ఐరోపా
| యూరప్ / ఐరోపా | |
| విస్తీర్ణం | 10,180,000 కి.మీ.² (3,930,000 చ.మై.) |
|---|---|
| జనాభా | 731,000,000 |
| జనసాంద్రత | 70/కి.మీ.² (181/చ.మై.) |
| ca. 50 | |
| ప్రాంతీయత | యూరోపియన్ |
| భాషా కుటుంబాలు | ఇండో-యూరోపియన్ Finno-Ugric Altaic Basque Semitic North Caucasian |
| పెద్ద నగరాలు | ఇస్తాంబుల్, మాస్కో, లండన్, పారిస్, మాడ్రిడ్, బార్సెలోనా, సెయింట్ పీటర్స్ బర్గ్, మిలాన్, బెర్లిన్, రోమ్, ఏథెన్స్, కీవ్, బుచారెస్ట్ |
| టైం జోన్లు | UTC (ఐస్‌ల్యాండ్) నుండి UTC+5 (రష్యా) వరకు |
సాంప్రదాయకంగా ఏడు ఖండాలు అని చెప్పుకొనేవాటిలో ఐరోపా ఒకటి. యురేషియా భూఖండము యొక్క పశ్చిమాత్య ద్వీపకల్పము. ఐరోపాకు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రము, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రము, దక్షిణాన మధ్యధరా సముద్రము, ఆగ్నేయాన కాకసస్ పర్వతాలు, నల్ల సముద్రం మరియు నల్లసముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్న కాలువలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పు దిశన ఐరోపా మరియు ఆసియా ఖండాలకు సరిహద్దులుగా ఉరల్ పర్వతాలు, ఉరల్ నది మరియు కాస్పియన్ సముద్రం ఉన్నాయి.[1] విస్తీర్ణాన్ని బట్టి ఐరోపా, 10,180,000 చదరపు కిలోమీటర్లు (3,930,000 చ.మై) వైశాల్యముతో ప్రపంచములో రెండవ చిన్న ఖండము. ఇది 2% భూమి వైశాల్యము కలిగి ఉంది. ఐరోపా ఖండంలో దాదాపు 50 దాకా సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. కానీ వీటి కచ్చితమైన సంఖ్య ఐరోపా యొక్క సరిహద్దుల నిర్ణయాన్ని బట్టి, పూర్తిస్థాయి గుర్తింపులేని ప్రదేశాలను పరిగణనలోకి తీసుకోవటం, తీసుకోకపోవటం వంటి విషయాలపై ఆధారపడుతుంది. ఐరోపా దేశాలలో జనాభా వారిగా మరియు వైశాల్యము వారీగా రష్యా అన్నింటికంటే పెద్దదేశం కాగా వాటికన్ అన్నింటికంటే చిన్నదేశం. 71 కోట్ల జనాభాతో ఆసియా, ఆఫ్రికాల తర్వాత ఐరోపా అత్యంత జనాభా కలిగిన ఖండము. ప్రపంచము యొక్క 11% ప్రజలు ఐరోపాలో నివసిస్తున్నారు. అయితే, ఖండము అంటే ఒక భౌగోళిక ఉనికితో పాటు, సాంస్కృతిక మరియు రాజకీయ ఉనికిని కూడా సూచిస్తుంది కాబట్టి ఐరోపా యొక్క సరిహద్దులు మరియు జనాభా గురించి ఏకాభిప్రాయము లేదు.
రాజకీయ భౌగోళికం[మార్చు]
అనేక సిద్ధాంతాలు మరియు విపులీకరణల తరువాత యూరప్ ఖండాన్ని భౌగోళిక మరియు రాజకీయ ప్రాంతాలుగా వర్గీకరించారు. వీటిలో 50 దేశాలు గలవు. యూరప్ సమాఖ్యలో 27 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. క్రింది పట్టిక ఐక్యరాజ్యసమితి ఉపయోగిస్తున్నది.[2]
| ప్రాంతము లేదా ఉప-ప్రాంతము పేరు మరియు పతాకము |
విస్తీర్ణం (కి.మీ²) |
జనాభా (జూలై 1 2002 నాటి అంచనా.) |
జనసాంద్రత (ప్రతి చ.కి.మీ.) |
రాజధాని |
|---|---|---|---|---|
| 1,552 | 26,008 | 16.8 | మారీహామ్న్ | |
| 28,748 | 3,600,523 | 125.2 | తిరానా | |
| 468 | 68,403 | 146.2 | అండోర్రా లా వెల్లా | |
| 83,858 | 8,169,929 | 97.4 | వియన్నా | |
| 29,800 | 3,229,900 | 101 | యెరావాన్ | |
| 86,600 | 8,621,000 | 97 | బాకు | |
| 207,600 | 10,335,382 | 49.8 | మిన్స్క్ | |
| 30,510 | 10,274,595 | 336.8 | బస్సెల్స్ | |
| 51,129 | 4,448,500 | 77.5 | సరజేవో | |
| 110,910 | 7,621,337 | 68.7 | సోఫియా | |
| 56,542 | 4,437,460 | 77.7 | జగ్రెబ్ | |
| 9,251 | 788,457 | 85 | నికోసియా | |
| 78,866 | 10,256,760 | 130.1 | ప్రేగ్ | |
| 43,094 | 5,368,854 | 124.6 | కోపెన్ హాగన్ | |
| 45,226 | 1,415,681 | 31.3 | టల్లిన్ | |
| 1,399 | 46,011 | 32.9 | తోర్షావన్ | |
| 336,593 | 5,157,537 | 15.3 | హెల్సెంకి | |
| 547,030 | 59,765,983 | 109.3 | పారిస్ | |
| 69,700 | 4,661,473 | 64 | తిబ్లిసి | |
| 357,021 | 83,251,851 | 233.2 | బెర్లిన్ | |
| 5.9 | 27,714 | 4,697.3 | జిబ్రాల్టర్ | |
| 131,940 | 10,645,343 | 80.7 | ఏథెన్సు | |
| 78 | 64,587 | 828.0 | సెయింట్ పీటర్ పోర్ట్ | |
| 93,030 | 10,075,034 | 108.3 | బుడాపెస్ట్ | |
| 103,000 | 307,261 | 2.7 | రేక్‌జవిక్ | |
| 70,280 | 4,234,925 | 60.3 | డబ్లిన్ | |
| 572 | 73,873 | 129.1 | డగ్లస్ | |
| 301,230 | 58,751,711 | 191.6 | రోమ్ | |
| 116 | 89,775 | 773.9 | సెయింట్ హెలియర్ | |
| 2,724,900 | 15,217,711 | 5.6 | ఆస్తానా | |
| 10,887 | 2,126,708 | 220 | ప్రిస్టీనా | |
| 64,589 | 2,366,515 | 36.6 | రిగా | |
| 160 | 32,842 | 205.3 | వడూజ్ | |
| 65,200 | 3,601,138 | 55.2 | విల్నియస్ | |
| 2,586 | 448,569 | 173.5 | లక్సెంబర్గ్ (నగరం) | |
| 25,333 | 2,054,800 | 81.1 | స్కోప్జే | |
| 316 | 397,499 | 1,257.9 | వల్లెట్టా | |
| 33,843 | 4,434,547 | 131.0 | చిస్‌నావ్ | |
| 1.95 | 31,987 | 16,403.6 | మొనాకో | |
| 13,812 | 616,258 | 44.6 | పొడ్గోరికా | |
| 41,526 | 16,318,199 | 393.0 | ఆమ్‌స్టర్‌డామ్ | |
| 324,220 | 4,525,116 | 14.0 | ఓస్లో | |
| 312,685 | 38,625,478 | 123.5 | వార్సా | |
| 91,568 | 10,409,995 | 110.1 | లిస్బన్ | |
| 238,391 | 21,698,181 | 91.0 | బుచారెస్ట్ | |
| 17,075,400 | 142,200,000 | 26.8 | మాస్కో | |
| 61 | 27,730 | 454.6 | సాన్ మెరీనో | |
| 88,361 | 9,663,742 | 109.4 | బెల్‌గ్రేడ్ | |
| 48,845 | 5,422,366 | 111.0 | బ్రాటిస్లావా | |
| 20,273 | 1,932,917 | 95.3 | జుబ్లజానా | |
| 504,851 | 45,061,274 | 89.3 | మాడ్రిడ్ | |
మయేన్ దీవులు (నార్వే) |
62,049 | 2,868 | 0.046 | లాంగియర్‌బెన్ |
| 449,964 | 9,090,113 | 19.7 | స్టాక్‌హోమ్ | |
| 41,290 | 7,507,000 | 176.8 | బెర్న్ | |
| 783,562 | 70,586,256 | 93 | అంకారా | |
| 603,700 | 48,396,470 | 80.2 | కీవ్ | |
| 244,820 | 61,100,835 | 244.2 | లండన్ | |
| 0.44 | 900 | 2,045.5 | వాటికన్ నగరం | |
| మొత్తం | 10,180,000 | 731,000,000 | 70 |
మూలాలు[మార్చు]
- ↑ Microsoft® Encarta® Online Encyclopedia 2007. ""Europe"". Retrieved 2007-12-27.
- ↑ "United Nations Statistics Division — Countries of Europe". Retrieved 2008-06-10.
| ప్రపంచం | |||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
| ||||||||||||||||||||||||
| ప్రపంచ ఖండాలు కూడా చూడండి | |||||||||||||||||||||||||