ఎ. కె. శేఖర్
ఎ. కె. శేఖర్, ప్రముఖ భారతీయ కళా దర్శకుడు.ఇతను వాహినీ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకులలో ఒకరుగా సంస్థ నిర్మించిన ఎన్నో మంచి సినిమాలకు కళా దర్శకత్వాన్ని అందించారు.
మల్లీశ్వరి (1951) ఒక మహోన్నత దృశ్య కావ్యంగా మలచడంలో ఇతని కృషి అనుపమానం.ఇతను 1966 లో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అనే చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు.
విశేషాలు
[మార్చు]ఇతను 1907లో చిత్తూరులో జన్మించారు. వీరు మామూలు విద్యాభ్యాసం ముగించి ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ప్రింటర్‌గా చేరాడు. కాలక్రమేణా జీవితంలో ఒక్కొక్క మెట్టే పైకెక్కి కళలో నిష్ణాతుడై చివారకు కళాదర్శకుడిగా ఎదిగినారు. వీరు మొట్టమొదట 1933లో రామనాథ్, ముత్తుస్వామిలు కొల్హాపూర్ నిర్మించిన తమిళ సినిమా సీతాకల్యాణం సినిమాకు కళాదర్శకునిగా పనిచేశారు. తరువాత మద్రాసులోని వేల్స్ పిక్చర్స్ స్టూడియోలో పి.వి.దాసు నిర్మించిన తెలుగు సీతాకల్యాణం కు కూడా కళాదర్శకత్వం వహించారు. ఆ తర్వాత బొంబాయి వెళ్ళి శబ్దగ్రహణ శాఖలో శిక్షణ పొంది వచ్చారు. వీరు 80 చిత్రాలకు పైగా కళాదర్శకత్వం వహించారు. ఆముదవల్లి అనే తమిళ సినిమా, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ అనే తెలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.[1]
చిత్ర సమాహారం
[మార్చు]- 1934 : సీతాకళ్యాణం
- 1936 : మాయాబజార్
- 1939 : వందేమాతరం
- 1940 : సుమంగళి
- 1941 : దేవత
- 1942 : భక్త పోతన
- 1942 : మంగమ్మ శపథం (తమిళ సినిమా)
- 1945 : స్వర్గసీమ
- 1948 : చంద్రలేఖ (తమిళ సినిమా)
- 1951 : మల్లీశ్వరి
- 1954 : పెద్ద మనుషులు, బంగారు పాప
- 1955 : అనార్కలి
- 1960 : రాజమకుటం
- 1963 : చిత్తూరు రాణీ పద్మిని (తమిళ సినిమా)
- 1964 : అమరశిల్పి జక్కన
- 1965 : బంగారు పంజరం
- 1966 : రంగుల రాట్నం, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
- 1967 : భక్త ప్రహ్లాద
మరణం
[మార్చు]వీరు 73 ఏళ్ల వయసులో మద్రాసులో 1981లో మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ మల్లీప్రియ, నాగరాజు (31 May 1981). "ఆంధ్రవైభవ దర్పణం శ్రీ ఎ.కె.శేఖర్". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68, సంచిక 59. Archived from the original on 22 జనవరి 2021. Retrieved 11 February 2018.