Jump to content

ఎస్.ఎం. బాషా

వికీపీడియా నుండి
ఎస్.ఎం. బాషా
జననం
షేక్ మహబూబ్ బాషా

(1963-07-01) 1963 జూలై 1 (వయసు 61)
జాతీయతభారతీయుడు
వృత్తిఅసిస్టెంట్ మేనేజర్ (భారతీయ స్టేట్ బ్యాంక్)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు , సినిమా నటుడు
జీవిత భాగస్వామిషేక్ మెహరున్నీసా బేగం
పిల్లలుషేక్ మన్సూర్ ఆశిష్, షేక్ మునీర్ బాషా
తల్లిదండ్రులుషేక్ మౌలాలీ, షేక్ మైమున్

ఎస్.ఎం. బాషా (షేక్ మహబూబ్ బాషా) నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.[1]

జననం

[మార్చు]

బాషా 1963, జూలై 1న షేక్ మౌలాలీ, షేక్ మైమున్ దంపతులకు ప్రకాశం జిల్లా లోని యర్రగొండపాలెంలో జన్మించాడు. తండ్రి మౌలాబి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి. బదిలీపై తెనాలి రావటంతో తెనాలిలోనే బాషా తన ప్రాథమిక విద్యను చదివాడు.[2]

వివాహం

[మార్చు]

1988, ఏప్రిల్ 10న షేక్ మెహరున్నీసా బేగంతో బాషా వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు షేక్ మన్సూర్ ఆశిష్, షేక్ మునీర్ బాషా.

ఉద్యోగం - ప్రస్తుత నివాసం

[మార్చు]

బాషా 1986లో భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరి, అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసి 2023 జూన్‌లో పదవీ విరమణ పొందాడు. హైదరాబాద్ లోని మణికొండలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

నాటకరంగ ప్రస్థానం

[మార్చు]

బీఎస్‌ఎన్‌ఎల్‌ లోని తోటి ఉద్యోగులతో కలిసి తన తండ్రి నాటకాలు వేయడంతో బాషా కూడా ఆ రిహార్సల్స్‌, నాటక ప్రదర్శనలు చూస్తూ పెరిగాడు. తర్వాత నరసరావుపేటకి బదిలీ అయినపుడు కూడా నాటకాలు చూశాడు. హైస్కూల్ చదువు సమయంలో ఫిరంగిపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఏకపాత్రల పోటీల్లో ద్వితీయ బహుమతి అందుకున్నాడు. కాలేజీ విద్యార్థిగా నరసరావుపేటలోని ‘రంగస్థలి’లో భాగస్వామిగా అనేక నాటకాలు ప్రదర్శించాడు. విశ్వవిద్యాలయం పోటీల్లో బాషా దర్శకత్వంలో ప్రదర్శించిన ‘జాతర’ నాటికకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు, విలన్‌ బహుమతులు కూడా వచ్చాయి.

గుంటూరులో రంగస్థల కళాకారుల ఐక్యవేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా అయిదేళ్లు పనిచేశాడు. హైదరాబాద్‌లోనే నిర్వహించిన నంది నాటకోత్సవాలను వివిధ జిల్లాల్లో జరగటానికి చొరవ తీసుకున్నాడు. కళాకారుల పింఛనుకు, గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌కు కృషిచేశాడు. బాషా, తను పనిచేసిన బ్యాంకు శాఖల్లో 200 మందిని నటీనటులుగా తీర్చిదిద్దాడు. బ్యాంక్‌ డే రోజున వారిచే నాటకాలను ప్రదర్శించేలా చేశాడు. కళాకృష్ణచే ‘బతుకమ్మ పేరిణి’ నృత్యరూపకాన్ని ముంబయిలో బ్యాంక్‌ దినోత్సవ రోజున ప్రదర్శన చేయించాడు.

బ్యాంకు ఉద్యోగం కారణంగా వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్ళినా కూడా నాటకాన్ని ఆపలేదు. తన నాటకరంగ జీవితంలో 60 నాటిక/నాటకాలను వందల ప్రదర్శనలిచ్చాడు, దర్శకత్వం వహించాడు. 60 మంది టీమ్‌తో ‘రంగులరాట్నం’ నాటకాన్ని విస్తృతంగా ప్రదర్శనలు చేశారు. కథా రచయిత గంధం నాగరాజుతో నాటకాలు రాయించాడు.[2]

నటించినవి

[మార్చు]
  1. విష పుష్పాలు
  2. కారులో షికారు
  3. ఆత్మగీతం
  4. జీవని
  5. దివ్యధాత్రి
  6. కన్యాశుల్కం
  7. నోట్ దిస్ పాయింట్
  8. అభయం
  9. యాజ్ఞసేని
  10. నిషిద్దాక్షరి
  11. పడమటిగాలి
  12. రాగరాగిణి
  13. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
  14. రంగులరాట్నం
  15. శేషార్థం
  16. ఉత్తీతపాట
  17. పలస
  18. పాదుకా స్వామ్యం
  19. కన్నీటికథ
  20. ఆకాశదేవర
  21. అందిన ఆకాశం[3][4]

దర్శకత్వం వహించినవి

[మార్చు]
  1. వలస
  2. ఆత్మగీతం
  3. దివ్యధాత్రి
  4. నోట్ దిస్ పాయింట్
  5. రంగులరాట్నం
  6. శేషార్థం
  7. ఉత్తీతపాట
  8. జీవని
  9. పాదుకా స్వామ్యం
  10. కొక్కొరొక్కొ
  11. కన్నీటికథ[5][6]
  12. చివరి గుడిసె[7]
  13. లక్షణరేఖ దాటాతే

నటించిన చిత్రాలు

[మార్చు]
  1. లక్ష్మి
  2. మహాత్మ
  3. గోల్కొండ హైస్కూల్
  4. బాణం

పురస్కారాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

నంది అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ దర్శకుడు - కన్నీటికథ (2013)
  • ఉత్తమ సహాయ నటుడు - శేషార్థం (2007- రాజమండ్రి)

ఇతర అవార్డులు

[మార్చు]

మాలాలు

[మార్చు]
  1. "ముగిసిన నాటిక పోటీలు". EENADU. 2022-04-03. Archived from the original on 2022-04-03. Retrieved 2023-05-19.
  2. 2.0 2.1 "మినీ నాటకశాలలే దిక్సూచి". www.sakshi.com. 2024-07-14. Archived from the original on 2024-07-14. Retrieved 2024-07-14.
  3. వెబ్ ఆర్కైవ్, నమస్తే తెలంగాణ, వరంగల్ సిటీ (12 February 2018). "ఆకట్టుకుంటున్న నాటకోత్సవాలు". Archived from the original on 17 April 2018. Retrieved 17 April 2018.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  4. ఈనాడు, పాలకొల్లు పట్టణం (5 April 2021). "ముగిసిన జాతీయ స్థాయి నాటికోత్సవాలు". Archived from the original on 22 June 2021. Retrieved 22 June 2021.
  5. నవతెలంగాణ. "నాటకం సమాజ ప్రతిబింబం : కెవి రమణ". Retrieved 1 July 2017.
  6. ప్రజాశక్తి. "ఎన్‌టిఆర్‌ కళాపరిషత్‌ నాటకోత్సవాల ఫలితాలు విడుదల". Retrieved 1 July 2017.
  7. ప్రజాశక్తి, కర్నూలు కల్చరల్‌ (17 May 2016). "యానాది జాతుల యదార్థగాథ 'చివరి గుడిసె'". www.prajasakti.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
  8. చిలకలూరిపేట బ్లాగ్. "చిలకలూరిపేట కళాపరిషత్ రాష్టస్తాయి నాటికల పోటీల ఫలితాలు". chilakaluripet1.blogspot.in. Retrieved 1 July 2017.[permanent dead link]
  9. అభినయ (1 May 2012). పరిచూరి ఫలితాలు. p. 27.