ఎ.పి. రామస్వామి
| Personal information | ||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | |||||||||||||||||||||||||||||
| Sport | ||||||||||||||||||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | |||||||||||||||||||||||||||||
| Event | 4 X 100 మీ | |||||||||||||||||||||||||||||
Medal record
| ||||||||||||||||||||||||||||||
ఎ.పి. రామస్వామి (జననం 1945) ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1973 లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో భారతదేశం తరఫున పాల్గొన్న జట్టులో సభ్యుడు. ఆ క్రీడలలో పురుషుల 4 X 100 మీ రిలే పరుగు పందెంలో అబ్దుల్ అజీజ్, అడ్రియన్ కెన్నెడీ, కె. నటరాజన్‌లతో కలిసి 40.3 సెకెన్లలో లక్ష్యాన్ని అధిగమించి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.[1]
క్రీడా జీవితం
[మార్చు]రామస్వామి 1970 జనవరి నెలలో కటక్‌లో జరిగిన భారత జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అదే ఏడాది డిసెంబర్ నెలలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొన్నాడు. ఒ. ఎల్. థామస్, కెన్నెత్ ఫావెల్, జయబాలన్ కురుప్పయ్యలతో కలిసి 4 X 100 మీ రిలే పరుగును 40.9 సెకెన్లలో పూర్తి చెసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
1973 నవంబర్ నెలలో ఫిలిప్పీన్స్, మారికినాలో జరిగిన మొట్టమొదటి ఆసియా ఛాంపియన్షిప్స్ పోటీలలో 4 X 100 మీ రిలే పరుగు పందెంలో కాంస్యపతకాన్ని గెలుచుకున్నాడు.ఇతడు, అబ్దుల్ అజీజ్, అడ్రియన్ కెన్నెడీ, కె. నటరాజన్‌ల జట్టు 40.3 సెకెన్లలో ఈ లక్ష్యాన్ని అధిగమించి జాతీయ రికార్డును సృష్టించింది.
1975 జూన్ నెలలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన రెండవ ఆసియా ఛాంపియన్షిప్స్ పోటీలలో సుందరరాజ్ శెట్టి, లెస్లీ లూయీస్, రామస్వామి జ్ఞానశేఖరన్ లతో కలిసి 4 X 100 మీ రిలే పరుగును 41.35 సెకెన్లలో పూర్తి చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
పతకాలు
[మార్చు]| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1970 | 1970 ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ | కటక్, భారతదేశం | 1వ | 100 మీ | 10.6 |
| 1970 | ఆసియా క్రీడలు | బ్యాంకాక్, థాయ్‌లాండ్ | 3వ | 4 X 100 మీ | 40.9 జాతీయ రికార్డ్ |
| 1973 | ఆసియా ఛాంపియన్షిప్స్ | మారికినా, ఫిలిప్పీన్స్ | 3వ | 4 X 100 మీ | 40.3 |
| 1975 | ఆసియా ఛాంపియన్షిప్స్ | సియోల్, ఉత్తర కొరియా | 3వ | 4 X 100 మీ | 41.35 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "A.P. Ramaswamy (1945)". అథ్లెటిక్స్ పోడియం. Athletics Podium. Retrieved 24 December 2025.