ఎవరైనా ఎప్పుడైనా
ఎవరైనా ఎప్పుడైనా (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | మార్తాండ్ కె. శంకర్ |
---|---|
తారాగణం | ఆలీ, బ్రహ్మానందం, గిరిబాబు, విమలా రామన్,[1] కోట శ్రీనివాసరావు, రమాప్రభ, వేణు మాధవ్ |
సంభాషణలు | రాజసింహ |
నిర్మాణ సంస్థ | ఏ.వి.యం.ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 జూన్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఎవరైనా ఎప్పుడైనా 2009లో విడుదలైన తెలుగు సినిమా. ఏ.వి.యం. ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణా గుహన్, అపర్ణ గుహన్ లు నిర్మించిన ఈ సినిమాకు మార్తాండ్ కె.శంకర్ దర్శకత్వం వహించాడు. ఆలీ, బ్రహ్మానందం, గిరిబాబు. విమలారామన్ ప్రధాన తారగణంగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతన్నందించాడు.[2]
కథ
[మార్చు]ఈ కథ విభిన్న స్వభావాలు, విరుద్ధమైన ఆలోచనలతో కూడిన ప్రధాన జత చుట్టూ తిరుగుతుంది. వెంకట్ (వరుణ్) స్వార్థపరుడు, మధుమిత (విమల రామన్) తన జీవితాన్ని ఇతరులకు సహాయం చేయడానికి అంకితం చేసే వ్యక్తి. మధుమితను చూసినప్పుడు ఇది మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. అతను ప్రపోజ్ చేయబోతున్నప్పుడు, మధుమిత తన తండ్రి తన కోసం ఒక సంబంధం చూసి అంగీకరించినట్లు చెప్పింది. మధుమిత నిశ్చితార్థం చేసుకోవాలని వెంకట్ ఊహిస్తాడు. నిశ్చితార్థాన్ని విచ్ఛిన్నం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అయితే, అలా చేసిన తరువాత, అది మధుమిత నిశ్చితార్థం కాదని, ఆమె అక్క నిశ్చితార్థం అని తెలుసుకుంటాడు. ఇప్పుడు, అతను తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకుంటాడు. దీని కోసం అతను చేసే ప్రయత్నంలో మిగిలిన కథ నడుస్తుంది.[3]
తారాగణం
[మార్చు]- వరుణ్ సందేశ్ వెంకట్ గా
- విమల రామన్ మధుమితగా
- రమాప్రభ బామ్మగా
- గిరి బాబు మధుమిత తండ్రిగా
- అలీ శివుమ్, మధుమిత యొక్క బావ
- రష్మి గౌతమ్ మధుమిత సోదరి
- వేణు మాధవ్ డాక్టర్ భార్గవ్ గా
- బ్రహ్మానందం కుటుంబరావు (ప్రత్యేక ప్రదర్శన)
- ఆదర్శ్ బాలకృష్ణ రాజాగా
- దువ్వాసి మోహన్
- సురేఖా వాణి
పాటలు
[మార్చు]- ఆకాశంలో, రచన:కృష్ణచైతన్య , గానం.టిప్పు
- మళ్లీ మళ్ళి , రచన: రహమాన్ , గానం. రాహూల్ నంబియార్ , రీటా
- నామనసే , రచన.భాస్కర భట్ల రవికుమార్, గానం.రంజిత్
- మధుర యాతన, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. రీటా
- వారెవ్వా , రచన:రెహమాన్ , గానం. రీటా
- నీలాలు కారు , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం. హేమచంద్ర, మాళవిక
- వానేమో తడిసి , రచన:కృష్ణచైతన్య , గానం. వరుణ్ సందేశ్
- నారా నారాఅంటివా , రచన: కృష్ణచైతన్య , గానం.రాహూల్ నంబియార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: మార్తాండ్ కె. శంకర్
- స్టుడియో: ఎ.వి.యం
- నిర్మాతలు: ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణా గుహన్, అపర్ణ గుహన్
- సంగీతం మణిశర్మ
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, సినిమా (11 June 2020). "హాట్ పిక్స్‌తో టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ". www.andhrajyothy.com. Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.
- ↑ "Evaraina Epudaina (2009)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ Jun 27, Updated:; 2009; Ist, 17:43. "Evaraina Epudaina.....: Get off anytime". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)