Jump to content

ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి

వికీపీడియా నుండి
ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి
జననం1971
నారాకోడూరు, చేబ్రోలు మండలం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్‌, భారతదేశం
మరణం2025 జూన్ 10
జాతీయత భారతీయుడు
వృత్తి
  • సినిమా దర్శకుడు
  • స్క్రీన్ రైటర్
భాగస్వామినాగ బిందు

ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి తెలుగు సినిమా దర్శకుడు. అతను 1995లో అమ్మదొంగ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి 2002లో మనసు సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేసి యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[1]

సినీ జీవితం

[మార్చు]

రవి కుమార్ చౌదరి సినిమాలపై మక్కువతో హైదరాబాద్ వచ్చి 1995లో అమ్మదొంగ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి, దర్శకుడు సాగర్ వద్ద దశాబ్ద కాలం పాటు పని చేసి ఆ తరువాత శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన 'నీ కోసం' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి 2002లో మనసుతో సినిమా సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేసి యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు ఇతర విషయాలు
2002 మనసుతో దర్శకుడిగా తొలి సినిమా
2004 యజ్ఞం
2005 వీరభద్ర
2008 ఆటాడిస్తా
2010 ఏం పిల్లో ఏం పిల్లడో
2014 పిల్లా నువ్వు లేని జీవితం
2015 సౌఖ్యం [2]
2024 తిరగబడర సామి [3]

మరణం

[మార్చు]

ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి 2025 జూన్ 10న గుండెపోటుతో మరణించాడు.[4][5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "ముక్కుసూటితనం.. వివాదాలు.. రవికుమార్ చౌదరి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలివే". TV9 Telugu. 11 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
  2. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  3. V6 Velugu (1 December 2022). "'తిరగబడరా సామి' మూవీ ప్రారంభం". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "ఇండ‌స్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి". NT News. 11 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
  5. "సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రవి కుమార్ చౌదరి మృతి". Chitrajyothy. 11 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
  6. "బ్రేకింగ్ న్యూస్: కార్డియాక్ అరెస్టుతో దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి మృతి". ABP Desham. 11 June 2025. Archived from the original on 11 June 2025. Retrieved 11 June 2025.
  7. "Director Ravi Kumar Chowdary passes away due to cardiac arrest" (in ఇంగ్లీష్). Cinema Express. 11 June 2025. Retrieved 11 June 2025.

బయటి లింకులు

[మార్చు]