ఎలిజా నెల్సన్
| Personal information | |
|---|---|
| Birth name | ఎలిజా మెన్డోంకా |
| Born | 1956 సెప్టెంబరు 27 పుణె, మహారాష్ట్ర, భారతదేశం |
| Occupation | ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి |
ఎలిజా నెల్సన్ (ఆంగ్లం: Eliza Nelson; జననం 1956 సెప్టెంబరు 27), ఒక భారతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి, భారత మహిళల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు మాజీ కెప్టెన్.[1][2] ఆమె 1981లో అర్జున అవార్డు అందుకుంది. 1983లో భారత ప్రభుత్వం ఆమెకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[3][4]
కెరీర్
[మార్చు]ఎలిజా నెల్సన్ 1977లో వెస్ట్రన్ రైల్వే హాకీ జట్టులో చేరింది. ఆమె భారతీయ రైల్వే తరపున ఆడింది 1982లో న్యూఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన భారత జాతీయ జట్టుకు ఆమె నాయకత్వం వహించింది.[2][5] 1980 మాస్కో వేసవి ఒలింపిక్స్ లో నాలుగో స్థానం సాధించిన జట్టులో కూడా ఆమె సభ్యురాలు.[2][5] 2001లో ఆమె సెంట్రల్ రైల్వేకు స్పోర్ట్స్ ఆఫీసర్ అయింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఎలిజా నెల్సన్ మహారాష్ట్ర పూణేలో గోవా కుటుంబంలొ జన్మించింది. ఆమెకు ఇద్దరు సోదరులు, అగస్టీన్, ఫెలిక్స్, ఇద్దరు సోదరీమణులు, ఐరీన్, సలోమీ ఉన్నారు. ఆమె కేరళకు చెందిన హాకీ క్రీడాకారుడు డారిల్ ను వివాహం చేసుకుని పూణేలో పదవీ విరమణ జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రియా అమెరికాలోని ఒక ఫార్మా సంస్థకు డైరెక్టర్, రెబెక్క ముంబైలో ఫ్యాషన్ డిజైనర్.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Indian Sports Portal". Indian Sports Portal. 2015. Archived from the original on 10 July 2015. Retrieved 9 July 2015.
- 1 2 3 "Eliza Nelson". Sports Reference. 2015. Archived from the original on 2020-04-18. Retrieved 9 July 2015.
- ↑ "Arjuna Awardees List". News Choupal. 6 August 2010. Archived from the original on 10 జూలై 2015. Retrieved 9 July 2015.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 18 June 2015.
- 1 2 "Poor planning cost us medal in 1980 Olympics". 25 July 2012. Retrieved 9 July 2015.
- 1 2 "INDIAN HOCKEY'S GOLDEN GIRL ELIZA NELSON". Stick2Hockey (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-10.