ఎ.ఎస్.కిరణ్ కుమార్
| జననం | 1952 అక్టోబరు 22 ఆలూరు, హాసన్ జిల్లా, మైసూరు రాజ్యం (ప్రస్తుత కర్ణాటక) |
|---|---|
| రంగము | అంతరిక్ష పరిశోధన, ఎలక్ట్రో ఆప్టిక్స్ |
| సంస్థలు | ఇస్రో |
| మాతృ సంస్థ | బెంగళూరు విశ్వవిద్యాలయం, ఇండీయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ |
| ప్రాముఖ్యత | ఇస్రో చైర్మన్ |
| ముఖ్య పురస్కారాలు | పద్మశ్రీ |
ఆలూరు సీలిన్ కిరణ్ కుమార్ (జననం 1952 అక్టోబరు 22) భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్[1] గవర్నర్ల బోర్డు సభ్యుడు. ఇస్రో చైర్మనుగా 2015 జనవరి 14 న పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[2] చంద్రయాన్-1, మంగళయాన్ అంతరిక్ష నౌకలలో కీలకమైన శాస్త్రీయ పరికరాల అభివృద్ధిలో ఆయనకు ఘనత ఉంది.[3][4][5][6] 2014 లో శాస్త్ర సాంకేతిక రంగాలకు చేసిన కృషికి గాను ప్రభుత్వం ఆయనను, భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[7] కిరణ్ కుమార్ గతంలో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఆలూరు సీలిన్ కిరణ్ కుమార్ 1952లో కర్ణాటక లోని హసన్ జిల్లాలో,[8] వీరశైవ లింగాయత్ మతంలో జన్మించాడు. 1971 లో అతను బెంగళూరు విశ్వవిద్యాలయంలోని నేషనల్ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో (ఆనర్స్) పట్టభద్రుడయ్యాడు.[4][9] తరువాత 1973 లో అదే విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్‌లో MSc పట్టా పొందాడు.[8] అతని తదుపరి అధ్యయనాలు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఉన్నాయి, అక్కడ అతను 1975లో ఫిజికల్ ఇంజనీరింగ్‌లో MTech పూర్తి చేశాడు.[5][10][11]
కిరణ్ కుమార్ 1975లో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించాడు.[9] స్పేస్ బోర్న్ ఎలక్ట్రో-ఆప్టికల్ ఇమేజింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై పనిచేసాడు.[8] అప్పటి నుండి ఆయన ఆ సంస్థలోనే ఉన్నాడు. 2012 ఏప్రిల్ నుండి ఎలక్ట్రో-ఆప్టికల్ సిస్టమ్స్ గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్నాడు.[6][8][10] 2015 జనవరి నుండి 2018 జనవరి వరకు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. ప్రపంచ వాతావరణ సంస్థ, ఇండో-యుఎస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆన్ సివిల్ స్పేస్ కోఆపరేషన్ వంటి అనేక అంతర్జాతీయ వేదికలలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ప్రాతినిధ్యం వహించాడు. కమిటీ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ (CEO)లో ఇస్రో తరఫున అధ్యక్షుడిగా ఉన్నాడు.[5][12]
వారసత్వం
[మార్చు]కిరణ్ కుమార్ వారసత్వం శాస్త్రీయ ప్రపంచానికి, ముఖ్యంగా భారతీయ అంతరిక్ష ప్రయత్నాలకు ఆయన చేసిన కృషిలో, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా జ్ఞాన వ్యాప్తికి ఆయన చేసిన ప్రయత్నాలలో విస్తరించి ఉంది.
కిరణ్ కుమార్ భారతీయ అంతరిక్ష కార్యక్రమాలకు, భాస్కర టీవీ పేలోడ్ వంటి ప్రారంభ ప్రాజెక్టుల నుండి చంద్రయాన్-1, మంగళయాన్ వంటి తరువాతి కార్యక్రమాల వరకు కృషి చేసాడు.[3][5][6] 1979లో ప్రయోగించబడిన భారతదేశపు మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కరలోను, 1981లో తదుపరి ఉపగ్రహం లోనూ[3] ఉపయోగించిన ఎలక్ట్రో-ఆప్టికల్ ఇమేజ్ సెన్సార్ల[6] రూపకల్పన, అభివృద్ధికి కుమార్ ప్రసిద్ధి చెందాడు.[9] అలాగే వాతావరణ అంచనా, సముద్ర మండలం/ల్యాండ్‌స్కేప్ మ్యాపింగ్, టెలికమ్యూనికేషన్‌లలో ఉపయోగించే సముద్ర రంగు సాధనాల రూపకల్పన లోనూ ఆయన ప్రముఖ పాత్ర పోషించాడు.[3][5][6][8]
INSAT–3D, రిసోర్స్‌శాట్, మైక్రో శాటిల్లైట్, కార్టోశాట్ వంటి ప్రాజెక్టులకు ఇమేజింగ్ పరికరాల రూపకల్పన, అభివృద్ధికి కూడా ఆయన దోహదపడ్డాడు.[9][12] చంద్రయాన్-1 ప్రాజెక్టు టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా, హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజర్ పేలోడ్‌లు కూడా కిరణ్ కుమార్ కృషికి నిదర్శనాలు.[5][6][9] అందులోని ఐదు శాస్త్రీయ పరికరాలలో మూడింటిని అభివృద్ధి చేసింది కుమార్ నేతృత్వంలోని బృందం.
విద్యాపరమైన సహకారాలు
[మార్చు]కుమార్ అనేక సెమినార్లు, సమావేశాలకు హాజరయ్యాడు. అనేక ఉపన్యాసాలు, ముఖ్య ప్రసంగాలు ఇచ్చారు.[10] అంతర్జాతీయ జర్నల్స్ లో అనేక వ్యాసాలను[13][14][15] ప్రచురించాడు. రీసెర్చ్ గేట్ ఆయన రాసిన 41 వ్యాసాలను జాబితా చేసింది.[16]
పురస్కారాలు, గుర్తింపులు
[మార్చు]
1994లో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అవార్డుతో ప్రారంభించి కిరణ్ కుమార్ అనేక పురస్కారాలు, గౌరవాలను అందుకున్నాడు.[5][8][9][12] నాలుగు సంవత్సరాల తరువాత, 1998లో, వాస్విక్ అవార్డును,[5][8][9][12] ఆ తర్వాత 2001లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డునూ అందుకున్నాడు.[5][8][9][12] ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 2006లో వ్యక్తిగత సేవా అవార్డుతో కుమార్‌ను సత్కరించింది.[5][12] 2007 లో అతనికి, ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వారి భాస్కర అవార్డు వచ్చింది.[5][9][12][17] మరుసటి సంవత్సరం, 2008లో, కుమార్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ యొక్క టీమ్ అచీవ్‌మెంట్ అవార్డును, ఇస్రో పెర్ఫార్మెన్స్ అవార్డునూ అందుకున్నాడు[12][5][9] కిరణ్ కుమార్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీర్స్, స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (SSME) ల్లో గౌరవ జీవిత సభ్యుడు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ లో సభ్యుడు.[5][9] భారత ప్రభుత్వం కిరణ్ కుమార్ ను 2014 గణతంత్ర దినోత్సవ గౌరవాలలో చేర్చి, పద్మశ్రీతో సత్కరించింది.[7] ఆయనకు 2015 మార్చి 24 న గీతం విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీ లభించింది.
- ఆయన బెంగళూరు అసోసియేషన్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (BASE) కి ఛైర్మన్, ఇది బెంగళూరులోని ప్రముఖ సంస్థ జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియంను నిర్వహిస్తుంది.[18]
- 2017లో ఆయనకు భూ పరిశీలనలు, కమ్యూనికేషన్, నావిగేషన్, స్వదేశీ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి రంగాలలో భారత అంతరిక్ష కార్యక్రమానికి దర్శకత్వం వహించినందుకు విజ్ఞాన్ రత్న హెచ్‌కె ఫిరోడియా అవార్డు లభించింది.[19]
- 2019లో ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారమైన షెవాలియర్ డి ఎల్'ఆర్డ్రే నేషనల్ డి లా లిజియన్ డి'హోన్నూర్ - భారతదేశం-ఫ్రాన్స్ అంతరిక్ష సహకారానికి ఆయన చేసిన కృషికి.[20]
- ఎ.ఎస్. కిరణ్ కుమార్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడుగా పనిచేసాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]
మూలాలు
[మార్చు]- ↑ "A S Kiran Kumar member of BoG, IIT Jodhpur".
- ↑ "A S Kiran Kumar takes over as Secretary, Department of Space, Chairman, Space Commission and Chairman, ISRO - ISRO". www.isro.gov.in. Archived from the original on 16 October 2016. Retrieved 2016-10-17.
- ↑ 3.0 3.1 3.2 3.3 "Canara News". Canara News. 25 September 2014. Retrieved 31 October 2014.
- ↑ 4.0 4.1 "INCN" (PDF). INCN. 2014. Archived from the original (PDF) on 31 October 2014. Retrieved 31 October 2014.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 "Space Application Centre". Space Application Centre. 2014. Archived from the original on 24 September 2015. Retrieved 31 October 2014.
- ↑ 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "SAC Appointment". Daily Bhaskar. 3 April 2012. Archived from the original on 31 October 2014. Retrieved 31 October 2014.
- ↑ 7.0 7.1 "Padma 2014". Press Information Bureau, Government of India. 25 January 2014. Archived from the original on 22 February 2014. Retrieved 28 October 2014.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 "ASI India". ASI India. 2014. Archived from the original on 31 October 2014. Retrieved 31 October 2014.
- ↑ 9.00 9.01 9.02 9.03 9.04 9.05 9.06 9.07 9.08 9.09 9.10 "National Academy of Engineering". National Academy of Engineering. 2014. Archived from the original on 4 June 2016. Retrieved 31 October 2014.
- ↑ 10.0 10.1 10.2 "lectures". News Hunt. 10 October 2014. Archived from the original on 31 అక్టోబర్ 2014. Retrieved 31 October 2014.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Dharmesh". Dharmesh. 2014. Retrieved 31 October 2014.
- ↑ 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 12.7 "News Hunt 2". News Hunt. 10 October 2014. Archived from the original on 31 అక్టోబర్ 2014. Retrieved 31 October 2014.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ Prakash Chauhan; Prabhjot Kaur; Satadru Bhattacharya; Aditya K. Dagar; A. S. Kiran Kumar (2014). "DETECTION OF OH/H2O ON THE CENTRAL PEAK OF JACKSON CRATER FROM MOON MINERALOGICAL MAPPER (M3) DATA ONBOARD CHANDRAYAAN-1". Research Gate. Retrieved 31 October 2014.
- ↑ Suchandra Bhowmick; Raj Kumar; A. S. Kiran Kumar (2014). "Cross Calibration of the OceanSAT -2 Scatterometer With QuikSCAT Scatterometer Using Natural Terrestrial Targets". Research Gate. Retrieved 31 October 2014.
- ↑ A. S. Arya; Phani Rajasekhar Rudravaram; Amitabh Singh; Barla Gopala Krishna; Ajai Prof; kiran kumar alur Seelin (2014). "Morphometric, rheological and compositional analysis of an effusive lunar dome using high resolution remote sensing data sets: A case study from Marius hills region". Research Gate. Retrieved 31 October 2014.
- ↑ "Research Gate". Research Gate. 2014. Retrieved 31 October 2014.
- ↑ "Indian Society of Remote Sensing". Indian Society of Remote Sensing. 2014. Archived from the original on 18 November 2014. Retrieved 31 October 2014.
- ↑ "A S Kiran Kumar member of BoG, IIT Jodhpur".
- ↑ "A S Kiran Kumar member of BoG, IIT Jodhpur".
- ↑ "A S Kiran Kumar member of BoG, IIT Jodhpur".