ఏలూరిపాటి అనంతరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర వ్యాసునిగా పేరొందినవారు ఏలూరిపాటి అనంతరామయ్య (1935 - 2002). తెలుగు సాహిత్యం, పురాణాల విషయాలలో అఖండ కృషి చేశారు.[1] ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి సమీపంలో ఉన్న తోగుమ్మి గ్రామంలో జన్మించారు. కొవ్వూరు సంస్కృత కళాశాలలో పట్టభద్రులైనారు. వీరి వాక్చాతుర్య ప్రతిభ, ఛలోక్తులు న భూతో న భవిష్యత్ అన్న విధంగా ఉండేవి.

దూరదర్శన్ డి డి 8 లో "పద్యాల తో రణం" అనే తెలుగు పద్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆకాశవాణిలో మూడు దశాబ్దాలు పైబడి ప్రతి శ్రీరామనవమి నాడు శ్రీ భద్రాద్రి రామ కల్యాణ వైభోగ వ్యాఖ్యానం ప్రత్యక్షప్రసారరంలో శ్రోతలకు అందజేశారు.

వీరు క్రీ. శ. 2002 సంవత్సరంలో ఆషాఢ పూర్ణిమ రోజున పరమపదించారు.

వీరికి నలుగురు కుమార్తెలు ఏకైక కుమారుడు. పేరు ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం పాత్రికేయులు.

రచనలు[మార్చు]

  • జైమిని భారతం
  • అశ్వమేధ పర్వం
  • విష్ణు పురాణం, 1, 2, 3 సంపుటాలు
  • శ్రీ స్కాంద పురాణం సూత సంహిత
  • శ్రీ శివ మహాత్మ్య ఖండం
  • శ్రీ వామన పురాణం
  • శ్రీ వరాహ పురాణం
  • శ్రీ స్కాంద రేవా ఖండం
  • శ్రీ మార్కండేయ పురాణం
  • శ్రీ బ్రహ్మవైవర్త పురాణం
  • శ్రీమద్భాగవతం, సప్తమ స్కందం
  • జంఘాలశాస్త్రి క్ష్మాలోక యాత్ర

మూలాలు[మార్చు]

  1. అనంతరామయ్య ఏలూరిపాటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 10.