ఐసోబారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అంటారు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

ఉదాహరణలు:

  • 19K40 మరియు 20Ca40లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.
  • 6C13 మరియు 7N13లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.