ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 39

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐరాస భద్రతామండలి
తీర్మానం 39
తేదీజనవరి 20 1948
సమావేశం సం.230
కోడ్S/654 (Document)
విషయంభారత పాకిస్తాన్ సమస్య
వోటింగు సారాంశం
9 అనుకూల వోట్లు
సున్నా ప్రతికూల వోట్లు
2 ఆబ్సెంటు
ఫలితంఆమోదం
భద్రతాసమితి కూర్పు
శాశ్వత సభ్యులు
Non-permanent members

కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడంలో సహాయపడేందుకు ఐరాస 1948 జనవరి 20 న ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 39ని ఆమోదించింది. ఇందు కోసం ముగ్గురు సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ సభ్యులలో ఒకర్ని భారతదేశం, మరొకర్ని పాకిస్తాన్ ఎన్నుకుంటాయి. వీరిద్దరూ కలిసి మూడవ సభ్యుని ఎన్నుకుంటారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఏ చర్యలు తీసుకోవాలో కమిషను భద్రతామండలికి సలహా ఇస్తూ ఉమ్మడిగా లేఖ రాస్తుంది.

కమిషన్ విధులు

[మార్చు]

"వాస్తవాలను పరిశోధించి", భద్రతామండలి ఇచ్చిన "ఆదేశాలను అమలు చేయడం"కమిషను కర్తవ్యం. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులకు సంబంధించి 1948 జనవరి 1 న రాసిన లేఖలో భారత్ చేసిన ఆరోపణలపై కమిషను దర్యాప్తు చెయ్యాలి. రెండవది, 1948 జనవరి 15 న పాకిస్తాన్ లేవనెత్తిన అంశాలను "భద్రతా మండలి నిర్దేశానుసారం" కమిషను పరిశీలించాలి. పాకిస్తాన్ చాలా ఆరోపణలు చేసింది. భారతదేశం దేశ విభజనను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని, తూర్పు పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాలలో ముస్లింలకు వ్యతిరేకంగా 'సామూహిక హత్యాకాండ'ను ప్రోత్సహిస్తోందనీ, జూనాగఢ్ ను బలవంతంగా, చట్టవిరుద్ధంగా ఆక్రమించిందనీ, జమ్మూ కాశ్మీరును 'మోసపూరితంగా, హింస' ద్వారా విలీనం చేసుకుందనీ, పాకిస్తాన్‌పై నేరుగా సైనిక దాడి చేస్తానని బెదిరించిందనీ పాకిస్తాన్ ఆరోపించింది. [1]

చర్చలు, పరిణామాలు

[మార్చు]

ఈ తీర్మానాన్ని మండలి చైర్మన్ స్థానంలో ఉన్న బెల్జియం ప్రతిపాదించింది. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడానికి బ్రిటన్ ఐక్యరాజ్యసమితికి పంపిన తమ మంత్రి ఫిలిప్ నోయెల్ బేకర్ నేతృత్వంలోని ప్రత్యేక బ్రిటిష్ ప్రతినిధి బృందం దీనిపై ఎక్కువగా పనిచేసింది. [2] [a] ఉక్రెయిన్, సోవియట్ యూనియన్లు ఆబ్సెంటవడంతో తీర్మానం తొమ్మిది ఓట్లతో ఆమోదం పొందింది.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కాశ్మీర్‌లో నిష్పాక్షిక పరిపాలనకు అంగీకరించాలని భారతదేశాన్ని ఒప్పించడానికి బ్రిటిష్ ప్రతినిధి బృందం ప్రయత్నించింది. పరిపాలనను "తటస్థ" ఛైర్మన్ నేతృత్వం వహిస్తారు, కాశ్మీరు, ఐరాస నియమించిన తటస్థ కమాండర్-ఇన్-చీఫ్ కింద పనిచేసే ఉమ్మడి సైనిక అధీనంలో ఉండాలి. ప్రభావశీలమైన ఈ ప్రతిపాదనలకు అమెరికా మద్దతు ఇవ్వలేదు. [3] [4] [5]

ఐరాస కమిషన్ భద్రతా మండలి అధీనంలో ఉండాలని బ్రిటన్ ప్రతినిధి బృందం, అయితే పరిష్కారాన్ని రూపొందించే అసలు పని న్యూయార్క్‌లో జరుగుతుందని భావించింది. అందుచేతనే, పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ, 1948 ఏప్రిల్ లో భద్రతామండలి తీర్మానం 47 ఆమోదించేంతవరకూ కమిషన్ను ఏర్పాటు చెయ్యడానికి ఏ ప్రయత్నమూ జరగలేదు. [6] కమిషన్ ఏర్పడి, అది ఉపఖండానికి వచ్చేసరికి మరో పదకొండు వారాలు గడిచాయి. కమిషన్ ఏర్పాటు ఆలస్యం కావడంపై ఐరాస దౌత్యవేత్త జోసెఫ్ కోర్బెల్ తరువాతి కాలంలో విమర్శించాడు. శీతాకాలంలో, పోరాటం చిన్నచిన్న ఘర్షణలకే పరిమితమైంది. వేసవిలో పోరాటం తిరిగి మొదలయ్యే లోపే కమిషన్ వస్తే పరిస్థితిని చల్లబరచే వీలుండేదని కోర్బెల్ అభిప్రాయపడ్డాడు. ఎట్టకేలకు కమిషను పనిలో దిగేటప్పటికి, రాజకీయ, సైనిక పరిస్థితులు 1948 జనవరి-ఏప్రిల్ ల నాటి పరిస్థితుల కంటే భిన్నంగా ఉన్నాయి. [7]

1948 ఏప్రిల్ 30 వరకు కమిషనులో పాకిస్తాన్ తన ప్రతినిధిని ప్రతిపాదించక పోవడం కూడా ఆలస్యానికి ఒక కారణమని తరువాతి కాలంలో గమనించారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. Ankit, Britain and Kashmir (2013, p. 278) quotes Noel-Baker stating "The fact that Van Langenhove is largely guided by us is not known... and we take every precaution to ensure that it is not known."

మూలాలు

[మార్చు]
  1. Dasgupta, War and Diplomacy in Kashmir 2014, p. 111.
  2. Ankit, Britain and Kashmir 2013, p. 278.
  3. Dasgupta, War and Diplomacy in Kashmir 2014, pp. 115–116.
  4. Ankit, Britain and Kashmir 2013, p. 277.
  5. Schaffer, Limits of Influence 2009, pp. 15–16.
  6. Dasgupta, War and Diplomacy in Kashmir 2014, pp. 117–118.
  7. Korbel, Danger in Kashmir 1966, p. 117.

గ్రంథ సూచీ

[మార్చు]
  • Ankit, Rakesh (2013), "Britain and Kashmir, 1948: 'The Arena of the UN'", Diplomacy & Statecraft, 24 (2) : 273–290, doi:10.1080/09592296.2013.789771
  • Dasgupta, C. (2014) [first published 2002], War and Diplomacy in Kashmir, 1947-48, SAGE Publications, ISBN 978-81-321-1795-7
  • Korbel, Josef (1966) [first published 1954], Danger in Kashmir (second ed.), Princeton University Press
  • Schaffer, Howard B. (2009), The Limits of Influence: America's Role in Kashmir, Brookings Institution Press, ISBN 978-0-8157-0370-9

బయటి లింకులు

[మార్చు]