Jump to content

ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్

వికీపీడియా నుండి
ఎ శ్యామ్ గోపాల్ వర్మ
దర్శకత్వంసిఎస్ రెడ్డి (రాకేష్ శ్రీనివాస్)
స్క్రీన్ ప్లేరేఖ రెడ్డి
సి.ఎస్. రెడ్డి
కథమల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన పుస్తకం ఆధారంగా
నిర్మాతరేఖ రెడ్డి
సి.ఎస్. రెడ్డి
తారాగణంషఫీ, జోయ ఖాన్
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవాత్సవ్
కూర్పుకార్తీక శ్రీనివాస్
సంగీతంమంత్ర ఆనంద్
నిర్మాణ
సంస్థ
  • సమిష్టి క్రియేషన్స్
విడుదల తేదీ
2015 జనవరి 1 (2015-01-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ 2015లో విడుదలైన వ్యంగ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సమిష్టి క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ కుమార్ రాజు, రాకేష్ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. షఫీ, జోయ ఖాన్, శివ కృష్ణ, ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను జనవరి 1న విడుదల చేశారు.[1]

ఎవరిమాట వినకుండా తనకి నచ్చినట్టు సినిమాలు తీసే డైరెక్టర్ శ్యామ్ గోపాల్ వర్మ(షఫీ). శ్యామ్ గోపాల్ వర్మ తను తీసిన ‘దెబ్బకు ఠా’ సినిమా ప్రీమియర్ షో ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేసి శ్రీ శైలం అడవుల్లోని ఓ పాడు బడ్డ బంగ్లాలో బందిస్తారు. అసలు శ్యామ్ గోపాల్ వర్మని అలా బంధించింది ఎవరు? ఆ బంగ్లా నుంచి తప్పించుకోవడానికి శ్యామ్ గోపాల్ వర్మ(షఫీ) ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? చివరికి తప్పించుకోగలిగాడా ? లేదా ? చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఇది శ్యాము ఫిలిం"ఆనంద్దీప్తి చర్య, ఆనంద్04:03
2."తీస్కో కోకా కోల"ఆనంద్గీత మాధురి 
3."జుంబా అజుంబా"హర ఉప్పాడదీప్తి చర్య, దినకర్ 
4."గోపాల గోపాల"రాకేష్ శ్రీనివాస్సాయికిరణ్, అనుదీప్, శ్రీదేవి, మంజు 

మూలాలు

[మార్చు]
  1. "A Shyam Gopal Varma Film Movie Review {2.5/5}: Critic Review of A Shyam Gopal Varma Film by Times of India" (in ఇంగ్లీష్). The Times of India. 2 January 2015. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.
  2. "Shafi to star in A Shyam Gopal Varma film". The Times of India. 15 January 2017. Archived from the original on 1 January 2026. Retrieved 1 January 2026.

బయటి లింకులు

[మార్చు]