ఎస్. శివరాజ్ పాటిల్
| ఎస్. శివరాజ్ పాటిల్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2013 | |||
| ముందు | సయ్యద్ యాసిన్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రాయచూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1970 మే 8 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (సెక్యులర్) | ||
| నివాసం | రాయచూర్ , కర్ణాటక | ||
| వృత్తి | డాక్టర్, రాజకీయ నాయకుడు | ||
డాక్టర్ ఎస్ శివరాజ్ పాటిల్ (జననం 8 మే 1970) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు రాయచూరు శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఎస్. శివరాజ్ పాటిల్ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో రాయచూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి సయ్యద్ యాసిన్పై 7,871 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి[3] 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి సయ్యద్ యాసిన్పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
ఎస్. శివరాజ్ పాటిల్ 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి మహ్మద్ షాలంపై 3,728 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "HDK: No tickets for Patil, Vajjal" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 7 January 2018. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
- ↑ "Two JD(S) MLAs from Raichur resign, join BJP" (in ఇంగ్లీష్). Deccan Herald. 18 January 2018. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Raichur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
- ↑ "Three first-time MLAs enter Assembly from Yadgir and Raichur districts" (in Indian English). The Hindu. 14 May 2023. Archived from the original on 24 May 2023. Retrieved 20 January 2025.