ఒహాయో
ఒహాయో (Ohio) అమెరికాలోని మధ్యపశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన మిరీ సరస్సు, తూర్పున పెన్సిల్వేనియా, ఆగ్నేయంలో పశ్చిమ వర్జీనియా, నైరుతిలో కెంటకీ, పశ్చిమాన ఇండియానా, వాయవ్యంలో మిషిగన్ సరిహద్దులుగా ఉన్నాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలో, విస్తీర్ణం ప్రకారం ఇది 34వ అతిపెద్దది. దాదాపు 1.2 కోట్ల జనాభాతో, ఒహాయో ఏడవ అత్యధిక జనాభా, పదవ-అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం. దీని రాజధాని, అత్యధిక జనాభా కలిగిన నగరం కొలంబస్. డేటన్, అక్రోన్, టోలెడోతో పాటు క్లీవ్‌ల్యాండ్, సిన్సినాటి అనే రెండు ఇతర ప్రధాన మెట్రోపాలిటన్ కేంద్రాలు ఉన్నాయి. ఒహాయోలో ఉండే బక్‌ఐ చెట్ల వల్ల దీనికి "బక్‌ఐ స్టేట్" అనే మారుపేరు ఉంది. ఇందులో నివసించే వారికి "బక్‌ఐస్" అని కూడా పిలుస్తారు.[1]
ఒహాయో అనే పేరు ఈ రాష్ట్రానికి దక్షిణంగా ప్రవహించే ఒహాయో నది పేరు మీదుగా వచ్చింది. సెనెకా భాషలో దీని అర్థం "మంచి నది", "గొప్ప నది" లేదా "పెద్ద నదీపాయ".[2][3] ఈ రాష్ట్రం అనేక ప్రాచీన స్థానిక నాగరికతలకు నిలయంగా ఉంది. సా.శ.పూ 10,000 నాటికి ఇక్కడ మానవులు ఉన్నారు. ఒహాయో అప్పలాచియన్ పర్వతాలకు పశ్చిమాన ఉన్న భూభాగాల నుండి ఉద్భవించింది. ఇక్కడ స్థానిక తెగలు, యూరోపియన్ వలసవాదులు 17వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం చివరి వరకు నియంత్రణ కోసం పోరాడారు. ఇది మొదటి అమెరికా సరిహద్దులో భాగంగా ఏర్పరచిన వాయవ్య భూభాగం నుండి వేరుచేయబడింది. వాయవ్య ఆర్డినెన్స్ ప్రకారం 1803 మార్చి 1న 17వ రాష్ట్రంగా మారింది. వలస పాలన తర్వాత బానిసత్వం నుంచి బయటపడిన మొదటి రాష్ట్రం ఇది. 20వ శతాబ్దంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా మారింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Why is Ohio known as the Buckeye State and why are Ohioans known as Buckeyes?" (PDF). November 1998. Archived (PDF) from the original on April 12, 2019. Retrieved December 7, 2018.
- ↑ "Quick Facts About the State of Ohio". Ohio History Central. Archived from the original on November 27, 2010. Retrieved July 2, 2010.
From Iroquois word meaning 'great river'
- ↑ "Native Ohio". American Indian Studies. Ohio State University. Archived from the original on February 2, 2007. Retrieved February 25, 2007.
Ohio comes from the Seneca (Iroquoian) ohiiyo' 'good river'
- ↑ Mary Stockwell (2006). Ohio Adventure. Gibbs Smith. p. 88. ISBN 978-1-4236-2382-3. Archived from the original on March 31, 2015. Retrieved June 16, 2015.
- ↑ William M. Davidson (1902). A History of the United States. Scott, Foresman and Company. p. 265. Retrieved June 16, 2015.