ఏమీ ఆడమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏమీ ఆడమ్స్
AmyAdamsOscarsFeb09.jpg
at the 81st Academy Awards, February 2009
జన్మ నామంఏమీ లూ ఆడమ్స్
జననం (1974-08-20) 1974 ఆగస్టు 20 (వయస్సు: 45  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1999–ప్రస్తుతం

ఏమీ లూ ఆడమ్స్ (Amy Lou Adams) [1] (జ. 1974 ఆగస్టు 20) అమెరికా దేశానికి చెందిన నటి మరియు గాయకురాలు. ఆడమ్స్ డ్రాప్ డెడ్ గార్జియస్ అనే ఒక హాస్య చిత్రంతో తెరంగేట్రం చేసారు, అంతకన్నా ముందు ఆమె విందు భవనాలలోని రంగస్థలముపై ప్రదర్శనలతో తన నటనజీవితాన్ని మొదలుపెట్టారు. టీవీ ధారవాహికలలో అతిథి పాత్రలు మరియు బి తరగతి చిత్రాలలో కొన్ని పాత్రలు పోషించిన మీదట ఆమెకు 2002లో క్యాచ్ మీ ఇఫ్ యు కాన్ చిత్రంలోని బ్రెండా స్ట్రాంగ్ పాత్ర వచ్చింది, కానీ 2005లో వచ్చిన జూన్ బగ్ చిత్రంలోని యాష్లీ జాన్స్టన్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది, దీనితోనే ఆమెకు మంచి పేరు మరియు ఉత్తమ సహాయనటిగా అకాడమీ అవార్డు ప్రతిపాదన వచ్చాయి.

తర్వాత ఆడమ్స్, డిస్నీ యొక్క 2007 చిత్రం ఎన్‌చాంటెడ్లో నటించింది, ఈ చిత్రం ఆమెకు ఒక కీలకమైన మరియు వాణిజ్యపరమైన విజయంతో పాటు, ఈ చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటన గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు కుడా ప్రతిపాదించబడింది. ఆతర్వాత సంవత్సరం డౌట్ చిత్రంలో ఆమె పోషించిన యువ సన్యాసిని సిస్టర్ జేమ్స్ పాత్ర, ఆమెకు తన రెండవ అకాడమీ అవార్డ్ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ప్రతిపాదనలు సాధించిపెట్టింది. ఆమె నాటకీయమైన మరియు హాస్యభరితమైన పాత్రలు పోషించినప్పటికి వైవిధ్యమైన పాత్రలు కూడా పోషించగలదన్న కీర్తి సాధించారు.[2][3] ఆడమ్స్ 2008లో వచ్చిన చిత్రం సన్ షైన్ క్లీనింగ్లో ఎమిలీ బ్లంట్ మరియు అలన్ హార్కిన్ తో కలిసి నటించారు. 2009 నుండి ఆమె నైట్ అట్ ది మ్యూజియమ్: బాటిల్ ఆఫ్ ది స్మిత్‌సోనియన్'లో' అమీలియా ఇయర్‌హాఁట్ పాత్ర మరియు జూలీ & జూలియా లో రచయిత్రి జూలీ పొవెల్ పాత్రలలో నటించారు.

బాల్య జీవితం[మార్చు]

ఆడమ్స్ విసెంజా, ఇటలీలో ,[4] ఏడుగురు పిల్లల్లో నాలుగవ అమ్మాయిగా అమెరికా దేశస్థులైన కాత్రిన్ (నే హికెన్) మరియు రిచర్డ్ ఆడమ్స్ కి జన్మించారు.[1] ఆమెకు నలుగురు సోదరులు మరియు ఇద్దరు సహోదరిలు.[5] ఆమె తండ్రి ఒక అమెరికా ఉద్యోగి ఆమె జన్మించేనాటికి[6] ఆయన కాసేర్మ ఎడేర్లెలో ఉండేవారు, ఉద్యోగరీత్యా వారి కుటుంబం అనేక ప్రదేశాలలో నివసించారు, ఆమెకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి ఆయన కాజిల్ రాక్, కొలరాడోకి వచ్చి స్థిరపడ్డారు.[7] ఆ తర్వాత నుండి ఆమె తండ్రి రెస్టారెంట్లలో పాటలు పాడటం వృత్తిగా చేసుకున్నారు. తల్లి కూడా దేహధారుడ్య శిక్షకురాలుగా పనిచేసేవారు.[7][8] ఆడమ్స్ ఒక క్రిస్టియన్ లాగా పెరిగారు, కానీ ఆమెకు 11 సంవత్సరములు ఉన్నప్పుడు తల్లి తండ్రి విడాకులు తీసుకోవటం మూలంగా ఆమె కుటుంబం వారు ఉంటున్న చర్చి నుండి బయటకు వచ్చేసింది.[9] ఆధ్యాత్మిక వాతావరణంలో పెరగటం వలన ఆమె ఏమన్నారంటే "...అది నాకు మంచి విలువలను నూరిపోసింది నేను ఇప్పటికి వాటికి కట్టుబడి ఉన్నాను. 'ఇతరులకి సహాయం చెయ్యాలి, ప్రేమగా వుండాలి...' అనే మూలసూత్రం, అది నా లోపల జీర్ణించుకుపోయింది. "[10]

ఆమె డగ్లస్ కౌంటీ ఉన్నత విద్యాలయంలో చదివినన్ని సంవత్సరాలు విద్యాలయం యొక్క గాయకబృందంలో పాటలు పాడేవారు మరియు ఒక స్థానిక నాట్యాలయంలో బాలేరీన నృత్యరీతిని నేర్చుకోవాలనే ధ్యేయంతో శిక్షణ పొందారు.[11] ఆమె తల్లితండ్రులు ఆమె తన క్రీడా శిక్షణ కొనసాగించాలని ఆశించారు ఎందుకంటే దానివలన ఆమెకు కళాశాలలో విద్యార్ధివేతనం పొందే అవకాశం ఉంటుంది అని, కానీ ఆమె దాన్ని నాట్యం నేర్చుకోవటం కోసం వదిలేసారు. తర్వాత ఆడమ్స్ తను ఇక మీదట విద్యాలయంకి వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్నారు. "అందరిలాగా నేను విద్యాలయంలో ఉండి సంతోషం పొందే అమ్మాయిని కాదు" కానీ నేను చదువుకోలేక పోతున్నానని చింతగా ఉంది."[12] ఉన్నత విద్యాలయంలో విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె తన తల్లితో కలిసి అట్లాంటా వెళ్లారు.[7] బాలేరీన నృత్యరీతిలో రాణించే దానికి తనకు తగినంత అదృష్టం లేదు అనుకుంటూ ఆమె సంగీత శిక్షణాలయంకి వెళ్లారు, "నా వ్యక్తిత్వానికి ఇదే బాగా సరిపోతుంది" అని ఆమె అనుకున్నారు.[10] 18 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కమ్యూనిటీ థియేటర్స్ లో ప్రదర్శనలు ఇస్తూనే తనని తను పోషించుకోవటానికి గ్యాప్ అనే వస్త్రదుకాణంలో పనిచేసారు.[11] ఆమె హూటర్స్ అనే ఒక భోజనాలయంలో అతిధులను ఆహ్వానించే ఒక ఉద్యోగంలో చేరారు, ఒక నిజం ఏంటంటే కొద్ది రోజులు "పూర్తి జన సమ్మర్దంలో ఉండే వృత్తి" లో ఆమె వున్నారు.[13] ఆడమ్స్ ఆ ఉద్యోగాన్ని మూడు వారాల తర్వాత తన మొదటి కారుని కొనుక్కోవటానికి చాలినంత డబ్బు సంపాదించుకున్న తర్వాత మానేసారు. ఆమె : "... నేను హూటర్స్ గురించి ఏదైతే అనుకున్నానో అలా అనుకోవటం నిజంగా నా అమాయకత్వం. అయిన నేను మధ్యంని నీళ్ళని కలప కూడదని తెలుసుకున్నాను!" అని అంగీకరించారు.[7]

వృత్తి[మార్చు]

1995–2004: పూర్వ వృత్తి[మార్చు]

ఆమె బౌల్డర్స్ డిన్నర్ థియేటర్ మరియు కంట్రీ డిన్నర్ ప్లే హౌస్ లలో నాట్యం చేయటం వృత్తిగా మొదలుపెట్టారు. అక్కడ ఆమె 1995లో మిన్నేపోలిస్ విందు భవనం యొక్క నిర్వహణాధికారి మైఖేల్ బ్రిన్దిసి, దృష్టిని ఆకర్షించింది.[14] ఆడమ్స్ అక్కడ నుండి చన్హాసెన్, మిన్నెసోటాకి మారి అక్కడ చన్హాసెన్ డిన్నర్ థియేటర్ లలో తర్వాత మూడు సంవత్సరాలు పనిచేసింది. ఆమె కండరాల నొప్పికి చికిత్స చేయించుకుంటూనే 1999 లో ఒక పరిహాస హాస్యభరితమైన చిత్రం డ్రాప్ డెడ్ గార్జియస్ నటపరీక్షకు హాజరయ్యారు. ఈ చిత్రం మిన్నిసోటాలో చిత్రీకరించారు, అదే ఆమె నటజీవితానికి మొట్టమొదటి పాత్ర. డ్రాప్ డెడ్ గార్జియస్ చిత్రంలోని సహనటుడు కిర్స్టీ అలె నచ్చచెప్పటం వలన ఆడమ్స్ జనవరి 1999 లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ కి వెళ్లారు.[8][14] అక్కడ తన మొదటి సంవత్సరం అనుభవం గురించి ఆమె అది తనకి ఒక "చీకటి సంవత్సరం" అని "అతి శీతలం" అయిన సంవత్సరం అని అన్నారు. అ సమయంలో ఆమె చన్హాసెన్ లో ఉన్నప్పుడు తన అనుభవాలని గుర్తుకు తెచ్చుకొని "బాగా బెంగ పెట్టుకున్నారు", "అక్కడ నేను కలిసి పనిచేసిన వారందరు నా కుటుంబసభ్యుల లాంటి వారు" అని అన్నారు.[15] లాస్ ఏంజెల్స్ కి వచ్చిన తర్వాత ఆమె ఫాక్స్ నెట్వర్క్ వారి దూరదర్శన్ ధారావాహికలు క్రూయెల్ ఇంటన్షన్స్ , మాంచెస్టర్ ప్రెప్ లో కాత్రిన్ మేర్షుఎల్స్ పాత్రలో నటించారు. కానీ ఈ ధారావాహిక ఆ నెట్వర్క్ యొక్క అంచనాలు అందుకోలేక పోయింది, అనేకసార్లు స్క్రిప్ట్ ని సవరించిన మీదట మరియు రెండు సార్లు నిర్మాణం ఆగిపోవటం వలన ఆ ధారావాహిక రద్దు చేయబడింది.[16] చిత్రీకరించిన భాగాలను మరల ఎడిట్ చేసి ఒక వీడియో చిత్రంగా క్రూయెల్ ఇంటన్షన్స్ 2 పేరుతో విడుదల చేసారు.

2000 నుండి 2002 వరకు దూరదర్శన్ కార్యక్రమాలు దట్ సెవన్టీస్ షో , చార్మడ్ , బఫి ది వంపైర్ స్లేయర్ , స్మాల్ విల్లె మరియు ది వెస్ట్ వింగ్ వంటి దూరదర్శన్ ధారావాహికలలో నటిస్తూనే ఆడమ్స్ సైకో బీచ్ పార్టీ వంటి చిన్న చిత్రాలలో నటిస్తుండేది. ఆ తర్వాత ఆమె స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క చిత్రం క్యాచ్ మీ ఇఫ్ యు కాన్ లో బ్రెండా స్ట్రాంగ్ పాత్రలో నటించింది, ఈ చిత్రంలో ఈమెది ఒక నర్సు పాత్ర, ఈమె తో ఫ్రాంక్ అబగ్నలే, Jr. (లియోనార్డో డికాప్రియో) ప్రేమలో పడతాడు. స్పీల్బర్గ్ మాటల్లో "ఈ పాత్రతో ఆమె నటనా వృత్తిలో స్థిరపడింది" అన్నారు. కానీ అ తర్వాత సంవత్సరం కూడా ఆమె అంతగా అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది.[5][17] కానీ ఆడమ్స్ "నేను కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ ఆకట్టుకునే స్థాయిలో నటించగలనని తొలిసారిగా తెలుసుకున్నాను...ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది" అన్నారు.[18] 2004లో ఆమె ది లాస్ట్ రన్ చిత్రంలో ఇంకా కింగ్ అఫ్ ది హిల్ అనే యానిమేటెడ్ దూరదర్శన్ ధారావాహికకు ఆమె తన గాత్రాన్ని అందించారు. ఇంకా ఆమె దూరదర్శన్ ప్రాయోజిత కార్యక్రమం Dr. వెగాస్ లో ఆలిస్ డార్టీ పాత్రలో నటించారు కానీ కొన్ని ఒప్పందానికి సంబంధించిన గొడవల వలన ఆ పాత్ర నుండి తప్పుకోవాల్సి వచ్చింది.[19]

2005–2007: కీలకమైన విజయం[మార్చు]

Casual head shot of blue-eyed young woman with long reddish-blond hair pulled back.
Adams in 2006 as her Enchanted character Giselle while filming in New York City's Central Park

Dr. వెగాస్లో పాత్రని వదిలే ముందే, ఆమెకు తక్కువ వ్యయము చిత్రం జూన్ బగ్ యొక్క స్క్రిప్ట్ వచ్చింది, ఆ చిత్రంలో ఆమెకు యాష్లే జాన్స్టన్ అనే ఎప్పుడు ఉల్లాసంగా మాట్లాడుతూ వుండే ఒక గర్భిణి పాత్రకు నటపరీక్ష కూడా జరిగింది.[7] దర్శకుడు ఫిల్ మొరిసన్ ఆ పాత్రలో ఆడమ్స్ ను నటింపజేయాలనే తన నిర్ణయాన్ని వివరిస్తూ "చాల మంది యాష్లేని చూస్తూ 'ఈమె ఏదో భాధని తన ముఖంలో కనిపించనీకుండా కప్పిపెడుతుంది' అని అనుకుంటారు. కానీ, అమీ ఆ సూక్ష్మాన్ని 'ఆమె ఏ భాధని కప్పిపుచ్చుతుంది?' అనే కోణంలో చేయలేకపోయింది" అని వివరించారు.[20] ఈ చిత్రాన్ని 21 రోజులలో నార్త్ కరొలిన లోని విన్స్టన్-సలేంలో చిత్రీకరించారు.[21] అ సమయంలో ఆడమ్స్ కి 30 సంవత్సరాలు వయసు దాటింది, ఆమె తన నటనావృత్తి గురించి కలత పడుతూ "నేను ఇక్కడ నుండి న్యూయార్క్ కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను, నేను చేయాల్సింది ఇది కాదు ఇంకా ఏమైనా చెయ్యాలి. నేను నాటకీయమైన మాటలు చెప్పటం లేదు, నేను ఈ వృత్తిని వదిలేయటం లేదు. కానీ నేను నాకు సరిపడే పాత్రలను చెయ్యటంలేదేమో" అని అన్నది.[22] జూన్ బగ్ చిత్రం చేసిన అనుభవంతో ఆడమ్స్ "ఇది నాకు నిజంగా శక్తిని ఇచ్చింది. వేసవికాలం చివరి వరకు నేను పని లేకుండా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు సంతోషంగా గర్వంగా ఉంది. అన్ని వైపుల నుండి నాకు ఉన్న ఆసరాతో నేను చేయగలిగాను అని అనిపిస్తుంది" అని అన్నారు.[21] జూన్ బగ్ 2005 సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది, దీనిలో ఆమె నటనకు స్పెషల్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది.

ఆడమ్స్ డెబ్ర మెస్సింగ్ మరియు డేర్మోట్ ముల్రోనే వంటి నటుల పక్కన నటించిన ది వెడ్డింగ్ డేట్ చిత్రం థియేటర్లలో విడుదల అయిన తర్వాత, జూన్ బగ్ చిత్రం సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ ద్వారా థియేటర్లలో విడుదల అయింది. ఆడమ్స్ జూన్ బగ్ లోని ఆమె నటనకు కీలకమైన పొగడ్తలను అందుకున్నారు: లాస్ ఏంజెల్స్ టైమ్స్ వార్తాపత్రిక చిత్రవిమర్సకుడు కారిన చొకానో ఏమని వ్రాసారంటే " ఆడమ్స్ పోషించిన పాత్రలోని నటనను ఒక వంగ్య చిత్రంలో చూపించ గలగాలంటే చాల క్లిష్టం, దానికి చాల నైపుణ్యం అవసరం."[23] వెరైటీ వార పత్రిక యొక్క చిత్ర విమర్శకుడు జో లేడన్ ఏమని వ్యాఖ్యానించారంటే "కొంత ఆమె పాత్ర యొక్క ఔదార్య స్ఫూర్తి మరికొంత ఆమె యొక్క సొంత నటన నైపుణ్యంతో ఆమె తన చిత్రంలో తీర్పు చెప్పలేని ఆమె పాత్ర చిత్రీకరణ తన తర్వాత నటులకి మంచి తీర్పుని ఇవ్వటానికి, మరికొంత వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వటానికి, కానీ పనికి రాని తీర్పుని ఇవ్వటానికి కాదు".[24] ఆమె చాలా అవార్డులని గెలుచుకున్నారు వాటిలో నేషనల్ సొసైటీ అఫ్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు మరియు ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఆమె స్క్రీన్ యాక్టర్ గిల్డ్ అవార్డు మరియు అకాడెమి అవార్డుల ప్రతిపాదనలు కూడా పొందింది. అకాడెమి అఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ఆడంని వారి సంస్థలో సభ్యురాలిగా ఉండాలని 2006లో ఆహ్వానించారు.[25]

అయినప్పటికీ జూన్ బగ్కి పరిమితమైన ప్రేక్షకులు ఉన్నారు, చిత్రంలోని ఆడమ్స్ యొక్క సున్నితమైన హర్షించదగిన నటన ఆమెకు తన నటనావృత్తిలో ఆసక్తి పెంచుకోవటానికి సహాయం చేసింది. తర్వాత ఆడమ్స్ స్టాండింగ్ స్టిల్లో అతిథి పాత్ర మరియు Talladega Nights: The Ballad of Ricky Bobby, ఇంకా దూరదర్శన్ లో ధారావాహిక కార్యక్రమం ది ఆఫీసులో కూడా అనేక పర్యాయములు అతిథి పాత్రలో నటించింది. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ యొక్క అండర్ డాగ్ చిత్రంలో పోలి ప్యూర్ బ్రెడ్ పాత్రకి గాత్రం ఇచ్చిన తర్వాత ఆడమ్స్ డిస్నీ యొక్క 2007 భారీ బడ్జెట్ యానిమేటెడ్/లైవ్-యాక్షన్ చిత్రం ఎంచాన్టెడ్లో నటించింది. ఈ చిత్రంలో సహనటులు పాట్రిక్ డెంప్సే, ఇడిన మెంజెల్, సుసాన్ సరన్డన్, మరియు జేమ్స్ మర్స్దేన్, గిసేల్లె చుట్టూ తిరుగుతుంటారు, వారు ఆమె బలవంతం వలన 2D యానిమేటెడ్ ప్రపంచం నుండి న్యూయార్క్ నగరంలోని వాస్తవ జీవితానికి వస్తారు. గిసేల్లె పాత్రకు నట పరీక్ష చేసిన 300 మించిన నటీమణులలో ఆడమ్స్ కూడా ఒకరు,[26] కానీ ఆమె నటన దర్శకుడు కెవిన్ లిమ ఆకట్టుకుంది ఎందుకంటే "పాత్ర పట్ల ఆమె యొక్క నిబద్దత, ఆ పాత్రలో ఆమె తీర్పు చెప్పలేని విధంగా జీవించ గలగటం ఆయనకు గొప్పగా అనిపించింది."[27]

ఎన్చాన్టెడ్ వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించి ప్ర్రపంచ వ్యాప్తంగా నికరంగా $340 మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ అర్జించింది.[28] చిత్రంలో ఆమె నటనకు చిత్ర విమర్శకుల దగ్గర నుండి కూడా అభినందనలు వచ్చాయి, వెరైటీ వార పత్రిక విమర్శకుడు టోడ్ మెక్ కార్టి ఏమన్నారంటే జూలీ యాన్ద్రుస్ కి ఒక మేరీ పాపిన్స్ లాగా ఎన్చాన్టెడ్ ఆడమ్స్ ని ఒక గొప్ప తారని చేసే వాహనం లాంటిది.[29] చికాగో సన్-టైమ్స్ వార్త పత్రిక విమర్శకుడు రోగేర్ ఎబెర్ట్ ఆడమ్స్ గురించి ఏమని వ్యాఖ్యానించారంటే ఆమె "ఎప్పుడు నూతనంగా వుంటుంది మరియు విజయాపేక్ష"తో వుంటుంది, ది బోస్టన్ గ్లోబ్ యొక్క విమర్శకుడు వెస్లీ మోరిస్ ఆమె గురించి "ఒక వాస్తవమైన నటి లో వుండే బుద్ధి కుశలత మరియు హాస్య చతురత మరియు ఆహార్య వాగ్ధాటి ఎలా వుండాలో ఆమె నుండి నేర్చుకోవచ్చు" అని అన్నారు..[30] ఆడమ్స్ ని గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రతిపాదన ఉత్తమ - మోషన్ పిక్చర్ మ్యూజికల్ ఆర్ కామెడీ, ఉత్తమ నటి కోసం క్రిటిక్స్ ఛాయస్ అవార్డు ప్రతిపాదన మరియు ఉత్తమ నటిగా సాటర్న్ అవార్డు వరించాయి. చిత్రం లోని మూడు పాటలు 80వ అకాడెమి అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ప్రతిపాదనలు పొందాయి. ఆడమ్స్ వాటిలో ఒక పాట "హ్యాపీ వర్కింగ్ సాంగ్", ఆస్కార్ ఉత్సవంలో రంగస్థలం మీద ప్రత్యక్షంగా ప్రదర్శన ఇచ్చింది. "దట్స్ హౌ యు నో", పాటలో ఆ చిత్రంలో ఆడమ్స్ నటించింది. అదే పాటని ఆ ఉత్సవంలో క్రిస్టిన్ చెనోవేత్ పాడింది. ఒక ముఖాముఖీలో ఆడమ్స్ ఈ పాట చేనోవేత్ కి "సరిఅయినది" ఎందుకంటే "గిసేల్లె పాత్ర తను పోషించటానికి చెనోవేత్ తనకు ప్రేరణ" అని చెప్పారు.[18]

ఎన్చాన్టెడ్, తరువాత ఆడమ్స్ చార్లీ విల్సన్స్ వార్లో నటించింది, ఈ చిత్రంలో ఆమెకు సహనటులు టాం హాంక్స్, జూలియ రాబెర్ట్స్, మరియు ఫిలిప్ సేయ్మార్ హాఫ్మన్. ఆడమ్స్ బోనీ బాక్ అనే ది టైటిల్ క్యారెక్టర్ యొక్క పరిపాలక సహాయ అధికారి పాత్రలో నటించింది. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ జరిగేటప్పుడు ఆడమ్స్ ఏమన్నారంటే "అప్పుడు చాలా తమాషాగా అనిపించింది. చిత్రీకరణ జరిగే ఆ ప్రదేశంలో వుండటం అక్కడ ఉండే వారి దగ్గర నుండి కొన్ని విషయాలు నేర్చుకోవటం మరియు ఫిలిప్ సేమార్ హాఫ్మన్ మరియు టాం హాంక్స్ కలిసి నటించిన అద్భుతమైన దృశ్యాలను గమనించటం, మైక్ నికోలస్ యొక్క దర్శకత్వం ఇవన్నీ నేను మళ్ళీ విద్యాలయానికి వెళ్లి చదువుకున్నట్లు వుంది.[31]

ఎన్చాన్టెడ్ చిత్ర విజయం 2007-08 చిత్ర అవార్డుల సమయంలో ఆడమ్స్ కి మీడియాలో మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఇంటర్వ్యూ , ఎల్లె మరియు వానిటీ ఫెయిర్ , వంటి సంచికలు ఆమె ఫోటోను ముఖచిత్రంగా వేసి "2008 యొక్క 10 తాజా ముఖము" లలో ఆమె ఒకరు అని వ్రాసాయి,[32] ఆడమ్స్ మార్చి 2008లో సాటర్డే నైట్ లైవ్ యొక్క 33వ సీజన్ యొక్క ఏడవ ఎపిసోడ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ కార్యక్రమభాగంలో, ఆమె రకరకాల పాత్రలు పోషించారు వాటిలో హైడి క్లాం, ఇంకా SNL యొక్క సభ్యురాలు క్రిస్టెన్ వీగ్ తో కార్యక్రమం మొదట్లో సంభాషించినపుడు సరదాగా జరిగిన పోట్లాటలో ఆమె వికిడ్ నుండి "వాట్ ఈస్ దిస్ ఫీలింగ్" అనే పాటను పాడారు.

ఆడమ్స్ యొక్క తర్వాత చిత్రం సన్ షైన్ క్లీనింగ్, ఈ చిత్రం న్యూ మెక్సికో లోని అల్బుకెర్క్ చుట్టు పక్కల 2007లో ఫిబ్రవరి నుండి మార్చి వరకు చిత్రీకరించారు.[33] దీనిలో ఆమె ఒక ఒంటరి తల్లి పాత్ర పోషించారు, ఆమె ఎక్కువ డబ్బుని దొంగిలించి సంపాదించి ప్రైవేటు విద్యాలయంలో ఉన్న తన కొడుకుకి పంపే పాత్ర. ముందుగా ఊహించిన చిత్రములానే, ఈ చిత్రం 2008 సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైనది, కానీ దీనికి మిశ్రమ అభిప్రాయాలు రావటంతో పంపిణీదారులు ఈ చిత్రాన్ని కొనటానికి అనుకున్నట్లుగా ముందుకి రాలేదు.[34] కానీ ఈ చిత్రం మార్చి 2009 లో పరిమితంగా థియేటర్స్ లో విడుదల అయిన తర్వాత మాత్రం బాగానే విజయవంతమైంది.[35] శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ యొక్క చిత్ర విమర్శకుడు మిక్ లసాల్లె ఈ చిత్రానికి ఒక ఆశావహమైన సమీక్ష ఇచ్చారు, అయన ఏమన్నారంటే "అమీ ఆడమ్స్ మొహంలోని ఉద్వేగభరితమైన నటనే సన్ షైన్ క్లీనింగ్ కి ప్రధాన ఆకర్షణ."[36] ది న్యూ యార్క్ టైమ్స్ వార్త పత్రిక యొక్క చిత్ర విమర్శకుడు ఎ.ఓ.స్కాట్ "దాని కన్నా కొన్నిసార్లు చూసేదానికి బాగానే ఉంది" ఎందుకంటే "మిస్.జేఫ్స్(రైన్ , సిల్వియా ) నటులతో మంచి సంభంధాలని కలిగి ఉన్నారు మరియు మంచి నటులు కూడా ఉన్నారు" అని వ్రాసారు. అమీ ఆడమ్స్ మరియు ఎమిలీ బ్లంట్ ఏమని వ్రాసారంటే, ఇద్దరు ఈ చిత్రంలో అక్కచెల్లెళ్ళు లాగా నటించారు, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తుంటారు, ఆ పాత్రలు పూర్తిగా వారికి అర్ధం ఇవ్వకపోయినా ఇద్దరు వారి పాత్రలని చాకచక్యంతో మరియు అంకితభావంతో చేసారు."[37] ఆడమ్స్ నటనకి ది బాల్టిమోర్ సన్ వార్త పత్రిక యొక్క చిత్ర విమర్శకుడు మైకేల్ శ్రాగో ఏమన్నారంటే "ఆడమ్స్ ఒక దివ్యమైన నటనతో పరిపూర్ణమైన స్పష్టతని సాధించింది".[38]

2007—ఇప్పటివరకు[మార్చు]

2008లో ఆమె థియేటర్స్ లో విడుదల అయిన ఆమె మొదటి చిత్రం 1939-చిత్రం మిస్ పెట్టిగ్రూ లివ్స్ ఫర్ ఏ డే, ఈ చిత్రంలో ఆమె లండన్ లో నివసించే, అతిగా ఆశపడే ఒక అమెరికా నటి ఎవరి జీవితమైతే మిస్ పెట్టిగ్రూ అనే ఒక అధికారిణిని కలిసిన తర్వాత మారిపోతుందో ఆ పాత్రలో నటించింది. మిస్ పెట్టిగ్రూ యొక్క పాత్రను ఫ్రాన్సిస్ మెక్ డార్మాండ్ పోషించారు. ఈ చిత్రంకి కూడా ఆమెకి అనుకూలమైన సమీక్షలే వచ్చాయి[39] ఈ చిత్రంలో ఆడమ్స్ పాత్ర జూన్ బగ్ మరియు ఎన్చాన్టెడ్ చిత్రాలలో పాత్రలకు దగ్గరగా వుండే సంతోషమైన అమాయకత్వమైన పాత్ర. లాస్ ఏంజెల్స్ టైమ్స్ వార్త పత్రిక యొక్క చిత్ర విమర్శకుడు ఏమన్నారంటే "ఆడమ్స్ మూగ పాత్రను అద్భుతంగా పోషించింది".[40] అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ యొక్క కిర్క్ హనీకట్ ఏమ్మన్నారంటే "ఆడమ్స్ ఎన్చాన్టెడ్ నుండి తన యువరాణి మీద తక్కువగా కానీ లేదా ఎక్కువగా కానీ ప్రతీకారం తీర్చుకుంటుంది, కొంచెం వంచించే తత్వం కలిగిన చిలిపితనంతో మాత్రమే".[41]

ఆడమ్స్ ని ఆమె మూస పాత్రలు వరకే పరిమితమవుతారేమో అని అడిగినప్ప్పుడు, ఆడమ్స్ ఏవిధంగా స్పందించారంటే " ఈ సమయంలో కాదు ... ఇప్పుడు నేను నేను ఏ పాత్రలని వాటిలో లీనమై చేస్తున్నాను మరియు నేను అనేక రకాల చిత్రాలని చేస్తున్నాను, నేను అనేక రకాల పాత్రలని పోషిస్తున్నాను. ఈ సంవత్సరం నేను ఒక నాటకీయమైన పాత్ర చేశాను, ఇంకా మాకు సన్ డాన్సు చిత్రం ఒకటి వుంది (సన్ షైన్ క్లీనింగ్ ), కానీ అలంటి ఉత్సాహవంతమైన పాత్రలని చాల సంతోషంగా చేస్తున్నాను, నేను ఆ పాత్రలని ఎందుకు చేసానంటే ఆ పాత్రలు నన్ను ఎంత ప్రేరేపించాయి అంటే ఎక్కడ ఉన్నా నా ప్రమేయం లేకుండా నేను ఆ పాత్రల్లోనే జీవిస్తున్నట్టుగా వున్నాయి."[42] ఆడమ్స్ మరొక ముఖాముఖీలో ఏమి మాట్లాడారంటే "నేను కొన్ని రకాల పాత్రలకి మాత్రమే స్పందిస్తాను... ఆ పాత్రలు చాల ప్రాధాన్యత ఉన్నవి, నేను ఎంచుకున్న పాత్రలు నన్ను ఆనందంగా వుంచగలుగుతున్నాయి... నేను ఆ పాత్రలతో గుర్తింపు తెచ్చుకోగలనని నేను అనుకుంటున్నాను.[43] ఇంకా ఆమె ఏమన్నారంటే తన బంగారు రంగు జుట్టుకి ఎరుపు రంగు వేసుకునే దానికి ముందే ఆమె "ది బీచి గాల్" పాత్ర పోషించాను అని అన్నారు.[2]

2008 సంవత్సరాంతంలో, ఆడమ్స్ జాన్ పాట్రిక్ షాన్లే వ్రాసిన డౌట్ అనే ఒక నాటికను అదే పేరుతో తీసిన చిత్రంలో ఆమె ఒక అమాయకురలైన యువ సన్యాసిని జేమ్స్ పాత్రని మెరిల్ స్ట్రీప్, ఫిలిప్ సేమార్ హాఫ్మాన్ మరియు విఒల డవిస్ వంటి వారి పక్కన పోషించారు. సన్ షైన్ క్లీనింగ్ చిత్రం గురించి తన సహా నటి ఎమిలీ బ్లాంట్ ద్వారా తెలిసినప్పుడు ఆడమ్స్ సిస్టర్ జేమ్స్ పాత్ర కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ పాత్రకు వేరే నటిని ఎంపిక చేసామని చెప్పారు.[44] షాన్లే ఆ తర్వాత ఆ పాత్రని ఆడమ్స్ తో చేయించారు ఎందుకంటే "అది ఆమెకు ఇంగ్రిడ్ బెర్గ్మన్ ద్వారా వచ్చింది. చూడండి ఒక మంచి వ్యక్తి ఈ క్లిష్టమైన ప్రపంచంలో పోరాడుతుంది. ఆమె బాగా తెలివైనది, కానీ ఆ పాత్రలోని ఒక సున్నితమైన అమాయకత్వం కూడా ఆమెలో వుంది. ఆమెకు మంచి అందమైన ప్రకాశవంతమైన ముఖం ఉన్నది." అని అన్నారు[45] ఆమె తన సహనటులు స్ట్రీప్ మరియు హాఫ్ మన్, లతో నటించేటప్పుడు తనకు "కొంత అనిశ్చితత్వం, కొంత సంశయం, మరికొంత ఆ అద్భుతమైన నటులకి దగ్గర అవ్వాలని ఉండేది అని వెల్లడించింది.[46] ఈ చిత్రం విమర్శకుల అభినందనలు కూడా పొందింది, ఆడమ్స్ యొక్క పాత్ర మిగతా నాలుగు ప్రధాన పాత్రల కన్నా "తక్కువ ఆడంబరంగా" వుంటుంది.[47] కానీ ఆడమ్స్ యొక్క నటనని ది న్యూ యార్క్ టైమ్స్ వార్త పత్రిక యొక్క విమర్శకుడు మనోహ్ల డర్గిస్ "స్థిరత్వం లేదు" అని విమర్శించారు. వెరైటీ సంచిక యొక్క టోడ్ మెక్ కార్టి "ఆడమ్స్ చేసిన సున్నితమైన యువ సన్యాసిని పాత్ర ఎవరైనా చేయగలరు" అని వ్యాఖ్యానించారు.[48] శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పత్రిక యొక్క చిత్ర విమర్శకుడు ఏమని వ్రాసారంటే : "ఆడమ్స్ కూడా చిత్రానికి ఒక ప్రయోజనాన్ని చేకూర్చింది. ఆమె సిస్టర్ జేమ్స్ అనే పాత్రని ఎంచుకుంది, ఈ పాత్ర చిత్రంలో సిస్టర్ అలోయ్సియాస్ కన్నా ప్రధానమైనది, మరియు యువ సన్యాసినిని ప్రత్యేకంగా హుందాగా ప్రేమగా మారుస్తుంది."[49] 81వ అకాడెమి అవార్డ్స్, 66వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 15వ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్, మరియు 62వ బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డ్స్ లలో ఆడమ్స్ ఉత్తమ సహాయనటిగా ప్రతిపాదన పొందింది.

Casual photo of a young woman sitting between two men in director chairs. The woman is wearing a black, sleeveless dress and is intently listening to one of the men, Ben Stiller, talk into a microphone.
Adams with Owen Wilson and Ben Stiller while promoting [121] in May 2009

ఆడమ్స్ నటించే తర్వాత పాత్ర అమేలియా ఇయర్హార్ట్ ఈ పాత్రలో ఆమె బెన్ స్టిల్లర్ పక్కన నటిస్తుంది. ఈ చిత్రం 2009 సంస్మరణ దినం వారాంతంలో ప్రదర్శితమైంది మరియు U.S. బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం $15.3 మిలియన్ డాలర్లను టెర్మినేటర్ సాల్వేషన్ను మించి విడుదల అయిన మొదటి రోజే అర్జించింది.[50] అయినప్పటికీ ఈ చిత్రం "మిశ్రమమైన మరియు సరాసరి సమీక్షలు" అందుకుంది, ఆడమ్స్ నటన విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.[51] వాటి అన్నిటిలో నుండి ఒక ఆశావాహమైన సమీక్ష ఇవ్వటానికి, చికాగో ట్రిబ్యూన్ యొక్క చిత్రవిమర్శకుడు మైకేల్ ఫిల్లిప్స్ ఏమనుకున్నారంటే ఈ చిత్రం "అమీ ఆడమ్స్ ఆవియాట్రిక్స్ అమేలియా ఇయర్ హార్ట్ పాత్ర చిత్రానికి విజయాన్ని చేకూర్చింది... ఆమె అధ్బుతంగా వుంది - తెర మీద మెరిసిపోయింది"; మరియు ఎంటర్టైన్మెంట్ వీక్లీ సంచిక చిత్రవిమర్శకుడు ఓవెన్ గ్లీబర్మన్ ఏమని వ్రాసారంటే "బాటిల్ అఫ్ ది స్మిత్ సోనియాన్ చిత్రం మంచి ఆదరణ పొందుతుంది. కానీ అది ఆడమ్స్ వలన వచ్చిన ఆదరణ."[52][53] మరో వైపు ది బోస్టన్ గ్లోబ్ పత్రిక చిత్రవిమర్శకుడు టైబర్ ఈ చిత్రం అంతగా నచ్చలేదని ఆడమ్స్ యొక్క ఇయర్ హార్ట్ పాత్ర వర్ణిస్తూ "స్వయంగా ఆమెలాంటి స్త్రీని పోలని ఒక చిత్తచాంచల్యమైన మందు" అని వ్రాసారు .[54] వెరైటీ సంచిక చిత్రవిమర్శకుడు లీల్ లోవెన్స్టెయిన్ ఏమి వ్రాసారంటే ఆడమ్స్ "బాగా కష్టపడటానికి ప్రయత్నించింది", రోగర్ ఎబెర్ట్ ఆమె ఒక్కరే విషయాన్ని అధిగమించారు అని వ్యాఖ్యానించారు.[55][56] చిత్ర దర్శకుడు షాన్ లేవి, ఆమె గురించి: "ఆమె తరంలో ఆమె కన్నా మంచి నటి ఉందేమో నాకు తెలియదు" అని అన్నారు... అంటే చాలామంది నటీమణులు ఉన్నారు, కానీ కొందరు మాత్రమే డౌట్ మరియు జూలీ & జూలియ, మరియు నైట్ ఎట్ ది మ్యూజియం 2లో పాత్రలు ఒకే సంవత్సరంలో ఎవరు చెయ్యగలరు? కానీ ఆమె సమాంతరంగా లేని పాత్రలు చేసింది. ఈ విషయం మీద ఎందుకు ఇంతగా స్పందిస్తున్నామంటే ఈ చిత్రం మొదటి చిత్రం కంటే మెరుగైనది."[57]

స్మిత్సోనియన్ తర్వాత, ఆడమ్స్ జూలీ & జూలియ లో ఒక విసిగిపోయిన ప్రభుత్వ కార్యదర్శిగా నటించింది, జూలియ చైల్డ్ యొక్క మాస్టరింగ్ ది ఆర్ట్ అఫ్ ఫ్రెంచ్ కుకింగ్ పుస్తకంలో అన్ని వంటకాలన్నీ వండాలని నిశ్చయించుకుంటుంది. ఆతర్వాత ఆమె లీప్ ఇయర్ అనే ఒక శృంగారభరితమైన హాస్య చిత్రంలో నటించింది, ఈ చిత్రం మార్చి 2009 సంవత్సరంలో చిత్రీకరణ జరిగి 2010 సంవత్సరం మొదట్లో విడుదల అయింది.[58] ఆమె తదుపరి చిత్రాలు ది ఫైటర్ ; డాటర్ ఆఫ్ ది క్వీన్ అఫ్ షేబ ;[59] మరియు అదేనా హల్పెర్న్'సాన్ యొక్క నవల ఆధారంగా తీసిన ది టెన్ బెస్ట్ డేస్ అఫ్ మై లైఫ్ , ఈ చిత్రానికి ఆమె కూడ ఒక నిర్మాత.[60]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఏప్రిల్ 2008, నాటికి ఆడమ్స్ ఆరు సంవత్సరాలుగా ఉన్న తన ప్రియుడు, నటుడు మరియు చిత్రకారుడు అయిన డారెన్ లి గాలో తో కలిసి ఉండటానికి నిశ్చయం జరిగింది.[7] ఆమె లి గాలో ని 2001లో ఒక నటశిక్షణా తరగతిలో కలిసారు.[61] ఆమె తరగతిలో అందరికన్నా "బాగా ఆకర్షించింది", ముందు అతను ఆమెను చూసి ఎలెక్షన్ చిత్రంలో ట్రేసి ఫ్లిక్ వలె వుంది అని అనుకున్నాడు."[5] వాళ్ళు ఇద్దరు కలుసుకున్న ఒక సంవత్సరం తర్వాత ఆడమ్స్ మరియు లి గాలో ఇద్దరు కలిసి ఒక తక్కువ నిడివి చిత్రం పెన్నీస్ లో ఒక వారం వరకు నటించారు, ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది.[7] ఆ వెంటనే వారు ఇద్దరు కలిసి నివసించటం మొదలు పెట్టారు. మే 15, 2010, ఆడమ్స్ వారిద్దరి జంట యొక్క మొదటి బిడ్డ[62] పాపకి జన్మనిచ్చింది. పాప పేరు అవియాన లి గాలో.[63]

చలనచిత్రపట్టిక[మార్చు]

చలన చిత్రాలు
సంవత్సరం చలనచిత్రం పాత్ర సూచనలు
1999 డ్రాప్ డెడ్ గార్జియస్ లెస్లీ మిల్లర్
2000 సైకో బీచ్ పార్టీ మార్వెల్ యాన్
2000 ది క్రోమియం హుక్ జిల్ రాయల్ ట్యుబర్ లఘు చిత్రం (అమీ లౌ ఆడమ్స్ వలె)
2000 క్రుఎల్ ఇంటెన్షన్స్ 2 ఖ్యాత్రిన్ మేర్ష్యుయిల్
2002 Slaughter Rule, TheThe Slaughter Rule డోరీన్
2002 గుమ్మడికాయ అలెక్స్
2002 సర్వింగ్ సారా కేట్
2002 క్యాచ్ మీ ఇఫ్ యు కాన్ బ్రెండా స్ట్రాంగ్
2004 Last Run, TheThe Last Run అలెక్సిస్
2005 Wedding Date, TheThe Wedding Date అమీ ఎలిస్
2005 జూన్ బగ్ యాష్లే జాన్స్టన్ ఉత్తమ సహాయ నటిగా బ్రాడ్ కాస్ట్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు (మిచేల్లి విలియమ్స్ తో కలిసి బ్రోక్ బ్యాక్ మౌంటైన్ చిత్రం కోసం)
ఉత్తమ సహాయ నటిగా ఫ్లోరిడా ఫిల్మ్ క్రిటిక్స్ సిర్కిల్ అవార్డు
అద్భుతమైన నటనకి గోతం అవార్డు
ఉత్తమ సహాయ నటిగా ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు
ఉత్తమ సహాయనటిగా సాన్ ఫ్రాన్సిస్కో క్రిటిక్స్ అవార్డ్
ఉత్తమ సహాయ నటిగా సౌత్ ఈస్టర్న్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్
నటనకు సన్ దండ్స్ ఫిలిం ఫెస్టివల్ స్పెషల్ జ్యూరి అవార్డు
ఉత్తమ సహాయ నటిగా వంకోవేర్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్
ఉత్తమ నటిగా వాషింగ్టన్ డి.సి ఏరియా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్
ఉత్తమ సహాయ నటిగా సాటర్న్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ నటునికి చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ నటికి శాటిలైట్ అవార్డు - చలన చిత్రం - ప్రతిపాదన పొందారు
సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ నటిగా St.లూయిస్ గేట్ వే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ - ప్రతిపాదన పొందారు
అత్యుత్తమ నటన కొరకు వాషింగ్టన్ డి.సి. ఏరియా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ - ప్రతిపాదన పొందారు
2005 స్టాండింగ్ స్టిల్ ఎలిస్
2006 పెన్నీస్ చార్లోటీ బ్రౌన్ లఘు చిత్రం
2006 మూన్ లైట్ సెరినేడ్ చ్లో
2006 Talladega Nights: The Ballad of Ricky Bobby సుసాన్
2006 టెనషియస్ డి ఇన్ ది పిక్ అఫ్ డెస్టినీ గార్జియస్ ఉమన్ అతిథి పాత్ర
2007 Ex, TheThe Ex అబ్బి మార్చి
2007 అండర్ డాగ్ 'స్వీట్' పోలి ప్యూర్ బ్రెడ్ (గాత్రం)
2007 ఎన్చాన్టెడ్ గిసేల్లె ఉత్తమ నటిగా సాటర్న్ అవార్డ్
ఉత్తమ సహాయ నటిగా జాతీయ చిత్ర విమర్శకుల సంస్థ పురస్కారం
ఉత్తమ నటికి బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ నటిగా సెంట్రల్ ఒహియో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటికి ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు – సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటికి ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ హాస్య నటనకి MTV మూవీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటిగా MTV మూవీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ వస్త్రధారణకు MTV మూవీ పురస్కారం - ప్రతిపాదన పొందారు
MTV మూవీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ పెర్ఫార్మన్స్ - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటిగా శాటిలైట్ అవార్డు - సంగీత ప్రధాన లేదా హాస్యరస చలన చిత్రం - ప్రతిపాదన పొందారు
హాస్య-చలన చిత్ర నటి కొరకు టీన్ చాయిస్ అవార్డ్ - ప్రతిపాదన పొందారు
2007 చార్లీ విల్సన్స్ వార్ బొన్ని బాక్
2008 మిస్ పెట్టిగ్రూ లివ్స్ ఫర్ ఎ డే డెలిషియా లఫోస్సే/ సారా గ్రబ్
2008 డౌట్ సిస్టర్ జేమ్స్ ఉత్తమ నటీనటులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు
ఉత్తమ నటిగా నార్త్ టెక్షస్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు
ఉత్తమ సహాయ నటిగా సాటర్న్ అవార్డు - ప్రతిపాదన పొందారు
సహాయ పాత్రలో ఉత్తమ నటిగా BAFTA అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ నటిగా బ్రాడ్‌కాస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయ నటిగా చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయనటుడిగా గోల్డెన్ గ్లోబ్ పురస్కారం-చలనచిత్రం - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన పొందారు
ఉత్తమ సహాయనటిగా ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డు - ప్రతిపాదన పొందారు
సహాయ పాత్రలో విశిష్టమైన ప్రదర్శన కనబరిచిన నటికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు - ప్రతిపాదన పొందారు
చలనచిత్రంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తారాగణానికి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారం - ప్రతిపాదన పొందారు
2009 సన్ షైన్ క్లీనింగ్ రోస్ లార్కోస్కి
2009 Night at the Museum: Battle of the Smithsonian అమేలియా ఇయర్ హార్ట్ / టేస్ హాస్య-చలన చిత్ర నటి కొరకు టీన్ చాయిస్ అవార్డ్ - ప్రతిపాదన పొందారు
2009 జూలీ & జూలియ జూలీ పావెల్
2010 లీప్ ఇయర్ అన్నా
2010 Fighter, TheThe Fighter చార్లేనే నిర్మాణానంతరం
2011 ఆన్ ది రోడ్ జేన్ చిత్రీకరణ
దూరదర్శన్
సంవత్సరం బిరుదు పాత్ర సూచనలు
2000 దట్ 70స్ షో కట్ పీటర్ సన్ ఎపిసోడ్ ("బర్నింగ్ డౌన్ ది హౌస్")
2000 చార్మడ్ మాగీ మర్ఫి ఎపిసోడ్ ("మర్ఫీస్ లక్")
2000 జో, డంకన్, జాక్ & జేన్ డినా ఎపిసోడ్ ("టాల్, డార్క్ అండ్ డన్కన్స్ బాస్")
2000 ప్రొవిడెన్స్ రెబెక్కా 'బెకా' టేలర్ ఎపిసోడ్ ("ది గుడ్ డాక్టర్")
2000 బఫీ ది వంపైర్ స్లఎర్ బెత్ మాక్లె ఎపిసోడ్ ("ఫ్యామిలీ")
2001 స్మాల్ విల్లె జోడి మెల్విల్లే ఎపిసోడ్ ("క్రావింగ్")
2002 West Wing, TheThe West Wing కాథీ ఎపిసోడ్ ("20 అవర్స్ ఇన్ అమెరికా: పార్ట్ 1")
2004 కింగ్ అఫ్ ది హిల్ మేరిలిన్/సన్ షైన్ (గాత్రం) ఎపిసోడ్ ("చీర్ ఫాక్టర్")
2004 కింగ్ అఫ్ ది హిల్ మిస్టి (గాత్రం) ఎపిసోడ్ ("మై హెయిర్ లేడీ")
2004 Dr. వెగాస్ ఆలిస్ డార్టీ ఆవర్త పాత్రలు
2005 Office, TheThe Office (US TV పరంపర) కాటీ ఎపిసోడ్ లు ("హాట్ గర్ల్", "ది ఫైర్" మరియు "బూజ్ క్రుయిస్")
2008 సాటర్ డే నైట్ లైవ్ అమీ ఆడమ్స్ (వ్యాఖ్యాత) ఎపిసోడ్ (2008 మార్చి 8)
రికార్డింగుల పట్టిక
రికార్డింగుల పట్టిక
సంవత్సరం పాట సౌండ్‌ట్రాక్ లేబుల్
2007 "ట్రూ లవ్స్ కిస్" ఎన్చాన్టెడ్ వాల్ట్ డిస్నీ రికార్డ్స్
2007 "హ్యాపీ వర్కింగ్ సాంగ్" ఎన్చాన్టెడ్ వాల్ట్ డిస్నీ రికార్డ్స్
2007 "దట్స్ హౌ యు నో" ఎన్చాన్టెడ్ వాల్ట్ డిస్నీ రికార్డ్స్
2008 "ఈఫ్ ఐ డిడ్ నాట్ కేర్" మిస్ పెట్టిగ్రూ లివ్స్ ఫర్ ఏ డే వారిస్ సారబండే

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 Van Valkenburg, Nancy (December 16, 2007). "Adams' family awed by accolades". Ogden Standard-Examiner. Retrieved December 29, 2008.
 2. 2.0 2.1 Freedom du Lac, Josh (December 11, 2008). "'The Real Thing': Amy Adams Enchants, Impresses in Nun's Role". The Washington Post. Retrieved December 31, 2008.
 3. Slotek, Jim (December 12, 2008). "The other side of Amy... it's about time". Toronto Sun. Sun Media Corporation. Retrieved December 31, 2008.
 4. "Gold Derby by Tom O'Neil: Transcript of our chat with critics' award winner Amy Adams". Los Angeles Times. January 12, 2006. Retrieved December 30, 2008.
 5. 5.0 5.1 5.2 Combe, Rachael (February 2, 2008). "Chasing Amy". Elle. Retrieved December 31, 2008.
 6. "Biografia di Amy Adams" (Italian లో). StarDustMovies. మూలం నుండి 2009-02-11 న ఆర్కైవు చేసారు. Retrieved February 12, 2009. Cite web requires |website= (help)CS1 maint: unrecognized language (link)
 7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 Shnayerson, Michael (November 2008). "Some Enchanted Amy". Vanity Fair. Retrieved December 31, 2008.
 8. 8.0 8.1 Koltnow, Barry (November 17, 2007). "'Enchanted' with Amy Adams". The Orange County Register. Retrieved December 31, 2008.
 9. Fox, Killian (November 18, 2007). "Amy's fairytale of New York". The Observer. Retrieved December 31, 2008.
 10. 10.0 10.1 West, Naomi (November 16, 2007). "Amy Adams: Happily ever after". The Daily Telegraph. Retrieved December 31, 2008.
 11. 11.0 11.1 Rochlyn, Margy (November 4, 2007). "A Disney Princess, Not Winking but Floating". The New York Times. Retrieved December 31, 2008.
 12. Galloway, Stephen (December 8, 2008). "Oscar Roundtable: The Actresses". The Hollywood Reporter. Retrieved December 31, 2008. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 13. Head, Steve (January 8, 2003). "An Interview with Amy Adams". IGN Movies. IGN Entertainment. Retrieved January 26, 2008.
 14. 14.0 14.1 Strickler, Jeff (August 13, 2005). "Former Chanhassen actor becomes reluctant star". Star Tribune. మూలం నుండి 2011-06-07 న ఆర్కైవు చేసారు. Retrieved December 31, 2008.
 15. Goldfarb, Brad (2008). "Amy Adams". Interview. Brant Publications, Inc. 38 (1): 100–107, 150. ISSN 0149-8932.
 16. Flint, Joe (October 22, 1999). "On The Air". Entertainment Weekly. Retrieved January 26, 2008.
 17. Young, Jamie Painter (August 4, 2005). "Amy Adams: Little Breaks". Back Stage West. Retrieved January 26, 2008.
 18. 18.0 18.1 Getlen, Larry (March 2, 2008). "Q&A: Amy Adams". New York Post. Retrieved March 28, 2008.
 19. Ide, Wendy (April 1, 2006). "Presumed innocent". The Times. London. Retrieved January 26, 2008.
 20. Page, Janice (August 7, 2005). "For actress Amy Adams, role was a turning point". The Boston Globe. Retrieved January 26, 2008.
 21. 21.0 21.1 Wolf, Matt (April 16, 2006). "And she did go to the ball". The Sunday Times. London. Retrieved January 26, 2008.
 22. Freydkin, Donna (March 5, 2008). "Rising star Amy Adams' career seems enchanted". USA Today. Retrieved December 31, 2008.
 23. Chocano, Carina (August 3, 2005). "Movie Review: Junebug". Los Angeles Times. Retrieved December 31, 2008.
 24. Leydon, Joe (February 9, 2005). "Junebug". Variety. మూలం నుండి December 6, 2012 న ఆర్కైవు చేసారు. Retrieved December 31, 2008.
 25. "Academy Invites 120 to Membership" (Press release). Academy of Motion Picture Arts and Sciences. July 5, 2006. Retrieved January 28, 2008.
 26. White, Cindy (November 20, 2007). "Amy Adams and Patrick Dempsey help director Kevin Lima bring back classic Disney in Enchanted". Sci Fi Weekly. Retrieved January 26, 2008.
 27. Wood, Jennifer M. (November 26, 2007). "Amy Adams Enchants Kevin Lima". MovieMaker. మూలం నుండి 2008-01-31 న ఆర్కైవు చేసారు. Retrieved January 26, 2008.
 28. "Enchanted". Box Office Mojo. October 26, 2008. Retrieved December 20, 2008.
 29. McCarthy, Todd (November 18, 2007). "Enchanted". Variety. Retrieved December 30, 2008.
 30. Morris, Wesley (November 21, 2007). "Enchanted: A movie princess is born". The Boston Globe. Retrieved January 26, 2008.
 31. Murray, Rebecca (November 15, 2007). "Amy Adams Transforms Into a Princess for Enchanted". About.com. మూలం నుండి 2007-11-30 న ఆర్కైవు చేసారు. Retrieved March 23, 2008.
 32. "V.F.'s Hollywood Issue: The Annie Leibovitz Covers". Vanity Fair. February 5, 2008. Retrieved March 28, 2008.
 33. "Governor Bill Richardson Announces Sunshine Cleaning to be filmed in New Mexico" (Press release). New Mexico Film Office. February 8, 2007. మూలం నుండి 2008-12-06 న ఆర్కైవు చేసారు. Retrieved January 28, 2008.
 34. Tourtellotte, Bob (January 21, 2008). "Docs are hot at Sundance". Reuters. మూలం నుండి 2008-02-03 న ఆర్కైవు చేసారు. Retrieved December 31, 2008.
 35. "Sunshine Cleaning". Metacritic. Retrieved June 12, 2009. Cite web requires |website= (help)
 36. LaSalle, Mick (March 20, 2009). "Movie review: Amy Adams in 'Sunshine Cleaning'". San Francisco Chronicle. మూలం నుండి 2011-09-17 న ఆర్కైవు చేసారు. Retrieved June 12, 2009.
 37. Scott, A. O. (March 13, 2009). "Movie Review: Sunshine Cleaning (2008)". The New York Times. Retrieved June 12, 2009.
 38. Sragow, Michael (March 27, 2009). "Amy Adams is a scene-stealer in 'Sunshine Cleaning'". The Baltimore Sun. Retrieved June 12, 2009.[permanent dead link]
 39. "Miss Pettigrew Lives for a Day". Metacritic. Retrieved March 28, 2008. Cite web requires |website= (help)
 40. Chocano, Carina (March 7, 2008). "Movie Review: Miss Pettigrew Lives for a Day". Los Angeles Times. Retrieved March 28, 2008.
 41. Honeycutt, Kirk (March 3, 2008). "Miss Pettigrew Lives for a Day". The Hollywood Reporter. మూలం నుండి 2008-12-06 న ఆర్కైవు చేసారు. Retrieved March 28, 2008.
 42. Turner, Miki (March 3, 2008). "Amy Adams is surprised she's an 'It Girl'". MSNBC. Retrieved March 28, 2008.
 43. Whitty, Stephen (March 1, 2008). "For Amy Adams, being nice is the best revenge". The Star-Ledger. Retrieved March 28, 2008.
 44. Murray, Rebecca (December 2008). "Amy Adams Talks About Doubt". About.com. మూలం నుండి 2009-01-29 న ఆర్కైవు చేసారు. Retrieved January 3, 2009.
 45. Freydkin, Donna (December 18, 2008). "A "Bergman thing" going on with Doubt star Amy Adams". USA Today. Retrieved December 31, 2008.
 46. Ordoña, Michael (December 18, 2008). "Amy Adams stars with Streep in Doubt". San Francisco Chronicle. Retrieved December 31, 2008.
 47. Gabrenya, Frank (December 24, 2008). "Nun vs. priest a cerebral feast". The Columbus Dispatch. Retrieved December 31, 2008.
 48. McCarthy, Todd (November 6, 2008). "Doubt". Variety. Retrieved December 31, 2008.
 49. LaSalle, Mick (December 12, 2008). "Movie review: Doubt". San Francisco Chronicle. Retrieved December 31, 2008.
 50. D'Alessandro, Anthony (May 23, 2009). "'Museum' edges 'Terminator' Friday". Variety. Retrieved June 12, 2009.
 51. "Night at the Museum 2: Battle of the Smithsonian". Metacritic. Retrieved June 12, 2009. Cite web requires |website= (help)
 52. Phillips, Michael (May 20, 2009). "Toys in the nation's attic". Chicago Tribune. మూలం నుండి 2009-05-27 న ఆర్కైవు చేసారు. Retrieved June 12, 2009.
 53. Gleiberman, Owen (May 19, 2009). "Night at the Museum: Battle of the Smithsonian (2009)". Entertainment Weekly. Retrieved June 12, 2009.
 54. Burr, Ty (May 22, 2009). "Night at the Museum: Battle of the Smithsonian". The Boston Globe. Retrieved June 12, 2009.
 55. Loewenstein, Lael (May 20, 2009). "Night at the Museum: Battle of the Smithsonian". Variety. Retrieved June 12, 2009.
 56. Ebert, Roger (May 20, 2009). "Night at the Museum: Battle of the Smithsonian". Chicago Sun-Times. Retrieved June 12, 2009.
 57. Kaltenbach, Chris (May 17, 2009). "Amy Adams can play saintly, sweet and saucy". The Baltimore Sun. Retrieved June 12, 2009.[permanent dead link]
 58. Zeitchik, Steven (November 24, 2008). "Anand Tucker makes leap to Year". The Hollywood Reporter. Retrieved December 16, 2008.
 59. McNary, Dave (October 27, 2008). "Amy Adams set for Queen of Sheba". Variety. Retrieved December 16, 2008.[permanent dead link]
 60. Fleming, Michael (December 4, 2008). "Amy Adams set for Fox's Ten Best". Variety. Retrieved December 16, 2008.
 61. "Names & Faces". The Washington Post. July 26, 2008. Retrieved January 3, 2009.
 62. "Amy Adams Welcomes a Baby Girl, Aviana Olea". UsMagazine.com. Cite news requires |newspaper= (help)
 63. Sarah Michaud (May 17,2010). "It's a Girl for Amy Adams!". People. Retrieved May 17, 2010. Check date values in: |date= (help)

బాహ్య లింకులు[మార్చు]