ఇండియన్ సివిల్ సర్వీసెస్
భారత పౌర సేవలు, (సాధారణ పేరు "సివిల్ సర్వీసెస్") భారత పౌరసేవలకు మారుపేరు. ఈ సేవలు భారత ప్రభుత్వ అధికారులు భారతదేశానికి, ప్రజలకు చేసే సేవలు. భారత పరిపాలనా వ్యవస్థలో ఈ "భారత పౌర సేవలు" అతిముఖ్య రంగం.[1]భారతీయ పార్లమెంటరీ ప్రజాతంత్ర వ్యవస్థలో పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించే గురుతర బాధ్యత ఈ రంగానిది. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రతినిధులు మంత్రులుగా వ్యవహరిస్తారు. కానీ అతికొద్ది మంది ప్రజా ప్రతినిధులు పరిపాలన సాగించలేరు. కావున ఈ సేవారంగం దేశంలో గల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే బాధ్యతను నిర్వర్తిస్తారు. మంత్రులు పాలసీలను తయారు చేస్తే, సేవారంగం వాటిని అమలు పరుస్తుంది.[2]
పౌర సేవకులు భారత ప్రభుత్వం లేదా రాష్ట్రాల ఉద్యోగులు, కానీ ప్రభుత్వ ఉద్యోగులందరూ పౌర సేవకులు కాదు. 2010 నాటికి, భారతదేశంలో 6.4 మిలియన్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, కానీ వాటిని నిర్వహించడానికి 50,000 కంటే తక్కువ పౌర సేవకులు ఉన్నారు.[3]
సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IT, C&CE) తో ఎక్కువ మంది సిబ్బంది ఉన్న ఏజెన్సీలు ఉన్నాయి. భారత ప్రభుత్వం 2015 లో ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీస్, [4] [5]2016 లో ఇండియన్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సర్వీస్‌ని ఏర్పాటు చేయడానికి ఆమోదించింది.[6]ఇంకా, భారతీయ రైల్వేలో ఉన్న అన్ని సివిల్ సర్వీసులను నిర్మాణాత్మకంగా భాగంగా ఒకే ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్‌గా విలీనం చేయడానికి భారత కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019 లో ఈ రంగంలో సంస్కరణలు జరిగాయి.
చరిత్ర
[మార్చు]ప్రస్తుతం అమలులో వున్న భారత పౌరసేవా రంగం (ఇండియన్ సివిల్ సర్వీసెస్) క్రితపు బ్రిటీషు ఇండియా భారత ప్రజా సేవ విధానాలపై ఆధారపడి తయారైన విధానం. ఈ విధానం భారత విభజన జరిగిన 1947 తరువాత నుండి అమలులోకి వచ్చింది.
రాజ్యాంగం
[మార్చు]భారత రాజ్యాంగం, భారత పౌరసేవ కొత్త శాఖలను సృష్టించే అధికారాన్ని రాజ్యసభకు ఇచ్చింది. రాజ్యసభలో రెండూ బై మూడొంతుల మెజారిటీతో కొత్త శాఖలను సృష్టించే తంతును పూర్తి చేస్తుంది. ఇవి మూడుగా విభజింపబడ్డాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎప్ఎస్),(ఐఎఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) ఇవి రాజ్యాంగ అధికారాలచే ఏర్పాటు చేయబడ్డాయి.
అధికారాలు, ఉద్దేశ్యాలు, బాధ్యతలు
[మార్చు]భారత సేవల ముఖ్య ఉద్దేశం, భారత పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించుట. భారతదేశం అనేక సేవారంగ సంస్థలచే ఆయా మంత్రిత్వ శాఖల పాలసీల ఆధారంగా పరిపాలనను నిర్వర్తిస్తాయి. [7]
నిర్మాణం
[మార్చు]భారత పౌరసేవలను రెండు వర్గాలుగా విభజించవచ్చును.
1. అఖిల భారత సేవలు - ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) లో మూడు సివిల్ సర్వీసులు ఉన్నాయి. అవి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS). ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రత్యేక లక్షణం ఈ సర్వీసుల సభ్యులను కేంద్రం (యూనియన్ గవర్నమెంట్ ఇన్ ఫెడరల్ పాలిటీ) నియమించింది, కానీ వారి సేవలను వివిధ స్టేట్ క్యాడర్ల కింద ఉంటాయి.కేంద్రం కింద రాష్ట్రం, కేంద్రం రెండింటిలోనూ సేవలందించే బాధ్యత వారికి ఉంది.దేశంలోని సమాఖ్య రాజ్యం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వాల కంటే యూనియన్ ప్రభుత్వాన్ని బలోపేతం చేసే సాధనాల్లో ఇది ఒకటిగా పరిగణిస్తారు. ఈ మూడు సేవల అధికారులు చెల్లింపు, ప్రవర్తన, సెలవు, వివిధ అలవెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ వర్తిస్తాయి.[8]
2. భారత పౌర సేవలు - (గ్రూపు ఎ). విశ్వవిద్యాలయ పట్టభద్రులు, అంతకు పైబడి విద్యగలవారిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి) ఒక ప్రత్యేక పరీక్షా విధానం ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హత పొందినవారిని ఆయా సేవారంగాలలో నియమిస్తారు.
పౌరసేవల దినోత్సవం
[మార్చు]ప్రతి ఏటా ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా జాతీయ పౌర సేవల దినోత్సవం నిర్వహిస్తారు.[9][10] భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్యలక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.[11]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Department of Administrative Reforms and Public Grievances (8 June 2011). "The civil service system". New Delhi: Government of India. Archived from the original on 17 ఫిబ్రవరి 2012. Retrieved 11 October 2011.
- ↑ https://web.archive.org/web/20120217052448/http://arc.gov.in/viet.ppt
- ↑ https://web.archive.org/web/20111030212507/http://darpg.gov.in/darpgwebsite_cms/Document/file/Civil_Services_Survey_2010.pdf
- ↑ Nanda, Prashant K. (2015-10-08). "Government nod to raise new Group-A civil service cadre". mint. Retrieved 2021-10-11.
- ↑ "Govt approves formation of Indian Skill Development Service". The Economic Times. Retrieved 2021-10-11.
- ↑ IANS (2016-12-21). "Cabinet approves enterprise development cadre". Business Standard India. Retrieved 2021-10-11.
- ↑ Cabinet Secretariat, Government of India (8 June 2011). "Complete List of Cabinet Secretaries since 1950". New Delhi: Government of India. Archived from the original on 10 మార్చి 2010. Retrieved 15 September 2011.
- ↑ "Department of Personnel & Training". web.archive.org. 2014-12-13. Archived from the original on 2014-12-13. Retrieved 2021-10-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ సాక్షి, జాతీయం (6 March 2016). "కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్!". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019.
- ↑ "Civil Services Day". New Delhi: Department of Administrative Reforms & Public Grievances, Ministry of Personnel, Public Grievances and Pensions. 8 June 2011. Archived from the original on 27 November 2011. Retrieved 21 April 2019.
- ↑ నమస్తే తెలంగాణ, మహబూబాబాద్ (22 April 2017). "మెరుగైన సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు". Archived from the original on 21 April 2019. Retrieved 21 April 2019.