ఏమీ లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Amy Lee
జన్మ నామంAmy Lynn Lee
మూలంLittle Rock, Arkansas, U.S.
రంగంAlternative metal
వృత్తిMusician, singer, songwriter, pianist
వాయిద్యాలుVocals, piano, organ,[1] guitar, harp[2]
క్రియాశీల కాలం1995–present
లేబుళ్ళుWind-up
సంబంధిత చర్యలుEvanescence
వెబ్‌సైటుwww.Evanescence.com
ముఖ్యమైన సాధనాలు
Baldwin Piano

'ఆమీ లీ 'గా ప్రెసిధ్ధిగాంచిన ఆమి లిన్ హర్జ్‌లర్, (నీ లీ; పుట్టిన తేది : 1981 డిసెంబరు 13) ఒక అమెరికన్ గాయని-గేయ రచయిత్రి మరియు సంప్రదాయబధ్ధంగా శిక్షణ పొందిన పియానిస్ట్. రాక్ బృందం అయిన ఎవానిసెన్స్‌కు ఆమె సహ-స్థాపకురాలు మరియు ముఖ్య గాయని. సాంప్రదాయ సంగీతకారులైన మొజార్ట్ నుండి ఆధునిక కళాకారులైన జోర్క్, టోరి ఎమోస్, డాని ఎల్ఫ్‌మన్[3] మరియు ప్లంబ్‌ల ప్రభావం తన మీద ఉన్నదని ఆమె చెబుతుంది.[4]

జీవితచరిత్ర[మార్చు]

బాల్య జీవితం[మార్చు]

డిస్క్ జాకీ మరియు టెలివిజం రంగానికి చెందిన జాన్ లీ మరియు సారా కార్గిల్ దంపతులకు లీ జన్మించింది. ఆమెకు ఒక సోదరుడు, రాబి ఇంకా ఇద్దరు అక్కలు, కారీ మరియు లోరి ఉన్నారు. లీకి ఒక చెల్లెలు ఉండేది తను 1987 లో మూడేళ్ళ వయసులో పేరు తెలియని జబ్బుతో మృతి చెందింది.[5] ఫాలెన్‌ లోని "హలో" అనే పాట, ఇంకా ది ఓపెన్ డోర్‌ లోని "లైక్ యు" అనే పాట కీర్తిసేషురాలైన తన చెల్లెలు స్మృత్యర్థం వ్రాసినట్లు తెలిసింది.[6] లీ సంప్రదాయసిధ్ధమైన పియానో పాఠాలను తొమ్మిది ఏళ్ళు అభ్యసించింది. ఆమె కుటుంబం ఎన్నో స్థలాలకు వలస వెళ్ళింది, అందులో ఫ్లోరిడా, ఇల్లినాయిస్[7] లాటి స్థలాలు ఉన్నాయి; తుదకు అర్కాన్సాస్‌లోని లిటిల్ రాక్‌లో స్థిరపడింది, అక్కడే ఇవానిసెన్స్ మొదలయ్యింది. ఆమె మిడిల్ టెన్నిసీ స్టేట్ యూనివర్సిటీలో కొంతకాలం సంగీత సిధ్ధాంతము ఇంకా కూర్పు నేర్చుకోవడానికి వెళ్ళారు, తరువాత, ఇవానిసెన్స్ పైన దృష్టి కేంద్రీకరించడానికి దానిని వదిలిపెట్టారు.[8]

AOL మ్యూజిక్ పైన జరిగిన ఇంటర్వ్యూలో, మొదటి గేయ రచనలు, తాను రాసినట్లుగా గుర్తున్నవి, "ఇటర్నిటీ ఆఫ్ ది రెమోర్స్" మరియు "ఎ సింగిల్ టియర్" అని చెప్పారు. మొదటిది తాను పదకొండు సంవత్సరాల వయసున్నపుడు, ఒక క్లాసికల్ కంపోజర్ కావాలని కోరుకున్నపుడు వ్రాసినది; రెండవది, తను ఎనిమిదో తరగతి చదువుతున్నపుడు, విధి నిర్వహణ కోసం చేసింది.[9]

నిశ్చితార్థం మరియు వివాహం[మార్చు]

"లైవ్ @ మచ్ " కార్యక్రమంలో, 2007 జనవరి 09న, మచ్‌మ్యూజిక్ ప్రత్యక్ష ప్రసారంలో లీ తనకు ముందు రోజు సాయంత్రం నిశ్చితార్థం జరిగినదని తెలియచేసారు. EvThreads.comలో తరువాత తను, చిరకాల స్నేహితుడు మరియు వైద్యుడు అయిన జోష్ హర్జ్‌లర్ తనను వివాహమాడ కోరాడని ధ్రువ పరిచారు.[10] "గుడ్ ఇనఫ్" మరియు "బ్రింగ్ మి టు లైఫ్" అనే పాటల వెనుక స్ఫూర్తి అతనిదేనని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.[11] ఈ జంట 2007 మే 6 న వివాహమాడింది, ఆ పిదప, ది బహామాస్ దగ్గర హనీమూన్ చేసుకుంది.[12] తానిప్పుడు "అధికారికంగా మిసెస్. ఆమీ హర్జ్‌లర్" అయ్యానని ఆమె EvThreads" వెబ్‌సైట్‌లో తెలియజేసింది.[13]

ఇవానిసెన్స్[మార్చు]

2007 స్క్రీం పురస్కారాలలో లీ

స్థాపన[మార్చు]

ఈ బృందాన్ని లీ బెన్ మూడీతో కలిసి స్థాపించింది. మీట్ లోఫ్ యొక్క గీతం "ఐ వుడ్ డు ఎనిథింగ్ ఫర్ లవ్ (బట్ ఐ వోంట్ డు దట్)" లీ పియానో పై ప్రదర్శిస్తుండగా, మూడీ విన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక యువ సదస్సులో కలిసారు.[14] ఒక నెలలోపల, వారిద్దరూ, అర్కాన్సాస్ బుక్ స్టోర్స్‌లోనూ, కాఫీ హౌసెస్‌[15] లోనూ అకౌస్టిక్ సెట్స్ వాయిస్తూ కనిపించారు ఆ తరువాత, తదనంతరముగా రెండు ఈపీలను, ఇవానిసెన్స్ EP మరియు సౌండ్ అస్లీప్ EP, రెకార్డ్ చేసారు. వాటిని వివిధ స్థానిక ప్రదేశాలలో అమ్మారు. 2000వ సంవత్సరంలో ఇవానిసెన్స్ ఒక పొడవాటి EP ఆరిజిన్‌ను రెకార్డ్ చేసింది. ఈ డెమోలో, ఆరంభపు ఆల్బం అయిన ఫాలెన్‌ నుండి మూడు పాటలు ఉన్నాయి, వాటిని లీ మరియు మూడీ కలిసి వ్రాసారు, అవి : "వ్హిస్పర్", "ఇమాజినరి" మరియు "మై ఇమ్మోర్టల్". "వ్హిస్పర్" మరియు "ఇమాజినరి" పాటలను ఫాలెన్‌లో చేర్చే ముందు కొంత మార్చినా, "మై ఇమ్మోర్టల్"ను మాత్రం అసలు మార్చకుండా అలాగే ఉంచారు. "మై ఇమ్మోర్టల్" యొక్క తరువాతి బృందపు రూపాంతరము, అధికారిక రూపంతరమైన ఫాలెన్‌ను వెబ్‌సైట్ ద్వారా కొన్నవారికి డవున్లోడ్ చేసుకోవడానికి ఉంచారు, కానీ అది ప్లే చేసే ముందు మరో CD చక్కెర్ ప్రోగ్రాంను కూడా సరిచూచుట కోసం డవున్‌లోడ్ చేసుకోవలసిన ఆవశ్యకత ఉంది.[16] బృందపు రూపాంతరం ఫాలెన్ యొక్క తరువాతి కాపీలలో చేర్చారు, ముఖ్యంగా బ్రజీలియన్, బొలీవియన్, అర్జెంటైన్ ఎడిషన్స్‌లో.

2003 అక్టోబరు 22న మూడీ బృందాన్ని సృజనాత్మక భేదాల కారణంగా విడిచిపెట్టాడు. కొన్ని నెలల తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆమీ, "....ఏదో మార్చక పోతే, మనం రెండవ రెకార్డ్ చేయగలిగే వాళ్ళం కాదు అన్న నిర్ణయానికి వచ్చాము" అని తెలియచేసింది. "మేమే చివరికి నిజమైన బృందం. కేవలం నేను, బెన్ ఇంకా మరికొందరు కలిసినంత మాత్రామ బృందం కాము" అని కూడా చెప్పింది.[15] గిటార్ మీదా, ఇంకా లీ రచనలకు సహచరుడిగా, ఎక్స్-కోల్డ్ గిటారిస్ట్ అయిన టెర్రి బాల్సమొ బృందంలో మూడీ స్థానంలో వచ్చాడు.

దావా[మార్చు]

2005 డిసెంబరు 1న, మాజీ ఇవానిసెన్స్ మేనేజర్ డెన్నిస్ రైడర్, 10 మిలియన్ల US డాలర్ల పరిహారానికి లీకు వ్యతిరేకంగా, ఒప్పందాన్ని అతిక్రమించినందుకు దావా వేసాడు. దావాలో రైడర్ తనను, అనుకున్న సమయానికంటే ముందుగా మరియు అన్యాయంగా తన మేనేజర్ స్థానం నుండి తొలగించారనీ, మూడు రెకార్డ్ల డీల్‌లో ఒక్క ఆల్బం మాత్రమే చేసాననీ పేర్కొన్నాడు.[11][17]

దానికి వ్యతిరేకంగా, లీ కౌంటర్-సూట్ (ప్రతి దావా) రైడర్ పైన వేసింది. ఇతర ఆరోపణలతో పాటు, రైడర్ పైన, విశ్వాసపాత్రమైన కర్తవ్య నిర్వహణ యొక్క ఉల్లంఘన, లైంగిక దాడి, శారీరక హింస, వృత్తిపరమైన బాధ్యతా రాహిత్యం మరియు ద్రవ్య మార్పిడి లాంటి అభియోగాలని మోపింది. రైడర్ లీ యొక్క వృత్తినీ, వ్యాపారాన్నీ నిర్లక్ష్యం చేసాడనీ, తన దృష్టి అంతా వివాహేతర సంబంధాల పైన, వాటిని తన భార్య దగ్గర దాచడం పైన ఉంచాడనీ, వ్యాపార చర్చల సమయంలో తాగిన మత్తులో ఉండేవాడనీ, ఆడవారిని శారీరకంగా హింసించడమే కాకుండా దాని గురించి గొప్పలు చెప్పుకునేవాడనీ, లీకి ఇష్టం లేని విధంగా లైంగిక భావాలు ప్రదర్శించేవాడనీ, కార్యనిర్వహణ ఒప్పందంలో లేని విధంగా జీతం తీసుకునేవాడనీ, లీ యొక్క కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ తన భార్యకు బహుమతులు కొనివ్వడానికి ఉపయోగించేవాడని కూడా దావాలో లీ నిందారోపణ చేసింది.[11][17]

రైడర్ యొక్క న్యాయవాది, బెర్ట్ డెయిక్స్‌లర్ ఒక వివరణలో రైడర్ 2002లో బృందానికి మేనేజర్ అయ్యాడు కాబట్టి, సంస్థకు చేయ వలసిన అతని కర్తవ్యాన్నీ, విధులనీ కార్యనిర్వహణ ఒప్పందం ప్రకారం చక్కగా నిర్వర్తించాడనీ, తన నడవడి విషయంలో కూడా ఉన్నతమైన వృత్తి ప్రమాణాలను పాటించాడనీ వాదించాడు.[11][17]

సోలో ఆల్బం[మార్చు]

అక్టోబరు 2008లో స్పిన్.కాంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లీ, తాను ఒక కొత్త సోలో ఆల్బం ప్రాజెక్ట్ కోసం కొత్త పాటలు రాస్తున్నానని తెలియ చేసింది. జానపదాలు మరియు సెల్టిక్ సంగీతం యొక్క ప్రభావాలను ఉదహరిస్తూ, తన ప్రస్తుత రచనలు తాను "నిజంగా పురాతన" మూలాలలోకి వెళ్తోన్న భావన కలగచేస్తున్నాయని చెప్పింది. అది విడుదల కానున్న తేదీని ఆమె ఇవ్వలేదు, కానీ ఈ కొత్త దారిలో వెళ్ళడానికి కారణం మాత్రం చెప్పింది: "నేను ఒక (trick pony) చమత్కారమైన చిన్న గుర్రం కంటే ఎక్కువ అని నిరూపించుకోవాలి".[18]

అక్టోబరు 2008లో ది గాంట్‌లెట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లీ, తాను సొలో వృత్తి మొదలు పెడదామా వద్దా అనే విషయం గురించి తనకి ఏమీ తెలియదనీ, "తరువాత ఏమి అవుతుందో చెప్పే పరిస్థితిలో" తాను లేననీ చెప్పింది. ఇవానిసెన్స్ ఒక బృందంగా ఇంకా ఉందనీ, కానీ పర్యటన మూసలో పోసినట్లుగా ఉన్నదనీ చెప్పింది. ఏ లక్ష్యాన్ని సాధిస్తాయో తెలీదుగానీ, తాను ఇంకా పాటలు రాయడం కొనసాగిస్తున్నానని ఆమె తిరిగి ఉద్ఘాటించారు.[19]

ఆగస్టు లేదా సెప్టెంబరు 2010లో విడుదల చేసేందుకు, లీ మరియు ఇవానిసెన్స్ ప్రస్తుతం మూడవ స్టూడియో ఆల్బం సెట్ పైన పనిచేస్తున్నారు.[20] మార్చి 2010లో స్పిన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, లీ, "తాను ఇదివరకు ఒక చాలా భిన్నమైన సృజనాత్మక స్థితిలో" ఉన్నాననీ, కొత్తగా తయారవుతున్న విషయాల పై తన పాత ప గురించి చెప్పింది. తాను కొన్ని మంచి పాటలు రాసిన సంగతి అలా ఉంచితే, వాటిల్లోనుండి ఏమీ కూడా కొత్త ఇవానిసెన్స్ ఆల్బంలో ఉంచబోనని చెప్పింది.[21]

ఆకృతి[మార్చు]

బ్రజిల్‌లోని సాఓ పోలోలో ఇవానిసెన్స్ కచేరీ ప్రదర్శిస్తున్న లీ

అప్పుడప్పుడూ ఉపయోగించే గోథిక్ మేక్అప్, ఇంకా విక్టోరియన్ స్టైల్ వస్త్ర ధారణాలతో లీకి ఒక గుర్తించదగిన ఫాషన్ స్టైల్ ఉంది.[22] "గోయింగ్ అండర్" అనే మ్యూజిక్ వీడియోలో ధరించిన వస్త్రాలు, 2004 గ్రామీ పురస్కారాల సమయంలో వేసుకున్న వస్త్రాలు, ది ఓపెన్ డోర్ కవర్ కోసం ధరించిన వస్త్రాలతో పాటు చాలా వరకు తన దుస్తుల రూపకల్పన ఆమె తనే చేసుకునేది. తాను రూపకల్పన చేసాక, జపనీస్ డిజైనర్ H. నాఓటోను తన దుస్తుల రూపకల్పనకు ఎన్నుకున్నది.[23] కచేరీలలో, తను కార్సెట్‌టాప్ మరియు ఫిష్‌నెట్స్ తరచు ధరిస్తుంది, అంతే కాక, పొడవాటి స్కర్ట్లు మరియు మోకాలిదాక యెత్తున్న బూట్లు ధరిస్తుంది. ఒక సమయంలో ఆమె ఎడమ కనుబొమపైన ఆమెకు గాయం అయ్యింది, అది ఫాలెన్ యొక్క కవర్ పైన కనిపిస్తుంది.

అనేక సందర్భాలలో ఆమె, తను తన స్తనాలను ప్రదర్శించడానికి ఎప్పటికీ ఇష్టపడననీ, తనమీదకు దృష్టి మరల్చే జనాలను ఆకర్షించే చేష్టలకు దూరంగా ఉంటాననీ చెప్పారు. నిజానికి, "ఎవెరీబడీ'స్ ఫూల్" అనే మ్యూజిక్ వీడియోలో, ఆమె లైంగిక ఆకర్షణను ఆయుధంగా ఉపయోగించే కళాకారులను ఎగతాళి చేసింది. ప్రేక్షకులని లైంగికంగా ఆకర్షించాలని చూసే సెలెబ్రిటీలు, చిల్లరగా అబద్దాలు ఆడుతున్నారని ఆమె వ్యక్తీకరించింది (అదే ఆ మ్యూజిక్ వీడియో యొక్క కథావస్తువు). చాలామంది అభిమానులు ఇతర సెలెబ్రిటీలలాగా లైంగిక ఆకర్షణని ఒక ఆయుధంగా ఉపయోగించకూడదనే లీ తత్వాన్ని ప్రశంసిస్తారు.[24]

2006 లో బ్లెండర్, లీను, జోఅన్ జెట్, కోర్ట్నీ లవ్ మరియు లిజ్ ఫెయిర్‌లతో పాటు రాక్ సంగీతంలో అత్యంత జనాదరణ పొందిన స్త్రీలలో ఒకరుగా ప్రకటించింది.[25]

ఇతర ప్రాజెక్టులు[మార్చు]

2000వ సంవత్సరంలో లీ, మాజీ కీబోర్డిస్ట్ అయిన డేవిడ్ హాడ్జెస్ యొక్క రెండు పాటలకు, అంటే "బ్రీద్" (ది సమ్మిట్ చర్చ్: సమ్మిట్ వర్షిప్ ) మరియు ఇంకా విడుదల కాని "ఫాల్ ఇన్‌టు యు" పాటలకు గెస్ట్ వోకల్స్ పాడింది.[26] బిగ్ డిస్మల్ యొక్క ఆరంభపు ఆల్బం బిలీవ్‌ లోని పాట "మిస్సింగ్ యు"కు ఆమె బాక్అప్ వోకల్స్ చేసారు. "సూపర్‌గ్రూప్" ది డామింగ్ వెల్‌తో రెండు పాటలకు బాక్అప్ వోకల్స్ పాడారు, కానీ రెకార్డ్ లేబుల్ వివాదాల వల్ల అంతిమ విడుదల నుండి ఆమె వోకల్స్‌ను తొలగించారు.[27] లీ తరువాత, సీథర్ యొక్క 2004 ఆల్బం డిస్‌క్లెయిమర్ II కొరకు, తన అప్పటి-స్నేహితుడు అయిన షౌన్ మోర్గాన్‌తో కలిసి "బ్రోకన్" అనే ట్రాక్ పైన ద్యూయెట్ ప్రదర్శించింది. ఆ పాట 2004 చలనచిత్రం ది పనిషర్‌లో కూడా సౌండ్‌ట్రాక్‌లో భాగంగా ఉండింది.

2003 బిల్‌బోర్డ్ పురస్కారాలలో లీ

2004లో లీ తాను The Chronicles of Narnia: The Lion, the Witch and the Wardrobeకు సంగీతం సమకూర్చడానికి పనిచేస్తున్నానని చెప్పింది, కానీ, స్టూడియో ఆ సంగీతాన్ని చాలా అంధకారంగా మరియు ఐతిహాసికంగా ఉన్నదని తిరస్కరించింది. కానీ, నార్నియా నిర్మాతలు, లీని తాము ఎప్పుడూ తమ చిత్రానికి సంగీతం సమకూర్చమని అడగలేదనీ, తమ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు హారి గ్రేగ్‌సన్-విలియమ్‌స్ అనీ, సౌండ్-ట్రాక్ పైన ఇవానిసెన్స్ సంగీతాన్ని తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదనీ చెప్పారు.[28][29] ఉంచాలనుకున్న పాటలలో ఒకటి తొలగించి, ది ఓపెన్ డోర్‌ లోని వివిధ ట్రాక్స్‌పై ఉపయోగించుకున్నారని కొంత ఊహాగానం నడిచింది, కానీ లీ ఇది నిజం కాదని, ఆల్బం "గుడ్ ఇనఫ్"లో మాత్రం దాని కొంత భాగాన్ని చివరి ట్రాక్‌లోకి మార్చామన్నది మాత్రం నిజమని చెప్పింది.[30]

2006లో ఔట్ ఆఫ్ ది షాడోస్‌ కి లీ అమెరికన్ చెయిర్‌పర్సన్ అయ్యింది. మూర్ఛవ్యాధి గురించి అవగాహన పెంచాలనే లక్ష్యం కలిగిన అంతర్జాతీయ సంస్థ ఇది. లీ తమ్ముడు అయిన రాబీకి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేసారు.[31] 2006 సంవత్సరం ఆఖర్లో జాని కాష్ యొక్క "గాడ్'స్ గోన్న కట్ యు డౌన్" అనే మ్యూజిక్ వీడియోలో ఆమె ఒక చిన్న అతిథి పాత్ర చేసారు.[32] షూట్‌లో కనపడిన ప్రతి సెలెబ్రిటీకి వీడియో కోసం తను ఏమి చేయదలచుకున్నారో అది చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి, లీ సమాధి పైన పూలు ఉంచుతున్నట్లుగా కనపడడాన్ని ఎన్నుకున్నారు. ఆమె దృశ్యాన్ని మన్‌హాటన్‌లోని ట్రినిటీ చర్చ్‌లో రెకార్డ్ చేసారు. అప్పుడు ఆమె ఇదివరకు టిమ్ బర్టన్‌కు చెందిన నల్ల వెల్వెట్ కోటు ధరించారు.[11]

ఫిబ్రవరి 2007లో MTV టెలివిజన్ మరియు రేడియోకి MTV Unplugged: Korn విడుదల చేసింది, అందులో లీ "ఫ్రీక్ ఆన్ అ లీష్" అనే పాటలో కనిపిస్తుంది. ఆ పాటను, ఆల్బం యొక్క మొదటి సింగిల్‌గా కూడా విడుదల చేసారు. నవంబరు 2007లో, బిహైండ్ ది మ్యూజిక్ తరహాలో VH1 ఒక మాక్యుమెంటరి నిర్మించింది. దాని పేరు రాక్ బాండ్ కొమెత్: ది రాక్ బాండ్ బాండ్ స్టోరి . అది వీడియో గేమ్ రాక్ బాండ్‌ను ప్రసిధ్ధము చేయడానికి నిర్మించారు. ఆ ప్రదర్శనలో లీ సెలెబ్రిటీ అతిథి పాత్రలలో ఒకరు.[33]

జూన్ 2008లో, నేషనల్ మ్యూజిక్ పబ్లిషర్స్ అసోసియేషన్ లీకు, తమ 2008 సాంగ్‌రైటర్ ఐకాన్ అవార్డ్ ప్రధానం చేసారు. అది అత్యున్నత శిఖరాలను అధిరోహించిన గేయ రచయితలకి, తమ వ్యక్తిగత లక్ష్యసిధ్ధికి ఇవ్వబడుతుంది.[34]

వాల్ట్ డిస్నీ రెకార్డ్స్ యొక్క సెప్టెంబరు 2008 విడుదల అయిన నైట్‌మేర్ రీవిసిటెడ్ కోసం, లీ "సాలీస్ సాంగ్" యొక్క రెమేక్ పాడింది. ఈ ఆల్బంలో కొత్త కథావస్తువు ఉన్నది, అది ఒరిజినల్ సౌండ్ ట్రాక్ అయిన నైట్‌మేర్ బిఫోర్ క్రిస్ట్‌మస్ లోని పాటలను కలిగి ఉంది.[35][36] హాలీవుడ్, కాలిఫోర్నియాలో నైట్‌మేర్ బిఫోర్ క్రిస్ట్‌మస్ రీ-రిలీజ్ ప్రీమియర్ ముందు, అక్టోబరు 17న, ఇంకా జే లెనోతో కలిసి అక్టోబరు 13 నాడు ది టునైట్ షో విత్ జే లేనో లో, లీ "సాలీ'స్ సాంగ్" యొక్క లైవ్ రెండిషన్స్ ప్రదర్శించారు.[37]

రికార్డింగుల పట్టిక[మార్చు]

2007లో ఫ్లోరిడాలోని, మియామీలో ఇవానిసెన్స్ కచేరీలో ప్రదర్శిస్తోన్న లీ

ఇవానిసెన్స్[మార్చు]

 • ఫాలెన్ (2003)
 • ది ఓపెన్ డోర్ (2006)

సహరూపకల్పన మరియు ఇతర పాటలు[మార్చు]

సంవత్సరం కళాకారుడు పాట విడుదల
2000 డేవిడ్ హాడ్జెస్ ఫీట్, ఆమీ లీ "బ్రీద్" ది సమ్మిట్ చర్చ్: సమ్మిట్ వర్షిప్
"ఫాల్ ఇన్‌టు యు" విడుదల చేయలేదు
2003 బిగ్ డిస్మల్ ఫీట్, ఆమీ లీ "మిస్సింగ్ యు" బిలీవ్
2004 సీథర్ ఫీట్, ఆమీ లీ "బ్రోకెన్" డిస్‌క్లెయిమర్ II
The Punisher: The Album
2007 కార్న్ ఫీట్, ఆమీ లీ "ఫ్రీక్ ఆన్ లీష్" MTV Unplugged: Korn
2008 ఆమీ లీ "సాలీ'స్ సాంగ్" నైట్‌మేర్ రీవిసిటెడ్

సూచనలు[మార్చు]

 1. http://twitter.com/AmyLeeEV/status/5777431076
 2. Lee, Amy; Leno, Jay (2008-10-13). The Tonight Show with Jay Leno (Television production). Burbank, California: NBC/Universal.
 3. "Interview with Evanescence singer Amy Lee". gURL.com. Retrieved 2006-11-07.
 4. Farias, Andree (2006-04-10). "Pre-Evanescence". Christianity Today. Christianity Today International. Retrieved 2006-11-07.
 5. Odell, Michael (April 2004). "Survivor!". Blender magazine. Retrieved 2006-10-18.
 6. "Evanescence: Amy Lee Explains the New Songs". VH1.com. 2006-10-08.
 7. "Amy's bio". OutoftheShadows.com. Retrieved 2006-11-07.
 8. Morse, Steve (May 23, 2003). "Evanescence is No Disappearing Act". The Boston Globe.
 9. Robertson, Jessica (2007-10-19). "P's & Q's: Amy Lee Finds Solace in Marriage and Music". AOL.com. Retrieved 2007-10-19.
 10. Lee, Amy (2007-01-09). "Amy's Engaged!: *clink clink* *ahem...*". EvThreads.com. Retrieved 2007-01-09.
 11. 11.0 11.1 11.2 11.3 11.4 Eells, Josh (2006). "Amy Lee: Back in Black". Blender. Retrieved 2007-01-09. Unknown parameter |month= ignored (help)
 12. Rubin, Courtney (2007-05-10). "Evanescence Singer Amy Lee Gets Married". People. Retrieved 2007-05-10.
 13. Hartzler, Amy (2007-05-18). "i've got a new ring & now you've got the scoop". EvThreads.com. Retrieved 2007-05-18.
 14. D'Angelo, Joe (2004-02-27). "Evanescence - The Split". MTV News. Retrieved 2006-11-07.
 15. 15.0 15.1 Bakker, Tiffany (2004-01-09). "Moody blues". The Sydney Morning Herald. Retrieved 2006-11-07.
 16. "My Immortal Band Version". Evanescence.com. మూలం నుండి 2004-06-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-03-10.
 17. 17.0 17.1 17.2 Harris, Chris (2005-12-08). "Evanescence's Amy Lee Sues Former Manager, Alleges Financial And Sexual Misconduct". MTV News via VH1.com. Retrieved 2006-11-07.
 18. Goodman, William (2008-10-17). "Evanescence's Amy Lee: "It's Not All Sad"". Spin.com. Retrieved 2008-10-18.
 19. Fisher, Jason (2008-10-23). "Evanescence Interview". TheGauntlet.com. Retrieved 2008-11-01.
 20. Hartzler, Amy (June 19, 2009). "News: Will the real Slim Shady please stand up?". Evanescence.com. Retrieved 2009-06-19.
 21. Goodman, William (March 5, 2010). "Amy Lee on the New Evanescence Album". Spin. Retrieved March 6, 2010.
 22. "Evanescence's Amy shreads her threads!". Kerrang!. 2003-06-09. మూలం నుండి 2005-03-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-01-15. Cite web requires |website= (help)
 23. "Amy Lee - Instant Fashion Profile". MTV News. 2004. Retrieved 2006-11-07.
 24. Moss, Corey (2004-06-10). "Evanescence's Amy Lee Hopes To Get Into Film, Rages Against Cheesy Female Idols". MTV News via VH1.com. Retrieved 2006-11-07.
 25. Errico, Mike (2006). "Hottest Women of...Rock!". Blender. Retrieved 2007-02-11. Unknown parameter |month= ignored (help)
 26. "Discography / Lyrics / Audio Clips". DavidHodges.info. Retrieved 2006-11-07.
 27. D'Angelo, Joe (2003-08-13). "Borland, Bowie, Maynard James Keenan Ready To Unveil Hush-Hush Project". MTV News. Retrieved 2007-03-08.
 28. D'Angelo, Joe (2004-11-18). "Evanescence's New Sound Is Reminiscent Of ... Evanescence". MTV News. Retrieved 2007-07-06.
 29. "Wardrobe closed to Evanescence singer". The New Zealand Herald. 2007-11-27. Retrieved 2007-07-06.
 30. Lee, Amy (2006-07-13). "Discussion of The Open Door album". EvBoard.com. Retrieved 2007-08-09.
 31. "Why Epilepsy?". OutoftheShadows.com. Retrieved 2006-11-07.
 32. Kaufman, Gil (2006-11-17). "Timberlake's Brainstorm: Johnny Cash Video With Kanye, Jigga, Depp, Others". MTV News via VH1.com. Retrieved 2006-11-30.
 33. "Megadeth's Mustaine, Evanescence's Lee Featured In 'Rock Band Commeth' Mockumentary". Blabbermouth.net. 2007-11-07. Retrieved 2007-11-08.
 34. Butler, Susan (2008-06-10). "NMPA Honors Amy Lee, Sen. Leahy". Billboard.biz. Retrieved 2009-06-25.
 35. Donahue, Ann (2008-08-05). "Elfman, Korn, Plain White T's Revisit 'Nightmare'". Billboard.biz. Retrieved 2008-08-09.
 36. "Jonathan Davis, Marilyn Manson, and Amy Lee Featured on "Nightmare Before Christmas" CD". RevolverMag.com. 2008-08-08. Retrieved 2008-09-04.
 37. "Evanescence Singer To Perform At 'Nightmare Before Christmas' Opening". Blabbermouth.net. 2008-10-10. Retrieved 2008-10-11.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Evanescence

"https://te.wikipedia.org/w/index.php?title=ఏమీ_లీ&oldid=2442471" నుండి వెలికితీశారు