Jump to content

ఏనుగు సంతోష్ రెడ్డి

వికీపీడియా నుండి
(ఏనుగు సంతోష్‌ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
ఏనుగు సంతోష్‌ రెడ్డి
ఏనుగు సంతోష్ రెడ్డి


పదవీ కాలం
3 ఫిబ్రవరి 2022 – 2023 జూన్ 20[1]
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

న్యాయశాఖ కార్యదర్శి
పదవీ కాలం
2019 నవంబరు – ప్రస్తుతం
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జి
పదవీ కాలం
2014 జూన్‌ 2 – 2017 జూన్‌

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఏనుగు సంతోష్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2022 మార్చి 24 నుండి 2023 జూన్ 20 వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశాడు.[2][3]

జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా 2025 ఏప్రిల్ 16న నియమితుడయ్యాడు.[4]

జననం, విద్య

[మార్చు]

సంతోష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, జోగిన్‌పల్లి గ్రామంలో జన్మించాడు.[5][6] తండ్రి ఏనుగు నారాయణరెడ్డి 1962 అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] తల్లి లింగమ్మ గృహిణి. జగిత్యాలలోని ఎస్. కె.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ, అనంతపూర్ లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యలో డిగ్రీ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ పూర్తిచేశాడు.[8]

వృత్తిరంగం

[మార్చు]

సంతోష్ రెడ్డి 1985లో కరీంనగర్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 1991లో డిస్ట్రిక్ట్‌ మున్సిఫ్‌గా ఎంపికై, 2004లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, 2010లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందాడు. ఆ తరువాత సిద్ధిపేట జిల్లా అదనపు జడ్జిగా కొంతకాలం పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో న్యాయశాఖ కార్యదర్శి నియమించబడ్డాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ వరకు రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పనిచేశాడు. 2019 నవంబరులో రెండోసారి న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడ్డాడు.[9] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Justice Anugu Santhosh Reddy Retired". Telangana Highcourt. 2024. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  2. telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  3. Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  4. "రెరా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా సంతోష్‌ రెడ్డి". Andhrajyothy. 17 June 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  5. "హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్‌పెల్లి స్కూల్‌". Sakshi. 13 June 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  6. "Telangana High Court: హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులు". EENADU. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
  7. "ఆ 'సైకిల్' స్వతంత్రులదే..!". Sakshi. 2014-04-24. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  8. M, Mahesh (2022-02-03). "హర్షం వ్యక్తం చేస్తున్న జోగిన్‌పల్లి గ్రామస్తులు". Dishadaily (దిశ): Latest Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  9. "హైకోర్టుకు 12 మంది జడ్జీలు!". Sakshi. 2022-02-03. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-03.
  10. Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.