Jump to content

ఏవిఎమ్ (కార్టూనిస్టు)

వికీపీడియా నుండి
ఆలపాటి వెంకట మోహనగుప్త
AVM
జననంఆలపాటి వెంకట మోహన గుప్త
మార్చి 12, 1947
విజయవాడ కృష్ణా జిల్లా
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుA V M
వృత్తిస్వంత వ్యాపారం
ఉద్యోగంస్వంత వ్యాపారం
భార్య / భర్తరత్న ప్రభావతి
పిల్లలుఉమా శంకర్‌, కిరణ్‌బాబు
తండ్రిఆలపాటి కమలనాభ రావు
తల్లిఆలపాటి దమయంతి

AVM గా 1968 నుండి వ్యంగ్య చిత్రాలు వేస్తున్న ఇతని అసలు పేరు ఆలపాటి వెంకట మోహనగుప్త. ఆంగ్లభాషలో తన పేరు అక్షర కూర్పు (Spelling) నుండి ప్రతిపదం మొదటి అక్షరాన్ని తీసుకొని తన కలం పేరును 'AVM'గా చేసుకుని తెలుగువారికి చిరపరిచిత వ్యంగ్య చిత్రకారులయ్యాడు. బాపు, వడ్డాది పాపయ్య లకు ఏకలవ్య శిష్యుణ్ణని వినయంగా చెప్పుకునే ఇతడు, బాపు వ్యంగ్య చిత్రాల వల్ల ప్రేరణ పొంది కార్టూనింగ్ రంగానికి వచ్చాడు. బొమ్మలు గీయటం కష్టపడి మదరాసు డ్రాయింగ్ స్కూలులో నేర్చుకున్నాడు.

వ్యక్తిగతం

[మార్చు]

ఇతను 1947వ సంవత్సరం మార్చి 12విజయవాడలో జన్మించాడు. ఇతడి తండ్రి ఆలపాటి కమలనాభరావు, తల్లి ఆలపాటి దమయంతి. చదువు పి.యు.సి (Pre University Course present Intermediate)ముగించి అవసరార్ధం వ్యాపారంలో తన వంతు బాధ్యతలను నిర్వహించవలసి వచ్చింది. ప్రస్తుతం విజయవాడలో స్వంత వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇతని భార్య రత్న ప్రబావతి, వివాహం ఏప్రిల్ 16, 1971న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉమా శంకర్, కిరణ్‌బాబు.

వ్యంగ్య చిత్రకారుని ప్రగతి

[మార్చు]
పిడుగు సంపుటి ముఖచిత్రం

బాపు, జయదేవ్ ల కార్టూన్లతో ఎంతగానో ప్రబావితుడై, వడ్డాది పాపయ్య గారి చిత్రాలను చూసి ప్రేరితుడై, బొమ్మలు గీయటం నేర్చుకోవాలని నిశ్చయించుకుని మద్రాసులో లైన్ డ్రాయింగ్‌ హైయ్యర్ గ్రేడ్ నేర్చుకుని వచ్చాడు. తన నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవటానికి డ్రాయింగ్ మాస్టారు వేణుగోపాలరావు వద్ద అనేక మెళుకువలు నేర్చుకున్నాడు. ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం 1968వ సంవత్సరంలో యువ మాసపత్రికలో అచ్చయింది. అప్పటినుండి అసంఖ్యాకంగా అనేక కార్టూన్లు అన్ని ప్రముఖ వార/మాస పత్రికలో ప్రచురించారు. తన గురువైన బాపు (ముళ్ళపూడి వెంకటరమణతో కలసి) సృష్టించిన బుడుగుకు తోడుగా "పిడుగు" అన్న కార్టూన్ పాత్రను పాఠకలోకం మీదకు వదిలాడు. ఇంతేకాక అనేక చిత్రకథలను రచించి/చిత్రించి బాల సాహిత్యానికి తనవంతు కృషిని అందించాడు. కార్టూన్లను అనేక సంపుటాలుగా కూడా ప్రచురించాడు. ఇతని కార్టూన్ల సంకలనాలు, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు, కార్టూనింగ్ అధ్యయనం చెయ్యటానికి ఎంతగానో ఉపకరిస్తాయి.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

[మార్చు]

పొందికైన బొమ్మలు, వంకర టింకర లేని చక్కటి ముఖ భంగిమలు,అవసరానికి మించని ఇతర వివరాలు, సహజత్వాన్ని దగ్గరగా రంగులు, మాటల పొదుపుతో పదునైన సంభాషణలు వీరి కార్టూన్లలో కనపడుతుంటాయి.

వ్యంగ్య చిత్రమాలిక

[మార్చు]