ఐ.హెచ్.లతీఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్
ఐ.హెచ్.లతీఫ్

ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్


రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి
ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి

మహారాష్ట్ర గవర్నరు

ఫ్రాన్స్‌లో భారత రాయబారి

వ్యక్తిగత వివరాలు

పూర్వ విద్యార్థి నిజాం కళాశాల

డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ

ఎయిర్ చీఫ్ మార్షల్ ఇద్రిస్ హసన్ లతీఫ్ (జ.9 జూన్ 1923) 1978 నుండి 1981 వరకు భారతీయ వాయుసేన యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా సేవచేశాడు.[1] విరమణానంతరం, ఈయన 1982 నుండి 1985 వరకు మహారాష్ట్ర గవర్నరుగా, ఆ తర్వాత 1988 వరకు ఫ్రాన్స్కు భారత రాయబారిగా పనిచేశాడు.[2] భారత వాయసేనకు, ఇతర రక్షణదళాలన్నింటిలో అధ్యక్షత వహించిన ప్రథమ, ఏకైక భారతీయ ముస్లిం.[3]

ప్రారంభ జీవితం , విద్యాభ్యాసం[మార్చు]

లతీఫ్, 1923లో హైదరాబాదులో ఒక సులేమానీ బోరా కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి హసన్ లతీఫ్, అప్పటి హైదరాబాదు రాజ్యంలో ప్రధాన ఇంజనీరు.[4] లతీఫ్ విద్యాభ్యాసం హైదరాబాద్ అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో, నిజాం కళాశాలలో, వెల్లింటన్ లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల, నేషనల్ డిఫెన్స్ కళాశాలలో సాగింది.

మిలటరీ జీవితం[మార్చు]

ఎయిర్ చీఫ్ మార్షల్ లతీఫ్, 1942లో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి, రెండవ ప్రపంచ యుద్ధంలో, బర్మాలోని అరాకన్ ఫ్రంట్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఈయన ఇండోనేషియా వైమానిక దళానికి, యుద్ధ జెట్ విమానాలను మొహరించేందుకు సహాయపడిన భారతీయ సలహాబృందంలో సభ్యుడిగా ఉన్నాడు. లతీఫ్ తూర్పు వైమానికదళ కమాండుకు ఎయిర్ డిఫెన్స్ కమాండరుగా, సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా పనిచేశాడు.1961 నుండి 1965 వరకు లతీఫ్, వాషింగ్టన్ డి.సి.లోని భారతీయ రాయబార కార్యాలయంలో ఎయిర్ అట్టాచీగా ఉన్నాడు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రణాళికలు) గా పనిచేశాడు. 1971లో లతీఫ్ పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించబడ్డాడు. 1974లో ఎయిర్ మార్షల్ గా పదవోన్నతి పొంది, వాయు సేనా కేంద్రకార్యాలయంలో, ఎయిర్ ఆఫీసర్ ఇన్ చార్జ్, ఆడ్మినిష్ట్రేషన్ గా నియమించబడ్డాడు. ఇక్కడ ఉండగా, 1975లో పాట్నా వరదల్లో వాయుసేన సహాయ పునరావాస కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. 1977లో ఎయిర్ మార్షల్‌గా ఉన్న లతీఫ్ వైస్ ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా, ఆ తర్వాత 1978 సెప్టెంబరు 1న చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అయ్యాడు.

వైమానిక సేవ తర్వాత[మార్చు]

క్రియాశీలక మిలటరీ సర్వీసు నుండి విరమించుకున్న తర్వాత, 1982, మార్చి 2న లతీఫ్ మహారాష్ట్ర గవర్నరుగా నియమించబడ్డాడు. 1985 ఏప్రిల్ 16 దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత, ఫ్రాన్స్ లో భారతీయ రాయబారిగా నియమితుడై, 1988 దాకా ఆ పదవిలో కొనసాగాడు. ఆ తర్వాత హైదరాబాదులో స్థిరపడి విశ్రాంత జీవితం కొనసాగించాడు.[4][5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఈయన ప్రముఖ సంఘసేవిక బిల్కీస్ ఐ. లతీఫ్ను పెళ్ళిచేసుకున్నాడు.[6]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Legends of the IAF: Air Chief Marshal Idris Hasan Latif". Indian Air Force. 6 July 2016.[permanent dead link]
  2. "Air Chief Marshal Idris Hasan Latif, PVSM biography". Archived from the original on 2011-05-18. Retrieved 2017-11-14.
  3. "Idris Hassan Latif profile at indianmuslims.info". Archived from the original on 2016-04-14. Retrieved 2017-11-14.
  4. 4.0 4.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-05-18. Retrieved 2017-11-14.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-11-04. Retrieved 2017-11-14.
  6. "Awards for 5 persons from State". Archived from the original on 2009-01-29. Retrieved 2017-11-14.