ఎల్లూరి శివారెడ్డి
Jump to navigation
Jump to search
ఎల్లూరి శివారెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఉపకులపతి[1] . మహబూబ్నగర్ జిల్లా, వీపనగండ్ల మండలం కల్లూరులో జన్మించాడు. ఎం.ఏ (తెలుగు)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడై స్వర్ణపతకం సాధించాడు. "ఆంధ్ర మహాభారతంలో రసపోషణ" (విరాట, ఉద్యోగ పర్వాలు) అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి.పట్టా సంపాదించాడు. ఇతను రాసిన సురవరం ప్రతాపరెడ్డి జీవితం-సాహిత్యం అను గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది, పలు గ్రంథాలకు సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[2]. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి రీడరుగా, ప్రొఫెసరుగా, తెలుగు శాఖాధిపతిగా పనిచేసి 2012లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమింపబడ్డాడు.
రచనలు[మార్చు]
- తిక్కన రసభారతి
- రసరేఖలు
- భావదీపాలు
- పూలకారు
- సురవరం ప్రతాపరెడ్డి జీవితం-సాహిత్యం
- పరిణతవాణి (ఐదు సంపుటాలు)
- ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్యం
మూలాలు[మార్చు]
- ↑ ఐ.బి.ఎన్.లో
- ↑ పాలమూరు కవిత, సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-157