సూదిని జైపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
(ఎస్.జైపాల్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సూదిని జైపాల్ రెడ్డి
పార్లమెంటు సభ్యుడు
వ్యక్తిగత వివరాలు
జననం (1942-01-16) 16 జనవరి 1942 (వయస్సు: 76  సంవత్సరాలు)
మాడుగుల, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
భాగస్వామి లక్ష్మి
సంతానం 2 కుమారులు మరియు 1 కుమార్తె
నివాసం మాడ్గుల్
As of September 16, 2006
Source: [1]

సూదిని జైపాల్ రెడ్డి (జ: 16 జనవరి, 1942) ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు. ఇతను ప్రస్తుతం పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిగా పదవిని నిర్వహిస్తున్నాడు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టా పొందాడు. ఈయన కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యాడు. ముందుగా కాంగ్రెసు పార్టీ సభ్యునిగా ఉన్నా, అత్యవసర పరిస్థితి నివ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరాడు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడు. ఇతను భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. తరువాత భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యాడు. రాజ్యసభ సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డాడు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా 1991-1992 లో ఉన్నాడు. రెండు సార్లు సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశాడు.

జైపాల్ రెడ్డి చట్ట సభలలో చేసిన డిబేట్లు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఇతను అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా 1998లో ఎన్నుకోబడ్డాడు.

బయటి లింకులు[మార్చు]