ఎ.వెంకటేశ్వర రెడ్డి
ఎ.వెంకటేశ్వర రెడ్డి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 13 అక్టోబర్ 2021 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | దేపల్లి గ్రామం, నవాబ్‌పేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | 1961 ఏప్రిల్ 15||
తల్లిదండ్రులు | వెంకటరామరెడ్డి, అనసూయమ్మ | ||
పూర్వ విద్యార్థి | జ్ఞానగంగా విశ్వవిద్యాలయం, కర్ణాటక రాష్ట్రం |
అద్దుల వెంకటేశ్వర రెడ్డి భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1][2]ఆయన అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]
జననం, విద్యాభాస్యం[మార్చు]
ఎ.వెంకటేశ్వర రెడ్డి 1961 ఏప్రిల్ 15లో తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలం, దేపల్లి గ్రామంలో వెంకటరామరెడ్డి, అనసూయమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన దేపల్లి గ్రామంలో 10వ తరగతి వరకు చదివి, మహబూబ్‌నగర్ లోని ఎంవీఎస్ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎ.వెంకటేశ్వర రెడ్డి కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గాలోని జ్ఞానగంగా యూనివర్సిటీ నుంచి 1986లో న్యాయశాస్త్రం పూర్తి చేసి పట్టా అందుకున్నాడు.[4]
వృత్తి జీవితం[మార్చు]
ఎ.వెంకటేశ్వర రెడ్డి 1987లో బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకొని షాద్‌నగర్ లో న్యాయవాది రుక్మారెడ్డి వద్ద జూనియర్‌గా చేరి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆయన 1994 జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా, 2012లో ఎల్ ఈ పరీక్షల ద్వారా జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది ఆదిలాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా విధులు నిర్వహించాడు.[5]
ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చివరి జ్యుడిషియల్ రిజిస్టార్‌గా, తెలంగాణ హైకోర్టు మొదటి రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్టార్ (ఇన్‌ఛార్జి)గా పనిచేశాడు. ఎ.వెంకటేశ్వర రెడ్డి సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్ యూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[6][7]
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
- ↑ ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
- ↑ Eenadu (14 October 2021). "హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.