ఎవరేమన్నా ఏమనుకున్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పాటని ఆరుద్ర రచించారు. దీన్ని మల్లిక్ స్వరపరచి గానంచేయగా చాలా ప్రజాదరణ పొందింది.


రాగం: ఆభేరి (హిందూస్తానీ భీంప్లాస్) తాళం: ఆది (హిందూస్తానీ కహరువా)

<poem>

సాకీ: జాబిలీ నీ గాథ ఒక వింత గాథ

        నీ వెలుగు లోనే తొలగు మా బాధ 

ఎవరేమన్నా ఏమనుకున్నా చంద్రా ఆగకు నీ మదిలో నమ్మిన దానిని నీవు చేయుట మానకు ॥

నిను చూడగానే కమల కాంతులు రుసరుసలాడినా నిను గని కలువ కన్నెల మనసు మిసమిసలాడినా వెన్నెలలో నవప్రేమికులెంతో సంతోషించినా వెలుగును చూసి కన్నపు దొంగలు కాదు దూషించినా ॥

తారాసతిమది దొంగిలించితే మునులూ దేవతలూ నేరాన్నేదో చేశావని నిను నిందించారోయీ హాలాహలమును మ్రింగిన శివునకు చలువ కూర్చగానే చాల యోగ్యుడవని నిను వారే సన్నుతించిరోయీ ॥