ఎల్.ఆర్.అంజలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్.ఆర్.అంజలి
ఎల్.ఆర్.అంజలి
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలినేపథ్య గానం
వృత్తిగాయని

ఎల్.ఆర్.అంజలి ఒక సినిమా నేపథ్య గాయని. ఈమె గాయని ఎల్.ఆర్.ఈశ్వరికి చెల్లెలు. ఈమె తల్లి నిర్మల 1950లలో సినిమాలలో కోరస్ పాడేది. ఈమె తండ్రి దేవరాజన్ మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు.ఈమె బాల్యంలోనే తండ్రి మరణించాడు. ఈమె చదువు మద్రాసు ఎగ్మోర్‌లోని ప్రెసిడెన్సీ హైస్కూలులో గడిచింది. తర్వాత రాజారాం అయ్యంగార్ వద్ద సంగీతాన్ని, మీనాక్షి సుందరం పిళ్లై వద్ద శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించింది.[1] ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో పాటలు పాడింది.

తెలుగు సినిమా పాటల జాబితా

[మార్చు]

ఎల్.ఆర్.అంజలి ఎం.ఎస్.విశ్వనాథన్, జె.వి.రాఘవులు, రమేష్ నాయుడు, కె.చక్రవర్తి, చెళ్ళపిళ్ళ సత్యం, టి.చలపతిరావు, విజయభాస్కర్ వంటి సంగీత దర్శకులు స్వరపరచిన పాటలను, ఆరుద్ర, కొసరాజు రాఘవయ్యచౌదరి, సి.నారాయణరెడ్డి, రాజశ్రీ, దాశరథి రంగాచార్య, అప్పలాచార్య, దాసం గోపాలకృష్ణ, ఆత్రేయ, అనిసెట్టి సుబ్బారావు, ఉత్పల సత్యనారాయణాచార్య, వేటూరి సుందరరామమూర్తి మొదలైన కవులు వ్రాసిన గేయాలను పాడింది. ఈమె ఎల్.ఆర్.ఈశ్వరి, పి.బి.శ్రీనివాస్, వాణీ జయరామ్, బి.వసంత, పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోలా, మాధవపెద్ది రమేష్, జి.ఆనంద్ వంటి గాయకులతో కలిసి అనేక పాటలు పాడింది.


ఈమె గానం చేసిన తెలుగు పాటలలో కొన్ని[2] ఈ క్రింది జాబితాలో:

క్రమ సంఖ్య సినిమా పేరు పాట పల్లవి సహ గాయకుడు/ గాయిని సంగీత దర్శకుడు గేయ రచయిత సినిమా విడుదలైన సంవత్సరం
1 బుల్లెట్ బుల్లోడు ఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేని ఎల్.ఆర్. ఈశ్వరి ఎం.ఎస్.విశ్వనాథన్,
జె.వి.రాఘవులు
ఆరుద్ర 1972
2 ఇంటింటి కథ రమణి ముద్దుల గుమ్మ రావే నా రాజనిమ్మల పి.బి. శ్రీనివాస్ రమేష్ నాయుడు కొసరాజు 1974
3 చందన ఏందే నాగు ఈడున్నావ్ ఓం భాయిరే షోక్ లంగారి రాజబాబు రమేష్ నాయుడు సినారె 1974
4 తిరపతి తప్పెట్లోయి తాళలోయి దేవుడి గుళ్ళో వాణీ జయరామ్,
చక్రవర్తి
చక్రవర్తి కొసరాజు 1974
5 తులాభారం వాణీ ప్రేమ రాణీ వినవేల పద్మనాభం,
వసంత,
పిఠాపురం
సత్యం రాజశ్రీ 1974
6 బంట్రోతు భార్య పిడికెడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
రమోలా,
చంద్రశేఖర్,
రఘురాం
రమేష్ నాయుడు దాశరథి 1974
7 ముగ్గురమ్మాయిలు చిట్టిబాబు స్వాగతం చేరింది ఉత్తరం ముస్తాబై ఎల్.ఆర్.ఈశ్వరి,
శరావతి
టి.చలపతిరావు సినారె 1974
8 హారతి కప్పాఅందరికన్నానువ్వే కె.చక్రవర్తి,
పద్మనాభం
కె.చక్రవర్తి అప్పలాచార్య 1974
9 కవిత బాజా భజంత్రీలు మ్రోగుతాయి పందిట్లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు 1976
10 మహాత్ముడు రంభలాగున్నది రమ్ము తీసుకొచ్చింది రమేష్,ఆనంద్,విల్సన్ టి.చలపతిరావు కొసరాజు 1976
11 చిల్లరకొట్టు చిట్టెమ్మ చీటికి మాటికి చిట్టెమ్మంటె చీపురు దెబ్బలు తింటావురో శారద రమేష్ నాయుడు దాసం గోపాలకృష్ణ 1977
12 జీవన తీరాలు అరేయ్ సాంబా ఎం.రమేష్ చక్రవర్తి ఆత్రేయ 1977
13 దొంగలు చేసిన దేవుడు అనంత దాయకి ఆలింపవా ఆరాధ్య దైవమా ఎల్.ఆర్.ఈశ్వరి ఎం.ఎస్.విశ్వనాథన్,
విజయా కృష్ణమూర్తి
అనిసెట్టి 1977
14 బొమ్మరిల్లు చల్లని రామయ్య చక్కని సీతమ్మ జి.ఆనంద్,
పిఠాపురం
చక్రవర్తి ఉత్పల 1978
15 అమ్మాయి కావాలి వస్తావా అమ్మాకుట్టి చేక్కేదాం చెన్నపట్నం ఎం. రమేష్ చక్రవర్తి 1979
16 కలియుగ మహాభారతం బురు బురు పిట్టా బురు పిట్ట ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎం.రమేష్,
రమోల
సత్యం 1979
17 విజయ బూర్లొండేదా బావా గార్లొండేదా బూరులైతే చంద్రశేఖర్ చక్రవర్తి వేటూరి 1979
18 దారి తప్పిన మనిషి కలగంటున్నాయి నీ కళ్ళు సలసల కాంగింది నీ ఒళ్ళు విజయభాస్కర్ 1979
18 పటాలం పాండు వస్తావా అమ్మకుట్టి చేక్కేదాం ఎం.రమేష్ చక్రవర్తి ఆరుద్ర 1981
19 బందరు పిచ్చోడు ఇంటి పెట్ట ఒకటున్నా అది విడవలేనిదని పార్థసారథి పార్థసారథి భావశ్రీ 1981
20 బందరు పిచ్చోడు దుత్త మీద దుతెట్టి బుట్టలోన కూడెట్టి పార్థసారథి పార్థసారథి యు.వి.బాబు 1981

మూలాలు

[మార్చు]
  1. "సినిమా ఎక్స్‌ప్రెస్ పత్రిక నుండి". Archived from the original on 2020-03-22. Retrieved 2020-03-22.
  2. కొల్లూరి భాస్కరరావు. "ఎల్.ఆర్.అంజలి". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 3 డిసెంబరు 2019. Retrieved 22 March 2020.