ఐదేయు హాండిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐదేయు హాండిక్
జోయ్మోతి (1935) సినిమాలో ఐదేయు హాండిక్
జననం1920
పానీ దిహింగియా, గోలాఘాట్‌, అస్సాం
మరణం2002, డిసెంబరు 17
కమర్గావ్, గోలాఘాట్‌

ఐదేయు నిలంబర్ హాండిక్ (1920 - 2002, డిసెంబరు 17)[1] అస్సామీ సినిమారంగంలో తొలి సినిమా నటి. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాలా దర్శకత్వం వహించిన జోయ్మోతి సినిమాలో కథానాయికగా నటించింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఐదేయు, నిలంబర్ హాండిక్ - మాలాఖి హాండిక్ దంపతులకు 1920లో అస్సాం రాష్ట్రం, గోలాఘాట్‌లోని పానీ దిహింగియాలో జన్మించింది.[3]

గుర్తింపు

[మార్చు]

1935లో వచ్చిన జోయ్మోతి అనే అస్సామీ సినిమాలో కథానాయికగా నటించిన ఐదేయు, అస్సామీ సినిమారంగంలో తొలి నటిగా గుర్తింపు పొందింది. అ తరువాత గంగా సిలోని సినిమాలో ఒక చిన్న పాత్ర, తన జీవితంపై తీసిన సినిమాలో అతిథి పాత్రలో మినహా ఐదేయు ఏ సినిమాలోనూ నటించలేదు.[3] 1985లో, అస్సాం సినిమా స్వర్ణోత్సవాలను జరుపుకున్నప్పుడు, ఐదేయును ప్రత్యేకంగా గౌరవించారు. ఈస్ట్ ఇండియన్ మోషన్ పిక్చర్ అసోసియేషన్ ఐదేయుకి వీల్ చైర్ బహుమతిగా ఇచ్చింది. అస్సాం ప్రభుత్వం చాలాకాలం తర్వాత ఆమెకు నెలకు రూ.1,500 పెన్షన్‌గా ఇచ్చి, పద్మశ్రీ పురస్కారానికి కూడా సిఫారసు చేసింది. కానీ ఐదేయు ఒకే ఒక్క సినిమా నటించినందున అవార్డు రాలేదు.[4] 1991లో తన స్వగ్రామంలోని బాలికల పాఠశాలకు ఐదేయు పేరు పెట్టారు.[1]

ఐదేయు (బిహైండ్ ది స్క్రీన్)

[మార్చు]

ఐదేయు హాండిక్ విషాద జీవితంపై 2007లో అరూప్ మన్నా దర్శకత్వంలో ఐదేయు (బిహైండ్ ది స్క్రీన్) అనే అస్సామీ సినిమా రూపొందించబడి, 2007 ఫిబ్రవరిలో ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తొలిసారిగా ప్రదర్శించబడింది.[5]

మరణం

[మార్చు]

ఐదేయు 2002, డిసెంబరు 17న గోలాఘాట్‌లోని కమర్గావ్ లో మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Haresh Pandya (15 February 2003). "Obituary: Aideu Handique | Film". London: The Guardian. Retrieved 2022-02-14.
  2. Tamuli, Babul (2002)""The making of Joymoti"". Archived from the original on 27 October 2009. Retrieved 2022-02-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), The Assam Tribune.
  3. 3.0 3.1 "The Telegraph - North East". www.telegraphindia.com. Retrieved 2022-02-14.
  4. "Recognition too late". The Hindu (in ఇంగ్లీష్). 25 March 2007. ISSN 0971-751X. Retrieved 2022-02-14.
  5. Santanava Hazarika. "Reel Reality". Archived from the original on 4 March 2016. Retrieved 2022-02-14.

బయటి లింకులు

[మార్చు]