనిచేస్తే అది ఏదైనా ఇతర పేపరు బ్యాలెట్ విధానం మాదిరిగానే ఒకే విధమైన ప్రయోజనాలు మరియు ఆందోళనలు కలిగి ఉంటుంది.

ఏదైనా ఓటింగ్ యంత్రాన్ని విజయవంతంగా ఆడిట్ చేయడానికి ఒక కఠినమైన చైన్ ఆఫ్ కస్టడీ (పేపర్ ట్రెయిల్) అవసరమవుతుంది.

ఈ ఫలితం (పరిష్కారం) తొలుత ప్రదర్శించబడింది (న్యూయార్క్ సిటీ, మార్చి 2001) మరియు (సాక్రమెంటో, కాలిఫోర్నియా 2002) AVANTE International Technology, Inc..చేత వినియోగించబడింది. 2004లో ఎలక్ట్రానిక్ రికార్డును ముద్రించగలిగే DRE ఓటింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన తొలి రాష్ట్రం నెవడా. $9.3 మిలియన్ ఓటింగ్ విధానాన్ని సీక్వోయా ఓటింగ్ సిస్టమ్స్ అమలు చేసింది. వెరివోట్ VVPAT పరికరం కలిగిన సుమారు 2,600 AVC EDGE టచ్‌స్క్రీన్ DREలకు పైగా ఈ కంపెనీ అందించింది. [23] పంచ్ కార్డు ఓటింగ్ విధానాలను భారీ స్థాయిలో మార్చి, వాటి స్థానంలో కొత్త విధానాలను అప్పటి విదేశాంగ మంత్రి డీన్ హెల్లర్ ఆదేశానుసారం అమలు చేశారు. ప్రభుత్వ భవనాల్లో సమావేశాలు నిర్వహించడం ద్వారా అక్కడి అధికార వర్గం నుంచి స్వీకరించిన సమాచారం ద్వారా వీటిని ఎంపిక చేయడం జరిగింది. ప్రాథమిక సమాచారాన్ని నెవడా గేమింగ్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకున్నారు.[24]

హార్డ్‌వేర్[మార్చు]

భద్రత ప్రమాణాలున్న సాఫ్ట్‌వేర్ కొరత కారణంగా భౌతికమైన ట్యాంపరింగ్‌ కలుగుతుంది. "Wij vertrouwen stemcomputers niet" వంటి కొన్ని విమర్శక గ్రూపులు ("ఓటింగ్ యంత్రాలను మేము విశ్వసించం"), ఈ విధంగా ధ్వజమెత్తాయి, ఉదాహరణకు, మ్యాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్ (కొన్ని సందర్భాల్లో జానూస్ ఎటాక్‌గా పిలుస్తారు) సాంకేతికతను ఉపయోగించి విదేశీ హార్డ్‌వేర్‌ను యంత్రంలోకి లేదా వినియోగదారుడు మరియు యంత్రంలోని ప్రధాన యంత్రాంగం మధ్య ప్రవేశపెట్టాలి. DRE యంత్రాలను సీల్ చేయడం ద్వారా తగినంత భద్రత సాధ్యపడకపోవచ్చు.[25] సమీక్ష మరియు పరిశీలనా ప్రక్రియలు మోసపూరిత కోడు లేదా హార్డ్‌వేర్‌ ఒకవేళ ఉంటే వాటిని గుర్తించగలవు. అందువల్ల తనిఖీ చైన్ ఆఫ్ కస్టడీ (పేపర్ ట్రెయిల్) అలాంటి హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ ప్రవేశాన్ని అడ్డుకునే అవకాశముంది.

సాఫ్ట్‌వేర్[మార్చు]

బ్రూస్ షీనియర్ వంటి భద్రతా నిపుణులు ఓటింగ్ యంత్రం యొక్క సోర్స్ కోడ్‌ (మూలాధార కోడు) తనిఖీకి వీలుగా తప్పకుండా బహిరంగంగా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు.[26] ఆస్ట్రేలియాలో చేసిన మాదిరిగా ఒక ఫ్రీ సాఫ్ట్‌వేర్ లైసెన్సు కింద ఓటింగ్ యంత్రం సాఫ్ట్‌వేర్ ముద్రించాలని మరికొందరు సూచించారు.[27]

తనిఖీ మరియు ధ్రువీకరణ[మార్చు]

ఓటింగ్ యంత్రాల్లో తలెత్తే లోపాలను కనిపెట్టడానికి ఉపయోగించే ఒక పద్ధతి పేర్లల్ టెస్టింగ్ (సమాంతర తనిఖీ). దీనిని ఎన్నికల రోజున నియమరహితంగా ఎంపిక చేసిన యంత్రాలపై నిర్వహిస్తారు. ACM ప్రచురించిన ఒక అధ్యయనం 2000 U.S. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చడానికి ప్రతి ప్రాంతీయ పరిధి నుంచి రెండు ఓట్లను మాత్రమే మార్చాల్సి ఉంటుందని తెలిపింది.[28]

ఇతరాలు[మార్చు]

మోసపూరిత కోడు లేదా హార్డ్‌వేర్‌ ఒకవేళ ఉంటే అలాంటి వాటిని కనిపెట్టడానికి నిర్వహించే సమీక్ష మరియు తనిఖీ ప్రక్రియల ద్వారా విమర్శలను తగ్గించవచ్చు. చైన్ ఆఫ్ కస్టడీ (పేపర్ ట్రెయిల్) ద్వారా హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌ ప్రవేశాన్ని నిరోధించవచ్చు.

క్రమపద్ధతిలో అమర్చే సమయాలు తగ్గడం మరియు ప్రత్యేకించి, ఇంటర్నెట్ ఓటింగ్‌ వినియోగం ద్వారా భాగస్వామ్యం (మొత్తం ఓట్లు) పెంపు వంటి ప్రయోజనాలున్నాయి.

దీనిని వ్యతిరేకించే వారు ప్రత్యామ్నాయ ఓట్ల లెక్కింపు విధానాలను సిఫారసు చేశారు. దానికి కారణంగా స్విట్జర్లాండ్‌ (అదే విధంగా పలు ఇతర దేశాలు)ను ఉదహరించారు. అది పేపర్ బ్యాలెట్లను ప్రత్యేకంగా ఉపయోగించింది. అందువల్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారానే ఓట్లను శరవేగంగా లెక్కించగలమని భావించరాదని వారు పేర్కొన్నారు. 7 మిలియన్ల మంది ప్రజలున్న స్విట్జర్లాండ్ సుమారు ఆరు గంటల్లో ఒక నిశ్చయాత్మక బ్యాలెట్ లెక్కింపును వెల్లడించింది. గ్రామాల్లోనైతే బ్యాలెట్లను మనుషులు లెక్కిస్తారు.

ఒక సుదూర ఓటరు యొక్క గుర్తింపును తనిఖీ చేయడం కష్టమైనది మరియు అసాధ్యమని పలువురు అభిప్రాయపడ్డారు. అలాగే పబ్లిక్ నెట్‌వర్క్‌ల ఆవిష్కరణ మరింత దుర్బలమైనది మరియు క్లిష్టమైనదని పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు అయ్యే మొత్తం వ్యయం ఇతర విధానాల కంటే తక్కువన్న విషయం ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఉదాహరణలు[మార్చు]

ఎలక్ట్రానిక్ ఓటింగ్ లేదా ఇంటర్నెట్ ఓటింగ్ పోలింగ్ కేంద్రాలు ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, ఎస్తోనియా, ఐరోపా సమాజం, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఐర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, రొమేనియా, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు వెనుజులా దేశాల్లో ఉన్నాయి.

నమోదిత సమస్యలు[మార్చు]

 • ఫ్లోరిడాలోని ఓటింగ్ విధానాలపై 2000 అధ్యక్ష ఎన్నికల నుంచి అనేక సమస్యలు తలెత్తాయి.[29]
 • ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ, వర్జీనియా, 2003 నవంబరు 4. తమకు నచ్చిన ఒక అభ్యర్థికి ఓటు వేస్తామని, అయితే ఆ ఓటుకు సంబంధించిన సూచిన (ఇండికేటర్) మాత్రం వెంటనే పనిచేయకుండా పోతోందని పలువురు ఓటర్లు ఫిర్యాదు చేశారు.[30]
 • ప్రీమియర్ ఎలక్షన్ సొల్యూషన్స్ (గతంలో డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్) యొక్క TSx

ఓటింగ్ విధానం అలామెడా మరియు శాన్ డైగో కౌంటీలలో 2004 మార్చి 2న జరిగిన కాలిఫోర్నియా ప్రాథమిక అధ్యక్ష ఎన్నికల్లో పనిచేయని ఓటరు కార్డు ఎన్‌కోడర్ల కారణంగా పలువురు ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసింది.[31] ఏప్రిల్ 30న కాలిఫోర్నియా ప్రభుత్వ కార్యదర్శి కెవిన్ షెల్లీ అన్ని టచ్‌స్క్రీన్ యంత్రాల యొక్క గుర్తింపును రద్దు చేశాడు. తద్వారా డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్‌పై విచారణను ఆదేశించాడు.[32] కాలిఫోర్నియా అటార్నీ జనరల్ నేర విచారణకు తొలుత వ్యతిరేకించాడు. అయితే తర్వాత ఎన్నికల అధికారులకు చేసిన మోసపూరిత ఫిర్యాదుల నేపథ్యంలో డైబోల్డ్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో $2.6 మిలియన్లు చెల్లించడం ద్వారా ఈ వివాదం నుంచి డైబోల్డ్ బయటపడింది.[33] 2006 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియా ప్రభుత్వ కార్యదర్శి బ్రూస్ మెక్‌ఫెర్సన్ డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్‌ DRE మరియు ఆప్టికల్ స్కాన్ ఓటింగ్ విధానానికి తిరిగి గుర్తింపు కల్పించాడు.[34]

 • నాపా కౌంటీ, కాలిఫోర్నియా, 2004 మార్చి 2న అక్రమంగా క్రమాంకనం చేసిన మార్క్‌సెన్స్‌ (అనేక కంప్యూటర్ స్కానర్లలో ఉండే ఆప్టికల్ రీడర్ పరికరం) స్కానర్ 6,692 అబ్సెంటీ బ్యాలెట్ (పోస్టల్ ఓట్) ఓట్లను విస్మరించింది.[35]
 • 2006 అక్టోబరు 30న డచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి తయారీ సంస్థ Sdu NV యొక్క 1187 ఓటింగ్ యంత్రాల లైసెన్సును రద్దు చేశాడు. అంటే ఉపయోగించడానికి ఉద్దేశించిన మొత్తంలో దాదాపు 10%. ఎందుకంటే, వాన్ ఎక్ ఫ్రీకింగ్‌ను ఉపయోగించి ఎవరైనా సరే 40 మీటర్ల దూరం నుంచే ఓటింగ్‌ను స్పీకర్లు లేకుండా వినొచ్చని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ నిరూపించడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.[36] ఈ నిర్ణయం తీసుకున్న 24 రోజుల తర్వాత జాతీయ ఎన్నికలను నిర్వహించారు. ఈ నిర్ణయం డచ్ ప్రధాన సంస్థ Wij vertrouwen stemcomputers niet [37] ("మేము ఓటింగ్ కంప్యూటర్లను విశ్వసించం"[38]) కారణంగా తీసుకోవాల్సి వచ్చింది.[39]
 • అమెరికా సంయుక్తరాష్ట్రాల సాధారణం ఎన్నికలు, 2006కు సంబంధించిన సమస్యలు:
  • అక్టోబరు, 2006లో మియామి, హాలీవుడ్ మరియు ఫోర్ట్ లాడెర్‌డేల్, ఫ్లోరిడాలో ముందస్తు ఓటింగ్‌ సమయంలో డెమొక్రాటిక్ అభ్యర్థుల జాబితాలో చేరాల్సిన మూడు ఓట్లు రిపబ్లికన్లకు పడినట్లు చూపబడ్డాయి. దీనిని ఓటింగ్ విధానంలోని టచ్‌స్క్రీన్‌లలో తలెత్తిన క్రమాంకన పొరపాట్లుగా ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.[40]
  • పెన్సిల్వేనియాలో తలెత్తిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ దోషం కారణంగా కొందరు పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియానాలోని 175 ప్రాంతీయ పరిధులు (జిల్లాలు) కూడా పేపర్ బ్యాలెట్లను ఉపయోగించుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని కౌంటీలు జాప్యాలను సవరించడానికి ఎన్నికల గంటలను పొడగించాయి.[41]
  • కుయాహోగా కౌంటీ, ఓహియో: డైబోల్డ్ కంప్యూటర్ సర్వరు స్తంభించిపోవడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆగిపోయింది. ప్రింటర్లలో పేపరు కాపీలు ఇరుక్కుపోవడంతో పలు ఓట్లు గణాంకాలకు అందకుండా పోయాయి. అందువల్ల ఓట్ల లెక్కింపు సమయంలో వాటి మొత్తం సంఖ్యను కచ్చితంగా వెల్లడించలేని పరిస్థితి నెలకొంది.[42]
  • వాల్డెన్‌బర్గ్, అర్కాన్సాస్: టచ్ స్క్రీన్ కంప్యూటర్ ఒక మేయర్ అభ్యర్థికి వచ్చిన ఓట్లను సున్నాగా చూపించింది. అయితే తనకు తానుగా వేసుకున్న ఒక్క ఓటు రావాలి కదా, అంటే కనీసం ఒక్క ఓటైనా తనకు వచ్చి ఉండాలంటూ అతను చెప్పడం టచ్ స్క్రీన్ కంప్యూటర్ వైఫల్యాన్ని ఎత్తిచూపినట్లయింది. టచ్ స్క్రీన్ యంత్రాల్లో ఈ విధంగా నమోదిత ఓట్లు కనిపించని పరిస్థితులు నెలకొంటున్నాయి.[41]
  • సారాసోటా, ఫ్లోరిడా: కాంగ్రెస్ ఎన్నికల్లో సుమారు 18,000 మంది వేసినవి "చెల్లని ఓట్లు"గా చూపించబడ్డాయి.[41] తర్వాత చేపట్టిన దర్యాప్తు చెల్లని ఓట్లు అనేవి సాఫ్ట్‌వేర్ దోషాల వల్ల కాదని పేర్కొంది. పేలవమైన బ్యాలెట్ రూపకల్పనే చెల్లని ఓట్లకు కారణంగా గుర్తించబడింది.
 • ఈ యంత్రాలకు సంబంధించిన లోపభూయిష్ట సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతాపరమైన వివాదాంశాలను 1 ఆగస్టు 2001న న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్‌లోని బ్రీనాన్ సెంటర్‌లో ఆవిష్కరించడం జరిగింది. 2004-2006 మధ్యకాలంలో 26 రాష్ట్రాల్లోని e-ఓటింగ్ యంత్రాల్లో చోటు చేసుకున్న వైఫల్యాలను 60కు పైగా ఉదాహరణలతో వివరిస్తూ రూపొందించిన నివేదికను NY యూనివర్శిటీ లా స్కూల్ విడుదల చేసింది. ఉదాహరణల్లో స్పెయిన్ భాషా బ్యాలెట్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి. 2004లో సాక్రమెంటోలో ఈ బ్యాలెట్లను ఉపయోగించి ఓటర్లు వేసిన ఓట్లు లెక్కించబడని పరిస్థితి నెలకొంది.[ఉల్లేఖన అవసరం]
 • ఫిన్‌లాండ్‌లో మూడు పురపాలక సంస్థలకు జరిగిన పైలట్ ఎలక్ట్రానిక్ ఓట్ల ఫలితాలను చెల్లనివిగా సుప్రీం అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ప్రకటించింది. పురపాలక ఎన్నికలను తిరిగి నిర్వహించమని ఆదేశించింది. ఈ విధానానికి ఒక వినియోగ సమస్య ఉంది. అంటే ఓటు వేయబడిందా లేదా అన్న అంశంపై అస్పష్టమైన సందేశాలు వస్తాయి. మొత్తం 232 కేసుల్లో (మొత్తం ఓట్లలో 2%), ఓటర్లు ప్రవేశించి, వారి యొక్క ఓట్లను ఎంపిక చేసుకున్నారు. అయితే దానిని ధ్రువీకరించుకోకుండానే వారు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేశారు. ఫలితంగా అవి నమోదు కాకుండా పోయాయి.[43]
 • 2008 అమెరికా సంయుక్తరాష్ట్రాల ఎన్నికలు:
  • వర్జీనియా, టెన్నెస్సీ మరియు టెక్సాస్: టచ్ స్క్రీన్ ఓటింగ్ యంత్రాలు ముందస్తు ఓటింగ్ పరిశీలనలో ఓట్లను తిరగవేశాయి.[44]
  • హమ్‌బోల్ట్ కౌంటీ, కాలిఫోర్నియా: ఒక భద్రతా లోపం కంప్యూటర్ డేటాబేసు (సమాచారం) నుంచి 197 ఓట్లను తొలగించింది.[45]

కాలిఫోర్నియా సమగ్ర తనిఖీ[మార్చు]

మే, 2007లో, కాలిఫోర్నియా ప్రభుత్వ కార్యదర్శి దెబ్రా బోవెన్‌ తమ రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలపై "సమగ్ర" తనిఖీకి ఆదేశించింది. కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆధ్వర్యంలోని కంప్యూటర్ భద్రతా నిపుణులను ఓటింగ్ విధానం మూలాధార కోడు యొక్క భద్రతా గణాంకాల కోసం ఆమె నియమించింది. అలాగే "అత్యంత నిశితంగా" పరిశీలించి, అంచనాలు వేసే "రెడ్ టీమ్స్‌"ను ట్యాంపరింగ్ (ఎవరికి వేసినా ఒకే అభ్యర్థికి లేదా పార్టీకి ఓటు పడటం) లేదా దోషానికి అవకాశమున్న దుర్బల పరిస్థితులు వంటి ఎన్నికల రోజు దృష్టాంతాలను గుర్తించడానికి ఏర్పాటు చేశారు. సమగ్ర తనిఖీలో యంత్రాల తయారీ సంస్థ యొక్క ప్రమాణ పత్రరచనపై విస్తృత సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంతేకాక ప్రవేశసౌలభ్య విశిష్టతలు మరియు ప్రత్యామ్నయ భాషా అవసరాలు కూడా సమీక్షించబడతాయి.

తనిఖీల యొక్క తుది ఫలితాలను నాలుగు వివరణాత్మక ప్రభుత్వ కార్యదర్శి ఆగస్టు 3, 2007 ముసాయిదాల (డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్, హర్ట్ ఇంటర్‌సివిక్, సీక్వోయా ఓటింగ్ సిస్టమ్స్ మరియు ఎలక్షన్స్ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్‌వేర్, ఇంక్‌) ద్వారా విడుదల చేశారు. డైబోల్డ్ మరియు సీక్వోయా ఓటింగ్ సిస్టమ్స్ యొక్క సవరించిన ముసాయిదాలను 25 అక్టోబరు 2007న అప్‌డేట్ చేయడం జరిగింది.[46] అన్ని తయారీసంస్థల యొక్క ఓటింగ్ యంత్రాల్లో చెప్పుకోదగ్గ విధంగా భద్రతా లోపాలున్నాయని భద్రతా నిపుణులు గుర్తించారు. ఒక నిపుణేతరుడు మొత్తం ఎన్నికలపై రాజీ పడే విధంగా లోపాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

3 ఆగస్టు 2007న ES&S ఇన్‌కాఓట్ యంత్రం సహా బోవెన్ తన యొక్క సమగ్ర తనిఖీలో పొరపాట్లున్నట్లు తేలిన యంత్రాల గుర్తింపును రద్దు చేసింది. ఇన్‌కాఓట్‌ను సమీక్షలో చేర్చలేదు. ఎందుకంటే సంబంధిత కంపెనీ తనిఖీ గడువు ముగిసిన తర్వాత సమర్పించింది. 27 జులై 2007న విడుదలైన నివేదికత నిపుణులైన "రెడ్ టీమ్" చేత రూపొందించబడింది. సాంకేతిక దుర్బల స్థాయిలను అది కనిపెడుతుంది. 2007 ఆగస్టు 2న విడుదలైన మరో నివేదిక ప్రధాన కోడు సమీక్ష బృందం (సోర్స్ కోడ్ రివ్యూ టీమ్) చేత నిర్వహించబడింది. ఇది ఓటింగ్ విధానం ప్రధాన కోడులోని లోపాలను గుర్తించడానికి ఉద్దేశించింది. ఈ రెండు నివేదికలు కూడా తనిఖీ చేసిన మూడు యంత్రాలు 2005లో సూచించిన స్వచ్ఛంద ఓటింగ్ విధాన మార్గదర్శకాల (VVSG)లోని కనీస అవసరాలను కూడా నెరవేర్చలేని విషయం బయటపడింది. తనిఖీ చేయబడిన మరికొన్ని విధానాలు కొత్త కార్యాచరణ భద్రతా అవసరాలను విధించడం ద్వారా షరతు కింద తిరిగి గుర్తించబడ్డాయి.[47] 2008 కాలిఫోర్నియా అధ్యక్ష ముందస్తు ఎన్నికల వరకు అనుమానాస్పద కంపెనీలు తమ యొక్క భద్రతాపరమైన వివాదాలను పరిష్కరించుకోవడం మరియు ఎన్నికల ఫలితాలు నిశితంగా ఆడిట్ చేయబడతాయని భరోసా ఇవాల్సి ఉంది.

ప్రీమియర్ ఎలక్షన్ సొల్యూషన్స్ (గతంలో డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్‌) యొక్క AccuVote-TSx ఓటింగ్ విధానంపై ప్రిన్స్‌టన్ యూనివర్శిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తల బృందం 2006లో అధ్యయనం చేసింది. వారి ఫలితాల్లో AccuVote-TSx విధానం భద్రత లేనిదిగా మరియు అది "ఒక్క నిమిషం లోపే ఓటు-దొంగతనం సాఫ్ట్‌వేర్‌తో ఇన్‌స్టాల్ చేయబడుతుంది" అని వెల్లడైంది. అంతేకాక ఈ యంత్రాలు "సాధారణ ఎన్నికల తంతు ముందు మరియు తర్వాత" కంప్యూటర్ వైరస్‌లను ఒక దాని నుంచి మరో దానికి బదిలీ చేయగలవని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు.[48]

ఫ్లోరిడా, పంచ్ కార్డులు మరియు 2000 అధ్యక్ష ఎన్నికలు[మార్చు]

పంచ్ కార్డులు (డేటాను రికార్డు చేసుకునే సామర్థ్యం కలిగినవి)2000లో చెప్పుకోదగ్గ విమర్శలకు గురయ్యాయి. ఫ్లోరిడాలో ఓటోమేటిక్‌ తరహా విధానాల్లో వాటి యొక్క ఎగుడుదిగుడు ప్రయోజనం కారణంగా U.S. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయనే విమర్శలు వచ్చాయి. ఓటోమేటిక్ అనేది IBM లైసెన్సు ద్వారా కొంతకాలం వరకు తయారు చేయబడిందని జోసెఫ్ P. హ్యారిస్ కనుగొన్నాడు. ప్రధాన నమూనాను రూపకల్పన చేయడం మరియు పేటెంట్లను రాసిన విలియం రోవెరాల్ 1982లో పేటెంట్ల (ప్రత్యేక అధికారాలు) గడువు తీరిన తర్వాత స్వల్ప నాణ్యత కలిగిన యంత్రాలు మార్కెట్‌లో దర్శనమిచ్చాయని చెప్పాడు. ఫ్లోరిడాలో ఉపయోగించిన యంత్రాలు వాస్తవిక ఓటోమేటిక్ యంత్రం దోషాలకు ఐదు రెట్లు అధికంగా ఉన్నాయని అతను చెప్పాడు.[49]

పంచ్ కార్డు ఆధారిత ఓటింగ్ విధానాలు, ప్రత్యేకించి ఓటోమేటిక్ విధానం ప్రత్యేక కార్డులను ఉపయోగిస్తుంది. ఇక్కడ ప్రతి సాధ్యపర రంధ్రం ముందుగా గుర్తించబడుతుంది. ఓటింగ్ యంత్రంలోని గైడు సాయంతో ఒక స్టైలస్ (వస్తువు)ను నొక్కడం ద్వారా రంధ్రాలు చేసే అవకాశాన్ని ఈ విధానాలు ఓటర్లకు కల్పిస్తాయి. ఈ విధానంలో తలెత్తే ప్రధాన సమస్య అసంపూర్ణ రంధ్రం. ఇది అంచనా రంధ్రం కంటే చిన్నది ఏర్పడేలా చేస్తుంది లేదా కార్డులో ఒక చిన్న పగులు లేదా ఒక చిన్న సొట్టను ఏర్పరుస్తుంది లేదా కాగితపు వ్యర్థాన్ని సృష్టిస్తుంది. ఈ విధమైన సాంకేతిక సమస్యను డెమొక్రాటిక్ పార్టీ 2000 U.S. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రచారం చేసింది. పంచ్ కార్డు ఓటింగ్ యంత్రాలను ప్రాథమికంగా ప్రజాస్వామ్య ప్రాంతాల్లో ఉపయోగించారు మరియు అసంపూర్ణ రంధ్రాల కారణంగా వందలాది బ్యాలెట్లు సక్రమంగా చదవబడలేదు లేదా అర్హత కోల్పోయాయి, ఫలితంగా ఓట్లు అల్ గోరె కంటే జార్జ్ W.బుష్‌కు అనుకూలంగా పడ్డాయని విమర్శకులు పేర్కొన్నారు. తర్వాత స్వతంత్ర సంస్థలు జరిపిన పరిశోధనలు ఈ ఆరోపణలను తప్పుబట్టాయి.[ఉల్లేఖన అవసరం]

2000 ఫ్లోరిడా అనుభవం తర్వాత అత్యధిక రాష్ట్రాలు అన్ని రకాల పంచ్ కార్డు ఓటింగ్ విధానాలను పక్కనపెట్టినప్పటికీ, ఇతర పంచ్ కార్డు ఓటింగ్ విధానాలు లోహ రంధ్ర-పంచ్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ లోపం వల్ల ఈ యంత్రాంగం సాధ్యమైనంత వరకు పెద్దగా ఇబ్బందికి గురికాదు. అయితే దక్షిణ కొరియా ఇప్పటికి కూడా ప్రభావవంతంగా పంచ్ కార్డు బ్యాలెట్లనే ఉపయోగిస్తోంది.[ఉల్లేఖన అవసరం]

అభివృద్ధికి సిఫారసులు[మార్చు]

డిసెంబరు, 2005లో US ఎన్నికల సహాయ సంఘం 2005 వాలంటరీ ఓటింగ్ సిస్టమ్ గైడ్‌లైన్స్ (స్వచ్ఛంద ఓటింగ్ విధాన మార్గదర్శకాల) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవి చెప్పుకోదగ్గ విధంగా ఓటింగ్ విధానాల భద్రతా అవసరాలను పెంచడం మరియు ప్రవేశాన్ని మరింత విస్తరిస్తాయి. వికలాంగులు రహస్యంగా మరియు స్వతంత్రంగా ఓటు వేసుకునే అవకాశాలను కూడా కల్పిస్తాయి. ఈ మార్గదర్శకాలు డిసెంబరు, 2007 నుంచి అమల్లోకి వచ్చాయి. ఫెడరల్ ఎలక్షన్ కమీషన్ తయారు చేసిన 2002 ఓటింగ్ విధాన ప్రమాణాల (VSS) స్థానంలో వీటిని అమలు చేశారు.

ఓపెన్ ఓటింగ్ కన్సార్షియం వంటి కొన్ని గ్రూపులు ఓటరుకు తిరిగి విశ్వాసాన్ని కల్పించే విధంగా మరియు సంభావ్య మోసాన్ని తగ్గించడానికి అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాలు తప్పక ప్రజా పరిశీలన (తనిఖీ)కు సంపూర్ణంగా అందుబాటులో ఉండాలని విశ్వసించాయి.

అంతేకాక OASIS అభివృద్ధి చేసిన ఎలక్షన్ మార్క్‌అప్ లాంగ్వేజ్ (EML) ప్రమాణం మరియు ప్రస్తుతం ISO పరిశీలనలో ఉన్న (డాక్యుమెంట్లు మరియు పథకాలను చూడండి) ఇలాంటి బహిరంగ ప్రజా ప్రమాణాలు మరియు విశిష్టతలను ఉపయోగించాల్సిన అవసరముందని కూడా అవి ప్రతిపాదించాయి. కంప్యూటర్ విధానాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహించడం మరియు పనితీరుకు ఇవి ఏకరీతి ప్రక్రియలు మరియు యంత్రాంగాలను సమకూర్చుతాయి.

చట్టం[మార్చు]

2004 వసంతంలో సమాచార సాంకేతిక వృత్తి నిపుణుల సంఘం యొక్క శాసన సంబంధిత వ్యవహారాల కమిటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ జాతీయ ప్రమాణాలకు సంబంధించి తొమ్మిది సూత్రాల ప్రతిపాదన చేసింది.[50] తర్వాత కథనంలో కమిటీ అధ్యక్షుడు చార్లెస్ ఓరియజ్ దేశం చుట్టూ వ్యాపించిన కొన్ని సమస్యలను వివరించాడు.[51]

నెల్సన్-వైట్‌హౌస్ బిల్లు సహా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌కు సంబంధించిన చట్టాన్ని అమెరికా సంయుక్తరాష్ట్రాల కాంగ్రెస్‌‌లో ప్రవేశపెట్టడం జరిగింది. టచ్ స్క్రీన్ విధానాల స్థానంలో ఆప్టికల్ స్కాన్ ఓటింగ్ విధానాలను అమలు చేయడానికి రాష్ట్రాలకు సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చాలని ఈ బిల్లు పేర్కొంటోంది. అంతేకాక అన్ని సమాఖ్య ఎన్నికల్లో (ఫెడరల్ ఎలక్షన్స్) 3% జిల్లాల యొక్క ఆడిట్ల అవసరాన్ని కూడా ఇది తెలుపుతుంది. ఏ విధమైన ఓటింగ్ టెక్నాలజీని అనుసరించైనా సరే అన్ని ఓటింగ్ యంత్రాలకు 2012 కల్లా ఒక తరహా పేపరు ట్రెయిల్ ఆడిట్లు తప్పనిసరి అని కూడా ఇది చెబుతోంది.[52]

మరో బిల్లు HR.811 (ఓటరు విశ్వాసం మరియు ప్రవేశసౌలభ్య వృద్ధి చట్టం 2003). దీనిని న్యూజెర్సీకి చెందిన డెమొక్రాట్ రష్ D. హోల్ట్, Jr. ప్రతిపాదించాడు. హెల్ప్ అమెరికా ఓట్ యాక్ట్ 2002 సవరణకు ఈ బిల్లు ఉద్దేశించబడింది. అలాగే ప్రతి ఓటుకూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఒక పేపరు ఆడిట్ ట్రెయిల్‌ను విడుదల చేయాలని కూడా సూచిస్తుంది.[53] ఫ్లోరిడా సెనేటర్ బిల్ నెల్సన్ 2007 నవంబరు 1న U.S. సెనేట్ అనుబంధ బిల్లు వెర్షన్‌ను ప్రవేశపెట్టాడు. వికలాంగులు, ప్రాథమికంగా ఆంగ్లం మాట్లాడలేని వారు మరియు అక్ష్యరాస్యత ఎక్కువగా లేని వారికి పేపరు బ్యాలెట్ ఓటింగ్‌ విధానాలను అందుబాటులోకి తెచ్చే విధంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ పరిశోధన కొనసాగించాలన్న అవసరతను ఈ బిల్లు తెలుపుతుంది. అంతేకాక చేతులతో లెక్కించిన ఓటరు పరిశీలనా పేపరు బ్యాలెట్లకు సంబంధించిన ఆడిట్ నివేదికలను రాష్ట్రాలు సమాఖ్య కార్యాలయానికి నివేదించాలని కూడా ఇది సూచిస్తుంది. ప్రస్తుతం, ఈ బిల్లు నిబంధనలు మరియు పాలనపై అమెరికా సంయుక్తరాష్ట్రాల సెనేట్ కమిటీ పరిశీలనలో ఉంది. ఓటింగ్ తేదీని ఇప్పటివరకు నిర్ణయించలేదు[54].

2008 సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ టెక్నాలజీ వినియోగంపై అలుముకున్న అభద్రతల కారణంగా పెరిగిన ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు హోల్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, అదనపు బిల్లులను కాంగ్రెస్‌కు నివేదించాడు. అందులో ఒకటి "ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ఫర్ సెక్యూర్ ఎలక్షన్స్ యాక్ట్ 2008" (HR5036). సాధారణ సేవల యంత్రాగం అనేది పౌరులకు పేపరు బ్యాలెట్లను సమకూర్చడానికయ్యే అదనపు ఖర్చు మరియు వాటిని లెక్కించడానికి వ్యక్తుల నియామకానికయ్యే ఖర్చులకు రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించాలని ఇది చెబుతుంది.[55] 2008 జనవరి 17న ఈ బిల్లును ప్రజాప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు[56]. పేపరు బ్యాలెట్లను తిరిగి ఉపయోగించడానికయ్యే ఖర్చులకు $500 మిలియన్లు, ఓటింగ్ ఆడిటర్లకు చెల్లించడానికి $100 మిలియన్లు మరియు చేతితో లెక్కించేవారికి $30 ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లు అంచనా వేసింది. ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను విశ్వసించని పక్షంలో భౌతికంగానే ఓటు వేసే అవకాశాన్ని ఇది వారికి కల్పిస్తుంది.[55]. ఈ బిల్లు ఆమోదానికి ఉద్దేశించిన ఓటింగ్ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

పాప్ సంస్కృతి[మార్చు]

2006 చలనచిత్రం మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌లో రాబిన్ విలియమ్స్ నటించాడు. ఇందులో రాజకీయ చర్చా కార్యక్రమానికి హాస్యభరిత అతిథేయుడు జాన్ స్టీవార్ట్‌ తరహా పాత్రలో విలియమ్స్ కన్పించాడు. అయితే నకిలీ తయారీ సంస్ధ డెలాక్రాయ్ ఉత్పత్తి చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తలెత్తిన సాఫ్ట్‌వేర్ దోషం కారణంగా అతను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు చూపించబడింది. ఫలితంగా మొత్తం ఓట్లు తప్పుగా లెక్కించబడే విధంగా పరిస్థితి ఏర్పడింది.

మార్క్ కాగిన్స్‌ రాసిన 2007 నవల రన్‌ఆఫ్‌ లో, శాన్‌ఫ్రాన్సిస్కో మేయర్ ఎన్నికలలో గ్రీన్ పార్టీ అభ్యర్థి యొక్క ఆశ్చర్యకరమైన ప్రదర్శన అతనికి మరియు అత్యధిక ఆదరణ ఉన్న అభ్యర్థికి మధ్య తుది పోరుకు దారితీసింది. దానిని 2003 ఎన్నికల వాస్తవిక ఫలితాలను అతి దగ్గరగా సమాంతరం చేస్తూ గీసిన ఒక గీతగా దానిని చెప్పొచ్చు. ఈ పుస్తకం యొక్క రహస్య గూఢచారి శక్తివంతమైన చైనాటౌన్ వ్యాపారస్థురాలి కోరిక మేరకు పరిశోధన చేశాడు. తద్వారా ఎన్నికల ఫలితం నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన e-ఓటింగ్ సిస్టమ్‌ భద్రతను ఛేదించిన ఒక వ్యక్తి రిగ్గింగ్‌కు గురైందని అతను తెలిపాడు.[57]

"హ్యాకింగ్ డెమొక్రసీ" అనేది 2006 లఘు చిత్రం. ఇది HBOలో ప్రసారమైంది. సుమారు మూడేళ్ల పాటు దీనిని చిత్రీకరించారు. ఇందులో 2000 మరియు 2004 అమెరికా ఎన్నికల్లో ప్రత్యేకించి, వోలుసియా కౌంటీ, ఫ్లోరిడాలో వెలుగుచూసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాల యొక్క అసాధారణ పరిస్థితులు మరియు క్రమరాహిత్యాలను పొందుపరిచారు. ఈ చిత్రం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల యొక్క తప్పుడు సమగ్రతపై పరిశోధన జరిపింది. ప్రత్యేకంగా, డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్ చేసినవి. అలాగే లియాన్ కౌంటీ, ఫ్లోరిడాలోని డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్ హ్యాకింగ్ ద్వారా ఇది సమాప్తమయింది.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ తయారీసంస్థలు[మార్చు]

విద్యా సంబంధిత ప్రయత్నాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. బెల్లిస్, మేరీ. ది హిస్టరీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్. About.com .
 2. రిమోట్ ఓటింగ్ టెక్నాలజీ Archived 2016-03-04 at the Wayback Machine., క్రిస్ బాకెర్ట్ e-గవర్నమెంట్ కన్సల్టింగ్
 3. U.S. ఎలక్షన్ అసిస్టెన్స్ కమీషన్: 2005 వాలంటరీ ఓటింగ్ సిస్టమ్ గైడ్‌లైన్స్ Archived 2008-02-07 at the Wayback Machine.
 4. U.S. ఫెడరల్ ఎలక్షన్ కమీషన్: డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ - సమాచార పేజీ
 5. ఫ్రీల్, బ్రెయిన్ (నవంబరు 2006)లెట్ ది రీకౌంట్స్ బిగిన్ Archived 2005-06-19 at the Wayback Machine., నేషనల్ జర్నల్
 6. ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం (మే, 2004) "ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఆఫర్స్ అపార్చునిటీస్ అండ్ ప్రజెంట్స్ చాలెంజెస్"
 7. ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం (సెప్టెంబరు, 2005) "ఫెడరల్ ఎఫర్ట్స్ టు ఇంప్రూ సెక్యూరిటీ అండ్ రిలైబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్స్ ఆర్ అండర్ వే, బట్ కీ యాక్టివిటీస్ నీడ్ టు బి కంప్లీటెడ్"
 8. థాంప్సన్, కెన్ (ఆగస్టు, 1984) రెఫ్లెక్షన్స్ ఆన్ ట్రస్టింగ్ ట్రస్ట్ Archived 2006-06-13 at the Wayback Machine.
 9. లాంబార్డి, ఎమాన్యుయెల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ అండ్ డెమొక్రసీ
 10. షీనియర్, బ్రూస్ (సెప్టెంబరు, 2004), ఓపెన్‌డెమొక్రసీ వాట్స్ రాంగ్ విత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్? Archived 2008-05-22 at the Wayback Machine.
 11. "http://post-journal.com/articles.asp?articleID=6218". ది పోస్ట్-జర్నల్ Archived 2007-10-29 at the Wayback Machine.
 12. "ప్రొటెక్టింగ్ ది ఇంటెగ్రిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఓటింగ్ ఇన్ 2004 అండ్ బియాండ్ Archived 2004-12-12 at the Wayback Machine.". పీపుల్ ఫర్ ది అమెరికన్ వే
 13. "డిసేబిలిటీ యాక్సెస్ టు ఓటింగ్ సిస్టమ్స్" Archived 2007-08-10 at the Wayback Machine. వెరిఫైడ్ ఓటింగ్ ఫౌండేషన్
 14. "బ్యాలెట్ టెంప్లేట్స్." Archived 2012-08-29 at the Wayback Machine. (స్పర్శ సంబంధి బ్యాలెట్లు) ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్షన్ సిస్టమ్స్
 15. "ORG ఎలక్షన్ రిపోర్ట్ హైలైట్స్ ప్రాబ్లుమ్స్ విత్ ఓటింగ్ టెక్నాలజీ యూజ్డ్". మూలం నుండి 2009-02-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 16. "ది ఓపెన్ రైట్స్ గ్రూప్ : బ్లాగ్ ఆర్కైవ్ » ORG వెర్డిక్ట్ ఆన్ లండన్ ఎలక్షన్స్: "ఇన్‌సఫిషియంట్ ఎవిడెన్స్" టు డిక్లేర్ కాన్ఫిడెన్స్ ఇన్ రిజల్ట్స్". మూలం నుండి 2009-04-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 17. "రూలింగ్ ఆఫ్ ది సెకండ్ సెనేట్ ఆఫ్ ది ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్ ఆఫ్ జర్మనీ, 3 మార్చి 2009". మూలం నుండి 2011-07-11 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 18. "జర్మన్ ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్ట్, ప్రెస్ రిలీజ్ నం. 19/2009, 3 మార్చి 2009". మూలం నుండి 2009-04-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 19. "రిక్వైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇండిపెండెన్స్ ఇన్ VVSG 2007: STS రికమెండేషన్స్ ఫర్ ది TGDC" (PDF). మూలం (PDF) నుండి 2013-10-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 20. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆన్ ది డ్రాఫ్ట్ రిపోర్ట్: "రిక్వైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇండిపెండెన్స్ ఇన్ VVSG 2007: STS రికమెండేషన్స్ ఫర్ ది TGDC"
 21. Pilot Study of the Scantegrity II Voting System Planned for the 2009 Takoma Park City Election (PDF), మూలం (PDF) నుండి 2011-07-19 న ఆర్కైవు చేసారు, retrieved 2010-05-21
 22. Hardesty, Larry. "Cryptographic voting debuts". MIT news. Retrieved 2009-11-30.
 23. ‘పేపర్ ట్రెయిల్’ ఓటింగ్ సిస్టమ్ యూజ్డ్ ఇన్ నెవెడా, అసోసియేటెడ్ ప్రెస్ సెప్టెంబరు 7, 2004
 24. నెవెడా ఇంప్రూస్ ఆడ్స్ విత్ e-ఓట్, CNN అక్టోబరు 29, 2004
 25. నీడాప్/గ్రోయెండాల్ ES3B ఓటింగ్ కంప్యూటర్ ఎ సెక్యూరిటీ ఎనాలిసిస్ (చాప్టర్ 7.1)
 26. ది ప్రాబ్లుమ్ విత్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్
 27. "ది ఎలక్ట్రానిక్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ సిస్టమ్". మూలం నుండి 2011-02-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 28. డి ఫ్రాంకో, A., పీట్రో, A., షీర్, E., మరియు వ్లాడిమిరావ్, V. 2004. చిన్న ఓటు హస్తలాఘవాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. కమ్యూనికేషన్. ACM 47, 10 (అక్టోబరు, 2004), 43-45. DOI= http://doi.acm.org/10.1145/1022594.1022621
 29. ఫ్లోరిడా ప్రైమరీ 2002: బ్యాక్ టు ది ఫ్యూచర్
 30. ఫెయిర్‌ఫాక్స్ టు ప్రోబ్ ఓటింగ్ మెషీన్స్ (వాషింగ్టన్ పోస్ట్, నవంబరు 18, 2003)
 31. గ్రెగ్ లూకాస్, "స్టేట్ బ్యాన్స్ ఎలక్ట్రానిక్ బ్యాలెటింగ్ ఇన్ 4 కౌంటీస్; టచ్-స్క్రీన్ ఫర్మ్ అక్యూస్డ్ ఆఫ్ 'రెప్రిహెన్సిబుల్,' ఇల్‌లీగల్ కండక్ట్" , శాన్‌ఫ్రాన్సిస్కో క్రానికల్ (మే 1, 2004) http://www.sfgate.com/cgi-bin/article.cgi?file=/chronicle/archive/2004/05/01/MNG036EAF91.DTL
 32. హార్డీ, మైఖేల్ (మార్చి 3, 2004). కాలిఫోర్నియా నిక్సెస్ e-ఓటింగ్ Archived 2005-06-13 at the Wayback Machine.. FCW.com .
 33. డైబోల్డ్ టు సెటిల్ E-ఓటింగ్ సూట్
 34. కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (ఫిబ్రవరి 17, 2006). అప్రూవల్ ఆఫ్ యూజ్ ఆఫ్ డైబోల్డ్ ఎలక్షన్ సిస్టమ్స్, ఇంక్ Archived 2006-05-02 at the Wayback Machine. .
 35. Kim, Zetter (2004-03-19). "E-Vote Snafu in California County". Wired. మూలం నుండి 2013-01-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21.
 36. http://www.minbzk.nl/contents/pages/82071/briefstemmachinses.pdf
 37. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-12-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 38. http://www.wijvertrouwenstemcomputersniet.nl/English
 39. AP వయా ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ (అక్టోబరు 30, 2006) డచ్ గవర్నమెంట్ స్క్రాప్స్ ప్లాన్స్ టు యూజ్ ఓటింగ్ కంప్యూటర్స్ ఇన్ 35 సిటీస్ ఇన్‌క్లూడింగ్ అమ్‌స్టర్‌డమ్
 40. టెస్ట్ రన్ ఫర్ ఓటింగ్ (మియామి హెరాల్డ్, 10/31/2006)[dead link]
 41. 41.0 41.1 41.2 పోల్ వర్కర్స్ స్ట్రగుల్ విత్ E-బ్యాలెట్స్[dead link]
 42. Thompson, Clive (January 6, 2008). "Can You Count on Voting Machines?". The New York Times. Retrieved March 29, 2010.
 43. "KHO: Kuntavaalit uusiksi Vihdissä, Karkkilassa ja Kauniaisissa". YLE Uutiset, Talous ja politiikka. YLE. 2009-04-09. Retrieved 2009-04-09.
 44. http://www.technologyreview.com/computing/21626/
 45. Grossman, Wendy M (30 April 2009). "Why machines are bad at counting votes". London: The Guardian. Retrieved 2009-07-14. Cite news requires |newspaper= (help)
 46. "CA SoS టాప్ టు బాటమ్ రివ్యూ". మూలం నుండి 2007-08-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21. Cite web requires |website= (help)
 47. సైమన్స్, బార్బరా. ఆగష్టు 13, 2007. "కాలిఫోర్నియా: ది టాప్ టు బాటమ్ రివ్యూ." ది ఓటర్ నవంబర్ 27, 2007న పునరుద్ధరించబడింది.
 48. రియోర్డన్, దెరీసా 13 సెప్టెంబరు 2006. [1] ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ. మార్చి 6 2008న తిరిగి పొందబడింది.
 49. "IGS Votomatic Prototype Goes to the Smithsonian". Institute of Governmental Studies, Public Affairs Report. University of California, Berkeley. 42 (4). Winter 2001. మూలం ([dead link]Scholar search) నుండి 2007-07-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-05-21.
 50. "లెజిస్లేటివ్ కమిటీ రిసొల్యూషన్ అవైటింగ్ BOD అప్రూవల్". జూలై 2004 ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్
 51. ఓరియజ్, చార్లెస్ (జులై 2004). "ఇన్ సెర్చ్ ఆఫ్ ఓటింగ్ మెషీన్స్ వుయ్ కెన్ ట్రస్ట్". ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్
 52. పాడ్‌గెట్, టిమ్. నవంబరు 3, 2007. "ఓటింగ్ అవుట్ E ఓటింగ్ మెషీన్స్" టైమ్ మేగజైన్. నవంబరు 28, 2007న తిరిగి పొందబడింది.
 53. రోసెన్‌ఫెల్డ్, స్టీవెన్. ఆగష్టు 8, 2007. ది ఫాలవుట్ ఫ్రమ్ కాలిఫోర్నియాస్ బ్యాన్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్. నవంబర్ 27, 2007న పునరుద్ధరించబడింది.
 54. 2007 [2] ది లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్. మార్చి 3, 2008న తిరిగి పొందబడింది.
 55. 55.0 55.1 2008 [3] Archived 2008-03-05 at the Wayback Machine. ఎలక్షన్ ఆర్కైవ్స్. మార్చి 3, 2008న తిరిగి పొందబడింది.
 56. 2008 [4] ఓపెన్‌కాంగ్రెస్. మార్చి 3, 2008న తిరిగి పొందబడింది.
 57. జనవరి మేగజైన్, "ది ఫిక్స్ ఈజ్ ఇన్"

బాహ్య వలయాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.