ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

వికీపీడియా నుండి
(ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.
ఎ. పి. జె. అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

2014 తిరువనంతపురం అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో


పదవీ కాలము
జూలై 25, 2002 – జూలై 25, 2007
ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి
మన్మోహన్ సింగ్
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్
భైరాన్‌సింగ్ షెకావత్
ముందు కె.ఆర్.నారాయణన్
తరువాత ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1931-10-15)1931 అక్టోబరు 15 [1]
ధనుష్కోడి, రామేశ్వరం,
తమిళనాడు, భారత దేశము
మరణం 2015 జూలై 27(2015-07-27) (వయస్సు 83)
షిల్లాంగ్, మేఘాలయ, భారత దేశము
రాజకీయ పార్టీ ఏ పార్టీకి చెందనివారు
జీవిత భాగస్వామి అవివాహితుడు
పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి
మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై
వృత్తి ప్రొఫెసర్
రచయత
శాస్త్రవేత్త
మతం ఇస్లాం

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గా పిలవబడే అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ (అక్టోబర్ 15, 1931 - జులై 27, 2015 ), భారత దేశపు క్షిపణి శాస్త్రవేత్త , 11వ భారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నై లోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందాడు.

భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ఆర్గనైజేషన్ - DRDO) , ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, వాహన ప్రయోగ సాంకేతిక అభివృద్ధికి కృషిచేశాడు. 1998లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా, ప్రతిపక్ష కాంగ్రెస్ మద్ధతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడు. భారతదేశపు పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడు.

బాల్యం , విద్యాభ్యాసం

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ కలాం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు. తండ్రి జైనులబ్ధీన్, పడవ యజమాని. తల్లి ఆషియమ్మ గృహిణి. పేద కుటుంబం కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉండటానికి అబ్దుల్ కలాం వార్తా పత్రికలు పంపిణీ చేసేవాడు.

పాఠశాలలో సగటు మార్కులు వచ్చినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు. ఎక్కువ సమయం కష్టపడేవారు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం తిరుచిరాపల్లి లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాల చేరి, 1954 లో భౌతికశాస్త్రంలో పట్టా పొందాడు. అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు. కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన ఉపకారవేతనం రద్దుచేస్తాను అని బెదిరించాడు. ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు. తరువాత డీన్ "కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను" అన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.

శాస్త్రవేత్తగా

మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT - చెన్నై) నుండి పట్టా పొందిన తరువాత 1960 లో, కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఏరోనాటికల్ డెవెలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరాడు. కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చెయ్యటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు, కానీ DRDO లో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969 లో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో (ఇస్రో) చేరి, ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేసి జూలై 1980 లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్ష్యలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970, 1990 మధ్య కాలంలో, కలాం పోలార్ SLV, SLV-III ప్రాజెక్టుల అభివృద్ధికి పనిచేశారు. రెండు ప్రాజెక్టులు విజయవంతం అయినాయి. 1970 లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలో మైలురాయి. జూలై 1992 నుండి డిసెంబరు 1999 మధ్య ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలలో కలాం రాజకీయ, సాంకేతిక పాత్ర నిర్వహించాడు.

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం అందచేసినవారు
2014 సైన్స్ డాక్టరేట్ ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK[2]
2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం[3]
2011 IEEE గౌరవ సభ్యత్వం IEEE[4]
2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం[5]
2009 గౌరవ డాక్టరేట్ ఓక్లాండ్ యూనివర్శిటీ[6]
2009 హూవర్ పతకం ASME ఫౌండేషన్, USA[7]
2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA[8]
2008 ఇంజనీరింగ్ డాక్టర్ నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్[9]
2007 కింగ్ చార్లెస్ II పతకం రాయల్ సొసైటీ, UK[10][11][12]
2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK[13]
2000 రామానుజన్ అవార్డు ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై [14]
1998 వీర్ సావర్కర్ అవార్డు భారత ప్రభుత్వం
1997 ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్
1997 భారతరత్న భారత ప్రభుత్వం[14][15]
1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)[16]
1990 పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం[14][17]
1981 పద్మ భూషణ్ భారత ప్రభుత్వం[14][17]

ఇతరాలు

 • "ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేవాడ్ని. మా అమ్మ ఉదయాన్నే నన్ను నిద్ర లేపేది. అప్పుడు స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడిని . స్నానం చేసి రాకపోతే మా మాస్టర్ పాఠాలు చెప్పేవారు కాదు. నేను ట్యూషన్ పూర్తి చేసుకొచ్చేసరికి మా నాన్న నన్ను నమాజ్‌కు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండేవారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక రైల్వేస్టేషన్‌కి వెళ్లేవాణ్ణి. మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని పంపిణీ చేసేవాడ్ని. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. సభ్యులు ఎక్కువ మంది ఉండేవారు. 'మా అమ్మ మాత్రం నాకు మిగితా వారికన్నా ఎక్కువ తిండి పెట్టేది. ఇంట్లో నేను చివరివాడిని . దానికి తోడు చదువుకుంటూ పని చేయడం వల్ల మా అమ్మ నాపై చాలా శ్రద్ధ చూపేది. మా ఇంట్లో ఆనందం, విషాదం రెండూ ఉండేవి'
 • ముగ్గురమ్మల కథ-ఆ ముగ్గురు అమ్మలు నాకెంతో ఇష్టం తనకు ముగ్గురు అమ్మలంటే చాలా ఇష్టమని.. వారందరిని తాను కలవగలిగానని కలాం చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలు ఎవరంటే.. 'ఒకరు మా సొంత అమ్మ. మరొకరు భారత సంగీతానికి అమ్మ, ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ థెరిస్సా' అని చెప్పారు. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి ఆమె సంగీతాన్ని ఎంతగానో అభిమానించానన్నారు. 'ఆమె భారతరత్న అవార్డు తీసుకునే సమయంలో నా తల నిమిరింది. ఆ ఘటనను నేనెప్పటికీ మరవలేను' అని ఉద్వేగంతో చెప్పారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి నలభైఏళ్ల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మగా కలాం చెప్పారు. (ఈనాడు 3.8.2008)
 • ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన అతను 1958లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగులో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత అతను భారత దేశపు రక్షణ పరిశోధన , అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ.లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ (hovercraft) ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో అతను (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రోకు మారారు. అక్కడ అతను ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా అతను కృషి ఎంతో ఉంది. 1982 లో, అతను DRDO కు డైరెక్టరుగా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి , పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు అతనుే సూత్రధారి. దీంతో అతనుకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992లో అతను భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనుకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతను కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
 • భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్ (1990 లో); , భారత రత్న (1997 లో) లతో బాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్. జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో (90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు. అతను్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో అతను ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
 • కలామ్ శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ అతను పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్తో బాటు, భగవద్గీతను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు, మానవతావాది. అతను తిరుక్కురళ్లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. అతను చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం" నైనా ప్రస్తావిస్తారు.
 • కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా అతను భావిస్తున్నారు. అతను భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను అతను చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అతను చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని అతను ప్రతిపాదించారు. అతను ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని అతను విశ్వాసం.

రచనలు

కలాం రచనలు

 • ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003) ISBN 0-14-027833-8
 • ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003) ISBN 0-14-302982-7
 • ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (Excel Books, 2004) ISBN 81-7446-350-X
 • ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్‌గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004) ISBN 0-07-053154-4

జీవితచరిత్రలు

 • వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999) ISBN 81-7371-146-1
 • సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003) ISBN 81-212-0807-6
 • ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002) ISBN 81-86830-55-3
 • ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002) ISBN 81-261-1344-8
 • ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002) ISBN 81-7648-380-X

మరణం

రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ అబ్దుల్‌ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్‌ కలాంను స్థానిక బెథాని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. అతను వయస్సు 84 సంవత్సరాలు.

మూలాలు

 1. "A Brief Biography of Dr. A. P. J. Abdul Kalam". Archived from the original on 2008-01-05. Retrieved 2008-01-17.
 2. "Ex-President of India Abdul Kalam visits the Forum". University of Edinburgh. Archived from the original on 2014-05-28. Retrieved 27 మే 2014.
 3. "Honorary Degrees – Convocation – Simon Fraser University". Simon Fraser University. Retrieved 31 ఆగస్టు 2012.
 4. "IEEE Honorary Membership Recipients" (PDF). IEEE. p. 1. Retrieved 28 ఆగస్టు 2011.
 5. "Yet another honorary doctorate for Kalam". Rediff.com. 6 October 2010. Retrieved 13 March 2012.
 6. "A.P.J Abdul Kalam – Honorary Degree, 2009". Oakland University.
 7. "Former President Kalam chosen for Hoover Medal". New York: Indiatimes. 27 March 2009. Archived from the original on 13 నవంబర్ 2013. Retrieved 30 October 2010. Check date values in: |archive-date= (help)
 8. "Caltech GALCIT International von Kármán Wings Award". galcit.caltech.edu. Retrieved 1 March 2012.
 9. "Dr Abdul Kalam, former President of India, receives NTU Honorary Degree of Doctor of Engineering". Nanyang Technological University. 26 ఆగస్టు 2008. Retrieved 28 ఆగస్టు 2011.
 10. "King Charles II Medal for President". The Hindu. Chennai, India. 12 July 2007. Retrieved 1 March 2012.
 11. "King Charles II Medal for Kalam". The Economic Times. India. 11 July 2007. Retrieved 1 March 2012.
 12. "Royal Society King Charles II Medal". Royal Society. Retrieved 14 November 2012.
 13. "Kalam conferred Honorary Doctorate of Science". The Economic Times. India. 23 October 2007. Archived from the original on 13 నవంబర్ 2013. Retrieved 1 March 2012. Check date values in: |archive-date= (help)
 14. 14.0 14.1 14.2 14.3 "Dr. Abdul Kalam's Diverse Interests: Prizes/Awards". Indian Institute of Technology Madras. Archived from the original on 28 మే 2012. Retrieved 1 March 2012.
 15. "List of recipients of Bharat Ratna" (PDF). Ministry of Home Affairs, Government of India. Archived from the original (PDF) on 3 ఫిబ్రవరి 2013. Retrieved 1 March 2012.
 16. "List of Distinguished Fellows". Institute of Directors (India). Retrieved 9 November 2014.
 17. 17.0 17.1 "Bharat Ratna conferred on Dr Abdul Kalam". Rediff.com. 26 November 1997. Retrieved 1 March 2012.

బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.


ఇంతకు ముందు ఉన్నవారు:
కె.ఆర్.నారాయణన్
భారత రాష్ట్రపతి
2002 జూలై 252007 జూలై 25
తరువాత వచ్చినవారు:
ప్రతిభా పాటిల్