Jump to content

ఏప్రిల్ 28 ఏం జరిగింది

వికీపీడియా నుండి
ఏప్రిల్ 28 ఏం జరిగింది
దర్శకత్వంవీరాస్వామి
స్క్రీన్ ప్లేవీరాస్వామి
నిర్మాతవీరాస్వామి
తారాగణంరంజిత్
షెర్రీ అగర్వాల్
తనికెళ్ళ భరణి
రాజీవ్ కనకాల
ఛాయాగ్రహణంసునీల్‌ కుమార్‌
కూర్పుసంతోష్
సంగీతంసందీప్‌ కుమార్‌
నిర్మాణ
సంస్థ
వి.జి. ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
27 ఫిబ్రవరి 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

ఏప్రిల్‌ 28 ఏం జరిగింది 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] వి.జి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వీరాస్వామి నిర్మించి దర్శకత్వం వహించాడు.[2] రంజిత్, షెర్రీ అగర్వాల్,తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదలైంది.[3]

విహారి (రంజిత్) సినిమాలకు రచయితగా పని చేస్తుంటాడు. ఓ సినిమా ఫ్లాపు తర్వాత నిర్మాత (తనికెళ్ళ భరణి)ఒత్తిడితో మంచి ఐడియా కోసం భార్య ప్రవల్లిక (షెర్రీ అగర్వాల్)తో కలిసి సిరిపురం అనే ఊరిలోని ఓ గెస్ట్‌ హౌస్‌కి వెళ్తాడు. కానీ అందులో ఉన్న కొన్ని ఆత్మలు రంజిత్ తో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అక్కడ కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతాయి. విహారికి స్నేహితుడు ఎస్ఐ డేవిడ్(అజయ్)తో పాటు ఈ ఫ్యామిలీ మొత్తం విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ ఇంట్లో ఉన్న ఆత్మలు ఎవరివి? ఆ తరువాత ఏం జరిగింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వీజీ ఎంటర్‌టైన్మెంట్
  • నిర్మాత: వీరాస్వామి
  • కథ, దర్శకత్వం: వీరాస్వామి
  • స్క్రీన్‌ప్లే: హరి ప్రసాద్ జక్కా
  • సంగీతం: సందీప్‌ కుమార్‌
  • సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌
  • ఎడిటర్: సంతోష్


మూలాలు

[మార్చు]
  1. Eenadu (9 February 2021). "ఏప్రిల్‌ 28న 'ఏం జరిగింది..?'". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Telangana Today (21 January 2021). "'April 28 Em Jarigindi' to hit screens". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  3. Eenadu (20 February 2021). "'ఏప్రిల్ 28 ఏం జరిగింది' అందరినీ అలరిస్తుంది". the original నుండి 8 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2022.
  4. Sakshi (27 February 2021). "'ఏప్రిల్‌ 28 ఏం జరిగింది' మూవీ రివ్యూ". the original నుండి 8 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 8 June 2022.

బయటి లింకులు

[మార్చు]