ఎస్. కుమరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. కుమరన్
ఎస్. కుమరన్


రాజ్యసభ ఎంపీ
పదవీ కాలం
1970 – 1976
పదవీ కాలం
1976 – 1982
నియోజకవర్గం కేరళ

భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి
పదవీ కాలం
1968 – 1970
ముందు సి. అచ్యుత మీనన్
తరువాత ఎన్.ఈ. బలరాం

శాసనసభ్యుడు
పదవీ కాలం
1960 – 1964
ముందు సిజి సదాశివన్
తరువాత ఎస్. దామోదరన్
నియోజకవర్గం మరారికుళం

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 25, 1923
కొచ్చుతకిడియిల్ హౌస్‌, ఆర్యద్‌, అలప్పుజా
మరణం 1991 డిసెంబరు 24(1991-12-24) (వయసు 68)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామి శాంతాంబికా దేవి
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
మూలం http://www.niyamasabha.org/codes/members/m325.htm

ఎస్. కుమరన్ (25 ఫిబ్రవరి 1923 - 24 డిసెంబరు 1991) కేరళ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. రాజ్యసభ మాజీ ఎంపీగా, మరారికుళం మాజీ శాసనసభ్యుడిగా పనిచేశాడు.[1][2]

జీవిత విషయాలు[మార్చు]

కుమరన్ 1923 ఫిబ్రవరి 25న కిట్టచన్-కొచుపారుల దంపతులకు అలప్పుజాలోని ఆర్యద్‌లోని కొచ్చుతకిడియిల్ హౌస్‌లో జన్మించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కుమరన్ కు శాంతాంబికా దేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయరంగం[మార్చు]

కాయిర్ ఫ్యాక్టరీ కార్మికులకు నాయకత్వం వహించి రాజకీయాల్లోకి వచ్చాడు. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలోనూ, పున్నప్ర-వయలార్ పోరాటంలోనూ పాల్గొన్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, మరారికులం మాజీ శాసనసభ్యుడు దివంగత ఎస్. దామోదరన్ ఇతని సోదరుడు.

పదవులు[మార్చు]

  • క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా స్టేట్ కాంగ్రెస్ ప్రాంతీయ ఉద్యమంతో ప్రారంభించాడు.[3]
  • 1938లో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు.
  • 1946లో రాష్ట్ర కమిటీలో చేరాడు.
  • 1960 నుండి 1964 వరకు మరారికుళం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.
  • 1966 నుండి 1970 వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తించాడు.
  • 1970 నుండి 1982 వరకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు.

మరణం[మార్చు]

కుమరన్ 1991, డిసెంబరు 24న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. "മനസ്സിൽ ഒരായിരം ഓർമ്മകളുടെ തിരയിളക്കം". February 1, 2020. Archived from the original on 2021-08-10. Retrieved 2021-09-16.
  2. "Members - Kerala Legislature".
  3. "ആര്യാട് ബ്ലോക്ക് പഞ്ചായത്ത് (Aryad Block Panchayat) » ചരിത്രം". Archived from the original on 2013-07-16. Retrieved 2021-09-16.