Jump to content

ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ

వికీపీడియా నుండి
ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ

పదవీ కాలం
1998 – 2009
ముందు ఉద్ధబ్ బర్మన్
తరువాత ఇస్మాయిల్ హుస్సేన్
నియోజకవర్గం బార్పేట

పదవీ కాలం
1978 – 1982

వ్యక్తిగత వివరాలు

జననం (1933-04-01)1933 ఏప్రిల్ 1
కాచార్ జిల్లా , అస్సాం
మరణం 2009 March 31(2009-03-31) (వయసు: 75)
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి జహానారా ఉస్మానీ
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం సిల్చార్
మూలం [1]

ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ (1 ఏప్రిల్ 1933 - 31 మార్చి 2009) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1978 అసోం శాసనసభ ఎన్నికలలో బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి గోలప్ బోర్బోరా మంత్రివర్గంలో నీటిపారుదల, విద్యుత్, గనులు & ఖనిజాల & వక్ఫ్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1985 అసోం శాసనసభ ఎన్నికలలో జానియా శాసనసభ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ 1998, 1999 & 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బార్పేట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మరణం

[మార్చు]

ఎ.ఎఫ్. గోలం ఉస్మానీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ 2009 మార్చి 31న న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Statistical report on general elections, 1998 to the Twelfth Lok Sabha" (PDF). Election Commission of India. p. 269. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  2. "Statistical report on general elections, 1999 to the Thirteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 265. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  3. "Statistical report on general elections, 2004 to the Fourteenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 361. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
  4. Golam Osmani passes away Archived 28 సెప్టెంబరు 2011 at the Wayback Machine