ఎస్.ఎ. రామదాస్
| ఎస్.ఎ. రామదాస్ | |||
వైద్య విద్య సహాయ మంత్రి | |||
| పదవీ కాలం 2010 సెప్టెంబర్ 23 – 2013 మే 13 | |||
| పదవీ కాలం 2018 – 2023 | |||
| ముందు | ఎం.కె. సోమశేఖర్ | ||
|---|---|---|---|
| తరువాత | టీ.ఎస్. శ్రీవత్స | ||
| నియోజకవర్గం | కృష్ణరాజ | ||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| ముందు | ఎం.కె. సోమశేఖర్ | ||
| తరువాత | ఎం.కె. సోమశేఖర్ | ||
| నియోజకవర్గం | కృష్ణరాజ | ||
| పదవీ కాలం 1994 – 2004 | |||
| ముందు | కె.ఎన్. సోమసుందరం | ||
| తరువాత | ఎం.కె. సోమశేఖర్ | ||
| నియోజకవర్గం | కృష్ణరాజ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 నవంబరు 4 మైసూర్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | No. 1063/77, A 1వ ప్రధాన రహదారి, 6వ క్రాస్, విద్యారణ్యపుర, మైసూర్ – 570008.[1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
ఎస్. అశ్వత్ నారాయణ రావు, రామదాస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై డి.వి. సదానంద గౌడ మంత్రివర్గంలో వైద్య విద్య సహాయ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎస్.ఎ. రామదాస్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి ఎం. వేదంత హెమ్మిగేపై 9,363 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ పై 9,752 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఎస్.ఎ. రామదాస్ 2004 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ చేతిలో 3,394 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ పై 19,422 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మే 2008లో ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్పకు పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు.[3] ఎస్.ఎ. రామదాస్ 2010లో యడ్యూరప్ప మంత్రివర్గంలో వైద్య విద్య శాఖ సహాయ మంత్రిగా, ఆ తరువాత డి.వి. సదానంద గౌడ మంత్రివర్గంలో వైద్య విద్య శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2008 నుండి 2013 వరకు మైసూర్ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు.
ఎస్.ఎ. రామదాస్ 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ చేతిలో 6,065 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఎం.కె. సోమశేఖర్ పై 26,347 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5]
ఎస్.ఎ. రామదాస్ కు 2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కృష్ణరాజ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్ దక్కలేదు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "MLA's of Karnataka". Karnataka government. Archived from the original on 10 April 2009. Retrieved 23 February 2009.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "MYSORE MUSINGS". The Hindu. 16 Sep 2008. Archived from the original on 18 September 2008. Retrieved 23 February 2009.
- ↑ "In Mysuru, Congress tally falls to 3 seats | In Mysuru, Congress tally falls to 3 seats" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 17 May 2018. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka polls: BJP denies Krishnaraja ticket to SA Ramadas; TS Srivatsa in fray". The Times of India. 18 April 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.
- ↑ "Karnataka elections | Ramdas pledges to continue as 'ordinary BJP worker'" (in Indian English). The Hindu. 18 April 2023. Archived from the original on 13 May 2025. Retrieved 13 May 2025.