Jump to content

ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

Coordinates: 16°26′13″N 80°33′11″E / 16.437°N 80.553°E / 16.437; 80.553
వికీపీడియా నుండి
ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
మైదాన సమాచారం
ప్రదేశంమంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
భౌగోళికాంశాలు16°26′13″N 80°33′11″E / 16.437°N 80.553°E / 16.437; 80.553
స్థాపితంTBA
సామర్థ్యం (కెపాసిటీ)34,000
యజమానిఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ
ఆపరేటర్ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
వాడుతున్నవారుఆంధ్రా క్రికెట్ జట్టు
అంతర్జాతీయ సమాచారం

ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం) మంగళగిరి పట్టణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం, ఇది మంగళగిరి తాడేపల్లె మునిసిపల్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA)లో భాగం. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, మంగళగిరి నుండి దాదాపు 10 మైళ్ళు (16 కి.మీ), తెనాలి నుండి 19 మైళ్ళు (31 కి.మీ) , పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి 8 మైళ్ళు (13 కి.మీ) దూరంలో ఉంది.[1]

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయవాడలో 2000లో అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం నిర్మించాలని భావించింది, కానీ తగినంత స్థలం లేకపోవడంతో ఈ స్టేడియం నిర్మాణాన్ని మంగళగిరికి తరలించారు. క్రికెట్ మైదానం నిర్మించబడినప్పటికీ ప్రేక్షకుల గ్యాలరీతో పాటు స్టేడియం నిర్మాణం ప్రారంభం కాలేదు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2013లో మంగళగిరిలో సెంట్రల్ జోన్ స్టేడియం నిర్మాణాన్ని జోనల్ వారీగా విజయనగరం, కడపలో వరుసగా ఉత్తర & దక్షిణ జోన్ అకాడమీలతో కలిపి ప్రతిపాదించింది.[2] ఏసీఏ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించింది, ఆటగాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి క్రికెట్ మైదానం పక్కన ఇండోర్ స్టేడియం నిర్మించారు. కానీ నిర్మాణ సమస్యల కారణంగా ప్రధాన స్టేడియం నిర్మాణం పునాది స్థాయిలోనే నిలిచిపోయింది.[3] ఈ స్టేడియం నిర్మాణం పని 2015 నుండి తిరిగి ప్రారంభమైంది.[4]

ఈ స్టేడియంను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 2016 మే 30న అనురాగ్ ఠాకూర్ (అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు), గల్లా జయదేవ్ (లో‍క్‍సభ సభ్యుడు), కేశినేని శ్రీనివాస్ (లో‍క్‍సభ సభ్యుడు), దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు,[5] నిర్మాణ సంస్థ ఐవిఆర్‌సిఎల్ లిమిటెడ్ ₹ 51.04 కోట్లు (US$6.0 మిలియన్లు) విలువైన ఈ ప్రాజెక్టు హక్కులను దక్కించుకుంది.[6] ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యాజమాన్యంలో ఉంది. ఈ స్టేడియం 24 ఎకరాల (9.7 హెక్టార్లు) విస్తీర్ణంలో 34,000 మంది కూర్చునే సామర్థ్యంతో విస్తరించి ఉంది.[7][8]

భారత మాజీ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ జూన్ 2013 లో సెంట్రల్ జోన్ అకాడమీ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ప్రారంభించాడు.[9] ఈ స్టేడియంలో క్లబ్ హౌస్, ఇండోర్ క్రికెట్ అకాడమీ ఉంటాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కార్యాలయంగా చేసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Eco-friendly stadium coming up at Mangalagiri". The Hindu (in Indian English). 2013-03-29. ISSN 0971-751X. Retrieved 2016-06-16.
  2. Andhra Cricket Association Academies in AP - TV5 (in ఇంగ్లీష్), retrieved 2021-04-20
  3. International Cricket Stadium in Mangalagiri. AP New Capital. 10TV (in ఇంగ్లీష్), retrieved 2021-04-19
  4. "ACA's Mangalagiri stadium to be ready by 2018". The Hindu (in Indian English). 2016-09-23. ISSN 0971-751X. Retrieved 2021-04-19.
  5. BCCI Chief Anurag Inaugurates Cricket Stadium at AP Capital Amaravati || NTv. YouTube. Archived from the original on 2021-12-10.
  6. "IVRCL bags orders worth Rs 1,098 crore". The Hindu Business Line. 2013-07-12. Retrieved 2016-06-16.
  7. "International cricket stadium for Vijaywada near NTR health university". The New Indian Express. Archived from the original on 1 June 2016. Retrieved 2016-06-16.
  8. ACA’s Mangalagiri stadium to be ready by 2018
  9. "ACA Central Zone Academy". The Indian Express. Retrieved 2014-05-11.