ఏకదిశ ప్రవాహ కవాటం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వింగు ఏకదిశ ప్రవాహ కవాటం
స్ప్రింగు ఏకదిశ ప్రవాహ కవాటం
స్ప్రింగు ఏకదిశ ప్రవాహ కవాటం

ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం.కవాటం అనగా ఎదైన ద్రవం లేదా వాయువు ప్రవాహన్ని నిరోధించునది, లేదా నియంత్రణ ప్రవాహాన్ని అనుమతించు పరికరం.కవాటంలో రెండు పక్కలనుండి ప్రవహించును[1] ఏక దిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు లేదా నాన్ రిటర్నువాల్వుఅందురు. ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును. వ్యతిరేకదిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రేరితంగా కవాటం నిరోధించును[2].ఒక విధంగా ఏక దిశ ప్రవాహ కవాటం రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును.ఉదాహరణకు గ్లోబ్ లేదా ప్లగ్ లేదా బాల్ వాల్వులలో రెండు వైపులా ప్రవహించును.పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా/స్వయం ప్రేరితంగా మూసుకోవు.

ఏకదిశ ప్రవాహ కవాటంకు మాములు నియంత్రణ కవాటంల మధ్య తేడా[మార్చు]

గొట్టంలో ఒకద్రవం కొంత పీడనంతో ఒకదిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ఆగిన, వాల్వు తరువాత ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు వెంటనే ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేకదిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పోవును.అలాగే కంప్రెసరు (వాయు సంకోచక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెనక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును.బాయిలరు పనిచేయునపుడు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును.కావున బాయిలరులో వున్న పీడనంకన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా బయిలరు లోనికి పంపిస్తారు. పంపు ఆపిన వెంటనే, బాయిలరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము+నీరు బాయిలరు నుండి వెనక్కి పంపులోకి,, ఫీడ్ వాటరు పంపులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తుపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం/పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించకుండా ఈ ఏకదిశ కవాటాలు నిరోధించును.పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. అందువలన ఈ చెక్‌వాల్వు లేదాఏకదిశ ప్రవాహ కవాటాన్ని పంపు డెలివరి గొట్టంలో అమర్చడం వలన ముందుకు వెళ్ళీన ప్రవాహం వెనక్కి రాదు.

బావులనుండి, కాలువ లనుండి నీటిని తోడు పంపుల సక్షనుపైపు కిందిభాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

ఏకదిశ ప్రవాహ కవాటం నిర్మాణం[మార్చు]

చెక్ వాల్వు అనబడు ఏకదిశ కవాటాలు పలుఆకృతులలోలభించును. ఏకదిశ ప్రవాహ కవాటాలు అవి పనిచేసి పధ్ధతిని అనుసరించి, ఆకృతి ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.

ఏకదిశ ప్రవాహ కవాటం వినియోగం[మార్చు]

విరుద్ద గుణాలు వున్న వేరు, వేరు వాయువులను వేరు వేరు నిల్వ ట్యాంకులు/సిలిండరుల నుండి ఒకే ప్రవాహంగా ఒకే గొట్టంలో మిశ్రమంచేసి పంపునపుడు, అందులో పీడన వ్యత్యాసం వలన అందులోని ఒక వాయువు వెనక్కి ప్రవహించి మరో వాయు సిలిండరులోకి ప్రవేశించకుండా నిరోధించును.అలామండే గూణాలున్న రెండూ వాయువులు కలసిన అగ్ని ప్రమాదం జరుగవచ్చును.అలాగే బాయిలరుకు నీటిని అందించు ఫీడ్ని పంపు యొక్క డెలివరి పైపుకు చెక్ వాల్వు ఉందటం వలన బాయిలరు లోని నీరు+స్టీము తిరిగి పంపుకు రాకుండా నిలువరింపబడును.అలాగే పిస్టను వ్యవస్థ కల్గిన పంపుల్లో పిస్టను ముందుకు తోసిన ద్రవం వెనక్కి రాకుందా ఆపును.అలాగే ద్రవ్రప్రమాణాన్ని కొలిచే, క్రోమటోగ్రఫీ పంఫుల్లో కూడా వాడుతారు.అలాగే కంప్రెసరులలో సంకోచింప చేసిన గాలి సిలిండరు నుండి వెనక్కి రాకుండా ఉపయోగిస్తారు. [2]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. "Valves". explainthatstuff.com. Archived from the original on 2018-03-01. Retrieved 2018-03-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "What is a check valve?". fluidcontrols.co.uk. Archived from the original on 2016-04-07. Retrieved 2018-03-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 3.2 "Valve Types and Configurations". kitz.co.jp. Archived from the original on 2016-10-13. Retrieved 2018-03-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)