ఎ క్లాక్ వర్క్ ఆరంజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
"Clockwork Orange" redirects here. For the film, see A Clockwork Orange (film). For other uses, see Clockwork Orange (disambiguation).
A Clockwork Orange
200px
Dust jacket from the first edition
కృతికర్త: Anthony Burgess
దేశం: United Kingdom
భాష: English
విభాగం(కళా ప్రక్రియ): Science fiction novel, Satire
ప్రచురణ: William Heinemann (UK)
విడుదల: 1962
ప్రచురణ మాధ్యమం: Print (hardback & paperback) & audio book (cassette, CD)
పేజీలు: 192 pages (hardback edition) &
176 pages (paperback edition)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 0434098000
OCLC: 4205836

ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ అనేది ఆంథోనీ బర్గెస్ రచించిన 1962 సంవత్సరపు డిస్టోపియన్ నవల.

నవల టైటిల్ కు బర్గెస్ మూడు వివరణలు ఇచ్చారు. ఎ క్లాక్ వర్క్ ఆరంజ్: ఎ ప్లే విత్ మ్యూజిక్ యొక్క అవతారికలో బర్గెస్ ఈ విధంగా వ్వ్రాశారు: "...రసంతో నిండిన, తీపి మరియు సువాసనతో కూడిన ఒక జీవంతో ఉన్న వస్తు ఆటోమేటన్ గా మారడానికి" ఈ నవల యొక్క శీర్షిక ఒక రూపకాలంకారం."[1] "క్లాక్ వర్క్ ఆరంజస్"², అనే తాను రాశిన ఒక వ్యాసంలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు. "ఈ కథకి ఇదే తగు శీర్షిక. రంగు మరియు తీపి వంటి అంశాలను కలిగిన పండు వంటి ఒక జీవికి పావ్లోవియన్ లేదా యాంత్రిక సూత్రాలను వర్తింపచేస్తే ఏర్పడే పరిణామాల గురించినది ఈ కథ" మంచి స్పందనలే చూపాలని నియంత్రించబడిన ప్రధాన పాత్ర, తన స్వేచ్ఛను ఆపే చెడు భావనలను ఏ విధంగా ఎదుర్కుంటాడు అనే అంశాన్ని ఈ శీర్షిక సూచిస్తుంది. ఈ యుక్తిని వాడి, ఆ వ్యక్తి హింసకు చూపే భావభరిత స్పందనలను వికారం వంటి వ్యతిరేక ప్రభావాలు కలుగజేసే విధంగా అనుసంధానించటం జరుగుతుంది.ఆ వ్యతిరేక ప్రభావం కలిగించే మందులు హింసను మరియు "అతిఎక్కువ స్థాయి హింసాత్మక" సంఘటనలను చూపించే చిత్రాలను ఆ వ్యక్తికి చూపించే ముందు ఇవ్వబడుతుంది. పక్షపాత వైఖరి చూపించి తన ప్రవర్తనకు ఏ మాత్రం చింతించని పాత్ర యొక్క వైఖరిని ఈ నవల చెప్పుతుంది. అంటే కాక, ఈ నవలలోని భాష పై క్రొత్త ప్రయోగాన్ని కూడా వాడబడుతుంది: సమీప భవిష్యత్తులో రాబోయే యువకుల మాట విధానాన్ని బర్గెస్ సృష్టిస్తున్నారు.

ఈ నవలను స్టాన్లీ కుబ్రిక్ మరియు అండి వార్హోల్ వివాదాస్పత చలనచిత్రముగా తీశారు; టెలివిజన్ మరియు రేడియోలలో కూడా ఈ నవల చూపబడింది. పలు సంగీత బృందాల పాటలలో ఈ పుస్తకమును మరియు చిత్రములో సూచించబడుతుంది.

కథా సారాంశం[మార్చు]

1వ భాగం: ఆలెక్స్ యొక్క ప్రపంచం[మార్చు]

సమీప-భవిష్యత్తు ఇంగ్లాండ్ లో నివసిస్తున్న అలెక్స్, రాత్రి పూట తన ముటాతో అవకాశాన్ని బట్టి యధ్దేచ్చగా హింసకు తలపెడతాడు. దీనిని అలెక్స్ "మితిమీరిన హింస" అని పిలుస్తాడు. అలెక్స్ మిత్రులు (నవల యొక్క యాంగ్లో-రష్యన్ ఏసలో 'డ్రూగ్స్'): డిం అనే తెలివి-తక్కువ బ్రూయిసర్, జార్జీ మరియు పేటె. శారీరకంగా ముటా యొక్క ముఖ్య బలము డిం. తెలివితేటలూ ఎక్కువ ఉండి, హాస్య భావం కలిగి ఉన్న అలెక్స్ ఈ ముటాకు నాయకుడు. చూడడానికి చాలా మర్యాదస్తుడు లాగా కనిపిస్తాడు.

కథ ఆరంభములో, డ్రూగ్స్ తమ అభిమాన మిల్క్ బార్ లో కూర్చొని ఉంటారు. రాత్రి తాము సృష్టించబోయే హింసకు తమ ఉద్రికతను పెంచుకోవడానికోసం వారు మాదక ద్రవ్యం కలిపిన పాలును త్రాగుతూ ఉంటారు. గ్రంథాలయం నుండి ఇంటికి నడచి వెళ్తున్న ఒక పండితుడిని కొడతారు, ఒక బిక్షగాడిను త్రొక్కుతారు, బిల్లిబాయ్ నేతృత్వంలోని ఒక పోటీ ముటాతో గొడవకు దిగుతారు, ఒక వార్తా విలేఖరిని దోచుకొని యజమానులను స్పృహ కోల్పోయేలా చేస్తారు. తరువాత ఒక కారును దొంగిలిస్తారు. ఆ కారులో ఊరంతా ఉషారుగా తిరుగుతూ, ఒక ఏకాంతమైన కాటేజీలో చొరబడి, అక్కడ నివసితున్న ఒక యువ జంటను చితకబాదుతారు. భర్తను కొట్టి, భార్య పై అత్యాచారం చేస్తారు. బర్త "ఎ క్లాక్ వర్క్ ఆరంజ్" అనే పేరుతో ఒక పుస్తకం వ్రాసే ప్రయత్నంలో ఉంటాడు - ఆ విచిత్రమైన పేరు అలెక్స్ తో జీవితాంతం ఉండి పోతుంది. ఆ కారును వదిలేసి డ్రూగ్స్ తమ స్థావరమైన బారుకు తిరిగి వచ్చినాక, అలెక్స్ డింను క్రూరమైన ప్రవర్తనకు మందలిస్తాడు. అలెక్స్ హద్దు మీరుతున్నాడని అనుకున్న జార్జీ, అలెక్స్ నేతృత్వం మీద తన అసంతృప్తిని స్పష్టం చేస్తాడు. తన మురికి ఇంట్లో అలెక్స్ సాంప్రదాయ సంగీతాన్ని చాలా బిగ్గరగా వాయిస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కువ స్థాయిలో హింసను ఊహించుకొని ఉచ్ఛ స్థాయికి వెళ్తాడు.

మరుసటి రోజు అలెక్స్ స్కూల్ కు వెళ్ళడం మానేస్తాడు. అలెక్స్ యొక్క చిరుప్రాయ తప్పిదాలను సరిచేయడానికి కేటాయించబడిన పి.ఆర్. డెల్టాయిడ్ అనే ఒక "పోస్ట్-కరెక్టివ్ సలహాదారుడు" అలెక్స్ ఇంటికి వస్తాడు. అలెక్స్ తన ప్రవర్తనను మార్చుకోకపోతే, త్వరలోనే కటకటాల పాలవుతాడని తాను భావిస్తున్నట్లు డెల్టాయిడ్ చెపుతాడు.కాని ఆ మాటలను అలెక్స్ పట్టించుకోడు. తన అభిమాన మ్యూజిక్ షాప్ కు వెళ్ళిన అలెక్స్, అక్కడ ఇద్దరు చిన్న వయస్సుగల అమ్మాయిలను కలుస్తాడు. వాళ్ళని తన తల్లితండ్రుల ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ వాళ్లకు మద్యం తాగించి, వాళ్ళు త్రాగిన మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ పై లైంగికంగా దాడి చేస్తాడు.

తరువాత అలెక్స్ తన తల్లితండ్రులతో మాట్లాడుతాడు. తాను ఒక రాత్రి ఉద్యోగములో చేరినట్లు అలెక్స్ చెప్పే మాటలను వారు నమ్మడం లేదు. కాని దాని గురించి అడగడానికి భయపడతారు. డ్రూగ్స్ ను కలవడానికి అలెక్స్ ఆలస్యంగా వస్తాడు. అప్పటికే వారు "ఎప్పుడు త్రాగే నైఫీ మోలోకో" (మత్తు పదార్థం కలిపిన పాలు) ని త్రాగి తమ ఉద్రికతను పైస్థాయికి తీసుకువెళ్ళి ఉన్నారు. ముటా నేతృత్వం విషయములో జార్జీ అలెక్స్ పై సవాలు చేస్తాడు. ఒంటరిగా పిల్లులతో నివసిస్తున్న ఒక ధనవంత ముసలావిడను దోచుకొని ఒక "మగవాడికి సరిపోయే" పనిని చేయాలని జార్జ్ కోరుతాడు. డిం చేతిని నరికి, జార్జితో పోట్లాడి అలెక్స్ ఈ తిరుగుబాటును అదుపు చేస్తాడు. తరువాత తన ఉదారతని చూపడానికి బలమిచ్చే ద్రావముల కొరకు వాళ్ళను ఒక బార్ కు తీసుకువెళతాడు. జార్జీ, డిం ఇద్దరూ ఇక ఆ రోజు పనులు ఆపేసి వెళ్ళిపోదామని చెపుతారు. కాని అలెక్స్ వాళ్ళను బెదిరించి దొంగతాననికి వచ్చేలా చేస్తాడు. ఆ ముసలావిడ ఇంట్లో, ఆమె తలుపు తెరవడానికి వెనకాడి, పోలీసులను పిలుస్తుంది. డ్రూగ్స్ అలెక్స్ ను పైకి లేపి రెండవ-అంతస్తు కిటికీ నుండి ఇంటి లోపలకి పంపుతారు. అక్కడ ఒక నాటకీయ పోరాటం తరువాత అతను ముసలావిడను స్పృహ కోల్పోయే లాగ దెబ్బతీస్తాడు. దూరములో సైరెన్ లు వినిపించడంతో, అలెక్స్ పారిపోతాడు. అతనికోసం డ్రూగ్స్ ముందు తలుపు దగ్గర కాచుకుని ఉంటారు. ఒక బైసైకిల్ చైన్ తో డిం అలెక్స్ ను ముఖం మీద కొడతాడు. అలెక్స్ కు విపరీతమైన నొప్పి కలిగి తాత్కాలికంగా కళ్ళు కనపడకుండా పోతాయి. వారు అలెక్స్ ను అక్కడే వదిలేషి వెళ్ళిపోతారు. పోలీసు అలెక్స్ ను చూసి అతన్ని అరెస్ట్ చేస్తారు. దాడి గురించి పోలీస్ స్టేషన్ లో అలెక్స్ ను ప్రశ్నిస్తారు. పి. ఆర్. డెల్టాయిడ్ అక్కడకి వచ్చి అలెక్స్ ముఖం మీద ఉమ్మేసి, అతని తరపున ఇంకా తాను ఉండనని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత అలెక్స్ ను జెయిల్ సెల్ నుండి పిలిపిస్తారు. అతను కొట్టిన ముసలావిడ చనిపోయిందని తెలుసుకుంటాడు.ఇప్పుడు అతని మీద హత్యా నేరం కూడా పడుతుంది.

2వ భాగం: లుడోవికో పద్ధతి[మార్చు]

రెండేళ్ళు జైలు జీవితం గడిపిన తరువాత, జైలు చాప్లైన్ కు సహాయకుడుగా ఉద్యోగంలో చేరతాడు. మతము మీద తనకు ఆసక్తి ఉన్నట్లు నటిస్తాడు. బైబిల్లో "ఓల్డ్ యాహూడీస్ (యూదులు) ఒకరినొకరు టోల్చోకింగ్ (కొట్టడం) చేసుకోవడం" గురించిన ఘోరమైన వర్ణనలను చదువుతూ ఉంటాడు. తాను కూడా "మేకులు కొట్టడం" (జీసస్ యొక్క (క్రుసిఫిక్షన్) కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ఊహించుకునేవాడు. అతను చేసిన ఒక విఫలమైన దొంగతనం సమయములో బాధితుడు నుండి తన మాజీ-డ్రూగ్ జార్జ్ మరణం గురించి అలెక్స్ తెసుకుంటాడు. "లుడోవికో పద్ధతి" అనే ఒక పరీక్షాత్మక కార్యక్రమం గురించి అతను తెలుసుకుంటాడు. దీని ప్రకారం, రెండు-వారాల చికిత్స అనంతరం ఖైదీ విడుదల చేయబడుతాడు. ఫలితంగా, ఆ తరువాత అతను ఎటువంటి నేరము చేయడు. జెయిల్ చాప్లిన్ ఈ పద్ధతిను వ్యతిరేకిస్తాడు. మానవ జాతికి నైతిక వికల్పం ఇవ్వవలసిన అవసరం ఉందని అతను వాదించాడు - ఇళ్ళ పై దాడి చేసిన సంఘటన సందర్భములోనే ఈ అంశం ప్రవేశపెట్టబడింది. అప్పుడు బాధితురాలి భర్త వ్రాసిన పుస్తకము నుంచి ఒక భాగాన్ని అలెక్స్ చదువుతాడు. అక్కడ దీని గురించి వ్రాసివుంటుంది.

లుడోవికో పద్ధతి యొక్క తొలి పూర్తి-స్థాయి పరిశోధనకు అలెక్స్ ఎన్నుకోబడతాడు. ఈ పద్ధతి ఒక రకమైన అయిష్టత చికిత్స. రెండు వారాల పాటు హింసాత్మకమైన చిత్రాలను అలెక్స్ కు చూపించి అదే సమయములో అత్యధిక వికారం కలిగించే మందు ఇవ్వబడుతుంది. ఒక పెద్ద తెర ముందు సీటులో అలెక్స్ ను కూర్చోబెట్టి కట్టేస్తారు. వరుసగా హింసాత్మక సంఘటనలను అలెక్స్ చూడాలని నిర్బంధం చేస్తారు. ఈ చికిత్స సమయములో, హింసాత్మక సంఘటనలే కాకుండా, ఆ సంగీతం కూడా అతనికి వికారాన్ని కలిగిస్తుందని అలెక్స్ తెలుసుకుంటాడు. (బీతొవెన్ యొక్క నైంత్ సింఫనీ సంగీతానికి మాత్రమే ఈ ఫలితం ఉన్నట్లు కుబ్రిక్ తీసిన చిత్రములో చూపబడుతుంది) ఆ సంగీతాన్ని ఆపేయమని చికిత్సను పర్యవేక్షిస్తున్న వైద్యులను అలెక్స్ వేడుకుంటాడు. సంగీతం మీద తనకున్న ప్రేమను తీసేయడం పాపమని చెప్పి వేడుకుంటాడు. "లుడ్విగ్ వాన్" ఏ తప్పు చేయలేదని, "సంగీతాన్ని సమకూర్చడం మాత్రమే చేసాడని", ఈ విధంగా ఒక సంగీతకారుడుని దుర్వినియోగం చేయడం తప్పని చెపుతాడు. కాని వైద్యులు దానికి అంగీకరించకుండా, ఈ విధంగా చేయడం అలెక్స్ కే మంచిదని, సంగీతం ఒక రకమైన "శిక్ష" అని చెపుతారు. ఈ చికిత్స ముగిసే సరికి, అలెక్స్ తన అభిమాన సాంప్రదాయ సంగీతాన్ని వికారం మరియు క్షోభ కలగకుండా వినలేక పోయేవాడు.

కొన్ని వారాల తరువాత జైలు మరియు ప్రభుత్వ అధికారుల ముందు విజయవంతంగా పునరావాసం పొందిన జైలు ఖైదీగా, భవిష్యత్తు సమాజ సభ్యుడుగా అలెక్స్ పరిచయం చేయబడతాడు. ఈ విధంగా నియంత్రించబడిన అలెక్స్ ను ఒక మొరటు వాడు కొదతాడు. అప్పుడు అలెక్స్ తనను రక్షించుకోలేక పోతాడు. అరకొరగా బట్టలు వేసుకున్న మహిళను చూడగానే అతనిలో శృంగార భావం కలిగినప్పుడు అతనికి వికారం కలుగుతుంది. జైలు చాప్లిన్ ఈ చికిత్సను ఖండించి, చెడును వదిలి మంచిని ఎన్నుకునే సామర్ధ్యాన్ని అలెక్స్ కు ఇవ్వకుండా ప్రభుత్వం చేసిందని అతను ఆరోపిస్తాడు. "పెడర్, ఇవన్ని చిన్న విషయాలు", అని ఒక ప్రభుత్వ అధికారి బదులిస్తాడు. "ఈ పద్ధతి పని చేస్తుందనేదే ముఖ్యం". ఆ తరువాత అలెక్స్ సమాజంలో వదలబడతాడు.

3 భాగం: జైలు తరువాత[మార్చు]

లుడోవికో చికిత్స వలన, హింసను తలుసుకున్నప్పుడల్లా అలెక్స్ కు ఆరోగ్యం చెడిపోయి, బలహీనడు అయిపోతాడు. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో అలెక్స్ సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. కాని తన తల్లితండ్రులు తన గదిని జో అనే ఒక వ్యక్తికి అద్దెకి ఇచ్చేశారని తెలుసుకుంటాడు. ఇలాగ చేయడం వలన వారు తమ కొడుకుని "మార్చేసినట్లు" భావిస్తుంటారు. తాను గతములో హింసించిన వారు మరల అతన్ని కలిస్తారు. అప్పుడు వారు అలెక్స్ మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏమి చేయలేక పోతాడు. నిరాశగా తిరుగుతూ ఉన్న సమయములో కోరోవ పాల కేంద్రానికి వస్తాడు. అక్కడ తాను ఎప్పుడు త్రాగే డ్రెంక్రోం కలిపిన పాలుని కాకుండా సింతేమేస్క్ కలిపిన పాలుని త్రాగుతాడు. అతను మ్యూజిక్ స్టోర్ కు వెళ్ళినప్పుడు, ఆ స్టోర్ గుమాస్తా అలెక్స్ ను వేధిస్తాడు. అలెక్స్ కోరిన సాంప్రదాయ సంగీతం కాకుండా బిగ్గరమైన మరియు అసహ్యకరమైన సంగీతాన్ని వేస్తాడు. అలెక్స్ కోపంతో స్టోర్ నుంచి వెళ్ళిపోతాడు. ఆత్మహత్య చేసుకోవాలని అలెక్స్ నిర్ణయించుకుంటాడు. కాని అది కూడా చేయలేక పోతాడు. ఎందుకంటే చికిత్స వలన ఎటువంటి హింసాత్మక పనులను, తన మీద కూడా, చేయలేక పోతాడు. మొదటి అధ్యాయంలో తాను డ్రూగ్స్ తో కలిసి కొట్టిన ఒక వయసుమళ్లిన పండితుడు అలెక్స్ ను ఒక పబ్లిక్ లైబ్రరీలో గుర్తుపడతాడు. ఆ పండితుడు తన మిత్రులతో కలిసి అలెక్స్ ను కొడతాడు. అక్కడకు వచ్చిన (లైబ్రరియన్ పిలిపించిన) పోలీసులు మరెవరో కాదు, డిం మరియు బిల్లిబాయ్. తమ హొదాను అడ్డం పెట్టుకొని, వాళ్ళిద్దరూ అలెక్స్ ను నగర సివారుకు తీసుకువెళ్లి బాగా కొడతారు. చనిపోయాడని అనుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు.

గ్రామప్రాంతాలంతా తిరిగిన అలెక్స్, ఒక ఏకాంతమైన కాటేజ్ తలుపు దగ్గిర పడిపోతాడు. పుస్తక అరంభంలో తాను తన డ్రూగ్స్ తో కలిసి దాడి చేసిన ఇల్లే అది అని ఆలస్యంగా తెలుసుకుంటాడు. డ్రూగ్స్ అత్యాచారం చేసిన మహిళ యొక్క భర్త అయిన శ్రీ. అలెక్జాన్డేర్ అలెక్స్ ను లోపలకి తీసుకువెళ్తాడు. అలెక్జాన్డేర్ అలెక్స్ ను గుర్తు పట్టలేదు ఎందుకంటే, ఆ రోజు డ్రూగ్స్ ముసుగులు ధరించి ఉన్నారు కనుక. అత్యాచారం సమయములో ఏర్పడిన గాయాల కారణంగా శ్రీమతి అలెక్జాన్డేర్ మరణించిందని తెలుస్తుంది. ఆ ఘోరమైన జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, ఆమె గురించిన "పసందైన జ్ఞాపకాల" అక్కడే ఉన్నాయి కనుక ఆ ఇంట్లోనే ఉండాలని ఆమె భర్త నిర్ణయించుకుంటాడు. అలెక్జాన్డేర్ తో ఉన్నప్పుడు అలెక్స్ అజాగ్రత్తగా మాటలు వాడడం వలన తాము ఇద్దరూ ఇంతకు ముందు ఎప్పుడో కలిసినట్టు ఉందని అలెక్జాన్డేర్ కు అనిపిస్తుంది. తరువాత పత్రికలలో ప్రవర్తన మార్పిడి చికిత్స గురించి వచ్చిన ప్రచారం ద్వారా అలెక్జాన్డేర్ అలెక్స్ ను గుర్తుపడతాడు. ఫెసిజం బాధితుల గురించి అవగాహన తెచ్చేందుకు అలెక్స్ ను ఒక రాజకీయ ఆయుధం లాగ వాడుకోవాలని అతను అనుకుంటాడు.

అలెక్జాన్డేర్ యొక్క రాజకీయ మిత్రులలో ఒకరు, అలెక్స్ ను పక్కకు తీసుకువెళ్ళి నేరుగా ప్రశ్నిస్తాడు: దొరికిపోయిన అలెక్స్, "దేవుడుకు తెలుసు నేను బాధ అనుభావించానని" అని చెప్పి తప్పించుకుంటాడు. "ఇంకా ఈ విషయం గురించి మనం మాట్లాడాము" అని ఆ మిత్రుడు హామీ ఇస్తాడు. కాని తరువాత అలెక్స్ ను మరొక గదికి తీసుకువెళ్లి, సాంప్రదాయ సంగీతాన్ని వినేలా చేస్తారు. అప్పుడు లుడోవికో చికిత్స యొక్క ప్రభావం వలన అలెక్స్ కు పిచ్చి పట్టినట్లు అయిపోతుంది. అలెక్స్ చచ్చి పోవాలని నిర్ణయించి తన పడకగది కిటికీ నుండి దూకుతాడు.

మరల స్పృహ వచ్చినప్పుడు అలెక్స్ ఒక ఆసుపత్రిలో ఉంటాడు. అలెక్స్ ఆత్మహత్యకు ప్రయత్నించడం వలన ప్రభుత్వానికి ఏర్పడిన దుష్ప్రచారమును సరిచేయడానికి ప్రభుత్వం అలెక్స్ కు లుడోవికో చికిత్స ప్రభావాన్ని తిరగవేసినట్లు తెలుసుకుంటాడు. అలెక్జాండెర్ యొక్క "సొంత రక్షణ మరియు అలెక్స్ యొక్క రక్షణ" కోసం అలెక్జాండెర్ ను ఒక మానసిక వ్యాధి ఆసుపత్రిలో బంధించినట్లు అలెక్స్ కు చెపుతారు. అధికారులకు సహకరించడానికి ప్రతిఫలంగా అలెక్స్ కు ఎక్కువ జీతంతో కూడిన మంచి ఉద్యోగం ఇస్తామని హామీ ఇస్తారు. తల్లితండ్రులు కూడా అలెక్స్ ను తిరిగి తీసుకోవడానికి ఒప్పుకుంటారు. హింసతో కూడిన తన పాత జీవితానికి మరల వెళ్లిపోవచ్చు అని అలెక్స్ సంతోషంగా ఉంటాడు.

చివరి అధ్యాయంలో అలెక్స్ తన అభిమాన పాలకేంద్రములో మరల కనిపిస్తాడు. ముగ్గురుతో కూడిన ఒక క్రొత్త డ్రూగ్స్ బృందంతో అలెక్స్ సహం-మనస్సుతో మరొక హింసాత్మక రాత్రికి సిద్ధమవుతూ ఉంటాడు. అలెక్స్ జేబులో ఒక బిడ్డ ఫోటో ఉండడం చూసి ఆ క్రొత్త డ్రూగ్స్ కు నవ్వొస్తుంది. ఒక అమాయక వ్యక్తి ఒక వార్తాపత్రిక తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా, అతన్ని వారు కొట్టడాన్ని అలెక్స్ చూస్తాడు. కాని ఇదివరకు అతనికి కలిగిన అనుభూతి ఇప్పుడు అతనికి కలుగలేదు. అతను తన ముటాను వదిలి వెళ్తాడు. అప్పుడు తన పాత డ్రూగ్ అయిన పీట్ ను అనుకోకుండా కలుస్తాడు. పీట్ పెళ్ళయి పెద్దవాడయి ఉంటాడు. తనకు ఒక స్వంత కొడుకు ఉండాలనే కోరిక ఉందని, అందువలనే తాను ఒక బిడ్డ ఫోటోను తనతో పెట్టుకొని ఉన్నాని పాటకులకు తెలియచేస్తాడు. హింసను వదిలేసి, కుటుంబముతో ఉండి సమాజంలో ఒక మంచి పౌరుడు లాగ జీవించాలని ఆలోచిస్తాడు. తనకు పుట్టే పిల్లలు తన మాదిరిగానే హింసాత్మకంగా ఉంటారని అనుకుంటాడు. దీని మూలాన హింస కుర్రతనమైన పని అని మనము తెలుసుకుంటాం.

చివరి అధ్యాయాన్ని తొలగించడం[మార్చు]

ఈ పుస్తకములో మూడు భాగాలు ఉండి, ఒక్కొక్కదానిలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. తాను కావాలనే మొత్తం 21 అధ్యాయాలు ఉండే విధంగా పుస్తకాన్ని వ్రాశానని బర్గెస్ చెప్పారు. మనిషికి 21 వయస్సు అనేది ఒక మైల్ రాయి వంటిదని అదే మనిషి పరిపక్వత చెందే వయస్సు అని తెలియచెప్పాలనదే దీనికి కారణము అని వ్రాశారు. 1986కు ముందు యునైటెడ్ స్టేట్స్ లో ప్రచురించబడిన పుస్తకాలలో 21వ అధ్యాయం తొలగించబడి ఉంటుంది.[2] సవరించబడిన అమెరికన్ పుస్తకము యొక్క పరిచయములో (ఈ క్రొత్త ఎడిషన్ లలో 21వ అధ్యాయము కూడా కలపబడింది) బర్గెస్ ఈ విహంగ వివరణ ఇస్తున్నారు: పుస్తకమును అతను మొదటి సారి ఒక అమెరికా ప్రచురణకర్తకు చూపించినప్పుడు, అలెక్స్ తన తప్పు తెలుసుకొని హింసను వదిలి, హింస నుండి లభించే శక్తి మరియు ఆనందాన్ని పూర్తిగా తొలగిపోయినట్లు చూపించే ఆఖరి అధ్యాయం యు.ఎస్. పాటకులుకు ఎట్టి పరిస్థితిలోనూ నచ్చదని చెప్పాడట. (అలెక్స్ మారే ఆ తరుణమే మెటనోయియా-ప్రధాన పాత్ర అప్పుడు వరకు తానూ అనుకున్నదంతా తప్పు అని తెలుసుకోవడం).

ఆ అమెరికా ప్రచురణకర్త పట్టుపట్టడంతో, బర్గెస్ యు.ఎస్.లో ప్రచురించిన పుస్తకాలలో ఆఖరి అధ్యాయాన్ని తొలగించడానికి ఒప్పుకున్నారు. అప్పుడే, కథ నిరాశతో ముగిస్తుంది. యువ అలెక్స్ తన చెడు వైఖరికి లొంగిపోయినట్లుగా కథ ముగిస్తుంది. ఈ ముగింపే "ఎక్కువ యదార్ధంగా" ఉండి యు.ఎస్. పాటకులకు ఆకర్షణీయంగా ఉంటుందని ఆ ప్రచురణకర్త పట్టుపట్టారు. స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వం వహించిన చిత్ర అనుకరణము ఈ (బర్గెస్' మాటలు, ibid.) "లోపించిన చెడు" అమెరికన్ ఎడిషన్ మీద ఆధారపడి తీయబడింది. కుబ్రిక్ 21వ అధ్యాయాన్ని "ఒక అదనపు అధ్యాయం" అని వర్ణించి, తాను చిత్ర కథను పూర్తి చేసే వరకు ఆ అధ్యాయాన్ని చదవలేదని,[3] దానిని వాడాలని తాను ఎప్పుడు అనుకోలేదని ఆయన చెప్పారు.

పాత్రలు[మార్చు]

 • అలెక్స్ : నవల యొక్క యాంటి-హీరో మరియు తన డ్రూగ్స్ కు నేత. అతను తరచూ తనను "మీ విధేయుడైన వ్యాఖ్యాత" అని చెప్పుకుంటాడు. (ఒక మ్యూజిక్ షాప్ లో ఇద్దరు అమ్మాయిలను వశం చేసుకున్న అలెక్స్ తనను "అలెక్జాండెర్ ది లార్జ్" అని చెప్పుకుంటాడు.; 1971 చిత్రములో అతని ఇంటిపేరు డిలార్జ్ అని చూపించడానికి ఇదే కారణము.)
 • జార్జ్' or జార్జీ' : అలెక్స్ తరువాత రెండవ స్థానములో ఉన్న అత్యాశ కలిగిన వ్యక్తి. ముటాకు అలెక్స్ యొక్క నేత్రుత్వాన్ని తక్కువగా జారీ చేస్తూ ఉంటాడు. అలెక్స్ జైలులో ఉన్న సమయములో అతను ఒక విఫలమైన దొంగతన ప్రయత్నములో చని పోతాడు.
 • పేటె : ముటా లోనే ఎక్కువ తెలివైన వ్యక్తి మరియు తక్కువ హింసాత్మకమైన వ్యక్తి. డ్రూగ్స్ తమలో తాము పోట్లాడుకుంటున్నప్పుడు, అతను మాత్రమే ఎవరి పక్షము తీసుకోడు. తరువాత అతను ఒక అమ్మాయిని కలిసి పెళ్ళి చేసుకుంటాడు. తన పాత అలవాటులను మార్చుకుంటాడు. అతనికి తన పాత మాట తీరు కూడా పోతుంది. ఆఖరి అధ్యాయంలో పీట్ ను అలెక్స్ కలవటంతో, తన పవర్తన మార్చుకొని, సమాజంలో ఒక మంచి పౌరుడు లాగ ఉండాలనే కోరిక అలెక్స్ కు ఏర్పడటానికి పీట్ కారకుడయ్యాడు.
 • డిం : ముటాలోనే పూర్తి బుద్ధిహీనుడు, అవివేకి. ఇతనిని అలెక్స్ చాలా తక్కువగా చూసినా, డ్రూగ్స్ యొక్క ఇతర సభ్యులు ఇతని పోట్లాడే సామర్ధ్యాని కొరకు ఇతనిని కొంత వరకు గౌరవిస్తారు. ఒక బైక్ చిన్ ముక్కే ఇతని ఇష్టమైన ఆయుధం. తరువాత ఇతను పోలీసు అధికారి అవుతాడు. అలెక్స్ ముటా నేతగా ఉన్నప్పుడు తనని అవమానించినందుకు అతని మీద పగ తీర్చుకుంటాడు.
 • పి. ఆర్. డెల్టాయిడ్ : అలెక్స్ ను సరైన మార్గములో పీట్ బాధ్యత చేపట్టిన ఒక సమాజ స్పృహ ఉన్న వ్యక్తి. ఇతను ఒక యేనలి రిటెన్టివ్ వ్యక్తి. యువకులతో ఎలా ప్రవర్తించాలో అని ఇతనికి ఏ మాత్రం తెలియదు. అలెక్స్ మీద ఎటువంటి సానుభూతి కాని అతని గురించి అవగాహన గాని ఇతనికి లేదు. ఒక ముసలావిడను హత్య చేసినందుకు అలెక్స్ అరెస్ట్ చేయబడి, అతనిని పలువురు పోలీసు అధికారులు గట్టిగా కొట్టినప్పుడు డెల్టాయిడ్ ఊరకే అలెక్స్ మీద ఉమ్మేసి వెళ్తాడు.
 • జైలు చాప్లిన్ : బలవంతమైన మంచి కంటే ఎన్నుకున్న దుర్మార్గము మంచిదా కాదా అని మొదట ప్రశ్నించిన వ్యక్తి. అలెక్స్ శ్రేయస్సు గురించి నిజమైన శ్రద్ధ కలిగిన ఒకే వ్యక్తి; అయితే ఇతన్ని అలెక్స్ పెద్దగా పట్టించుకోలేదు. (ఇతనికి "జైలు చార్లీ" లేదా "చాప్లిన్" అని అలెక్స్ మారుపేరు పెట్టాడు. ఇవి చార్లీ చాప్లిన్ను సూచిస్తున్నాయి)
 • బిల్లీబాయ్ : అలెక్స్ కు పోటీదారుడు, ప్రత్యర్థి. కథ ప్రారంభములో, అలెక్స్ తన డ్రూగ్స్ తో కలిసి బిల్లీబాయ్ అతని డ్రూగ్స్ తో ఘర్షణకు దిగుతారు. పోలీస్ వచ్చినప్పుడు ఇది హటాత్తుగా ఆగిపోతుంది. తరువాత, అలెక్స్ జైలు నుండి విడుదలైన తరువాత, బిల్లీబాయ్ (డింతో పాటు. ఇతను మాదిరిగానే డిం కూడా ఒక పోలీసు అధికారి అయి ఉంటాడు) అలెక్స్ ను ఒక ముటా నుండి రక్షించి, తరువాత అతన్ని బాగా కొడతారు.
 • గవర్నర్ : లుడోవికో పద్ధతిను ఉపయోగించి సంస్కరణ పొందడానికి మొదటి వ్యక్తిగా అలెక్స్ ను ఎన్నుకున్న వ్యక్తి.
 • డా. బ్రనోం : బ్రోడ్స్కి యొక్క సహా ఉద్యోగి మరియు లుడోవికో పద్ధతి రూపకర్తలలో ఒకరు. మొదట్లో అతను అలెక్స్ కు ఒక మిత్రుడులాగా, తండ్రి లాగ అనిపించినా, తరువాత మానసీక వేధింపుకు గురిచేయటానికి అతన్ని థియేటర్ కు బలవంతంగా పంపుతాడు.
 • డా. బ్రాడ్స్కీ : మనుషులను ద్వేషించే శాస్త్రవేత్త మరియు లుడోవికో పద్ధతి రూపకర్తలలో ఒకరు. బ్రనోం కంటే చాలా తక్కువ క్రియాశీలంగా ఉంటాడు. చాలా తక్కువ మాట్లాడుతాడు.
 • ఎఫ్. అలెక్జాండెర్ : ఇతను ఒక రచయిత. అలెక్స్, తన డ్రూగ్స్ తో కలిసి అతని ఇంట్లోకి చొరబడినప్పుడు, అతను ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ అనే పేరుతొ ఒక మాగ్నం ఓపస్ ను వ్రాసే పనిలో ఉన్నాడు. అలెక్స్, అతని డ్రూగ్స్ ఇతన్ని కొట్టి తరువాత ఇతని భార్య మీద అత్యాచారం చేస్తారు. దీని వలన ఆమె తరువాత చనిపోతుంది. ఈ ఘటనలు అతన్ని బాగా బాధిస్తాయి. రెండేళ్ళు తరువాత అతను అలెక్స్ ను కలిసినప్పుడు, ఒక క్రూరమైన పరిశోధనలో అలెక్స్ ను ఒక గినీ పిగ్ లాగా వాడుతాడు. లుడోవికో పద్ధతి వలన ప్రయోజనం లేదని నిరూపించడమే ఈ పరిశోధన యొక్క ఉద్దేశం.
 • ఒట్టో స్కడేలిగ్ : డెన్మార్క్ కు చెందిన సంగీతకారుడు - ఒక కల్పనా పాత్ర అతని మూడవ సింఫనీ లోని మొదటి దశ బాగా హింసాత్మకంగా ఉంటుంది. ఇది అలెక్స్ ను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. డేనిష్ మరియు నార్వేజియన్ భాషలలో అతని ఇంటిపేరుకు "హానికరం" అని అర్ధం.[4]

విశ్లేషణ[మార్చు]

శీర్షిక[మార్చు]

ఈ శీర్షికకు బర్గెస్ మూడు మూలాలు ఇస్తున్నారు:

 • "ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ లాగా విచిత్రమైన" అనే మాటను అతను ఒక లండన్ పబ్ లో వింటాడు. అది ఒక కాక్నీ పద ప్రయోగమని అనుకుంటాడు. ¹ అప్పటినుంచి పలు మార్లు ఈ పదాలను తాను విన్నానని 1972లో లిసనర్లో ప్రచురించబడిన క్లాక్ వర్క్ మర్మలేడ్ అనే ఒక వ్యాసంలో అయన వ్రాశారు. అయితే 1962కు ముందు ఈ పదాన్ని వాడినట్లు ఆ ఆధారాలు లేవు.[1] మేమాయిర్స్ (1991) అని తాను వ్రాసిన పుస్తకములో కింగ్స్లీ అమిస్ ఈ విధంగా వ్రాస్తాడు: ఎరిక్ పార్ట్రిడ్జ్ యొక్క చారిత్రాత్మిక యాస నిఘంటువులో ఈ పదాల గురించి ఎక్కడ వ్రాయలేదు.
 • "మనిషి" అనే అర్ధంగల ఆరంజ్ అనే మలయ్ భాష పదం పైన ఒక శ్లేషయే ఈ పదం అనేది అతని రెండవ వివరణ. నవలలో ఇంకేమి మలయ్ పదాలు గాని సంబంధించినవి కానీ లేవు.[1]
 • ఎ క్లాక్ వర్క్ ఆరంజ్: ఎ ప్లే విత్ మ్యూజిక్ యొక్క అవతారికలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు: "...రసంతో నిండిన, తీపి మరియు సువాసనతో కూడిన ఒక జీవంతో ఉన్న వస్తు ఆటోమేషన్ గా మారడానికి" ఈ నవల యొక్క శీర్షిక ఒక రూపకాలంకారం."[1] "క్లాక్ వర్క్ ఆరంజస్"², అనే తాను వ్రాసిన ఒక వ్యాసంలో బర్గెస్ ఈ విధంగా వ్రాశారు. "ఈ కథకి ఇదే తగు శీర్షిక. రంగు మరియు తీపి వంటి అంశాలను పొందగలే పండు వంటి ఒక జీవికి పవ్లోవియన్ లేదా యాంత్రిక సూత్రాలను వర్తింపచేస్తే ఏర్పడే పరిణామాల గురించినది ఈ కథ" మంచి స్పందనలే చూపాలని నియంత్రించబడిన ప్రధాన పాత్ర, తన స్వేచ్ఛను ఆపే చెడు భావనలను ఎలాగా ఎదుర్కుంటాడు అనే అంశాన్ని ఈ శీర్షిక సూచిస్తుంది.

అభిప్రాయం[మార్చు]

ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ కథ విశ్వసనీయతలేని పక్షపాత వైఖరి ఒక వ్యాఖ్యాత ఉత్తమ-పురుష పద్ధతిలో చెప్పే విధంగా వ్రాయబడింది. ప్రధాన పాత్ర అయిన అలెక్స్ కథలో తన చర్యలను ఎప్పుడూ సమర్దించుకోడు. అతను కొంతమేరకు ఒక విశ్వాసపాత్రుడు లాగా కనిపిస్తాడు; తన పనులవల్ల తన మీద ఎంతో ద్వేషం కలిగించాలని అలెక్స్ ప్రయత్నించినా, తన అంతులేని బాధలను చెప్పుతూ ఉండడం, ఈ విషవలయము ఎప్పటికి ముగియదు అని తెలుసుకోవడం వంటి అంశాల వలన పాటకులకు అతని మీద సానుభూతి కలుగుతుంది. అలెక్స్ ఉన్న సందర్భాలు అర్ధం కానప్పటికీ, అతను వివరిస్తున్న ధోరణి సులభంగా పాటకులు అర్ధం అవుతుంది.

యాస యొక్క వాడకం[మార్చు]

ప్రధాన వ్యాసం: Nadsat

అలెక్స్ వ్యాఖ్యాతగా ఉన్న ఈ పుస్తకములో, నాడ్సట్ అనే పలు క్రొత్త యాస పదాలను బర్గెస్ సృష్టించాడు. మార్పు చేయబడిన స్లావిక్ పదాలు, రైమింగ్ యేస, రష్యన్ పదాలు ("బబూచ్క") మరియు బర్గెస్ కనిపెట్టిన క్రొత్త పదాలు ఈ నడ్సాట్ లో ఉన్నాయి. ఉహాహరణకు నాడ్సాట్ లో ఈ పదాలకు అర్ధాలు ఇవి. 'డ్రూగ్' అంటే 'స్నేహితుడు'; 'కోరోవ' అంటే 'పశువు'; 'రిస్ప్' అంటే చొక్కా; 'గోలోవ' (గల్లివర్) అంటే 'తల'; 'మాల్చిక్' లేక 'మాల్చికివిక్' అంటే 'అబ్బాయి'; 'సూమ్క' అంటే 'గోనిసంచి' లేక 'సంచి'; 'బొగ్' అంటే 'దేవుడు'; 'ఖోరోశో' (హారర్ షో) అంటే 'మంచిది', 'ప్రేస్టూప్ నిక్' అంటే 'నేరగాడు'; 'రూక' (రూకర్) అంటే 'చేయి', 'కాల్' అంటే 'చెత్త', 'వెక్' ('చేల్లోవెక్') అంటే 'మగవాడు' లేక 'గై'; 'లిట్సో' అంటే 'ముఖము'; 'మలేన్కి' అంటే 'కొద్దిగా'; అలెక్స్ యొక్క వైద్యులలో ఒకరు ఈ భాషను తన సహ ఉద్యోగికి ఈ విధంగా వివరిస్తారు: "పాత రైమింగ్ యాసలోని కొన్ని మాటలు; కొంత జిప్సీ మాటలు కూడా ఉన్నాయి. కాని చాలా పదాల మూలాలు స్లావ్ ప్రచారమే. సుబ్లిమినల్ పేనిట్రేషన్." కొన్ని పదాలకు ఈ మూలాలు లేవు. కాని వాటిని సులభంగా ఊహించవచ్చు. ఉదాహరణకు, "ఇన్-అవుట్, ఇన్-అవుట్' లేదా 'పాత ఇన్-అవుట్' అనగా శృంగారం. అయితే 'కట్టర్' అంటే డబ్బు ఎందుకంటే 'కట్టర్' అనే పదం 'బ్రెడ్-అండ్-బెటర్' అనే దానికి రైం; ఇది ఒక రైమింగ్ ఏస. బయటవాళ్ళకు (ముఖ్యంగా పోలీసువాళ్ళకు) అర్ధం కాని విధంగా ఉండాలని ఈ విధంగా పెట్టబడింది.

పుస్తకము యొక్క మొదటి ఎడిషన్ లో, ఈ యాస పదాలకు అర్ధాలు ఇవ్వబడలేదు. పాటకలు ఈ భాషను సందర్భం బట్టి అర్ధం చేసుకోవలసి వచ్చింది. సవరించబడిన ఎడిషన్ యొక్క అపెండిక్స్ లో బర్గెస్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ యాస భాష పుస్తకము పాతపడి పోకుండా చూసుకుంటుంది. అంతే కాక, హింసాత్మక ఘటనల మూలాన "అశ్లీల భావాలు" ఏర్పడకుండా ఈ యాస భాష చూసుకుంటుంది. బ్రెయిన్వాష్ ప్రక్రియ ఒక పాత్ర వహిస్తున్న ఈ నవలలో, కథ చెప్పే విధమే నాడ్సాట్ ను అర్ధం చేసుకునే విధముగా పాటకులను మతిపోగోడుతుంది.

మితిమీరిన మరియు/లేదా అర్ధంలేని హింసకు "అల్ట్రావయలన్స్" అనే పదాన్ని బర్గెస్ రూపొందించాడు. "అల్ట్రా-వయ్లంట్ ను చేయి" అనే వాక్యాలు పుస్తకములో వస్తాయి. ఈ పదముకు కళాత్మక హింసకు ఉన్న సంబంధం వలన మీడియాలో ఈ పదం వాడబడింది.[5][6][7][8]

రచయిత యొక్క వివరణ[మార్చు]

1985లో, ఫ్లేం ఇంటు బీయింగ్: ది లైఫ్ అండ్ వర్క్ అఫ్ డి.హెచ్. లారన్స్ (హీనేమాన్, లండన్) అనే పుస్తకాన్ని బర్గెస్ ప్రచురించారు. ఆఖరి అధ్యర్యంలోలేడీ చాటేర్లీస్ లవర్ గురించి వ్రాసినప్పుడు, ఆ నవల యొక్క వ్యాఖ్యాతను ఎ క్లాక్ వర్క్ ఆరంజ్తో పోల్చాడు: "తెలిసినవాటిని చెడుగా ప్రాబల్యం చెందేలా చేయాలనే కోరిక మనమందరికి ఉంది. నేను ఏ పుస్తకానికోసం ప్రసిద్ధి చెందానో, ఆ నవలను ఖండించడానికి సిద్ధంగా ఉన్నాను: ఇరవై ఐదు సంవసరాల కృతం రాశిన ఈ జ్యూ డి'ఎస్ప్రిట్ నవల మూడు వారాలలోనే పూర్తి డబ్బు సంపాదించింది. అయితే, అది కామము, హింస వంటి అంశాలను గొప్పగా చిత్రీకరించే ఒక చలనచిత్రానికి మూలంగా అయింది. ఈ చిత్రము వలన నవలను అపార్ధం చేసుకోవడం సులభమయింది. నేను మరణించేవరకు ఈ అపార్ధం నన్ను వేధిస్తూ ఉంటుంది. నేను ఈ పుస్తకాన్ని వ్రాసి ఉండకూడదు. ఎందుకంటే అపార్ధం చేసుకోబడే ఈ ప్రమాదం ఉంది కనుక. లారన్స్ అండ్ లేడి చటేర్లీస్ లవర్ గురించి కూడా ఇదే విధంగా చెప్పవచ్చు."

పురస్కారాలు, ప్రతిపాదనలు మరియు రేంకింగ్ లు[మార్చు]

 • 1983 – ప్రోమేత్యూస్ అవార్డు{/౦ (ప్రిలిమినరి నామినీ)
 • 1999 – ప్రోమేత్యూస్ అవార్డు (ప్రతిపాదన)
 • 2002 – ప్రోమేత్యూస్ అవార్డు (ప్రతిపాదన)
 • 2003 – ప్రోమేత్యూస్ అవార్డు (ప్రతిపాదన)
 • 2006 – ప్రోమేత్యూస్ అవార్డు (ప్రతిపాదన)[9]
 • 2008 – ప్రోమేత్యూస్ అవార్డు (హాల్ అఫ్ ఫేం అవార్డు)

1923 నుండి 2005 వరకు వెలుబడిన 100 ఉత్తమ ఆంగ్ల-భాష నవలలలో ఒకటిగా ఈ నవలను టైం పత్రిక ఎన్నుకుంది.[10]

అనుకరణలు[మార్చు]

చలనచిత్రం[మార్చు]

 • 1971లో స్టాన్లీ కుబ్రిక్ తీసిన ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ చిత్రమే ఈ నవల యొక్క ప్రసిద్ధమైన చిత్ర అనుకరణ.
 • 1965లో అండి వార్హోల్ తీసిన వినైల్ చిత్రం కూడా బర్గెస్ నవల మీద ఆధారపడింది.
 • 1983లో, బెల్జియన్ టెలివిజన్ కు ఇచ్చిన ఒక భేటిలో బర్గెస్ ఈ విధంగా చెప్పాడు- 60లలో రోలింగ్ స్టోన్స్ కు చెందిన అండ్రూ లూగ్ వోల్ధాం ఒక చిత్ర అనుకరణలో నటించడానికి ఆసక్తి చూపించారు.

టెలివిజన్[మార్చు]

నవల యొక్క మొదటి రెండు అధ్యాయాలు నాటకములుగా తీయబడి BBC TV యొక్క టునైట్, 1962 అనే కార్యక్రములో ప్రసారం చేయబడింది (ఇప్పుడు ఇది లేదు, తొలగించబడిందని నమ్మబడుతుంది).

రంగస్థలం[మార్చు]

కుబ్రిక్ తీసిన చిత్రం విడుదల అయిన తరువాత, బర్గెస్ ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ నాటకానికి కథ వ్రాశాడు. దీనిలో అయిష్టత కలిగించే చికిత్స వలన సంగీతాన్ని అనుభవించే సామర్ధ్యాన్ని అలెక్స్ కోల్పోయాడు అని తెలియగానే డా. బ్రనోం మానసీక వైద్యశాలనుంది వైతోలుగుతాడు. ఈ నాటకంలో నవల యొక్క అసలు ముగింపు ఉంటుంది.

1988లో, బాడ్ గోడేస్బెర్గ్ లో జరిగిన జర్మన్ అనుకరణలో జర్మన్ పంక్ రాక్ బ్యాండ్ డై టోటెన్ హోసేన్ వారి సంగీతము మరియు బీతొవన్ యొక్క నైంత్ సింఫనీ మరియు "ఇతర చెత్త పాటలు" (సబ్ టైటిల్ లో పెర్కున్నట్లు) తో కూడిన Ein kleines bisschen Horrorschau అనే ఆల్బం విడుదల చేయబడింది. Hier kommt Aleks అనే పాట, బ్యాండ్ యొక్క ప్రధాన పాటగా మారింది.

వనేస్సా క్లైర్ స్మిత్, స్టెర్లింగ్ వోల్ఫ్, మైకేల్ హోమ్స్, మరియు రికి కోట్స్ - బ్రాడ్ మేస్ యొక్క మల్టీ-మీడియా స్టేజి రూపకల్పన ఎ క్లాక్ వర్క్ ఆరంజ్, 2003, లాస్ ఏంజెలెస్ (ఫోటో: పేటర్ జూల్క్)
వనేస్సా కలైర్ స్మిత్ - బ్రాడ్ మేస్ యొక్క మల్టీ-మీడియా స్టేజి రూపకల్పన ఎ క్లాక్ వర్క్ ఆరంజ్, 2003, లాస్ ఏంజెలెస్ (ఫోటో: పేటర్ జూల్క్)

ఫిబ్రవరి 1990లో, రాయల్ షేక్స్పియర్ కంపెనీ లండన్ లోని బర్బికన్ థియేటర్ లో మరొక సంగీత వెర్షన్ ను తయారు చేసింది. 'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్:2004' అనే పేరుగల ఈ సంగీత నాటకం చాలా వరకు ప్రతికూల విమర్శలనే ఎదుర్కుంది. ది సండే టైమ్స్ అఫ్ లండన్ కు చెందిన జాన్ పీటర్ దీనిని ఒక వివేచనాత్మక 'రాకీ హారర్ షో' అని చెప్పాడు. ది సండే టెలిగ్రాఫ్ కు చెందిన జాన్ గ్రాస్ దీనిని ఒక క్లాక్ వర్క్ లెమన్ అని చెప్పాడు. నవల ఆధారంగా ఈ నాటకానికి కథ వ్రాసిన బర్గెస్ కే ఈ నాటకం నిరాశ కలిగించింది. ది ఈవినింగ్ స్టాండర్డ్ ప్రకారం, U2 అనే రాక్ బృందానికి చెందిన బోనో మరియు ఎడ్జ్ వ్రాసిన పాటను అతను నియో-వాల్పేపర్ అని వర్ణించాడు. మొదట్లో నాటక దర్శకుడు రాన్ దేనియల్స్ తో కలిసి బర్గెస్ పనిచేసినప్పుడు సాంప్రదాయకమైన సంగీతాన్ని రూపొందించాలని అనుకున్నాడు. కాని ఆ సంగీతాన్ని కాదని బ్యాండ్ పరీక్షాత్మకంగా రూపొందించిన హిప్ హోప్, లిటుర్జికల్ మరియు గోతిక్ సంగేతాల మిశ్రమను అతను ఘాటుగా విమర్శించాడు. ది ఐరిష్ ఇండేపెండెంట్ కు చెందిన లైసె హ్యాండ్ ఈ విధంగా వ్రాశారు: ముందు రూపొందించిన సంగీతం "ఒక నవల రచయిత వ్రాసినట్లు ఉంది కానీ ఒక పాటల రచయిత వ్రాసినట్లు లేదు" అని U2 కు చెందిన ది ఎడ్జ్ చెప్పారు. 20/20 మాగజైన్ కు చెందిన జెన్ ఎడ్వార్డస్ దీనిని "అర్ధంలేని గ్లిట్జ్" అని చెప్పి ఈ నాటకాన్ని చూడడం ఎలాగ ఉందంటే, "ఒక ఖరీదైన ఫ్రెంచ్ రెస్టారంట్ కు పిలిచి ఒక బిగ్ మాక్ ను ఇవ్వడం లాగ ఉంది".

2001లో, టెర్రీ కోస్టా దర్శకత్వంలో UNI థియేటర్ (మిస్సిస్సాగా, ఒంటారియో) ఈ నవల యొక్క కనెడియన్ నాటిక అనుకరణను రూపొందించింది.[11]

2002లో, అన్తోనీ బర్గెస్ వ్రాసిన 'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్' యొక్క న్యూ యార్క్ అనుకరణను గాడ్లైట్ థియేటర్ కంపెనీ మాన్హాటన్ థియేటర్ సోర్స్ లో ప్రదర్శించింది. ఈ నాటిక SoHo ప్లేహౌస్ (2002), ఎన్సేమ్బిల్ స్టూడియో థియేటర్ (2004), 59E59 థియేటర్స్ (2005) మరియు ఎడింబర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ (2005) లో ప్రదర్శించబడింది. ఎడింబర్గ్ లో నిండు సభలో ప్రర్శించబడినప్పుడు, ఈ నాటిక సానుకూల విమర్శలను అందుకుంది. ఈ నాటికకు గాడ్లైట్ యొక్క కళా దర్శకుడు అయిన జో టన్టలో దర్శకత్వం వహించాడు.

2003లో, లోస్ ఏన్జేలేస్ దర్శకుడు బ్రాడ్ మేస్[12] మరియు ARK థియేటర్ కంపెనీ కలిసి ఎ క్లాక్ వర్క్ ఆరంజ్,[13] యొక్క ఒక వివాదాస్పతమైన మల్టీ-మీడియా అనుకరణను ప్రదర్శించారు. దీనిని LA వీక్లీ "పిక్ అఫ్ ది వీక్"గా ఎన్నుకుంది. మూడు 2004 LA వీక్లీ థియేటర్ అవార్డు లకు ప్రతిపాదించబడింది: దర్శకత్వం, (20వ శతాబ్ద సృష్టిలను) పునరుద్దరణ మరియు ప్రధాన మహిళా పాత్ర ప్రదర్శన. [14] వనేస్సా క్లైరే స్మిత్ అద్బుతంగా సంగీతాన్ని ప్రేమించే ఒక యువ సమాజ విద్రోహి అలెక్స్ పాత్రలో నటించినదానికి ఉత్తమ నటి పురస్కారం అందుకుంది.[15] ఈ వినూత్న ప్రదర్శనలో మూడు విడివిడి వీడియో స్ట్రీంల ద్వారా స్టేజిలో ఏడు వీడియో మానిటర్ల పెట్టి ప్రదర్శన చేయబడింది. వీటిలో ఆరు 19 అంగుళాలు కాగా ఒకటి 40 అంగుళాలు. పుస్తకము యొక్క ఉత్తమ-పురుష పద్ధతిని అనుసరించడానికి, "మీ విధేయుడు" అని అలెక్స్ మాటలు ముందుగానే రికార్డ్ చేయబడి 40 అంగుళాలు మానిటర్ లో చూపబడింది.[16] దీని మూలానా స్టేజి లోని పాత్రలకు స్వేచ్ఛ దొరికింది.[17] LA వీక్లీ ప్రకారం, మానవ స్ఫూర్తి మీద ఆధిక్యం కొరకు మనిషి యొక్క చెడుతత్వం, మంచి తత్వాలకు మధ్య జరిగే పోరాటాన్ని ఈ మల్టిమీడియా ప్రదర్శన చక్కగా చూపిస్తుంది. యుద్ధం, చిత్రహింస, అశ్లీల చిత్రాలను ఏడు TV తెరల మీద చూపించి ప్రేక్షలకు హింస యొక్క బీభత్సాన్ని చక్కగా దర్శకుడు చూపించాడు."[18]

జనవరి 2010లో, బుక్ క్లబ్ అనే ఒక హాస్య బృందం హాలివుడ్, CA లోని I.O. వెస్ట్ థియేటర్ లో ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ యొక్క రంగస్థల అనుకరణను ప్రదర్శించారు.

సంగీతం[మార్చు]

బ్రెజిల్ కు చెందిన సేపుల్టుర అనే హెవి మెటల్ బృందం ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ కథను తమ A-Lex అనే ఆల్బంకు వాడుకున్నారు. ఈ ఆల్బం పేరు కథలోని ప్రధాన పాత్ర పేరును సూచిస్తుంది. లాటిన్ భాషలో a-lex అంటే, "చట్టం లేకుండా" అని అర్ధం.

అర్జెంటినాకు చెందిన లాస్ వయోలడోరిస్ అనే పంక్ రాక్ బృందం, ఈ కథ వలన ప్రభావితమయి 1,2,Ultraviolento అనే పాటను వ్రాశారు.

జర్మనీకి చెందిన Die Toten Hosen అనే పంక్ బృందం ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ మీద ఆధారపడిన Ein kleines bisschen Horrorschau లేదా "అ లిటిల్ బిట్ అఫ్ హారర్ షో." అనే ఆల్బంను రూపొందించారు.

అమెరికాకు చెందిన మేలోర క్రీగేర్ అనే సేల్లిస్ట్ "ఐ వాంట్ టు మారి ఎ లైట్ హౌస్ కీపెర్"ను తన రెండు అల్బంలలో వాడింది. ఆ ఆల్బాలు ఇవి: Melora a la Basilica మరియు ది ప్రేగ్నంట్ కన్సుర్ట్.

విడుదల వివరాలు[మార్చు]

 • 1962, UK, విల్లియం హీనేమాన్ (ISBN ?), డిసంబర్ 1962, హార్డ్ కవర్
 • 1962, US, W W నార్టన్ & కో లి (ISBN ?), 1962, హార్డ్ కవర్
 • 1963, US, W W నార్టన్ & కో లి (ISBN 0-345-28411-9), 1963, పేపర్ బ్యాక్
 • 1965, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-01708-0), 1965, పేపర్ బ్యాక్
 • 1969, US, బాలన్టైన్ బుక్స్ (ISBN ?), 1969, పేపర్ బ్యాక్
 • 1971, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-02624-1), 1971, పేపర్ బ్యాక్
 • 1972, UK, లోర్రిమేర్, (ISBN 0-85647-019-8), 11 సెప్టెంబర్ 1972, హార్డ్ కవర్
 • 1972, UK, పెంగుయిన్ బుక్స్ లి (ISBN 0-14-003219-3), 25 జనవరి 1973, పేపర్ బ్యాక్
 • 1973, US, కేడ్మోన్ రికార్డ్స్, 1973, వినైల్ LP (మొదటి 4 అధ్యాయాలును ఆంథోనీ బర్గెస్ చదివాడు)
 • 1977, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-27321-4), 12 సెప్టెంబర్ 1977, పేపర్ బ్యాక్
 • 1979, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-31483-2), ఏప్రిల్ 1979, పేపర్ బ్యాక్
 • 1983, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-31483-2), 12 జూలై 1983, అన్ బౌండ్
 • 1986, US, W. W. నార్టన్ & కంపెనీ (ISBN 0-393-31283-6), నవంబర్ 1986, పేపర్ బ్యాక్ (యు.ఎస్. వెర్షన్ లలో అధివరకు లేని చివరి ఆధ్యాయం కూడా కలపబడింది)
 • 1987, UK, W W నార్టన్ & కో లి (ISBN 0-393-02439-3), జూలై 1987, హార్డ్ కవర్
 • 1988, US, బాలన్టైన్ బుక్స్ (ISBN 0-345-35443-5), మార్చి 1988, పేపర్ బ్యాక్
 • 1995, UK, W W నార్టన్ & కో లి (ISBN 0-393-31283-6), జూన్ 1995, పేపర్ బ్యాక్
 • 1996, UK, పెంగ్విన్ బుక్స్ లి (ISBN 0-14-018882-7), 25 ఏప్రిల్ 1996, పేపర్ బ్యాక్
 • 1996, UK, హార్పెర్ ఆడియో (ISBN 0-694-51752-6), సెప్టెంబర్ 1996, ఆడియో కేసట్
 • 1997, UK, హేయ్న్ వేర్లాగ్ (ISBN 3-453-13079-0), 31 జనవరి 1997, పేపర్ బ్యాక్
 • 1998, UK, పెంగ్విన్ బుక్స్ లి (ISBN 0-14-027409-X), 3 సెప్టెంబర్ 1998, పేపర్ బ్యాక్
 • 1999, UK, రేబౌండ్ బై సెజ్ బ్రష్ (ISBN 0-8085-8194-5), అక్టోబర్ 1999, లైబ్రరీ బైండింగ్
 • 2000, UK, పెంగ్విన్ బుక్స్ లి (ISBN 0-14-118260-1), 24 ఫిబ్రవరి 2000, పేపర్ బ్యాక్
 • 2000, UK, పెంగ్విన్ బుక్స్ లి (ISBN 0-14-029105-9), 2 మార్చి 2000, పేపర్ బ్యాక్
 • 2000, UK, టర్టిల్ బుక్స్ (ISBN 0-606-19472-X), నవంబర్ 2000, హార్డ్ బ్యాక్
 • 2001, UK, పెంగ్విన్ బుక్స్ లి (ISBN 0-14-100855-5), 27 సెప్టెంబర్ 2001, పేపర్ బ్యాక్
 • 2002, UK, తార్న్ డైక్ ప్రెస్ (ISBN 0-7862-4644-8), అక్టోబర్ 2002, హార్డ్ బ్యాక్
 • 2005, UK, బక్కనీర్ బుక్స్ (ISBN 1-56849-511-0), 29 జనవరి 2005, లైబ్రరీ బైండింగ్

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ యొక్క సాంస్కృతిక సూచనల జాబితా
 • హింస యొక్క ఏస్తిటికైజేషన్
 • నాడ్సాట్

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 Dexter, Gary (2008). Why Not Catch-21?: The Stories Behind the Titles. Frances Lincoln Ltd. pp. 200–203. ISBN 0711229252. 
 2. బర్గెస్, ఆంథోనీ (1986) ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ రేసక్డ్ , ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ లో, W. W. నార్టన్ & కంపెనీ, న్యూ యార్క్.
 3. ది కుబ్రిక్ సైట్: 'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్' కుబ్రిక్ యొక్క విమర్శలు
 4. హార్ట్, గైల్ కాథ్లీన్. ఫ్రైడ్రిచ్ షిల్లెర్: క్రైం, ఎస్తేటిక్స్ అండ్ ది పోయటిక్స్ అఫ్ పనిష్మెంట్ . యూనివర్సిటీ అఫ్ డెలవేర్ ప్రెస్. 2005. ఆన్ లైన్ గూగుల్ బుక్స్. జూన్ 30, 2008
 5. AFP (2007-10-29). "Gruesome 'Saw 4' slashes through North American box-office". Archived from the original on 2007-11-14. Retrieved 2008-01-15. 
 6. "Q&A With 'Hostel' Director Eli Roth and Quentin Tarantino - New York Magazine". Retrieved 2008-01-15. 
 7. "ADV Announces New Gantz Collection, Final Guyver & More: Nov 6 Releases". Retrieved 2008-01-15. 
 8. CBS News. ""Manhunt 2": Most Violent Game Yet?, Critics Say New Video Game Is Too Realistic; Players Must Torture, Kill - CBS News". Retrieved 2008-01-15. 
 9. లిబెర్టేరియన్ ఫ్యూచరిస్ట్ సొసైటి
 10. "The Complete List | TIME Magazine — ALL-TIME 100 Novels". Time magazine. Retrieved 2007-08-20. 
 11. మిరటేక ఆర్ట్స్ మానేజ్మెంట్
 12. బ్రాడ్ మేస్
 13. బ్రాడ్ మిస్ దర్శకత్వం వహించిన ARK థియేటర్ కంపెనీ తీసిన ఎ క్లాక్ వర్క్ ఆరంజ్, 2003 నిర్మాణ ఫోటోలు
 14. LA వీక్లీ థియేటర్ అవార్డులు ప్రతిపాదనలు ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ - "ఉత్తమ రివైవల్ నిర్మాణ," "ఉత్తమ ప్రధాన మహిళా ప్రదర్శన," "ఉత్తమ దర్శకత్వం" ప్రతిపాదనలు
 15. LA వీక్లీ థియేటర్ అవార్డులు ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ - వనేస్సా క్లైర్ స్మిత్ "ఉత్తమ ప్రధాన మహిళా ప్రదర్శన" గెలుచుకున్నారు
 16. బ్రాడ్ మేస్ (చిత్రం)
 17. బ్రాడ్ మేస్ గ్యాలరి: ఎ క్లాక్ వర్క్ ఆరంజ్
 18. బ్రాడ్ మేస్ విమర్శలు
 19. ఆంథోనీ బర్గెస్ ఫ్రొం ఎ క్లాక్ వర్క్ ఆరంజ్: ఎ ప్లే విత్ మ్యూజిక్ (సెంచురీ హచ్చిసన్ లి, 1987)
 20. వర్క్testament/aక్లాక్ వర్క్testament_anthonyburgessonaclockworkorange_page2.html a clock work testament - 'ఎ క్లాక్ వర్క్ ఆరంజ్' గురించి ఆంథోనీ బుర్గేస్స్ - పేజి 2
 21. ఎ క్లాక్ వర్క్ ఆరంజ్ - ఫ్రం ఎ క్లాక్ వర్క్ ఆరంజ్: ఎ ప్లే విత్ మ్యూజిక్

బాహ్య లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:A Clockwork Orange మూస:Burgess