Jump to content

ఎస్. రఘు

వికీపీడియా నుండి
ఎస్. రఘు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2008
నియోజకవర్గం సి.వి. రామన్‌నగర్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2008 - 2004
ముందు ఎం. మునిస్వామి
తరువాత ఎన్. ఎ. హారిస్
నియోజకవర్గం శాంతి నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-02) 1969 మే 2 (వయసు: 57)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

ఎస్. రఘు (జననం 2 మే 1969) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్. రఘు భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో శాంతి నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2008 శాసనసభ ఎన్నికలలో సి.వి. రామన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె.సి. విజయకుమార్‌పై 16655 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎస్. రఘు 2013 శాసనసభ ఎన్నికలలో సి.వి. రామన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పి. రమేష్ 8419 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్. సంపత్ రాజ్ పై 12,227 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

ఎస్. రఘు 2023 శాసనసభ ఎన్నికలలో సి.వి. రామన్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎస్. ఆనంద్ కుమార్‌పై 16,395 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Congress feels Shantinagar is a Safe Bet" (in ఇంగ్లీష్). The New Indian Express. 18 August 2015. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  2. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. ↑ "A battle of prestige for BJP and Congress in C.V. Raman Nagar and Shantinagar constituencies" (in Indian English). The Hindu. 3 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  4. ↑ "Karnataka Assembly Elections 2023: C.V. Raman Nagar". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎస్._రఘు&oldid=4508696" నుండి వెలికితీశారు