ఎల్.ఎ. రవి సుబ్రమణ్య
ఎల్.ఎ. రవి సుబ్రమణ్య | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2008 | |||
ముందు | కె. చంద్రశేఖర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బసవనగుడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిక్కమగళూరు , కర్ణాటక, భారతదేశం | 1958 మే 20||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
బంధువులు | తేజస్వి సూర్య (మేనల్లుడు) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ఎల్.ఎ. రవి సుబ్రమణ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బసవనగుడి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఎల్.ఎ. రవి సుబ్రమణ్య భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బసవనగుడి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి కె. చంద్రశేఖర్ పై 13200 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె. బాగేగౌడపై 19713 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఎల్.ఎ. రవి సుబ్రమణ్య 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బసవనగుడి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి కె. బాగేగౌడపై 38009 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి యు.బి. వెంకటేష్ పై 54,978 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Basavanagudi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 24 April 2025. Retrieved 24 April 2025.