Jump to content

ఏర్చూరి సింగన

వికీపీడియా నుండి

ఏర్చూరి సింగన సా.శ.1450-1500[1] సింగన భాగవతంలోని షష్ఠమ స్కంద రచయిత. పోతన ప్రణీతమైన మహా భాగవతం లో కొంత భాగము జీర్ణమయినా మహానుభావులు వెలిగందల నారాయణామాత్యులు , ఏర్చూరి సింగనామాత్యులు , బొప్పన గంగనామాత్యులు తమ తమ ప్రతిభానైపుణ్యములతో భాగవతమునకు పునః సంపూర్ణతను సమకూర్చారు.[2] సింగనామాత్యులు షష్ఠస్కంధమును అచ్యుతుని, కృపావాసుని ప్రశంసిస్తూ విభిన్న మార్గములో ప్రారంభించారు.

భాగవత దేవాలయ జీర్ణోద్ధారాన్ని వెలిగందల నారాయణామాత్యుడు మొదలుపెట్టిన తర్వాత బొప్పన గంగనామాత్యుడు కొనసాగింపగా ఆ మహత్కార్యాన్ని పూర్తిచేసి పునీతజనాశ్రయం కల్పించిన పుణ్యచరిత్రుడు మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు.

జననం

[మార్చు]

సింగన నల్లగొండ జిల్లా ఏర్చూరులో జన్మించాడు.

రచనలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ’ముంగిలి’ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. తెలుగు అకాడమి: తెలుగు అకాడమి. 2016. p. 638. ISBN 9788181803092.
  2. Sirimalle (2019-01-20). "మహాకవి ఏర్చూరి సింగనామాత్యుడు". Sirimalle (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-05.
  3. "Goodreads". Goodreads. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-02-13.