Jump to content

ఓంవతి దేవి

వికీపీడియా నుండి
ఓంవతి దేవి

పదవీ కాలం
1998  1999
ముందు మంగళ్ రామ్ ప్రేమి
తరువాత శీష్ రామ్ సింగ్ రవి
నియోజకవర్గం బిజ్నోర్

పదవీ కాలం
1985  1989
ముందు బిషన్ లాల్
తరువాత రామేశ్వరి
పదవీ కాలం
1996  2012
ముందు సతీష్ కుమార్
తరువాత మనోజ్ కుమార్ పరాస్
నియోజకవర్గం నగీనా

వ్యక్తిగత వివరాలు

జననం 1949
బిజ్నోర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్ వాదీ పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ
నివాసం కాజంపూర్, బిజ్నోర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ఓంవతి దేవి (జననం 1949) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

ఓంవతి దేవి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నగీనా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మంగళ్ రామ్ ప్రేమిపై 9212 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లో‍క్‍సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

ఓంవతి దేవి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి శీష్ రామ్ సింగ్ రవి చేతిలో 23700 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 1996, 2002 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నగీనా శాసనసభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా, 2007 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైంది.

ఓంవతి దేవి 2019లో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరి,[2] 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నగీనా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 20,046 ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "With 30% minorities, Bijnor had just one Muslim MP since Independence". The Times of India. 23 March 2019. the original నుండి 26 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2025.
  2. "Former UP minister & four-term MLA Omwati Devi joins Congress". The Times of India. 11 March 2019. the original నుండి 26 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2025.
  3. "Nagina Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 26 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2025.