ఎస్.పి.కోదండపాణి

వికీపీడియా నుండి
(ఎస్.పీ.కోదండపాణి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఎస్.పి.కోదండపాణి
ఎస్.పి.కోదండపాణి
జననంశ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
1932
గుంటూరు
మరణం1974 ఏప్రిల్ 5
వృత్తిసంగీత దర్శకుడు

ఎస్.పి.కోదండపాణి (1932 - 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి. వీరు ఇదిగో దేవుడు చేసిన బొమ్మ వంటి కొన్ని పాటలు పాడారు కూడా.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించాడు. అతని బాల్యం గుంటూరులో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరిలోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నాడు. అద్దేపల్లి రామారావు చిత్రం నా ఇల్లులో బృందగానంలో మొదటి సారిగా 1953 లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణామూర్తి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకుడిగాను పనిచేశాడు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత కె.వి. మహదేవన్ వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగాడు.

హాస్యనటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవాడు. ఆయనకు సంగీత దర్శకుడిగా సేవలందించాడు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల వల్ల 1961లో కన్నకొడుకు చిత్రానికి సంగీత దర్శకుడయ్యాడు. తరువాత పదండి ముందుకు (1962), మంచి రోజులొచ్చాయి, బంగారు తిమ్మరాజు, తోటలో పిల్ల కోటలో రాణి, లోగుట్టు పెరుమాళ్ళకెరుక మొదలైన చిత్రాలకు పనిచేశాడు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవాడు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్, 1974) న చనిపోయాడు.

పద్మనాభం చిత్రం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ద్వారా ఇతను 1967లో ఈనాటి ఉత్తమ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

చిరకాలం గుర్తుండే పాటలు

[మార్చు]

చిత్రాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]