Jump to content

ఎస్.పి. సింగ్ పటేల్

వికీపీడియా నుండి
ఎస్.పి. సింగ్ పటేల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు సంగం లాల్ గుప్తా
నియోజకవర్గం ప్రతాప్‌గఢ్

పదవీ కాలం
2002 మే 5 – 2014 మే 4
నియోజకవర్గం లక్నో పట్టభద్రుల

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-01) 1956 జనవరి 1 (వయసు: 70)
సదర్‌పూర్, హర్దోయ్ జిల్లా, ఉత్తర ప్రదేశ్
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
తల్లిదండ్రులు రామ్ లాల్ సింగ్, కమలా దేవి
జీవిత భాగస్వామి కాంతి సింగ్ పటేల్
సంతానం 4
పూర్వ విద్యార్థి అలహాబాద్ విశ్వవిద్యాలయం
మూలం [1]

డాక్టర్ శివ్ పాల్ సింగ్ పటేల్ (జననం 1 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రతాప్‌గఢ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎస్.పి. సింగ్ పటేల్ 1956 జనవరి 1న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, హర్దోయ్‌ జిల్లాలోని సదర్‌పూర్‌ గ్రామంలో రామ్ లాల్ సింగ్, కమలా దేవి దంపతులకు జన్మించారు. ఆయన వృక్షశాస్త్రంలో ఎం.ఎస్సీ, పిహెచ్‌డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్.పి. సింగ్ పటేల్ సమాజ్‌వాదీ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2002 మే 5 నుండి 2008 మే 4 వరకు & 2008 మే 5 నుండి 2014 మే 4 వరకు వరుసగా రెండుసార్లు లక్నో పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఎస్.పి. సింగ్ పటేల్ 2022లో ఝాన్సీ ఉపాధ్యాయ నియోజకవర్గంకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బాబు లాల్ తివారీ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

ఎస్.పి. సింగ్ పటేల్2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ప్రతాప్‌గఢ్ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంగం లాల్ గుప్తాపై 66,206 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. "Who is Dr. SP Singh Patel? SP Nominates Him for Lok Sabha from Pratapgarh". Rashtrawadi News. 21 February 2024. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  3. "प्रतापगढ़ से जीतने वाले समाजवादी पार्टी के एसपी सिंह पटेल कौन हैं? जानें अपने सांसद के बारे में". TV9 Bharatvarsh. 5 June 2024. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  4. "Lok Sabha 2024 Election Results: Pratapgarh". Election Commission of India. 4 June 2024. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.