(సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దర్శకత్వంఎస్.శంకర్
నిర్మాతవిశ్వనాథన్ రవిచంద్రన్
రచనఎస్.శంకర్
నటులువిక్రమ్
ఎమీ జాక్సన్
సురేష్ గోపి
సంగీతంఏ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణంపీ.సీ.శ్రీరామ్
కూర్పుఅంటోనీ
నిర్మాణ సంస్థ
ఆస్కార్ ఫిలిమ్స్
పంపిణీదారుఆస్కార్ ఫిలిమ్స్
గ్లోబల్ యునైటెడ్ మీడియా (కేరళ)
విడుదల
జనవరి 14 (2015-01-14)
నిడివి
188 నిముషాలు.[1]
దేశంభారతదేశం
భాషతమిళం

రొమాంటిక్ థ్రిల్లర్ తరహాలో ఎస్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2015 నాటి తమిళ సినిమా. విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈ సినిమాలో సురేష్ గోపి, ఉపేన్ పటేల్, రాంకుమార్ గణేషన్, సంతానం ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ ఫిలిమ్స్ పతాకంపై విశ్వనాథన్ రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, పీ.సీ.శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతను నిర్వర్తించాడు.

2015 జనవరి 14న విడుదలయిన ఈ సినిమాను ఐ – మనోహరుడు అనే పేరుతో తెలుగులో, ఐ అనే పేరుతో హిందీలోకి అనువదించి అదే రోజున విడుదల చేశారు.

కథ[మార్చు]

లింగేశన్ (విక్రమ్) మిస్టర్ ఇండియా పోటిలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న శరీర సౌష్టి. తన స్నేహితుడు బాబు (సంతానం)తో కలిసి ఓ వ్యాయామశాలను నడుపుతుంటాడు. అతడు ఆరాధించే వ్యక్తులు ఇద్దరు. ఒకరు తన స్ఫూర్తిగా భావించే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, తన అభిమాన మోడల్ దియా (ఎమీ జాక్సన్). డాక్టర్ వాసుదేవన్ (సురేష్ గోపి) సాయంతో మిస్టర్ తమిళనాడు పోటిలో గెలుస్తాడు లింగేశన్.

ఇదిలావుండగా, దియాను తన సహనటుడు జాన్ (ఉపేన్ పటేల్) లైంగికంగా వేధిస్తుంటాడు. తనతో కటువుగా మాట్లాడిన దియాను బ్లాక్లిస్ట్ చేయించి యాడ్స్ నుండి దూరం చేస్తాడు. తన కెరీరును కాపాడుకోవడానికి, ఇదివరకే ఓ షూటింగులో పరిచయమైన తన అభిమాని లింగేశన్ ను జాన్ కు బదులుగా చైనాలో జరిగే యాడ్ షూటింగుకు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. తన గార్డియన్ వాసుదేవన్ ని వెంటబెట్టుకొని లింగేశన్ దగ్గరకు వెళ్తుంది దియా. మిస్టర్ ఇండియా పోటీలు దగ్గర పడటంతో మొదట నిరాకరించిన లింగేశన్, దియా సమస్యను అర్థం చేసుకొని, వాసుదేవన్ సిఫార్సు మీద చైనా వెళ్ళడానికి ఒప్పుకుంటాడు.

దియా తన స్టైలిస్ట్ ఓస్మా జాస్మిన్ (ఓజాస్ రజని)తో లింగేశన్ ఆకృతిని ఓ మోడలుగా మార్పిస్తుంది. చైనాలో షూటింగ్ మొదలయ్యాక, లింగేశన్ దియా పట్ల తనకున్న అభిమానం, భయం వల్ల షూటింగుకి సహకరించడు. ఆ యాడ్ దర్శకుడు సుషీల్ (మోహన్ కపూర్) సలహా మేరకు, లింగేశన్ సహకరించడానికి అతడిని ప్రేమిస్తున్నట్టు అబద్ధం చెబుతుంది దియా. అది నిజమని నమ్మిన లింగేశన్ ఆనందంతో పొంగిపోయి షూటింగుకి సహకరించడం మొదలుపెడతాడు. అతడిపై మనసుపడిన ఓస్మా అదంతా నాటకమని లింగేశన్ కు నిజం చెబుతుంది. అతడు ప్రశ్నించగా, దియా కూడా ఒప్పుకుంటుంది. తొలుత బాధపడినప్పటికీ షూటింగుని యథావిధిగా కొనసాగిస్తాడు లింగేశన్. కానీ క్రమంగా, దియాకు లింగేశన్ పై నిజంగానే ప్రేమ కలిగి అతడికి వ్యక్తపరిచి, ఇద్దరు మళ్ళీ దగ్గరవుతారు.

చైనాలో తాము చేసిన యాడ్ బాగా ప్రాచుర్యం పొందడంతో దియా, లింగేశన్ యాడ్స్ రంగంలో పేరుమోసిన జంటగా మారిపోతారు. మరోప్రక్క జాన్ చిన్న స్థాయి యాడ్సుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకు కారణమైన లింగేశన్ పై కోపం పెంచుకుంటాడు జాన్. తన ప్రేమను కాదన్నందుకు ఓస్మా కూడా లింగేశన్ పై రగిలిపోతుంది. ఇంతలో, తాము ఇన్నాళ్ళు యాడ్స్ చేసిన ఇంద్రకుమార్ (రాంకుమార్ గణేశన్)కు చెందిన కంపెనీ తయారు చేసే ఓ శీతల పానీయంలో రసాయనాలున్నాయని వార్తలు రావడంతో, దానికి సంబంధించిన యాడ్స్ చేయలేనని లింగేశన్ అతడితో చెబుతాడు. ఇదే విషయం మీడియాకు కూడా చెప్పడంతో ఇంద్రకుమార్ వ్యాపారంలో నష్టపోతాడు. అతడూ లింగేశన్ పై కోపంతో రగిలిపోతాడు. వీరికి తోడవుతాడు మిస్టర్ తమిళనాడు పోటిలో లింగేశన్ చేతిలో ఓడిపోయిన రవి (ఎం.కామరాజ్). నలుగురు కలిసి లింగేశన్ ను నాశనం చేయాలని నిశ్చయించుకుంటారు. ఓ రోజు లింగేశన్ ను అపహరించి అతడిని బంధిస్తారు జాన్, రవి. కానీ వారితో పోరాడి అక్కడినుండి తప్పించుకుంటాడు లింగేశన్.

మరోప్రక్క, లింగేశన్, దియాల పెళ్ళి నిశ్చయమవుతుంది. హఠాత్తుగా లింగేశన్ తన శరీరంలో అనూహ్యమైన మార్పులను గమనిస్తాడు. జుట్టు రాలిపోయి, పళ్ళు ఊడిపోయి, నడుము ఒంగిపోయి, గూనిగా మారిన లింగేశన్ డాక్టర్ వాసుదేవన్ ని కలుస్తాడు. లింగేశన్ ఓ అరుదైన జన్యుపరమైన వ్యాధి బారినపడ్డాడని, దానికి చికిత్స లేదని వాసుదేవన్ నిర్ధారిస్తాడు. తన పరిస్థితి గురించి దియాకు తెలియకూడదని వాసుదేవన్ దగ్గర మాట తీసుకొని, పెళ్ళిని ఆపేయమని చెప్పి, క్రమంగా దియాకు దూరమై, ఓ రోజు కారు ప్రమాదంలో తను మరణించినట్టు సృష్టిస్తాడు లింగేశన్. అతడు బ్రతికేవున్న విషయం అతడికి, తన స్నేహితుడు బాబుకి, వాసుదేవన్ కి మాత్రమే తెలుసు. లింగేశన్ చనిపోయాడన్న నిజం తెలిసిన దియా తట్టుకోలేకపోతుంది. ఆ పరిస్థితిలో దియాను వాసుదేవన్ వివాహం చేసుకోవడమే సరైనదని అతడిని పెళ్ళికి ఒప్పిస్తాడు లింగేశన్. దియా తల్లి, లింగేశన్ల ప్రోద్భలంతో పెళ్ళికి ఒప్పుకుంటాడు వాసుదేవన్.

పెళ్ళి మండపం దగ్గర తన ప్రత్యర్థి రవిని చూసిన లింగేశన్ ఆశ్చర్యపోతాడు. ఇంతలో, కురూపి వేషంలో ఉన్న తనను దియా బిచ్చగాడనుకోవడంతో ఆత్మహత్యాయత్నం చేసిన లింగేశన్ కు వైద్యం చేసిన డాక్టర్ పెళ్ళి మండపం బయట లింగేశన్ ను గుర్తుపడతాడు. తనకున్నది జన్యుపరమైన వ్యాధి కాదని, ఎవరో బలవంతంగా తన శరీరంలో ఎక్కించిన “ఐ” అనే వైరస్ వల్ల వచ్చిన హెచ్4ఎన్2 అనే వ్యాధని చెబుతాడు. ఆ తరువాత లింగేశన్ పెళ్ళి మండపంలో ప్రవేశించగా, తన నలుగురు ప్రత్యర్థులను ఒకేచోట చూస్తాడు. అతడిని ఆశ్చర్యపరుస్తూ, డాక్టర్ వాసుదేవన్ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడే లింగేశన్ కు అసలు విషయం తెలుస్తుంది.

దియాకు గార్డియన్ గా ఉన్న డాక్టర్ వాసుదేవన్ కు దియాకు పదేళ్ళ వయసున్నప్పటి నుండి చాలా మోజు. దియాకు లింగేశన్ దగ్గరవడం తట్టుకోలేకపోయిన వాసుదేవన్ మిగతా నలుగురితో కలిసి అతడి శరీరంలోకి వైరస్ ని ఎక్కించి అతడిని నాశనం చేస్తాడు.

ఇది తెలుసుకున్న లింగేశన్ వారినుండి దియాను కాపాడడానికి పెళ్ళి మండపం నుండి ఆమెని అపహరించుకొని పోతాడు. ఓ పాడుబడ్డ భవంతిలో ఆమెని బంధిస్తాడు. తనకు అన్యాయం చేసిన ఒక్కొక్కరిపై తన స్నేహితుడు బాబు సాయంతో కక్ష సాధించడం మొదలుపెడతాడు. మొదటగా, రవి ఒంటిపై పెట్రోలు పోసి అతడి శరీరం తీవ్రంగా కాలిపోయేలా చేస్తాడు. తరువాత ఓస్మా వాడే మేకప్ పదార్థాలను మార్చి ఆమెకు ఒళ్ళంతా జుట్టు పెరిగేలా చేస్తాడు. తేనెటీగలను ప్రేరేపించి ఇంద్రకుమార్ ఒళ్ళంతా తేనెటీగల ముళ్ళతో నింపేస్తాడు. హై వోల్టేజి కరెంటు షాకుతో జాన్ శరీరాన్ని నాశనం చేస్తాడు. చివరగా, ఓ కుక్కతో వాసుదేవన్ ని కరిపించి, దానికి విరుగుడు మందుని మార్చేసి, ఓ వైరస్ ను వాసుదేవన్ తన శరీరంలోకి తానే ఎక్కించుకునేలా చేసి, అతడి శరీరమంతా వాపులు వచ్చేలా చేస్తాడు. ఇలా తన శరీరాన్ని రూపుమాపిన అందరి శరీరాలను తానూ రూపుమపుతాడు.

అందరిపై పగ సాధించిన తరువాత, తన అసలు స్వరూపం దియాకు తెలిపి ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు లింగేశన్. కానీ అందుకు దియా నిరాకరిస్తుంది. తనకు అతడి అందం ముఖ్యం కాదని, అతడెలా ఉన్నా అతడితోనే తన జీవితమని చెబుతుంది దియా. లింగేశన్ మాట వినకుండా, ఊరికి దూరంగా ఉన్న తన ఇంటికి అతడిని తీసుకొనివెళ్ళి ఎవరికీ కనబడకుండా జీవనం సాగిద్దామని చెబుతుంది. లింగేశన్ కు అసలు నిజం చెప్పిన డాక్టరుని పిలిపించి అతడికి వైద్యం చేయిస్తుంది. పలురకాల వైద్యాలు అందుకుంటూ లింగేశన్ క్రమంగా కోలుకోవడం మొదలుపెడతాడు.

నటీనటులు[మార్చు]

సినిమా ప్రధాన తారాగణం
విక్రమ్
ఎమీ జాక్సన్
 • విక్రమ్ (లింగేశన్ అలియాస్ లీ), మిస్టర్ ఇండియా పోటిలో గెలవడమే లక్ష్యంగా ఉన్న శరీర సౌష్టి. మోడల్ దియాకు వీరాభిమాని.
 • ఎమీ జాక్సన్ (దియా), బాగా పేరుమోసిన యాడ్ ఫిలిం మోడల్
 • సంతానం (బాబు), లింగేశన్ స్నేహితుడు
 • సురేష్ గోపి (డాక్టర్ వాసుదేవన్), దియా కుటుంబ వైద్యుడు, లింగేశన్ స్పాన్సర్
 • ఉపేన్ పటేల్ (జాన్), దియా సహనటుడు. ఆమెని లైంగికంగా వేధించే వ్యక్తి
 • రాంకుమార్ గణేశన్ (ఇంద్రకుమార్), ఓ వ్యాపారవేత్త, దియా, లింగేశన్ల యాడ్సు నిర్మాత
 • ఒజాస్ రజని (ఓస్మా జాస్మిన్), పేరుమోసిన స్టైలిస్ట్.
 • ఎం.కామరాజ్ (రవి), మిస్టర్ తమిళనాడు పోటిలో లింగేశన్ ప్రత్యర్థి
 • మహ్రు షేక్ (దియా తల్లి)
 • అళగు (లింగేశన్ తండ్రి)
 • టి.కె.కళ (లింగేశన్ తల్లి)
 • మోహన్ కపూర్ (సుషీల్), యాడ్ ఫిలిం దర్శకుడు
 • శ్రీనివాసన్ (కీర్తివాసన్)
 • యోగి బాబు (కీర్తివాసన్ అభిమాని)
 • రాధ రామకృష్ణన్ (మాయ), యాడ్ ఫిలిమ్స్ ఆర్గనైజర్
 • విద్యాధర్ (డాక్టర్ తిరువెంగడం), లింగేశన్ ని మామూలు మనిషిగా మార్చే వైద్యుడు
 • ఆర్.శరత్ కుమార్ (ఆర్.శరత్ కుమార్), అతిథి పాత్ర. లింగేశన్ కు మిస్టర్ తమిళనాడు బహుమతి ప్రదానం చేసే వ్యక్తి

నిర్మాణం[మార్చు]

మూలం[మార్చు]

అక్టోబరు 2010లో, ఎంథిరన్ (రోబో) సినిమా విడుదల తరువాత ఏర్పాటు చేసిన సన్ టీవీ ముఖాముఖీలో, 1996లో ఇండియన్ (భారతీయుడు) సినిమా విడుదల తరువాత దర్శకుడు శంకర్ తన తదుపరి సినిమా కోసం మూడు కథలతో తన వద్దకు వచ్చారని రజనీకాంత్ చెప్పడం జరిగింది. అందులో మొదటిది శివాజీ (2007), రెండోది ఎంథిరన్ (రోబో) (2010) అని, వాటిలో నటించడానికి సుముఖత చూపినట్లు రజనీకాంత్ పేర్కొన్నారు. మూడవది, శరీరం విచ్ఛిన్నం అయిపోయే ఓ బాడీ బిల్డరు కథ అని, తాను ఆ కథ చేయడంపై సుముఖత చూపలేక తిరస్కరించినట్టు తెలిపారు.[2] నన్బన్ (స్నేహితుడు) (2012) తరువాత శంకర్ మళ్ళీ ఆ కథపై పనిచేయడం మొదలైంది.

అభివృద్ది[మార్చు]

దర్శకుడు శంకర్ ఈ సినిమా స్క్రిప్టుని శుభ అనే కలం పేరు గల సురేష్, బాలకృష్ణన్ అనే రచయిత ద్వయంతో కలిసి పూర్తి చేశారు.[3] సంగీత దర్శకుడిగా ఏ.ఆర్.రెహమాన్ను ఎంచుకున్నారు. శంకర్-రెహమాన్ కలయికలో వచ్చిన పదవ సినిమా ఇది. శంకర్ తో మొదటిసారిగా ఛాయాగ్రాహకుడు పీ.సీ.శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేశారు.[4] పోరాటాలకు నేతృత్వం వహించడానికి మొదట పీటర్ హెయిన్ ని ఎంచుకున్నప్పటికీ, ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న బాహుబలి (2015) సినిమాకు ఇదివరకే పనిచేస్తున్నందుకు పీటర్ వెనక్కి వెళ్ళిపోయారు.[5] అతడి స్థానంలో యున్ వూ-పింగ్ అనే చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కళాకారుడిని తీసుకోవడం జరిగింది.[6] అదనపు పోరాట ఘట్టాల పర్యవేక్షణకు అనల్ అరసుని ఎంచుకోవడం జరిగింది. వి.శ్రీనివాస్ మోహన్ నేతృత్వంలో రైసింగ్ సన్ వీఎఫ్ఎక్స్ సంస్థను ఈ సినిమాలోని మోషన్ కాప్చర్ ఫిల్మింగ్ కోసం సంప్రదించారు. ప్రొడక్షన్ డిజైనర్ టి.ముత్తురాజ్ ని ఈ సినిమాకు కళాదర్శకుడిగా ఎంచుకున్నారు.[7]

మే 2012లో శంకర్ న్యూ జేలాండ్ వెళ్ళి దర్శకులు పీటర్ జాక్సన్, రిచర్డ్ టేలర్లకు సంబంధించిన వేట వర్క్ షాప్ ని సంప్రదించారు.[8] సీన్ ఫుట్, డావిన లమొంట్ ఈ సినిమాలో విక్రమ్ మృగం పాత్రకు కావాల్సిన ప్రోస్తెటిక్ మేకప్ అందించారు. అదనపు ప్రోస్తెటిక్ మేకప్ క్రిస్టియన్ టెన్స్లీ, డొమిని టిల్ అందించడం జరిగింది.[9] గేవిన్ మిగ్వేల్, మేరీలకు ఈ సినిమాలోని నటులకు కాస్ట్యూమ్ డిజైన్ బాధ్యతను అప్పగించారు.[10]

ఈ సినిమాకు తొలుత “తెండ్రల్” అనే పేరుని అనుకున్నట్టు వార్తలొచ్చాయి కానీ చివరకు “ఐ” అనే పేరుని ఖరారు చేయడం జరిగింది.[11][12] శంకర్ “అళగన్”, “ఆనళగన్” అనే పేర్లు అనుకున్నప్పటికీ, వాటిని ఇదివరకే వేరే సినిమాలకు పెట్టడంతో “ఐ” అనే అక్షరాన్ని పేరుగా ఎంచుకున్నారు. “ఐ” అంటే “అందం” అనే అర్థం ఉండడం, అది సినిమాలో కథానాయకుడి పాత్రకు కూడా సరిపోవడంతో ఇదే పేరుని శంకర్ ఖరారు చేసినట్టు సమాచారం.[13]టైమ్స్ అఫ్ ఇండియా తమ కథనంలో శంకర్ ఈ సినిమాకు “ఐ” అని పేరు పెట్టడం వెనుక అది కథానాయకుడి పాత్ర లక్షణాలను చెప్పడంతో పాటు “రాజు”, “అందం”, “ఆశ్చర్యం”, “గురువు”, “సున్నితం”, “యజమాని”, “బాణం” అనే అర్థాలను కూడా ధ్వనించడం అని పేర్కొనడం జరిగింది.[14]

సెప్టెంబరు, 2014లో సినిమా నిర్మాత, పంపిణీదారు ఆస్కార్ వి.రవిచంద్రన్ ఈ సినిమా యొక్క అంచనావ్యయం సుమారు రెండొందల కోట్ల పైగా ఉండొచ్చునని పేర్కొనడం జరిగింది.[15] అయితే, అక్టోబరు, 2014లో దర్శకుడు శంకర్, నిర్మాత సినిమా వ్యయం వంద కోట్లలోపే ఉండొచ్చునని పేర్కొన్నారు.[16][17][18][19]

నటీనటుల ఎంపిక, పాత్రధారణ[మార్చు]

ఏప్రిల్, 2012లో ఈ సినిమాలో కథానాయకుడిగా విక్రమ్ని ఎంచుకోవడం జరిగింది.[20] కథానాయికగా తొలుత బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి.[21] ఆ తరువాత అసిన్ పేరు కూడా వినిపించింది.[22] దీపిక పదుకొనేని సంప్రదించినట్టు కూడా వార్తలొచ్చాయి కానీ వాటిని దీపిక ఖండించడం జరిగింది.[23] మోడల్ ఎవెలిన్ శర్మ ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చానని, తరువాత భాష సమస్య వల్ల తప్పుకున్నానని పేర్కొన్నారు.[24][25][26] తరువాత సమంతని కథానాయికగా తీసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం, సమంతకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ సినిమా నుండి తప్పుకోవడం జరిగింది.[27] చివరగా, 75 లక్షల పారితోషికంతో ఆ పాత్ర ఎమీ జాక్సన్కు వెళ్ళింది.[28]

సంతానం, ఉపేన్ పటేల్, శ్రీనివాసన్,[29] సురేష్ గోపిలను ముఖ్య పాత్రలకు ఎంచుకున్నారు. ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ పెద్దకుమారుడు, ప్రఖ్యాత నిర్మాత రాంకుమార్ గణేషన్ను మరో ముఖ్య పాత్రకు ఎంచుకున్నారు.[30] ఉపేన్ పటేల్ పాత్ర కోసం తొలుత నటుడు జీవాను సంప్రదించగా, డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్నారు జీవా.[31] హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ఇందులో బహుమతి ప్రదాన సన్నివేశంలో కనిపిస్తారని వచ్చిన వార్తలను నిర్మాత రవిచంద్రన్ ఖండించారు. ఆర్నాల్డ్ సినిమా పాటల విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. విక్రమ్ ఆర్నాల్డ్ నుండి శరీర ధారుడ్యానికి సంబంధించిన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది.[32] మేకప్ ఆర్టిస్ట్ ఓజాస్ ఎం.రజని ఇందులో ఓ ట్రాన్స్ జెండర్ పాత్రకు ఎంపిక అయ్యారు.[33] విక్రమ్ మీద చిత్రించిన ఓ పోరాట సన్నివేశంలో 2014 మిస్టర్ ఆసియ విజేత సయద్ సిద్ధిక్ కూడా కనిపించడం జరిగింది.[34] చైనాలో చిత్రించిన సైకిల్ పోరాటంలో ఫైట్ మాస్టర్ పీటర్ మింగ్ ప్రోఫెషనల్ సైక్లిష్ట్లను పిలిపించారు.[35]

ఈ సినిమాలో విక్రమ్ పోషించిన “లింగేశన్” పాత్ర ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అభిమాని కావడంతో, దర్శకుడు శంకర్ విక్రమ్ తలకట్టు యుక్తవయసులోని ఆర్నాల్డ్ తలకట్టులా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో విక్రమ్ కనిపించిన అన్ని వేషాల్లో అతి కష్టమైనది గూనిగా ఉన్న వేషధారణేనని శంకర్ పేర్కొన్నారు. పాత్ర చర్మంపైనున్న బుడగలను వేట వర్క్ షాప్ ఆధ్వర్యంలో రూపొందించడం జరిగింది.[36]}}[37] తన పాత్రకు సంబంధించిన వేషధారణల మార్పు సులువు కావడం కోసం విక్రమ్ శిరోముండనం కూడా చేయించుకోవడం జరిగింది.[38]

ఈ సినిమాలో కథానాయిక పాత్ర ఓ మోడల్ కావడంతో స్వతహాగా మోడల్ అయిన ఎమీ జాక్సన్ ని ఎంచుకోవడం జరిగిందని శంకర్ పేర్కొన్నారు.[39] బాబు పాత్ర కోసం హాస్యనటుడు సంతానం కూడా బరువు తగ్గారు.[40]

మూలాలు[మార్చు]

 1. "Shankar's I run time is 188 min". The Times of India. 7 January 2015. Retrieved 7 January 2015. CS1 maint: discouraged parameter (link)
 2. Rajinikanth (Actor) (October 2010). Super Star Rajini – Special Interview (Interview) (in Tamil). Chennai: Sun TV.CS1 maint: unrecognized language (link)
 3. V. Lakshmi (11 మార్చి 2012). "Shankar to find a new team". The Times of India. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 27 డిసెంబరు 2013. CS1 maint: discouraged parameter (link)
 4. "PC Sreeram in Shankar's next film". The Times of India. 22 జూన్ 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 15 జూలై 2012. CS1 maint: discouraged parameter (link)
 5. V. Menon, Thinkal (7 జూన్ 2014). "I wanted to work in 'Ai': Peter Hein". Deccan Chronicle. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 10 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 6. "'I' and the Matrix". The Times of India. 3 డిసెంబరు 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 7 సెప్టెంబరు 2014. CS1 maint: discouraged parameter (link)
 7. "ஐ". S. Shankar Official Website. 21 జూన్ 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 24 జూలై 2012. CS1 maint: discouraged parameter (link)
 8. Prasad, Shiva (16 జూలై 2013). "Shankar opens up on 'Ai'". The Times of India. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 30 జూలై 2013. CS1 maint: discouraged parameter (link)
 9. ""Shankar has taken technology to a totally different level in 'Ai'" – PC Sreeram". Behindwoods. 22 జూన్ 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 22 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 10. "Shankar's 'Ai' getting ready for release". Sify. 24 March 2014. Archived from the original on 15 September 2014. Retrieved 15 September 2014. CS1 maint: discouraged parameter (link)
 11. "Shankar, Vikram to team up for 'Thendral'". CNN-IBN. 16 మే 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 28 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 12. "Shankar, Vikram, Samantha next Project named as 'I'". The Times of India. 23 జూన్ 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 28 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 13. "'I' isn't the first choice ..." Behindwoods. 17 September 2014. Archived from the original on 17 September 2014. Retrieved 17 September 2014. CS1 maint: discouraged parameter (link)
 14. Ramanujam, Srinivasa (3 September 2013). "Kollywood filmmakers opt for classical words for film titles". The Times of India. Archived from the original on 13 September 2014. Retrieved 3 September 2013. CS1 maint: discouraged parameter (link)
 15. TE Narasimhan (17 September 2014). "India's costliest movie I to be released in 10,000 screens in China". Business Standard. Retrieved 3 January 2015. CS1 maint: discouraged parameter (link)
 16. Director Shankar hires 'Avatar' make-up artistes for 'I' – IBNLive Archived 2013-03-22 at the Wayback Machine. Ibnlive.in.com (19 March 2013). Retrieved on 2015-07-18.
 17. 'I' Release: Vikram Starrer to Clash with Rajinikanth's 'Lingaa'?. Ibtimes.co.in (30 October 2014). Retrieved on 2015-07-18.
 18. Shankar and I. The Hindu (11 October 2014). Retrieved on 2015-07-18.
 19. The budget of I is not 150 crorers Shankar – Tamil Movie News. Indiaglitz.com (15 October 2014). Retrieved on 2015-07-18.
 20. "Shankar's choice is Vikram". Behindwoods. 26 ఏప్రిల్ 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 14 జూన్ 2012. CS1 maint: discouraged parameter (link)
 21. Vikram and Asin to act together in Shankar's next film: Sources – IBNLive. CNN-IBN.com (18 May 2012). Retrieved 15 April 2015.
 22. "'Therdal' to have a Bollywood lead". The Times of India. 22 మే 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 14 జూన్ 2012. CS1 maint: discouraged parameter (link)
 23. Shekhar (24 జూలై 2012). "I am not doing Shankar's Telugu film: Deepika Padukone". Oneindia Entertainment. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 13 సెప్టెంబరు 2014. CS1 maint: discouraged parameter (link)
 24. "Evelyn Sharma was offered the lead in I". Hindustan Times. Indo-Asian News Service. 24 January 2015.
 25. "Evelyn Sharma was offered the lead in 'I'". Zee News. Indo-Asian News Service. 24 January 2015.
 26. Evelyn Sharma wants to work in Tamil cinema. Hindustan Times. (22 January 2015). Retrieved 15 April 2015.
 27. V. Lakshmi (29 June 2012). "Samantha out of Shankar's film". The Times of India. Archived from the original on 3 October 2014. Retrieved 11 September 2014. CS1 maint: discouraged parameter (link)
 28. "Amy Jackson signs 'I' for a whooping price". CNN-IBN. 21 జూలై 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 11 సెప్టెంబరు 2014. CS1 maint: discouraged parameter (link)
 29. "Shankar wants Powerstar". Behindwoods. 5 జూలై 2012. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 5 జూలై 2012. CS1 maint: discouraged parameter (link)
 30. Rangarajan, Malathi (7 July 2012). "Grand re-entry". The Hindu. Archived from the original on 30 November 2012. Retrieved 15 July 2012. CS1 maint: discouraged parameter (link)
 31. "Why Jiiva rejected Shankar's 'Ai'?". SS Music. 29 జనవరి 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 30 జనవరి 2014. CS1 maint: discouraged parameter (link)
 32. "Arnold Schwarzenegger to launch Telugu movie 'Ai'?". Deccan Chronicle. 26 ఆగస్టు 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 26 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 33. Subramanian, Anupama (9 జూన్ 2014). "Real to wwwreel, all happening in 'Ai'". Deccan Chronicle. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 10 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 34. Achal, Ashwin (26 August 2014). "The champion quest". The Hindu. Archived from the original on 26 August 2014. Retrieved 26 August 2014. CS1 maint: discouraged parameter (link)
 35. M. Suganth (17 సెప్టెంబరు 2014). "Arnold was an inspiration for Vikram's character". The Times of India. Archived from the original on 17 సెప్టెంబరు 2014. Retrieved 17 సెప్టెంబరు 2014. CS1 maint: discouraged parameter (link)
 36. Arnold Schwarzenegger impressed by Vikram. The Times of India. M. Suganth. August 28, 2014
 37. "AN EXCLUSIVE SCOOP ON 'I' AND ITS MAKING VIDEO". Cinemalead. Archived from the original on 17 September 2014. Retrieved 17 September 2014. CS1 maint: discouraged parameter (link)
 38. ""Anything for 'Ai'"- Vikram". Behindwoods. 24 మార్చి 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 28 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 39. "Jackie Chan and Arnold Schwarzenegger set for South gala". Deccan Chronicle. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 26 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)
 40. "Santhanam emulates Vikram for Shankar's 'Ai'". Behindwoods. 21 జనవరి 2014. Archived from the original on 13 సెప్టెంబరు 2014. Retrieved 29 ఆగస్టు 2014. CS1 maint: discouraged parameter (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఐ_(సినిమా)&oldid=3177770" నుండి వెలికితీశారు