ఐసిసి పురుషుల వన్డే జట్టు ర్యాంకింగులు
| నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
|---|---|
| ప్రారంభం | 2002 |
| జట్ల సంఖ్య | 20 |
| ప్రస్తుత అగ్ర ర్యాంకు | |
| మొత్తమ్మీద అత్యధిక కాలం మొదటి ర్యాంకులో ఉన్నది | |
| ఏకబిగిన సుదీర్ఘ కాలం మొదటి ర్యాంకులో ఉన్నది | |
| అత్యధిక రేటింగు | |
| చివరిసారి తాజాకరించినది: 2025 ఆగస్టు 22. | |
ఐసిసి పురుషుల వన్డే జట్టు రేటింగులు (గతంలో ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్ అని పిలిచేవారు) అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఇచ్చే అంతర్జాతీయ వన్డే ఇంటర్నేషనల్ (వన్డే) క్రికెట్ ర్యాంకింగుల వ్యవస్థ. ప్రతి వన్డే మ్యాచ్ తర్వాత, పాల్గొన్న రెండు జట్లకు ఒక గణిత సూత్రం ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. జట్టు సాధించిన మొత్తం పాయింట్లను వారు ఆడిన మొత్తం మ్యాచ్‌ల సంఖ్యతో భాగించి రేటింగు ఇస్తారు. అన్ని జట్లను రేటింగు క్రమంలో ఒక పట్టికలో ర్యాంకు ప్రకారం చేరుస్తారు.[1]
క్రికెట్ బ్యాటింగ్ సగటులతో పోలిస్తే, వన్‌డే మ్యాచ్ గెలిచినందుకు వచ్చే పాయింట్లు ఎల్లప్పుడూ జట్టు రేటింగు కంటే ఎక్కువగా ఉంటాయి. ఇది రేటింగును పెంచుతుంది. మ్యాచ్ ఓడిపోయినపుడు వచ్చే పాయింట్లు, రేటింగు కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటాయి. ఇది రేటింగును తగ్గిస్తుంది. ఎక్కువ రేటింగు తక్కువ రేటింగు ఉన్న జట్ల మధ్య జరిగే మ్యాచ్ డ్రా అయినపుడు, ఎక్కువ రేటింగు ఉన్న జట్టుకు నష్టం కలిగి, తక్కువ రేటింగు ఉన్న జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. ఓ "సగటు" జట్టు బలమైన, బలహీనమైన జట్లతో ఆడుతూ, సమానంగా గెలవడం, ఓడిపోవడం జరిగితే దాని రేటింగు 100 ఉండాలి.[1]
2025 ఆగస్టు 22 నాటికి, 36 వెయిటెడ్ మ్యాచ్‌ల నుండి 124 రేటింగు సాధించి భారత్ ఐసిసి పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, అత్యల్ప రేటింగు ఉన్న జట్టు యుఎఇ, 32 మ్యాచ్‌ల నుండి 8 రేటింగు పొందింది.
2013 వరకు, వార్షిక కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 1 నాటికి మొదటి ర్యాంకు పొందిన జట్టు ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్ షీల్డును, ప్రైజ్‌మనీనీ అందుకునేది.[2] 2019 లో క్రికెట్ ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత కల్పించడానికి ఈ రేటింగులను ఉపయోగించారు. 2027 లో కూడా వీటినే ఉపయోగించారు.[3]
ప్రస్తుత రేటింగులు
[మార్చు]| జట్టు | మ్యాచిలు | పాయింట్లు | రేటింగు |
|---|---|---|---|
| 45 | 5,377 | 119 | |
| 47 | 5,370 | 114 | |
| 38 | 4,134 | 109 | |
| 44 | 4,475 | 102 | |
| 41 | 4,022 | 98 | |
| 47 | 4,600 | 98 | |
| 28 | 2,657 | 95 | |
| 43 | 3,782 | 88 | |
| 41 | 3,243 | 79 | |
| 41 | 3,173 | 77 | |
| 24 | 1,291 | 54 | |
| 18 | 938 | 52 | |
| 34 | 1,509 | 44 | |
| 38 | 1,668 | 44 | |
| 36 | 1,425 | 40 | |
| 28 | 1,023 | 37 | |
| 36 | 959 | 27 | |
| 35 | 781 | 22 | |
| 23 | 357 | 16 | |
| 36 | 396 | 11 | |
|
మూలం: ఐసిసి పురుషుల వన్‌డే ర్యాంగింగులు, 2026 ఏప్రిల్ 10 | |||
అసోసియేట్ రేటింగులు
[మార్చు]2005 చివరిలో, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి), ఐసిసి పురుషుల వన్డే జట్టు రేటింగులలోని టెస్ట్ దేశాల రేటింగులకు అనుబంధంగా, అగ్రశ్రేణి టెస్ట్-యేతర దేశాలకు 11 నుండి 30 వరకు ర్యాంకులను ఇచ్చింది. దేశాలకు ర్యాంకులను ఇవ్వడానికి ఐసిసి, 2005 ఐసిసి ట్రోఫీ, WCQS డివిజన్ 2 పోటీ (అంటే 2007 క్రికెట్ ప్రపంచ కప్‌కు ప్రాథమిక అర్హత యంత్రాంగాలు) ఫలితాలను ఉపయోగించింది.
గ్లోబల్ వరల్డ్ క్రికెట్ లీగ్‌లో జట్ల ప్రారంభ సీడింగును నిర్ణయించడానికి ఈ రేటింగులను ఉపయోగించారు. 11–16 ర్యాంకులు పొందిన జట్లను డివిజన్ 1లో; 17–20 ర్యాంకులు పొందిన జట్లను డివిజన్ 2లో; 21–24 ర్యాంకులు పొందిన జట్లను డివిజన్ 3లో ఉంచారు; మిగిలిన జట్లను వారి వారి ప్రాంతీయ క్వాలిఫైయర్‌ల పై డివిజన్‌లలో ఉంచారు.
2009 ఏప్రిల్ 19 కి ముందు, అగ్ర ఆరు అసోసియేట్ దేశాలు వన్డే హోదా పొందాయి. కెన్యా, ఐర్లాండ్ రెండూ ప్రధాన రేటింగు పట్టికలో చేరేందుకు అర్హత సాధించాయి. కెన్యా దాని ప్రస్తుత హోదా నుండి, ఐర్లాండ్ 2007 ప్రపంచ కప్‌లో సాధించిన రెండు విజయాల ప్రకారం అర్హత సాధించాయి. 2010 జూలై లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన తరువాత, నెదర్లాండ్స్ ప్రధాన పట్టికలో చేరింది. ఆఫ్ఘనిస్తాన్, కెనడా, స్కాట్లాండ్ ద్వితీయ పట్టికలోనే ఉండిపోయాయి. 2009 మే లో, ఐసిసి అన్ని అసోసియేట్ సభ్యుల కోసం ర్యాంకింగ్స్ పట్టికను జోడించింది. ఇందులో ప్రపంచ, ప్రాంతీయ స్థానాలు రెండూ ఉన్నాయి. 2018 జూన్ లో, వన్‌డే హోదా ఉన్న నాలుగు అసోసియేట్ దేశాలను ప్రధాన ర్యాంకింగ్ జాబితాకు తరలించారు.[4]
చారిత్రక రేటింగులు
[మార్చు]2002 అక్టోబరు నుండి ఐసీసీ, ప్రతి నెలా చివరి నాటికి రేటింగులను వెలువరిస్తోంది. అప్పటి నుండి నెలల వారీగా వరుసగా అత్యధిక రేటింగు పొందిన జట్లను కింది పట్టికలో చూడవచ్చు.
| జట్టు | ప్రారంభం | ముగింపు | మొత్తం నెలలు | సంచిత నెలలు | అత్యధిక రేటింగు |
|---|---|---|---|---|---|
| 2002 అక్టోబరు | 2007 జనవరి | 52 | 52 | 140 | |
| 2007 ఫిబ్రవరి | 2007 ఫిబ్రవరి | 1 | 1 | 128 | |
| 2007 మార్చి | 2008 ఫిబ్రవరి | 12 | 64 | 130 | |
| 2008 మార్చి | 2008 మే | 3 | 4 | 127 | |
| 2008 జూన్ | 2008 డిసెంబరు | 7 | 71 | 131 | |
| 2009 జనవరి | 2009 ఆగస్టు | 8 | 12 | 127 | |
| 2009 సెప్టెంబరు | 2012 ఆగస్టు | 35 | 106 | 134 | |
| 2012 ఆగస్టు | 2013 జనవరి | 5 | 5 | 121 | |
| 2013 జనవరి | 2014 జనవరి | 12 | 12 | 124 | |
| 2014 జనవరి | 2014 సెప్టెంబరు | 8 | 114 | 117 | |
| 2014 సెప్టెంబరు | 2014 అక్టోబరు | 1 | 13 | 113 | |
| 2014 అక్టోబరు | 2014 అక్టోబరు | 1 | 115 | 114 | |
| 2014 అక్టోబరు[1] | 2014 నవంబరు | ½ | 13 | 115 | |
| 2014 నవంబరు | 2014 నవంబరు | ½ | 14 | 117 | |
| 2014 నవంబరు | 2017 ఫిబ్రవరి | 26 | 141 | 129 | |
| 2017 ఫిబ్రవరి | 2017 ఫిబ్రవరి | 1 | 14 | 119 | |
| 2017 మార్చి | 2017 మార్చి | 4 days | 141 | 118 | |
| 2017 మార్చి | 2017 సెప్టెంబరు | 6 | 20 | 123 | |
| 2017 సెప్టెంబరు | 2017 సెప్టెంబరు | 4 days | 14 | 120 | |
| 2017 సెప్టెంబరు | 2017 సెప్టెంబరు | 4 days | 20 | 119 | |
| 2017 అక్టోబరు | 2017 అక్టోబరు | 17 days | 15 | 120 | |
| 2017 అక్టోబరు | 2018 ఫిబ్రవరి | 4 | 24 | 120 | |
| 2018 ఫిబ్రవరి | 2018 మే | 3 | 18 | 123 | |
| 2018 మే | 2019 జూన్ | 14 | 19 | 127 | |
| 2019 జూన్ | 2019 జూన్ | 5 days | 18 | 123 | |
| 2019 జూన్ | 2021 మే | 22 | 41 | 135 | |
| 2021 మే | 2022 సెప్టెంబరు | 16 | 16 | 121 | |
| 2022 సెప్టెంబరు[2] | 2022 నవంబరు[3] | 2 | 43 | 119 | |
| 2022 నవంబరు | 2023 జనవరి | 2 | 18 | 116 | |
| 2023 జనవరి | 2023 జనవరి | 3 days | 43 | 113 | |
| 2023 జనవరి | 2023 మార్చి | 2 | 20 | 115 | |
| 2023 మార్చి | 2023 మే | 2 | 143 | 115 | |
| 2023 మే | 2023 మే | 2 days | 113 | ||
| 2023 మే | 2023 ఆగస్టు | 3 | 146 | 118 | |
| 2023 ఆగస్టు | 2023 సెప్టెంబరు | 13 days | 120 | ||
| 2023 సెప్టెంబరు | 2023 సెప్టెంబరు | 3 రోజులు | 146 | 121 | |
| 2023 సెప్టెంబరు | 2023 సెప్టెంబరు | 6 రోజులు | 1 | 118 | |
| 2023 సెప్టెంబరు | 2023 సెప్టెంబరు | 3 రోజులు | 146 | 115 | |
| 2023 సెప్టెంబరు | 2023 సెప్టెంబరు | 5 రోజులు | 1 | 115 | |
| 2023 సెప్టెంబరు | ప్రస్తుతం | 31 | 51 | 124 |
2011లో, ఐసీసీ 1981 నుండి ప్రతి నెలాఖరుకు రేటింగ్‌లను అందిస్తూ, 1981 నుండి ఫలితాలకు తన రేటింగ్ విధానాన్ని వర్తింపజేసింది. అత్యధిక నెలలతో (200 నెలలు) ఆస్ట్రేలియా, మొదటి స్థానంలో నిలిచి, వన్డే క్రికెట్‌లో ఆధిపత్యం వహించింది. ఈ పట్టిక 1981 నుండి మాత్రమే ప్రారంభమవుతుంది, ఎందుకంటే ఆ తేదీకి ముందు, మ్యాచ్‌లు అరుదుగా జరగడం, తొలినాళ్లలో పోటీపడే జట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల తగినంత డేటా అందుబాటులో లేదు.
1981 జనవరి నుండి 2002 సెప్టెంబరు వరకు, పూర్తి నెలల కాల వ్యవధులలో వరుసగా అత్యధిక రేటింగు ఉన్న జట్లు:
| టీం | ప్రారంభించండి | ముగింపు | మొత్తం నెలలు | సంచిత నెలలు |
|---|---|---|---|---|
| 1981 జనవరి | 1981 ఫిబ్రవరి | 2 | 2 | |
| 1981 జూన్ | 1981 నవంబరు | 6 | 6 | |
| 1981 డిసెంబరు | 1981 డిసెంబరు | 1 | 3 | |
| 1982 జనవరి | 1987 మే | 65 | 71 | |
| 1987 ఆగస్టు | 1988 మార్చి | 8 | 11 | |
| 1988 ఏప్రిల్ | 1988 మే | 2 | 73 | |
| 1988 ఆగస్టు | 1989 మే | 10 | 21 | |
| 1989 ఆగస్టు | 1989 డిసెంబరు | 5 | 78 | |
| 1990 జనవరి | 1990 మార్చి | 3 | 3 | |
| 1990 ఏప్రిల్ | 1990 ఏప్రిల్ | 1 | 79 | |
| 1990 మే | 1990 మే | 1 | 4 | |
| 1990 జూలై | 1990 జూలై | 1 | 80 | |
| 1990 ఆగస్టు | 1990 నవంబరు | 4 | 8 | |
| 1990 డిసెంబరు | 1991 జనవరి | 2 | 2 | |
| 1991 ఫిబ్రవరి | 1991 మే | 4 | 12 | |
| 1991 ఆగస్టు | 1991 ఆగస్టు | 1 | 3 | |
| 1991 అక్టోబరు | 1992 మే | 8 | 20 | |
| 1992 ఆగస్టు | 1993 మార్చి | 8 | 29 | |
| 1993 ఏప్రిల్ | 1993 ఏప్రిల్ | 1 | 81 | |
| 1993 మే | 1993 జూలై | 3 | 23 | |
| 1993 ఆగస్టు | 1994 నవంబరు | 16 | 97 | |
| 1994 డిసెంబరు | 1995 మార్చి | 4 | 4 | |
| 1995 ఏప్రిల్ | 1995 మే | 2 | 99 | |
| 1995 ఆగస్టు | 1995 అక్టోబరు | 3 | 7 | |
| 1995 నవంబరు | 1995 డిసెంబరు | 2 | 31 | |
| 1996 జనవరి | 1996 ఏప్రిల్ | 4 | 27 | |
| 1996 మే | 2000 ఫిబ్రవరి | 46 | 46 | |
| 2000 మార్చి | 2002 జనవరి | 23 | 50 | |
| 2002 ఫిబ్రవరి | 2002 ఫిబ్రవరి | 1 | 47 | |
| 2002 మార్చి | 2002 సెప్టెంబరు | 7 | 57 | |
| సూచనః చారిత్రక ర్యాంకింగ్స్ | ||||
1981 నుండి ఇప్పటి వరకు పూర్తి నెలల వారీగా అత్యధిక రేటింగు పొందిన జట్లు:
| జట్టు | మొత్తం నెలలు | అత్యధిక రేటింగు |
|---|---|---|
| 204 | 140 | |
| 99 | 141 | |
| 71 | 134 | |
| 66 | 135 | |
| 58 | 127 | |
| 18 | 121 | |
| 4 | 131 | |
| సూచన: 2025 మార్చి 9 వరకు నవీకరించబడిన చారిత్రక రేటింగులు | ||
- వరుస నెలలు
| # | జట్టు | సంవత్సరాలు |
|---|---|---|
| 65 | 1982 జనవరి-1987 మే | |
| 59 | 2002 మార్చి-2007 జనవరి | |
| 46 | 1996 మే-2000 ఫిబ్రవరి | |
| 35 | 2009 సెప్టెంబరు-2012 ఆగస్టు | |
| 31* | 2023 సెప్టెంబరు-ప్రస్తుతం | |
| 26 | 2014 నవంబరు-2017 ఫిబ్రవరి | |
| 23 | 2000 మార్చి-2002 జనవరి | |
| 22 | 2019 జూన్-2021 మే | |
| 16 | 1993 ఆగస్టు-1994 నవంబరు | |
| 16 | 2021 మే-2022 సెప్టెంబరు | |
ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్ (2002–2013)
[మార్చు]
ర్యాంకింగు వ్యవస్థను గతంలో ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్ అని పిలిచేవారు. 2013 వరకు, ప్రతి ఏప్రిల్ ప్రారంభంలో పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుకు ఐసిసి వన్డే ఛాంపియన్‌షిప్ షీల్డ్‌ను ప్రదానం చేసేవారు. 2 యూరోల నాణెం లాగా, ఈ షీల్డులో బంగారు రంగు లోహంతో చేసిన లోపలి వలయం, దాని చుట్టూ వెండి రంగు లోహపు వలయం ఉంటాయి. దీనిని మొదటిసారిగా 2002 డిసెంబరు లో ప్రదానం చేశారు. అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ అవార్డును అందుకున్నాడు.[5]
దీనిని చివరిసారిగా 2013 జూలై లో ప్రదానం చేశారు, అప్పుడు భారత కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ అవార్డును అందుకున్నాడు.[6]
| సంవత్సరం | దేశం |
|---|---|
| 2002 | |
| 2003 | |
| 2004 | |
| 2005 | |
| 2006 | |
| 2007 | |
| 2008 | |
| 2009 | |
| 2010 | |
| 2011 | |
| 2012 | |
| 2013 |
పాయింట్ల లెక్కింపు
[మార్చు]కాల వ్యవధి
[మార్చు]ఒక మ్యాచ్ నుండి సాధించిన పాయింట్ల లెక్కింపు
[మార్చు]రెండు జట్లు మ్యాచ్ ఆడిన ప్రతిసారీ, ఆ ఆటకు ముందు ఆ జట్ల రేటింగుల ఆధారంగా రేటింగుల పట్టికను క్రింది విధంగా నవీకరిస్తారు. మ్యాచ్ తర్వాత జట్ల కొత్త రేటింగులను నిర్ణయించడానికి, ముందుగా ఆ మ్యాచ్ నుండి పొందిన పాయింట్లను లెక్కించాలి:
మ్యాచ్‌కు ముందు రెండు జట్ల రేటింగుల మధ్య వ్యత్యాసం 40 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే, అప్పుడు:
| మ్యాచ్ ఫలితం | సంపాదించిన పాయింట్లు |
|---|---|
| గెలిస్తే | ప్రత్యర్థి రేటింగు + 50 |
| టై | ప్రత్యర్థి రేటింగు |
| ఓడిపోతే | ప్రత్యర్థి రేటింగు − 50 |
మ్యాచ్‌కు ముందు రెండు జట్ల రేటింగుల మధ్య వ్యత్యాసం కనీసం 40 పాయింట్లు ఉంటే, అప్పుడు:
| మ్యాచ్ ఫలితం | సంపాదించిన పాయింట్లు |
|---|---|
| బలమైన జట్టు గెలిస్తే | స్వీయ రేటింగు + 10 |
| బలహీనమైన జట్టు ఓడిపోతే | స్వీయ రేటింగు − 10 |
| బలమైన జట్టు టై చేస్తే | స్వీయ రేటింగు − 40 |
| బలహీనమైన జట్టు టై చేస్తే | స్వీయ రేటింగు + 40 |
| బలమైన జట్టు ఓడిపోతే | స్వీయ రేటింగు − 90 |
| బలహీనమైన జట్టు గెలిస్తే | స్వీయ రేటింగు + 90 |
- జట్టు రేటింగు అనేది, ఆ జట్టు సాధించిన మొత్తం పాయింట్లను అది ఆడిన మొత్తం మ్యాచ్‌ల సంఖ్యతో భాగించగా వచ్చే సంఖ్య. (ఈ లెక్కలలో సిరీస్‌లకు ప్రాముఖ్యత లేదు).
- మ్యాచ్‌లో సాధించిన పాయింట్లను ఇప్పటికే సాధించిన పాయింట్లకు (పట్టికలో చూపిన విధంగా మునుపటి మ్యాచ్‌లలో) కలపాలి, ఆడిన మ్యాచ్‌ల సంఖ్యకు ఒకటి కలపాలి - కొత్త రేటింగు వస్తుంది. [1]
- జట్లు సంపాదించే పాయింట్లు ప్రత్యర్థి రేటింగులపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ రేటింగు వ్యవస్థను మొదలుపెట్టినపుడు జట్లకు ప్రాథమిక రేటింగులు కేటాయించాల్సి వచ్చింది.
సంవత్సరాంతపు చారిత్రక ర్యాంకింగ్
[మార్చు]2011 లో, ఐసిసి అధికారిక గణాంకవేత్త అయిన డేవిడ్ కెండిక్స్, 1981 నుండి ప్రతి నెలా చివరినాటి రేటింగ్‌లను అందిస్తూ, 1981 నుండి ఫలితాలకు దాని రేటింగులను వర్తింపజేశాడు.[7]
| సంవత్సరం | జట్టు | రేటింగు |
|---|---|---|
| 1981 | 121 | |
| 1982 | 133 | |
| 1983 | 132 | |
| 1984 | 133 | |
| 1985 | 139 | |
| 1986 | 140 | |
| 1987 | 133 | |
| 1988 | 132 | |
| 1989 | 119 | |
| 1990 | 122 | |
| 1991 | 127 | |
| 1992 | 120 | |
| 1993 | 115 | |
| 1994 | 114 | |
| 1995 | 113 |
| సంవత్సరం | జట్టు | రేటింగు |
|---|---|---|
| 1996 | 121 | |
| 1997 | 134 | |
| 1998 | 132 | |
| 1999 | 129 | |
| 2000 | 125 | |
| 2001 | 128 | |
| 2002 | 131 | |
| 2003 | 136 | |
| 2004 | 136 | |
| 2005 | 135 | |
| 2006 | 131 | |
| 2007 | 130 | |
| 2008 | 131 | |
| 2009 | 130 | |
| 2010 | 128 |
| సంవత్సరం | జట్టు | రేటింగు |
|---|---|---|
| 2011 | 130 | |
| 2012 | 121 | |
| 2013 | 120 | |
| 2014 | 117 | |
| 2015 | 127 | |
| 2016 | 120 | |
| 2017 | 120 | |
| 2018 | 126 | |
| 2019 | 125 | |
| 2020 | 123 | |
| 2021 | 121 | |
| 2022 | 116 | |
| 2023 | 121 | |
| 2024 | 118 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఐసిసి పురుషుల టెస్ట్ జట్టు రేటింగులు
- ఐసిసి పురుషుల టి20ఐ జట్టు రేటింగులు
- ప్రపంచ క్రికెట్ లీగ్
- అంతర్జాతీయ క్రికెట్
- ఐసిసి మహిళల వన్డే, టి20ఐ రేటింగులు
- ఐసిసి ప్లేయర్ రేటింగులు
మూలాలు
[మార్చు]- 1 2 3 "Reliance ICC One-Day International Team Rankings -frequently asked questions" (PDF). ESPNcricinfo. ICC. Retrieved 6 January 2015."Reliance ICC One-Day International Team Rankings -frequently asked questions" (PDF). ESPNcricinfo. ICC. Retrieved 6 January 2015.
- ↑ "Dhoni receives Reliance ICC ODI Championship Shield and cheque". International Cricket Council. 3 June 2013. Retrieved 28 November 2020.
- ↑ "Explainer: With 2023 Cricket World Cup qualifying process underway, here's a breakdown of ICC's new-look league structure". Yahoo! Cricket. 16 August 2019. Archived from the original on 7 December 2020. Retrieved 27 November 2020.
- ↑ "Four new teams in the ICC's ODI rankings". ESPNcricinfo. Retrieved 2018-06-02.
- ↑ "Australia increases lead in ODI standings". ESPNcricinfo. 23 March 2003. Retrieved 3 May 2021.
- ↑ "Dhoni receives Reliance ICC ODI Championship Shield and cheque". 3 June 2013. Retrieved 3 May 2021.
- ↑ "ICC Historical Ranking". Archived from the original on 2013-01-20.