Jump to content

ఏథర్ ఎనర్జీ

వికీపీడియా నుండి

ఏథర్ ఎనర్జీ భారతదేశానికి చెందిన విద్యుత్ వాహనాల తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఈ సంస్థను 2013 లో స్వప్నీల్ జైన్, తరుణ్ మెహతాలు స్థాపించారు. ఏథర్ 450, ఏథర్ రిట్జా అనే పేరుతో ద్విచక్ర విద్యుత్ వాహనాలు ఈ సంస్థ తయారు చేస్తుంది. ఏథర్ గ్రిడ్ పేరుతో దేశవ్యాప్తంగా ఛార్జింజ్ నెట్‌వర్క్ ను కూడా ఏర్పాటు చేశారు.

ప్రారంభం

[మార్చు]

ఈ సంస్థను ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులైన స్వప్నీల్ జైన్, తరుణ్ మెహతాలు ప్రారంభించారు. ఏథర్ ఎనర్జీ అంటే స్వచ్ఛమైన గాలి అని అర్థం. దీన్ని స్థాపించక మునుపు తరుణ్ అశోక్ లేలాండ్, స్వప్నీల్ జనరల్ మోటార్స్ సంస్థలో పని చేసేవారు.[1] 2014లో దీనికి 4.5 మిలియన్ డాలర్ల మూలధనం లభించింది. భారత సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడిచే టెక్నాలజీ డెవెలప్‌మెంట్ బోర్డు, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి ఏరోస్పైక్ సంస్థ వ్యవస్థాపకుడైన వి.శ్రీనివాసన్ ఈ నిధులు సమకూర్చారు.[2] డిసెంబర్ 2014 లో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులైన సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ 1 మిలియన్ డాలర్ల నిధిని సమకూర్చారు.[3] 2015 మే నెలలో టైగర్ గ్లోబల్ సంస్థ నుంచి 12 మిలియన్ డాలర్ల నిధిని అందించింది. దీనిని విద్యుత్ వాహనాల అభివృద్ధి, పరీక్ష, ఉత్పత్తికి కేటాయించారు.[4]

ఫిబ్రవరి 23, 2016 న ఈ సంస్థ బెంగళూరులో జరిగిన ఒక సాంకేతిక సదస్సులో S340 అనే పేరుతో తమ మొదటి వాహనాన్ని ఆవిష్కరించారు.[5][6] అక్టోబరు 2016లో భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ సిరీస్ బి రౌండ్లో భాగంగా ఇందులో 180 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. 2018 లో మరో 130 కోట్లు పెట్టుబడులు పెట్టింది.[7][8]

డిసెంబరు 2019 లో ఏథర్ ఎనర్జీ తమిళనాడులోని హోసూరులో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 635 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది.[9][10] జనవరి 2020 లో ఏథర్ 450X, ఏథర్ 450 ప్లస్ అనే పేరుతో రెండు మోడళ్ళను మొదటిసారిగా విడుదల చేసింది.[11]

మూలాలు

[మార్చు]
  1. ↑ "సొంత టెక్నాలజీతో… రూ.47 వేల కోట్లు". EENADU. Retrieved 2026-07-28.
  2. ↑ "Flipkart founders invest $1 million in Ather Energy". The Hindu.
  3. ↑ "Flipkart founders lead $1M investment in electric scooter startup Ather Energy". Tech Crunch.
  4. ↑ "Bansals backed Ather Energy raises $12M from Tiger Global". Business Standard.
  5. ↑ "Ather Energy showcases S340, 'India's first smart scooter' at Surge 2016". Tech2. 25 February 2016.
  6. ↑ "5,000+ attendees from 72 countries on their way to SURGE". SurgeConf.
  7. ↑ "Hero MotoCorp To Invest Up To ₹ 205 Crore In Ather Energy". NDTV Auto.
  8. ↑ "Hero MotoCorp to refuel Ather Energy with $19 mn". VCCircle (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-25. Retrieved 2018-07-30.
  9. ↑ "Ather Energy to set up electric vehicle manufacturing facility at Hosur in TN - Times of India". The Times of India. 2 December 2019. Retrieved 2019-12-23.
  10. ↑ "Ather 450 to roll out of new Hosur plant in Tamil Nadu". Autocar India (in ఇంగ్లీష్). Retrieved 2019-12-23.
  11. ↑ "Ather Energy launches its second e-scooter 450X at Rs 1.5 lakh, enters Delhi market in July". www.businesstoday.in. 28 January 2020. Retrieved 2020-08-13.