ఎ. గణేష మూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ ఎ. గణేష మూర్తి ప్రస్తుత 15వ లోక్ సభలో ఎం.డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడు లోని ఈరోడ్ నియోజకవర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా కొనసాగుతున్నారు.

బాల్యం[మార్చు]

శ్రీ గణేష మూర్తి 10 జూనె, 1947 లో తమిళ నాడులోని ఈరోడ్ జిల్లా, ఉల్గాపురంలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: శ్రీ అవినషి, శ్రీమతి శారాదాంబాళ్. వీరు చెన్నైలోని త్యాగరాజ కళాశాలలో బి.ఎ. ఎకనమిక్స్ చదివారు.

కుటుంబము[మార్చు]

వీరు 31 అక్టోబరు 1978 లో శ్రీమతి బాలమణి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తావనము[మార్చు]

శ్రీ గణేష మూర్తి 1989-91 మధ్య కాలంలో తమిళ నాడు శాసన సభలో సభ్యునిగా ఉన్నారు. 1998 లో 12 లోకసభలో సభ్యునిగా కొనసాగారు. (రెండవ సారి) 2009 లో ప్రస్తుత 15వ లోక్ సభలో ఎం.డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడు లోని ఈరోడ్ నియోజిక వర్గంనుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా కొనసాగుతున్నారు. వీరు వివిధ పార్లమెంటరీ కమీటిలలో సభ్యులుగా పనిచేసారు.

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20140311014218/http://164.100.47.132/lssnew/Members/statedetail.aspx?state_code=Tamil%20Nadu