ఐపాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐపాడ్ (ఐదవ తరము), ఐపాడ్ నేనో (రెండవ తరము), ఐపాడ్ షఫుల్ (రెండవ తరము)

ఐపాడ్ (iPod) ఆపిల్ ఇన్‌కార్పొరేటెడ్ డిజైన్ చేసి మార్కెట్ చేస్తున్న పోర్టబుల్ మీడియా ప్లేయర్‌ల బ్రాండు. ఆపిల్ 2001 లో ఐపాడ్ బ్రాండు మీడియా ప్లేయర్లను విడుదల చేసింది. ఆక్టోబరు 2005 నాటికి, ఈ ప్రాడక్టుల వరుసలో వీడియో చూపించగలిగే ఐపాడ్ (5వ తరము), చిన్న ఐపాడ్ నేనో,డిస్ప్లే లేని ఐపాడ్ షఫుల్. ఫుల్ సైజు ఐపాడ్ లో మల్టీమీడియా (ఆడియో,వీడియో,టెక్స్ట్) ఒక ఇంటర్నల్ హార్డ్ డ్రైవు మీద ఉండగా, ఐపాడ్ నేనో, ఐపాడ్ షఫుల్ ఫ్లాష్ మెమొరీని వాడును. చాలా డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్స్ లాగే ఐపాడ్ లు కూడా ఎక్సటర్నల్ మాస్ స్టోరేజ్ డివైస్ (యు ఎస్ బి మాస్ డివైస్ ) లుగా ఉపయోగ పడతాయి. జనవరి 2007 లో ఆపిల్ ఐపాడ్, సెల్ ఫోన ల మిశ్రమమైన ఐఫోన్ ను విడుదల చేసింది.

ఆపిల్ ఐట్యూన్స్ సాఫ్ట్ వేర్ మ్యూజిక్ ను (ఐపాడ్) డివైస్ ల లోకి బదిలీ చెయ్యడానికి ఉపయోగ పడును. ఐట్యూన్స్ ఒక యూజర్ (user) దగ్గర ఉన్న మొత్తము మ్యూజిక్ లైబ్రరీని (అన్ని పాటల సముదాయము) యూజర్ కంప్యూటర్ లో ఉంచుతుంది. ఫొటో లు,వీడియో లు, ఆటలు (వీడియో గేమ్స్), కేలండర్లను కూడా భద్రపరుస్తుంది.

చరిత్ర మరియు డిజైన్ ఐపాడ్ లైన్ ఆపిల్ యొక్క "డిజిటల్ కేంద్రం" వర్గం నుండి వచ్చింది, కంపెనీ వ్యక్తిగత డిజిటల్ పరికరాల పెరుగుతున్న మార్కెట్ కోసం సాఫ్ట్వేర్ రూపొందించడం ప్రారంభించారు. డిజిటల్ కెమెరాలు,camcorders మరియు నిర్వాహక పరికరాలు బాగా అమ్మబడుతున్నా వాడుటకు కష్టంగా వుండేవి. ఆపిల్ కంపెనీ కొత్త దానిని స్వంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుంది. CEO స్టీవ్ జాబ్స్ ఆదేశంమెరకు ఆపిల్ యొక్క హార్డ్వేర్ ఇంజనీరింగ్ చీఫ్ జోన్ రూబిన్స్టెన్ నాయకత్వంలో హార్డ్వేర్ ఇంజనీర్లు టోనీ ఫాడెల్ మరియుమైకేల్ ధ్యూహీ, మరియు డిజైన్ ఇంజనీర్ జోనాథన్ ఐవ్ తయారు చేశారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఐపాడ్&oldid=1977194" నుండి వెలికితీశారు