Coordinates: 14°39′23″N 77°55′13″E / 14.656450°N 77.920331°E / 14.656450; 77.920331

ఎల్లుట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎల్లుట్ల, అనంతపురం జిల్లా, పుట్లూరు మండలానికి చెందిన గ్రామం.

ఎల్లుట్ల Ellutla
—  రెవెన్యూ గ్రామం  —
ఎల్లుట్ల Ellutla is located in Andhra Pradesh
ఎల్లుట్ల Ellutla
ఎల్లుట్ల Ellutla
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°39′23″N 77°55′13″E / 14.656450°N 77.920331°E / 14.656450; 77.920331
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం పుట్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి బైనేని వెంగముని
జనాభా (2011)
 - మొత్తం 2,296
 - పురుషుల సంఖ్య 1,176
 - స్త్రీల సంఖ్య 1,120
 - గృహాల సంఖ్య 528
పిన్ కోడ్ 515425
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన పుట్లూరు నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడిపత్రి నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 606 ఇళ్లతో, 2372 జనాభాతో 2538 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1170, ఆడవారి సంఖ్య 1202. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 550 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595030[1].పిన్ కోడ్: 515414.

అహ్లాదకర వాతావరణం[మార్చు]

గ్రామం చుట్టూ అరటితోటలుతో, కొండల మధ్యనా పచ్చని చెట్ట్ల్లతో కళకళలాడుతుంది.చుట్టూ కొండలు.. చెట్ల మధ్యన గ్రామం.. ప్రతి ఇంటిముందు చెట్లు. పాడి పశువులు, కోళ్ళు, గొర్రెలు ఉంటాయి.ఎల్లుట్ల గ్రామంలో 320 ఇళ్ళు ఉండగా అందరు ఉదయం అయ్యే సరికి చేతిలో అన్నం క్యారీలను చేతబట్టుకొని తోటలలోని పనులకు వెళ్తూ దర్శనం ఇస్తారు. అలాగే మరి కొందరు అరటిగెలలును లోడ్ చేయడానికి వాహనాలలో దర్శనం ఇస్తారు. ఉదయం అయ్యే సరికి గ్రామం యొక్క ప్రధాన సర్కిల్ రవాణా వాహనలుతో రద్దీగా కనిపిస్తుంది.ఎల్లుట్ల చాలా ఆహ్లాదకరమైనటు వంటి ప్రదేశం. చుట్టూ చూడదగ్గ పచ్చనికొండలు, పచ్చనిపంట పొలాలు, చల్లనిగాలి వీటితో చూడదగ్గ సుందరమైనటు వంటి ప్రదేశం.అరటితోటలుకు ప్రసిద్ధి చెందింది.ఈ గ్రామాన్ని చూడగానే మనము ఏమైనా కోనసీమకు వచ్చామా అన్నట్లుగా అనిపిస్తుంది. తోటలో ఇంట్లో వాడుకకు కావాల్సిన కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు. తోటలో అరటి, మామిడి, దానిమ్మ, సీతాపలం పండిస్తున్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది.

పాడి పుష్కలం[మార్చు]

ప్రతి ఇంటికి పాడి పశువులు సంవృద్దిగా ఉన్నాయి. చుట్టూ కొండలు ఉండటంతో అందరు వ్యవసాయం చేస్తున్నారు. గ్రాసం సమస్య లేక పోవటంతో ప్రతి ఇంటికి స్థాయి తగ్గటు పశువులు ఉన్నాయి. దీంతో గ్రామం పశువులతో కళకళలాడుతుంది.

అదనపు ఆదాయం[మార్చు]

గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను పోషిస్తున్నారు. జీవాలను పోషించటం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. వ్యవసాయ పనులు చేయలేని వృద్ధులు వీటిని పోషిస్తూ కుటుంబ పోషణకు తమ వంతు బాధ్యతనిర్వహిస్తున్నారు. వీటితో పాటు కోళ్ళను పెంచుతున్నారు.

బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు పండించడం[మార్చు]

ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు అభివృదిపథంలో ముందున్నారు. అరటి, దానిమ్మ, టమోటా, మిరప, వేరుసెనగ పంటలు పండిస్తారు. తక్కువ వర్షపాతం నమోదు అవుతున్నా.. గ్రామంలో వాటర్ షెడ్ వారు నిర్మించినా చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించడంవల్ల వర్షపు నీరు వృధాగా వెళ్ళకుండా ఎక్కడ పడినటువంటి వర్షపు నీరు అక్కడే నిలువ ఉన్న్డటం వాళ్ళ కోద్దిగా భూగర్భ జలాలు ఉండటంతో ఏడాదిలో మూడు పంటలను పండింస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర్ల సేద్యం పరికరాల ద్వారా అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు.పల్లె చుట్టూ పచ్చని పందిరి వేసినట్లుగా కనిపిస్తున్నాయి.

గ్రామంలోని ప్రధాన దేవాలయాలు[మార్చు]

శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం:ఈ ఆలయం గ్రామానికి సూమారుగా 2కిలో మీటర్లు దూరంలో ఉంది. శ్రీరాముడు ఈ మార్గంలో వెళుతూ ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠ చేశాడని పురాతణ ఆధారాలున్నాయి. ఈ ఆలయం ప్రక్కన "నీటి బుగ్గల ద్వారా ఈనదీ ప్రవహిస్తుంది. ఈ ఆలయం ముందర కోలనులో తామరపుష్పాలు, కలువపుష్పాలు కనువిందు చేస్తున్నాయి. అలాగే అతి విశాలమయినటు వంటి 2అంతస్తులు కళ్యాణమండపం కూడా ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఎడ్లలాగుడు పోటీలు నిర్వహిస్తారు.

ఇంకా అంకాలమ్మదేవాలయం, పెద్దమ్మ దేవాలయం, చెన్నకేశవస్వామిదేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, రామాలయం, ప్రధానదేవాలయాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి నార్పలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల నార్పలలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు అనంతపురంలో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పుట్లూరులోను, ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ఎల్లుట్లలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ఎల్లుట్లలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ఎల్లుట్లలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1346 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 58 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 101 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 114 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 5 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 10 హెక్టార్లు
  • బంజరు భూమి: 257 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 646 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 463 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 450 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ఎల్లుట్లలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 450 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ఎల్లుట్లలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.ఎల్లుట్లలో 99%శాతం ప్రజలు అందరు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. మిగతా10%శాతం వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తున్నారు.

ప్రధాన పంటలు[మార్చు]

ఎల్లుట్లలో పండించే పంటలు అరటి, వేరుశనగ, పప్పుశనగ, టమోటా, మిరప, దానిమ్మ, కోత్తిమీర, వేరుశనగ, పొద్దుతిరుగుడు మొదలయినటు వంటి అంతరపంటలును పండిస్తారు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్లుట్ల&oldid=4124527" నుండి వెలికితీశారు