ఒబెరాయ్ హోటల్సు, రిసార్ట్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Oberoi Hotels & Resorts
రకంహోటళ్ళు
పరిశ్రమHospitality
స్థాపన1934
స్థాపకుడుLate Rai Bahadur Mohan Singh Oberoi
ప్రధాన కార్యాలయంDelhi, India
కీలక వ్యక్తులు
పృథ్వీ రాజ్ సింగ్, Vikram Oberoi, Arjun Oberoi
ఉత్పత్తులుHotels
మాతృ సంస్థEast India Hotels
వెబ్‌సైట్Oberoi Hotels & Resorts

ఒబెరాయ్ గ్రూపు ప్రపంచ వ్యాప్తంగా హోటళ్ల కంపెనీలు కలిగి ఉన్న సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది..[1] ఐదు దేశాల్లో 20కి పైగా హోటళ్లు, 2 క్రూయిజర్లను ఒబెరాయ్ సంస్థ సొంతగా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అనేక అవార్డులు అందుకున్న ఒబెరాయ్ గ్రుపు హోటళ్లలో ఇది ఒకటి.[2]

హోటళ్లు

[మార్చు]

ఒబెరాయ్ గ్రూపు నకు పునాదులు పడిన 1934 సంవత్సరానికి ముందు గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడైన రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ ఓ ఆంగ్లేయుని నుంచి ఢిల్లీలోని క్లార్క్స్ హోటల్, సిమ్లాలోని క్లార్క్స్ హోటల్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంవత్సరాల్లో మొహన్ సింగ్ ఒబెరాయ్ తన ఇద్దరు కుమారులైన తిలక్ రాజ్ సింగ్ ఒబెరాయ్, పృథ్విరాజ్ ఒబెరాయ్ లకు సలహాలిస్తూ హోటళ్ల విస్తరణకు సహకరించారు.[3]

ప్రస్తుతం ఒబెరాయ్ గ్రూపునకు ఛైర్మన్ గా ఉన్న పి.ఆర్.ఎస్.ఒబెరాయ్, అతని కొడుకు విక్రమ్ ఒబెరాయ్, అతని మేనళ్లుడు అర్జున్ ఒబెరాయ్ లు సంయుక్తంగా ఇ.ఐ.హెచ్ లిమిటెడ్, ఇ.ఐ.హెచ్ అనుబంధ హోటళ్లకు మేనేజింగ్ డైరెక్టర్లుగా సేవలందిస్తున్నారు.

ట్రైడెంట్ పేరుతో భారత్, సౌదీ అరేబియాలో కూడా ఒబెరాయ్ గ్రూపు హోటళ్లను నిర్వహిస్తోంది. సిమ్లాలో ఉన్న క్లార్క్స్, ఢిల్లీలోని మెయిడెన్స్ హోటళ్లను కూడా ఈ గ్రూపే నిర్వహిస్తోంది. ఈ రెండు ఆస్తులు కూడా ట్రైడెంట్ లేదా ఒబెరాయ్ పేర్లపై ఉంటాయి.

హోటళ్ల జాబితా

[మార్చు]

ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్, ట్రైడెంట్ హోటల్స్

Oberoi Maidens Hotel, Delhi.
 • ఒబెరాయ్, న్యూ ఢిల్లీ
 • ఒబెరాయ్, బెంగళూరు
 • ఒబెరాయ్ గ్రాండ్, కోల్ కతా
 • ఒబెరాయ్, ముంబయి
 • ఒబెరాయ్ అమర్ విలాస్, ఆగ్రా
 • ఒబెరాయ్ రాజ్ విలాస్, జైపూర్
 • ఒబెరాయ్ ఉదయ్ విలాస్, ఉదయ్ పూర్ (ప్రపంచ ఉత్తమ హోటల్లలో నెం.4 హోటల్ గా 2012లో గుర్తింపు[4])
 • వైల్డ్ ఫ్లవర్ హాల్, హిమాలయాల్లోని సిమ్లా
 • ఒబెరాయ్ సెసిల్, సిమ్లా
 • ఒబెరాయ్, మోటర్ వెస్సెల్ వ్రింద, బ్యాక్ వాటర్ క్రూయిజర్, కేరళ
 • ఒబెరాయ్ వన్యవిలాస్, సవాయ్ మధోపూర్ లోని రాంతమ్ బోర్
 • ఒబెరాయ్, గుర్గావ్
 • ట్రైడెంట్, ఆగ్రా
 • ట్రైడెంట్, భువనేశ్వర్
 • ట్రైడెంట్, చెన్నై
 • ట్రైడెంట్, కొచ్చిన్
 • ట్రైడెంట్, గుర్గావ్
 • ట్రైడెంట్, జైపూర్
 • ట్రైడెంట్, బండ్ర కుర్ల, ముంబయి
 • ట్రైడెంట్, నారిమన్ పాయింట్, ముంబయి
 • ట్రైడెంట్, ఉదయ్ పూర్
 • ట్రైడెంట్, హైదరాబాద్
 • ఒబెరాయ్, బాలీ
 • ఒబెరాయ్, లోంబాక్

మారిషస్లో

[మార్చు]
 • ఒబెరాయ్, మారిషస్
 • ఒబెరాయ్, షాల్ హసీసా, ఎర్ర సముద్రం (రెడ్ సీ)
 • ఒబెరాయ్ జహ్రా, విలాసవంతమైన నైలు నౌక
 • ఒబెరాయ్ ఫైలే, నైలు నౌక

సౌదీ అరేబియాలో

[మార్చు]
 • ఒబెరాయ్, మదీనా

యు.ఎ.ఇ.లో

[మార్చు]
 • ఒబెరాయ్, దుబాయ్

అవార్డులు-విజయాలు

[మార్చు]

యు.ఎస్.ఎ.లోని కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ఆసియాలోని మొదటి 15 రిసార్ట్స్ ల జాబితాలోఒబెరాయ్ వన్య విలాస్ కు స్థానం లభించింది. ఒబెరాయ్ అమర్ విలాస్, ఆగ్రా ప్రపంచంలో ఐదో ఉత్తమ హోటల్ గా, ఒబెరాయ్ రాజ్ విలాస్, జైపూర్ 13వ ఉత్తమ హోటల్ గా, ఒబెరాయ్ ఉదయ్ విలాస్, ఉదయ్ పూర్ ప్రపంచ 4వ ఉత్తమ హోటల్ ర్యాంకు దక్కింది. యునైటెడ్ స్టేట్స్ కు బయట ఉన్న ఉత్తమ హోటళ్లలో ఒబెరాయ్ హోటల్స్ & రిసార్ట్స్ 2007లో ఉత్తమ హోటల్ గా, 2008లో యునైటెడ్ కింగ్ డమ్ కు బయట ఉన్న హోటళ్లలో ఉత్తమ హోటల్ ర్యాంకు లభించింది. 2004 నుంచి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ట్రైడెంట్ హోటల్స్ ‘బెస్ట్ ఫస్ట్ క్లాస్ హోటల్ బ్రాండ్’గా గెలిలియో ఎక్స్ ప్రెస్ అవార్డును అందుకున్నాయి. ఒబెరాయ్, ముంబయి హోటల్ 'బెస్ట్ బిజినెస్ హోటల్ ఇన్ ఇండియా' అవార్డును అందుకుంది.

యాజమాన్యం

[మార్చు]

శ్రీ పి.ఆర్.ఎస్.ఒబెరాయ్ ఇ.ఐ.హెచ్. లిమిటెడ్ లో ప్రధాన భాగస్వామిగా 32.11% వాటా కలిగి ఉన్నారు. సిగరెట్ల నుంచి హోటల్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన ఐటీసీ లిమిటెడ్ సుమారుగా 14.98% వాటాను ఇ.ఐ.హెచ్. లిమిటెడ్ లో కలిగి ఉంది. ఇ.ఐ.హెచ్. లిమిటెడ్ లో ఒబెరాయ్ కుటుంబం 14.12% వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్టిమెంట్ హోల్డింగ్ ప్రయివేట్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానికి అమ్మినారు. ఈ వాటాను 2010 ఆగస్టు 30 నాడు ఇ.ఐ.హెచ్ లిమిటెడ్ విలువ ప్రకారం రూ. 1,021 కోట్లకు అంబానీ కొనుగోలు చేశారు. ఇది ఎంటర్ ప్రైజ్ విలువ ప్రకారం రూ. 7,200 కోట్లు ఉంటుంది. ఇటీవల రిలియన్స్ ఐటీసీలో తన వాటాను మరింత పెంచుకుంది.

విభాగాలు

[మార్చు]
 • ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, అధికారిక వెబ్ సైట్
 • ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్
 • భారత్ లో హాస్టిటాలిటీ అందించే కంపెనీలు
 • హోటల్ చైన్స్
 • భారతీయ బ్రాండులు
 • 1934లో స్థాపించిన కంపెనీలు
 • 1934లో భారత్ లో స్థాపించిన కంపెనీలు

మూలాలు

[మార్చు]
 1. "Contact Us." Oberoi Group. Retrieved on 14 November 2012. "Oberoi Hotels & Resorts 7, Sham Nath Marg, Delhi-110 054, India "
 2. "World's Leading Luxury Hotel Brand Award". WorldTravelAwards.
 3. "Oberoi Group Hotels in New Delhi". cleartrip.com. Retrieved 2012-11-03.
 4. World's Best Hotels 2012 Travel and Leisure.

వెలుపలి లంకెలు

[మార్చు]