Jump to content

ఎ.పి. కోమల

వికీపీడియా నుండి
(ఎ.పి.కోమల నుండి దారిమార్పు చెందింది)
ఆర్కాట్ పార్థసారధి కోమల
ఆర్కాట్ పార్థసారధి కోమల
జననంఆర్కాట్ పార్థసారధి కోమల
1934 ఆగష్టు 28
మరణం2024 ఏప్రిల్ 26
ప్రసిద్ధిదక్షిణభారత దేశపు నేపథ్యగాయని

ఆర్కాట్ పార్థసారథి కోమల (తమిళం: ஏ.பி.கோமளா) (1934 ఆగష్టు 28 - 2024 ఏప్రిల్ 26) [1][2] దక్షిణభారతదేశపు నేపథ్యగాయని.[1] ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది.

కోమల మద్రాసులోని తిరువళ్ళికేనులో జన్మించింది. ఈమె తల్లితండ్రులు పార్థసారథి, లక్ష్మి. మూడేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన కోమలకు ఒక తెలిసిన వ్యక్తి రేడియోలో పాడే అవకాశం ఇచ్చింది.[3] అదే సమయంలో రేడియోలో నాదస్వరం వాయించటానికి రాజమండ్రి నుండి మద్రాసు వచ్చిన గాడవల్లి పైడిస్వామి ఆమె పాటను విని, ఆనందపడి, కోమలిని తనతో పాటు రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇచ్చాడు. జన్మతః తమిళురాలైనా కోమల సంగీతం నేర్చుకున్నది తెలుగుదేశంలోనే.[4] తొలిసారిగా ఒరిస్సాలోని బరంపురంలో 1943లో జరిగిన శాస్త్రీయ సంగీత పోటీలో ముత్తుస్వామి దీక్షితార్‌ కృతి ‘శ్రీ గణనాయకం’ పాడి వెండిభరిణె గెలుచుకున్నది. ఈ కార్యక్రమానికి వచ్చిన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ కోమలను ప్రశంసించి మళ్లీ ఆ కృతిని పాడించుకున్నారు.[5]

సంగీత అవగాహన ఉండటం వలన 1944లో తొమ్మిదేళ్ళ వయసులోనే ఈమెకు ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. రేడియోలో ప్రసారమయ్యే గానలహరి కార్యక్రమంలో విద్యార్థినిగా పాల్గొనేది. అక్కడ పనిచేస్తుండగా సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కోమల ప్రయాగ నరసింహశాస్తి సిఫార్సుతో 1946లో చిత్తూరు వి.నాగయ్య తీసిన ‘త్యాగయ్య’లో తొలిసారిగా సినిమా పాట పాడింది. ఆనందభైరవి రాగంలో ‘మధురానగరిలో చల్లనమ్మ’ అనే ఈ పాటకు ఆమె 250 రూపాయల పారితోషికం అందుకున్నది.[5] ఈమె సినిమాలలో పాడిన తొలిపాట, చివరి పాట తెలుగు పాటలే కావటం విశేషం.

ఆలిండియా రేడియోలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన కోమల 1995లో పదవీ విరమణ పొందింది.

తెలుగు సినిమా పాటల జాబితా

[మార్చు]

ఎ.పి.కోమల పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయనీ గాయకులుసంగీత దర్శకుడురచయితసినిమా విడుదలైన సంవత్సరం
1శ్రీ లక్ష్మమ్మ కథతాళగ జాలనురా నా సామి జాలము సేయకురాసి.ఆర్.సుబ్బరామన్1950
2దీక్షఏమి మొగాళ్ళొయ్ మీరేమి మొగాళ్ళొయ్ఎం.సావిత్రిపెండ్యాల నాగేశ్వరరావు1951
3పెళ్ళి చేసి చూడుబ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యాకె. రాణి, ఉడుతా సరోజినిఘంటసాలఊటుకూరి సత్యనారాయణ1952
4ప్రేమఓహో ఇదిగదా వియోగి ఇదికదా కలలు నిజములైపోయే గదాసి.ఆర్.సుబ్బరామన్1952
5పరోపకారంనరజన్మ అత్యున్నతమురా నీవు పరమార్ధ మార్గానమాధవపెద్దిఘంటసాల1953
6పరోపకారంనిరుపేదల లోకము ఇంతేనోయి వెనుకాడకుమోయిఘంటసాల1953
7పరోపకారంహృదయము వూగిసలాడి ప్రతి వదనము కలతల వాడెఘంటసాల, ఎ.ఎం.రాజా, పి.లీలఘంటసాల1953
8పిచ్చి పుల్లయ్యఈ మౌనమేలనోయీ మౌనమేలనోయి గతంబే మరచుట మేలోయిటి.వి.రాజుఅనిసెట్టి1953
9పుట్టిల్లుజో జో లాలి లాలి జోజో కుమారా సుందరాకార నాకు వెలుగునుటి.చలపతిరావు1953
10పెంపుడు కొడుకుచిన్నారి చిటిపాపా కన్నారి కనుపాప ఇన్నాళ్ళు పెరిగి ఈనాటితోనేసాలూరు రాజేశ్వరరావుశ్రీశ్రీ1953
11జయసింహతందానా హోయ తందానా తానితందనఘంటసాల బృందంటి.వి.రాజుసముద్రాల రాఘవాచార్య1955
12జయసింహనడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామి నా సామిటి.వి.రాజుసముద్రాల రాఘవాచార్య1955
13జయసింహమనసైనా చెలీ పిలుపు వినరావేలా ఓ చందమామారావు బాలసరస్వతీ దేవిటి.వి.రాజుసముద్రాల రాఘవాచార్య1955
14జయసింహమురిపెము మీరా మీ కోరిక తీరా వారంపిన కానుకలేకె.రాణిటి.వి.రాజుసముద్రాల రాఘవాచార్య1955
15రంగులరాట్నంపన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణాబి.వసంతసాలూరు రాజేశ్వరరావు1967
16బంగారు పంజరంపదములే చాలు రామ ! నీ పద ధూళులే పదివేలుసాలూరు రాజేశ్వరరావుదేవులపల్లి కృష్ణశాస్త్రి1968

మూలాలు

[మార్చు]
  1. 1 2 ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Komala A. P. పేజీ
  2. ↑ "Tribute to singer A.P. Komala". The Hindu. 23 May 2024. Retrieved 26 May 2024.
  3. ↑ జ్ఞాపకాలు - ఎపి కోమల
  4. ↑ కమ్మని కోమల గాత్రధారిణి
  5. 1 2 గనిరెడ్డి, అరుణ్‌కుమార్‌. "తెలుగు సినిమా నన్ను మరిచి పోయింది!". ఆంధ్రజ్యోతి. No. 28 Aug 2014. Retrieved 3 December 2014.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎ.పి._కోమల&oldid=4628730" నుండి వెలికితీశారు